Sunday, September 28, 2008

చిటపట చినుకులు పడుతూ ఉంటే...

స్వాగతం...
రోజు దాదాపు ప్రతీ తెలుగు వ్యక్తికి తెలిసిన ఒక సరదా ప్రేమ గీతాన్ని గుర్తు తెచ్చుకుందాం.

post title చూసి నేను పాట గురించి ఇక్కడ రాస్తున్నానో మీకు అర్ధమయ్యే ఉంటుంది కదా..! సరే.. అదే ఆత్మబలం చిత్రం లోని "చిటపట చినుకులు పడుతూ ఉంటే.." అనే యుగళ గీతం. ఈ పాట వర్షంలో తడుస్తూ ప్రేమికులు ఆలపించే ప్రేమ గీతం. మనసు కవి ఆత్రేయ గారు రాసిన ఈ పాటకి K.V.మహదేవన్ గారు సంగీతాన్ని అందించారు. నటసామ్రాట్ అక్కినేని గారు, B.సరోజా దేవి గారు నటించారు. మీరు గమనించే ఉంటారు సరోజాదేవి గారు ఈ పాటలో రెండు జడలు వేసుకుని ఉంటారు. అది కూడా పూల జడలు. ఆ రోజుల్లో పెద్దవాళ్లు కూడా రెండు జడలు వేసుకునేవాళ్ళని మా అమ్మ చెప్పింది ఒకసారి. అదే fashion అప్పుడు. అదే మరి ఇప్పుడయితే చిన్నపిల్లలు కూడా పూల జడలు వేసుకోవట్లేదు కదా.. కనీసం జడలు వేసుకునేంత జుట్టు ఉండట్లేదనుకోండి అది వేరే విషయం :) మనలో చాలామంది అమ్మాయిలకి చిన్నప్పుడు పూలజడ photo ఉండేఉంటుంది. కాని ఇప్పుడు పిల్లలకి పాపం కనీసం photo కూడా ఉండట్లేదు గుర్తుగా. సరే.. అయితే ఈ విషయం మీరు గుర్తు పెట్టుకుని మీ పిల్లలకి పూల జడ వేయించి photo తీయించండి :)
ఇంక మళ్లీ పాట విషయానికి వస్తే, ఈ పాటని పాడింది ఘంటసాల గారు మరియు సుశీల గారు. వీరిద్దరి combination లో వచ్చిన ఎన్నో మధుర గీతాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రం 1964 లో ఇప్పటి హీరో జగపతి బాబు గారి తండ్రి అయిన ప్రముఖ నిర్మాత V.B. రాజేంద్రప్రసాద్ గారు Jagapathi art pictures banner లో నిర్మించారు. ఈ పాటని గురించిన మీ భావాలని ఇక్కడ తప్పకుండా పంచుకుంటారని ఆశిస్తున్నాను.
మీ అభిప్రాయాలకోసం ఎదురు చూస్తాను..!
ప్రేమతో..
మధుర వాణి

7 comments:

aaa said...

Hi madhuravaani...
telugu lo blog baavundi. Meeru pettinavi kudaa baavunnayi. Thanks for reminding the beautiful song..!

keep posting..!

Anonymous said...

these songs always evrgreen

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
భారతీయ వాఙ్మయం said...

mee blog bagundi. paatha patalu, madhura geethalu, chitti kathalu anni veti kave vunnayi. naa kaithe mee blog chaduvuthunte vennello inti venuka kutumbam antha bhojanam chesinattu anipistundi. chaduvuthunte santosham, chadivaka badha poti padi vasthunnayi. ekkado paresukunna bangaru balyam, chinna chinna anandalu anni gurthuku thestunnaru. idi type chestuntene naa kallu nindipothunnayi kannillatho. dayachesi blog continue cheyyandi. thank you for giving small emotions.

మధురవాణి said...

@ Sneham,
మీ వ్యాఖ్యతో నా మనసుని తడిపేశారండీ! నిజంగా నా బ్లాగు వల్ల మీకంత చక్కటి అనుభూతి దొరికిందంటే నాకెంత సంతోషంగా అనిపిస్తోందో మాటల్లో చెప్పలేను. మానకుండా ఈ బ్లాగు రాస్తూనే ఉంటానండీ! You made my day! మీకు బోలెడన్ని ధన్యవాదాలు.

Anonymous said...

స్నేహం చెప్పారు

మీ బ్లాగ్ బాగుంది . పాత పాటలు , మధురగీతాలు , చిట్టి కథలు అన్నీ వేటికవే ఉన్నాయి. నా కైతే మీ బ్లాగ్ చదువుతుంటే వెన్నెల్లో ఇంటి వెనుక కుటుంబం అంతా భోజనం చేసినట్టు అనిపిస్తోంది. చదువుతుంటే సంతోషం,చదివాక బాధ పోటి పడి వస్తున్నాయి.ఎక్కడో పారేసుకున్న బంగారు బాల్యం చిన్న చిన్న ఆనందాలు అన్నీ గుర్తుకుతెస్తున్నారు ఇది టైపు చేస్తుంటేనే నా కళ్ళు నిండిపోతున్నాయి కన్నీళ్ళతో దయచేసి బ్లాగు కంటిన్యూ చెయ్యండి
thank you for giving small emotions.

మిగతా వాళ్ళకి చదవడానికి శ్రమ లేకుండా
మధురవాణి బ్లాగు అభిమాని

మధురవాణి said...

@ Anonymous,

That's so sweet of you! అలాగే మీ పేరు కూడా చెప్పుంటే బాగుండేది కదండీ! :-)