Thursday, December 26, 2013

గగనకుసుమం


అల్లంత దూరాన నీలవర్ణాన వెలిగిపోయే ఆకాశధామం నీ నివాసం..
వినీలమైనా కారునలుపైనా నింగికి అద్దం పట్టే సాగరం నా నెలవు..
దిగంతాల అంచుల దాకా ఎగరేసే విశాలమైన రెక్కలు నీ సొంతం..
నీటి అలల తాటింపు తప్ప మరే విద్య నేర్వని చిన్ని రెక్కలు నావి..
దివిసీమలనేలే స్వేఛ్ఛావిహంగానివి నీవు..
జలతారు నీటివలలో బంధీనైన మీనాన్ని నేను..
మింటి మెరుపులని వేటాడుతూ మరీచిలా సాగేవు నీవు..
నీ క్రీగంటి చూపుకై ప్రతీక్షిస్తూ ఛాయలా తిరిగేను నేను..
సుదూరాన గగనభువనాలు సంగమించే చోటు కళ్ళెదుటే కనిపిస్తూ ఆకర్షిస్తుంది..
కానీ ఎంతగా రెక్కలార్చుకు ఈదినా ఇసుమంతైనా ఆ దూరం తరగదు కరగదు!

4 comments:

సి.ఉమాదేవి said...

మీన వేదనను వినిపించిన మీ వాణి అలరించింది మధుర గారు.

మధురవాణి said...

​@ సి. ఉమాదేవి,
ధన్యవాదాలండీ!

ఏలియన్ said...

కానీ ఎంతగా రెక్కలార్చుకు ఈదినా ఇసుమంతైనా ఆ దూరం తరగదు, కరగదు!

నచ్చింది,

మధురవాణి said...

@ ఏలియన్,
థాంక్సండీ.. :-)