"ఈనాటి
ఈ బంధమేనాటిదో.. ఏనాడు పెనవేసి ముడి
వేసెనో.."
ఈ 'ఈ' స్నేహాల గురించి, స్నేహితుల గురించి చెప్పాలంటే....
వీళ్ళు ఎక్కడో ఏదో దేశంలో భూమి ఆవలి పక్కన ఉంటారా.. మనం లేచే టైముకి వాళ్ళు నిదరోతారు. లేదా వాళ్ళు లంచు తినే టైముకి మనం నడి నిద్రలో ఉంటాం.. అయినా సరే "ఇదో.. నాకు ఫలానా ఆలోచన వచ్చింది.. నువ్వేమంటావోయ్?" అని అడగ్గానే ఓ పక్క నుంచి వాళ్ళ భవబంధాలతో సర్కస్ చేస్తూనే ఓ నిమిషం మనకోసం కేటాయించి ఓ మాట చెప్పేసి పోతారు. "నేనో పిచ్చి పని చేసాను" అనగానే ఓ అడుగు ఇటొచ్చి వర్చువల్ గా మొట్టికాయ వేసి సరిదిద్దేసి పోతారు. "నేనీ సరదా సంఘటనకి నవ్వుతున్నాను" అని చెప్పగానే ఓ రెండు స్మైలీలతో మన సంతోషాన్ని పంచుకుంటారు. "నాకు దిగులుగా ఉంది" అంటే వెంటనే భుజం తట్టి వెన్ను నిమిరి చెయ్యి పట్టుకుని నేనున్నా పదమంటూ ధైర్యంగా ముందడుగు వేయిస్తారు.
ఇంకా....
చెరో దేశంలో ఉన్నా ఒకే సినిమా చూసొచ్చి ఎంచక్కా ఇద్దరూ కలిసి సినిమా రివ్యూ పేరిట చీల్చి చెండాడి కడుపుబ్బేలా నవ్వుకోవచ్చు. ఎక్కడో ఏదో అన్యాయం జరిగిందంటే ఆవేశంగా స్పందించి ఆక్రోశం వెళ్ళగక్కొచ్చు. దుర్మార్గపు రాజకీయాల మీద దుమ్మెత్తి పోయొచ్చు.. చేయగలిగిన సాయం ఉందంటే చేతులు కలిపి మరొకరికి చేయూతనందివ్వొచ్చు.. వాడి వేడి చర్చలు, సరదా కబుర్లు, ఆటలు, పాటలు, అల్లర్లూ, గొడవలూ కూడా చెయ్యొచ్చు. ఆనందం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి అభినందిస్తే సంబరపడొచ్చు. కష్టం కలిగినప్పుడు ఆప్యాయంగా నాలుగు మంచి మాటలు చెప్తే విని సాంత్వన పొందవచ్చు. మొత్తంగా అచ్చం మనలాంటి పిచ్చో మంచో మనసున్న వాళ్ళ మధ్యన మహా ఆనందంగా రోజులు గడిపెయ్యొచ్చు. మన మధ్యన ఉన్న దూరాభారాలూ, బరువులూ బాధ్యతలూ, భవబంధాలు, కర్తవ్య నిర్వహణలు ఏవీ మన స్నేహానికి అడ్డుగోడలు కాలేవు. పైపెచ్చు ఈ యాంత్రిక ఉరుకుల పరుగుల జీవనయానానికి అలవాటు పడ్డవాళ్ళందరికీ ఓ గొప్ప ప్రశాంతతని, సంతోషాన్ని అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదంతా బానే ఉంది గానీ ఒకటి మాత్రం భలే చిత్రంగా అనిపిస్తుంది. ముక్కూ మొహం తెలీకుండా, మొహామొహాలూ చూసుకోకుండా, ఎదురుబొదురూ కలిసి నించోకుండా, చేతులో చెయ్యేసి కలిసి తిరక్కుండా.. కేవలం అక్షరాల్లో మనుషుల్ని చూసి ఇంత ప్రేమాభిమానాలు పెంచుకోవడం, పేరుకి వర్చువల్ అని తేలిగ్గా అనగలిగినా ఈ 'ఈ' బంధాలు మనసులకి ఎంతో దగ్గరైనవనీ, రోజురోజుకీ మన జీవితాల్లో బలంగా పెనవేసుకుపోతున్న అందమైన అనుబంధాలని ఎవరికి వారికే బాగా అర్థమవుతుందేమో! చిత్రం ఏంటంటే, ఓ నాలుగు రోజులు ఊరికి వెళ్తున్నామనో, జ్వరం వచ్చిందనో, లేకపోతే ఏదొక మాటా మాటా అనుకుని తాత్కాలికంగా పోట్లాడుకుంటేనో, అలిగి మౌనవ్రతం చేస్తేనో, మెయిల్ కి రెండ్రోజులైనా జవాబు ఇవ్వలేదనో..... ఇలాంటి వాటన్నీటికి మన మనసు స్పందించే తీరులో, మన ప్రేమ, ఆప్యాయత, ఆదుర్దా, దిగులు, కోపం, బాధ వగైరా భావాల్లో ఏమైనా మార్పు ఉంటుందంటారా? చెప్పడానికి చాలా తేలిగ్గా 'వర్చువల్' స్నేహాలే కావచ్చు కానీ ఈ 'ఈ' బంధాలు మన మొహాల్లో పూయించే నవ్వులు, మనసుల్లో ఊరించే సంతోషాలు, కళ్ళల్లో పొంగించే కన్నీళ్లు.. ఇవన్నీ వర్చువల్ కాదు, అన్నీ అచ్చంగా మనం మనస్పూర్తిగా అనుభవిస్తున్న, అనుభూతిస్తున్న, జీవిస్తున్న మన నిజమైన జీవితపు తాలూకూ చెరిగిపోని ముద్రలే కదూ!
నీవూ నేనూ నిజమై ఋజువై..
ఎన్ని యుగాలుగ ఉన్నామో..
ఎన్ని జన్మలు కన్నామో..
ఈనాటి 'ఈ' బంధమేనాటిదో..
ఏనాడు పెనవేసి ముడి వేసెనో!
**అలవాటుగా ఏవో కులాసా కబుర్లు మాట్లాడుతూ ఉండగా ఊరెళుతున్నానని చెప్పి నాలో చిన్నపాటి బెంగని కలిగించి ఈ వేళ కాని వేళలో నా చేత ఇంత మాట్లాడించిన ఓ 'ఈ' స్నేహానికి ప్రేమతో.. :-)
ఏంటో అర్ధరాత్రి పూట నిద్ర మానుకుని మరీ ఇంత అత్యవసరంగా ఘంటసాల పాటల గురించి చర్చిస్తున్నానేమిటా అని మీరు ఆశ్చర్యపోవడంలో
వింతేం లేదు కానీ... అసలు
విషయం ఏంటంటే, ఒకోసారి కొన్ని భావాలు ఆలోచనలుగా మారి ఆనందం, ఆవేదన,
ఆవేశం, అయోమయం.. (ప్రాస బాగుందని వాడేసాన్లే..
చూసీ చూడనట్టు పోవాలి మరి.. :D) వగైరా అనుభూతులన్నీ కలగాపులగమై
చివరికి ఇదిగో ఇలా అర్ధరాత్రి
అపరాత్రి అని చూసుకోకుండా ఉన్నపళంగా కూర్చోబెట్టేసి అక్షర మాలలు అల్లించేస్తాయి.
