పాట మొదలే ఎంత బావుందో కదా అసలు.! టకటకమని ఎవరో మది తలుపులు తడితే.. తెరిచీ తెరవగానే ఒకేసారి ప్రాణం పోయినంత పని అయిందట. అంతటి పరవశమన్న మాట అబ్బాయికి.! ఇంకా, ఆ అమ్మాయి రాక ఇతగాడి జీవితంలో ఎన్నెన్ని మార్పులు తీసుకొచ్చింది అనే భావాన్ని అనంత శ్రీరామ్ చక్కటి, చిక్కటి మాటల్లో నింపేశారు. పల్లవి కంటే చరణాలు మరింత ఆకట్టుకుంటాయి ఈ పాటలో. పాట రాగం, అలాగే గాయకుడి గాత్రమాధుర్యం రెండూ పోటీ పడ్డాయనిపించింది నాకైతే. ఈ పాట సాహిత్యం క్రింద ఇస్తున్నాను. ఓ చూపు అటేసి.. అలాగే ఓ చెవు కూడా వేసేస్తే ఒక పని అయిపోతుంది మరి.!
టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..
తెరిచా.. తెరిచా..! ఒక నిమిషము ప్రాణము విడిచా..!
టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..
తెరిచా.. తెరిచా..! ఒక నిమిషము ప్రాణము విడిచా..!
ఆ హంతకి.. నాలో ఊహకి.. ఊపిరే పోసినది..
నే ఒంటరి.. అనే మాటని.. అంతమే చేసినది..
టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..
తెరిచా.. తెరిచా..! ఒక నిమిషము ప్రాణము విడిచా..!
ఉలుకూ పలుకూ.. అసలెరుగని మనుసుని ఉసిగొలిపినదా అందం..
ఉరుకూ పరుగూ.. అవి తెలియని తలపుని తెగ తరిమినదే పాపం..
నీలాల నింగి తెర పైన గీసుకున్నానా ఆమె రూపం..
జగమంతా కాగితం చేసి రాసుకున్నానా ప్రేమ గీతం..
ఏ వేళలో.. ఎటేపెళ్లినా.. ఎదురుగా కనబడుతూ..
ఆ పాటనే.. ప్రతీ అక్షరం.. వదలక పలికినదీ..
హో.. అదిగో అదిగో.. ఆ అడుగుల సడి విని కదలని కదలిక రాదా..
అపుడే అకడే.. ఆ పెదవుల నగవుకి ఎదలోని బడలిక పోదా..
సంతోషం నీడలా మారి నడచి వస్తుంది ఆమె వెంట..
ఆనందం పాపలా చేరి ఆడుకుంటోంది ఆమె కంట..
నా రేయికి.. తనే వేకువై.. వెలుగునే ఇచ్చినదీ..
ఈ జన్మలో.. మరో జన్మనే.. మరుక్షణం చూపినదీ..
టక టక టక టక ఎవరో.. నా మది గది తలుపులు తడితే..
తెరిచా.. తెరిచా..! ఒక నిమిషము ప్రాణము విడిచా..!
10 comments:
చాలా రోజుల తర్వాత బ్లాగు తలుపులు తెరిచారు.
నేను విన్నానండి ఈ పాట, సినిమా గురించి తెలియదు కాని పాట మాత్రం నచ్చింది.
Good song..
మంచి పాటండి. సాహిత్యం బాగుంది. లిరిక్స్ చదివాకా పాట వినాలనిపిస్తుంది. బాగారాసారు.
పాట బాగుందండి .
సంక్రాంతి శుభాకాంక్షలు .
ఇప్పటి దాక అంట పరీక్షగా వినలేదు పాట. అద్భుతంగా రాసాడు అనంత శ్రీరాం. మీరన్నట్టు చరణం అద్భుతంగా ఉంది .. సిరివెన్నెలా రాసినది అనిపించింది. చిన్న చిన్న పదాలతో అద్భుతమయినా భావాలను పలికించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్యలా ఉంది.
@ విజయ మోహన్ గారూ,
అవునండీ ఈ మధ్యనే కాస్త వీలు చిక్కుతుంది. అందుకే బ్లాగు తలుపులు తెరిచాను :)
@ పద్మార్పిత గారూ,
నాకూ అంతేనండీ :)
@మురళి గారూ,
:)
@ జయ గారూ,
లిరిక్స్ లాగే పాట కూడా బాగుంటుంది. విని చూడండి. మీకు నచ్చుతుంది.
@ మాలా గారూ,
:)
@ వాసు గారూ,
నాకూ అలాగే అనిపించింది. ఇటీవలి కాలంలో అనంత శ్రీరాం బాగా రాస్తున్నాడనిపిస్తోంది :)
song paadindi rahul kaadandi NARESH IYER
paata paadindi rahul kaadandi.. NARESH IYER atanu paadina paatalu miku telise untai. nuvvu nenu premaloni preminche premava..,,leaderlo aunana kadana inka kotta patalu chalane unnai
@ admirer,
నిజమేనండీ.. ఈ పాట పాడింది నరేష్ అయ్యర్.. నేనే పొరపాటుగా రాసినట్టున్నాను.. ఇప్పుడు సరి చేసాను. సరిదిద్దినందుకు ధన్యవాదాలు. :)
Post a Comment