చిన్నప్పుడు మనల్ని బళ్ళో చేర్చినప్పుడు పక్కన కూర్చున్న మరో పాపాయితో బలపాలు పంచుకునే పసి స్నేహాలు, ఇంకాస్త ఎదిగాక బళ్ళో పెన్సిళ్ళూ, పెన్నులూ, పుస్తకాలూ, పెరట్లో పూసే కనకాంబరాలూ, నాన్న కొనిచ్చిన సిల్కు రిబ్బన్లూ, అమ్మ పెట్టిన తీపి తాయిలాలు పంచుకునే బాల్య స్నేహాలు, తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళి పరీక్షలూ, కోచింగులూ, ర్యాంకులూ, టీజింగులూ, క్రష్షులూ, ప్రేమలేఖలూ, వార్నింగులూ, బ్రేకప్పులూ వగైరా ఊసులన్నీ పంచుకునే టీనేజ్ స్నేహాలూ, పెళ్ళిళ్ళో, ఉద్యోగాలో మూలంగా అప్పటిదాకా ఉన్న పరిసరాలకి, స్నేహితులకి దూరంగా వెళ్ళిపోయి కొలీగ్స్ లోనో, పక్కింటి వాళ్ళలోనో వెతుక్కునే తప్పనిసరి స్నేహాలు..... ఇవన్నీ జీవితపు ప్రతి మలుపులోనూ మనందరికీ అనుభవమవుతూనే ఉంటాయి కదూ!
అప్పటికీ, ఇప్పటికీ చుట్టూ ఎవరో ఒక స్నేహితులైతే ఉంటారు గానీ ఆ స్నేహాలలో అనుభూతి మాత్రం అన్నిటా ఒకటే కాదు. ముఖ్యంగా పైన చెప్పిన జాబితాలో చివరి మలుపుకి వచ్చేసరికి ఏర్పడే స్నేహాలు కేవలం పరిస్థితుల ఆధారంగా మనుగడ సాగించేవి అయ్యి ఉంటాయి తప్ప చిన్నప్పటిలా పూర్తి అమాయకత్వంలో ఏర్పడే అందమైన స్నేహాలు కావు. అలాగని మన అభిరుచులు, మనోభావాలు, అభిప్రాయాలు నచ్చి మనం ఇష్టంగా పెంచుకున్న స్నేహాలు కూడా కావు. ఒకవేళ అలాంటి స్నేహాలున్నా ఎక్కడో నూటికో కోటికో ఒకరికి ఉంటాయేమో అలా అన్నీ కలిసొచ్చేవి.
ఇంతకీ ఇప్పుడు నే చెప్పొచ్చేది ఏంటంటే.. ఈ ఉరుకుల పరుగుల జీవితపు పరుగు పందెంలో మన మనసుకి అత్యంత సమీపంగా, భావసారూప్యత కలిగి, అభిప్రాయాలు కలిసి, ఒకరి మనసులో ఒకరికి స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు, పరస్పర గౌరవాలు ఉండి మనకి దగ్గరగా మనతో కలిసి మన పక్కన నిలబడగలిగే, మన దారిలో నడవగలిగే స్నేహితులు ఉండటం అనేది ఎంత అపురూపమైన విషయం అయిపోయింది కదా అనిపిస్తుంది.
సరే అయితే ఇప్పుడేంటీ.. అంటారా?
అదేదో టీవీ యాడ్ లో చెప్పినట్టు "మీరు అసాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యం చేస్తుంది మా ఒకే ఒక ప్రోడక్ట్.." అన్న చందంగా ఈ 'ఈ-స్నేహాలు' ఉన్నాయి చూసారూ.. ఈ ఒక్క ఐడియా నిజంగా మన జీవితాన్నే మార్చేస్తుందంటే నమ్మాలి మరి!
హమ్మయ్యా... ఇప్పుడు అసలు విషయం దగ్గరికొచ్చాను. ఇహ కాస్త ఊపిరి పీల్చుకుని కులాసాగా వినండి.. :D

26 comments:
చాలా బాగా రాశారు మధురా...
>అన్నీ అచ్చంగా మనం మనస్పూర్తిగా అనుభవిస్తున్న, అనుభూతిస్తున్న, జీవిస్తున్న మన నిజమైన జీవితపు తాలూకూ చెరిగిపోని ముద్రలే కదూ!<
అవును.
పేరుకి వర్చువల్ అయినా నిజజీవితపు స్పందనలకి ఈ స్నేహాల పట్ల మన స్పందనలకి తేడా ఉండదనేది నేనిన్నాళ్ళలో తెలుసుకున్న సత్యం.
నా మనసు అచ్చుగుద్దేసినట్లుగా, ఫోటో తీసేసినట్లుగా, నా మనసు చదివేసి రాసినట్లుగా, నా మాట, నేను చెప్పినది నాకే వినపడినట్లుగా, నేనే మరో రూపంలో ఉన్నట్లుగా....
చేప్పేస్తే....చాలాబాగుంది..తక్కువమాట..హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా....
చాలా చాలా బావుంది.దూరాలు దగ్గరైన వేళలు అంటే... నిజంగా ఇలాంటివే!
మీరు వెలిబుచ్చిన ప్రతి భావం... ఎప్పుడో ఒకప్పుడు అందరూ అనుభవించినవే!
ఆ భావాలని అక్షరీకించిన తీరు మాత్రం చాలా బావుంది. థాంక్ యు మధుర గారు.
"కానీ ఈ 'ఈ' బంధాలు మన మొహాల్లో పూయించే నవ్వులు, మనసుల్లో ఊరించే సంతోషాలు, కళ్ళల్లో పొంగించే కన్నీళ్లు.. ఇవన్నీ వర్చువల్ కాదు"
ఇందెంత నిజమో కదా..
బెంగ పెట్టుకోకండి మధుర గారు..మీ నేస్తం త్వరలోనే వచ్చెస్తారులే. :):)
బావుంది మధురవాణి గారు, నిజానికి అవి "virtual" స్నేహాలే అయినా వాటికి మనం స్పందించే తీరులో ఏం తేడా ఉండదు.
బాగా చెప్పావు మధురా. నీ భావాలని అక్షరాలలో చక్కగా చూపిస్తావు. బాగుంది. :)
అద్భుతం గా వ్రాసారు. మన అందరిలోనూ ఉన్న భావాన్ని చాలా అందంగా చెప్పారు. నిజం చెప్పాలంటే ఇది ఇలా మీరే వ్రాయగలరు.
>>వీళ్ళు ఎక్కడో ఏదో దేశంలో భూమి ఆవలి పక్కన ఉంటారా.. మనం లేచే టైముకి వాళ్ళు నిదరోతారు. లేదా వాళ్ళు లంచు తినే టైముకి మనం నడి నిద్రలో ఉంటాం.. అయినా సరే "ఇదో.. నాకు ఫలానా ఆలోచన వచ్చింది.. నువ్వేమంటావోయ్?" అని అడగ్గానే ఓ పక్క నుంచి వాళ్ళ భవబంధాల్లో సర్కస్ చేస్తూనే ఓ నిమిషం మనకోసం కేటాయించి ఓ మాట చెప్పేసి పోతారు. "నేనో పిచ్చి పని చేసాను" అనగానే ఓ అడుగు ఇటొచ్చి వర్చువల్ గా మొట్టికాయ వేసి సరిదిద్దేసి పోతారు. "నేనీ సరదా సంఘటనకి నవ్వుతున్నాను" అని చెప్పగానే ఓ రెండు స్మైలీలతో మన సంతోషాన్ని పంచుకుంటారు. "నాకు దిగులుగా ఉంది" అంటే వెంటనే భుజం తట్టి వెన్ను నిమిరి చెయ్యి పట్టుకుని నేనున్నా పదమంటూ ధైర్యంగా ముందడుగు వేయిస్తారు.<<
so true..బాగా రాసావు మధుర. మా అందరి మనసులో ఉన్న మాటలు నీ ద్వారా బయటకి వచ్చాయి :) అప్పుడప్పుడూ "ఈ" స్నేహితులు కలల్లోకి వస్తున్నారంటే అర్థం కావట్లేదు "ఈ బంధం దృఢమైనది" అని....నాగార్జున సిమెంట్ అంత :))
మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు.మీ టపా చాలా బాగుంది.నిజంగా
"ఈనాటి 'ఈ' బంధమేనాటిదో!"...నాకూ చాలా నచ్చింది .
మీ Post చాలా చాలా బాగుంది మధురవాణి గారు.
అద్భుతంగా రాస్తారు మీరు.మీ Blog తరచూ చదువుతూ ఉంటాను. ఈ Post కి Comment పెట్టకుండా ఉండలేకపోతున్న.
చాలా చాలా బాగా రాశారు
చాల బాగుందండీ నిజానికి వర్చ్యువల్ స్నేహలలో ఎమోషనల్ అటాచ్మెంట్ఎక్కువ వుంటుంది
మధురా.."ఈనాటి'ఈ'బంధం ఏనాటిదో!"కదూ..!
మనసు లోదిగులు గా వున్నప్పుడు నీ బ్లాగ్ తెరిసిచూస్తే చాలు .నేనున్నానమ్మా అంటూ పలకరించినట్లుగా అక్షర రూపం లో ఎదుట నిలుస్తావ్ ..
చాలా బాగా రాశారు మధుర గారు..:-) టచ్ చేసారు..:-)
"చెప్పడానికి చాలా తేలిగ్గా 'వర్చువల్' స్నేహాలే కావచ్చు కానీ ఈ 'ఈ' బంధాలు మన మొహాల్లో పూయించే నవ్వులు, మనసుల్లో ఊరించే సంతోషాలు, కళ్ళల్లో పొంగించే కన్నీళ్లు.. ఇవన్నీ వర్చువల్ కాదు, అన్నీ అచ్చంగా మనం మనస్పూర్తిగా అనుభవిస్తున్న, అనుభూతిస్తున్న, జీవిస్తున్న మన నిజమైన జీవితపు తాలూకూ చెరిగిపోని ముద్రలే కదూ!"
సో ట్రూ!
ఇదే కాదు, పోస్ట్‌లోని ప్రతి అక్షరంతో ఏకీభవిస్తాను.. చాలా బాగా రాశావ్, మధురా!
సౌమ్య అన్నట్టు మా మనసుల్లో ఉన్నదాన్నే ఎంతో హృద్యంగా చెప్పావు!
అవును కానీ, ఈ నేస్తాలెందుకు అన్నన్ని రోజులు ఊరెళ్ళిపోతారు.. అంత అవసరమా, పెద్ద! :(
:-)
True! and Such a nice post.. chala baga rasaru.. :) can see and feel the emotions..
నైస్ :)
మధురవాణి గారూ!...ఈ మధ్య సరదాగా ఈ కాన్సెప్ట్ టో వ్రాసిన ముఖపుస్తకపు మనోహరి o సారి చూడండి...
చాలా బాగా వ్రాసారు....కొన్ని స్నేహాలు వాస్తవికమైన నిజ జీవితపు స్నేహాల కంటే అపురూపం అనిపిస్తాయి...'ఈ' (అంతర్జాలపు) స్నేహాలు....@శ్రీ
http://srikavitalu.blogspot.in/2012/11/blog-post_11.html
@ వేణూ శ్రీకాంత్,
సేమ్ పించ్! థాంక్యూ! :)
@ కష్టేఫలే,
ధన్యోస్మి శర్మ గారూ! చాలా సంతోషంగా అనిపించింది మీ స్పందన చూసి.. :)
@ వనజవనమాలి,
అందరిదీ అదే భావం అన్నమాట.. ఈ మాట వినడం బావుందండీ.. ధన్యవాదాలు.
@ శ్రీరాం,
థాంక్సండీ.. :)
@ ధాత్రి,
that's so sweet of you. Thanks! :)
@ చిన్ని,
మీదీ అదే అభిప్రాయం అన్నమాట. ధన్యవాదాలండీ..
@ శిశిర,
థాంక్యూ డియర్! :)
@ బులుసు గారూ,
Am touched by your kind words. చాలా చాలా సంతోషంగా అనిపించింది మీ మాటలు విని. ధన్యవాదాలు.
@ ఆ. సౌమ్య,
అంతేనంటారా.. థాంక్యూ సో మచ్! :)
@ రాధిక (నాని),
ధన్యవాదాలండీ..
@ మధుర,
నా పేరుతోనే మిమ్మల్ని పిలవడం భలే సరదాగా ఉందండీ. :D
చాలా సంతోషపడిపోయానండీ మీ కామెంట్ చూసి.. నా బ్లాగుని ఫాలో అవుతున్నందుకు బోల్డు ధన్యవాదాలు.
@ శ్రీవిద్య,
'బ్లాగువనం' శ్రీవిద్య గారూ.. నా బ్లాగుకి స్వాగతమండీ.. Thanks for visiting my blog. :)
@ chinni v,
నిజమేనండీ. భలే పాయింట్ చెప్పారు. నాక్కూడా అలాగే అనిపిస్తుంటుంది. Thanks for the comment.
@ A Homemaker's Utopia,
:)) థాంక్సండీ..
@ Paddu,
మీ కామెంట్ చూసి బోల్డు సంబరపడిపోయానండీ.. నిజంగా నేనూ, నా అక్షరాలూ మీకు కాస్తైనా సంతోషాన్ని పంచుతున్నామంటే అంతకంటే ఇంకేం కావాలండీ.. Thanks for writing in. You made my day! :)
@ నిషిగంధ,
థాంక్యూ సో మచ్ డియర్! :)
పోన్లేద్దూ.. నేస్తాలు ఊరెళ్లినా లాప్ టాపులూ అవీ వెంట తీసుకెళ్తున్నారుగా పాపం.. అందుకని మరీ ఎక్కువ అలగకుండా ఈసారికి ఊరుకుందాంలే.. ఏమంటావ్? ;-)
@ అనంత్,
Great to hear it. Thank you! :)
@ ఫోటాన్,
థాంక్స్! :)
@ శ్రీ,
లింక్ ఇచ్చినందుకు థాంక్సండీ.. భలే రాసారు మీరు.. చాలా బాగుంది. :)
నిజం ఫ్రెండ్స్ కంటే ఈ-ఫ్రెండ్స్ ని ఎక్కువగా(దగ్గరదగ్గర రోజు)కలుస్తున్నాము,.అందువల్లనేమో అవి బలపడుతున్నట్లున్నాయ్,.మంచి టాపిక్,.
మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండీ బాబు......... మా తూర్పు గోదావరి యాస లో చెప్పాలి అంటే "సానా బాగా చెప్పారండి ఆయ్! మా కాకినాడ కాజా తిన్నట్టుంటుంది మీ టపాలు చదువుతుంటే. వెన్నెల్లో గోదావరి లాగ మా గొప్పగా ఉంటదండి మీ టపాలు ఆయ్1 మరి ఉంటానండి........... :) "
@ the tree,
సరైన పాయింట్ చెప్పారండీ.. ఎక్కడెక్కడో దూరంగా ఉన్నా సరే ఎప్పుడూ ఒక మెయిల్ దూరంలో ఉండి ఒకరికొకరు అందుబాటులో ఉండటం అనేది ఈ ఈ-స్నేహాలు బలపడటానికి అతి ముఖ్యమైన కారణం అనుకుంటాను. స్పందించినందుకు ధన్యవాదాలండీ..
@ అనంతం కృష్ణ చైతన్య,
అయ్ బాబోయ్.. అయ్ బాబోయ్.. ఎంత గొప్ప గొప్ప మాటలు సెప్పేరండీ నా అచ్చరాల గురించి... మీది మా దొడ్డ మనసండీ సైతన్య గోరూ.. :))
నేనెప్పుడూ మీ కాకినాడ కాజాలు తినలేదండీ.. మీరు రుచి చూపించేశారు ఇప్పుడు.. :D
చాలా సంతోషమయింది. మీకు బోల్డు బోల్డు ధన్యవాదాలు చైతన్య గారూ...
ప్రతి మాటా అక్షర సత్యమే మధురా...
Post a Comment