Wednesday, July 11, 2012

నిన్నైనా నేడైనా..


నిన్న చెప్పాను కదా.. 'మొదటి సినిమా' లో పాటలన్నీ బాగుంటాయని. ఇప్పుడు ఇంకో పాట చూడండి.

సిరివెన్నెల గారు ఎన్నో స్పూర్తివంతమైన పాటలని రాసినా మళ్ళీ ఇంకో కొత్త పాట రాసిన ప్రతీసారీ సరికొత్తగా "అవున్నిజమే కదా" అని మనం బుద్ధిగా తలూపేలా అలవోకగా బతుకు పాఠాలు చెప్తుంటారు. అలాంటి ఒక పాట ఇది కూడా!
ఈ పాటలోని ప్రతీ వాక్యం నిరాశా నిస్పృహల్ని తరిమేస్తూ ఉత్తేజాన్ని కలిగించేదిగా ఉంటుంది. పాటలోని భావానికి శంకర్ మహదేవన్ గళం తోడై మరింత ఉత్సాహాన్ని నింపుతుంది.

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా..
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా!
ఏ పూటకి ఆ పూటే.. బ్రతుకంతా సరికొత్తే..
ఆ వింతను గమనించే.. వీలున్నది కాబట్టే..
మన సొంతం కాదా ఏ క్షణమైనా!

ఎటు నీ పయనమంటే.. నిలిచేదెక్కడంటే..
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికి లేదే!
ఎదలో ఆశ వెంటే.. ఎగసే వేగముంటే..
సమయం వెనుకబడదా ఊహ తన కన్నా ముందుంటే!
మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా?
మనకే ఎందుకు పుట్టింది లేనిపోని ఈ ప్రశ్న?
మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా వరమైనా!

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా..ఒకలాగే పూర్తయ్యేనా!

కసిరే వేసవైనా.. ముసిరే వర్షమైనా..
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా!
మసకే కమ్ముకున్నా.. ముసుగే కప్పుకున్నా..
కనులే కలలు కంటే నిద్దరేం కాదని అంటుందా!
నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోద సంతోషం..
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోద ప్రతి గాయం..
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా!

నిన్నైనా నేడైనా.. రోజన్నది ఎపుడైనా..
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా!
ఏ పూటకి ఆ పూటే.. బ్రతుకంతా సరికొత్తే..
ఆ వింతను గమనించే.. వీలున్నది కాబట్టే..
మన సొంతం కాదా ఏ క్షణమైనా!

కొంచెం ఇదే ట్యూన్లో ఇంకొక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. అది శ్రీ కుమార్ పాడారు. అది కూడా చాలా బాగుంటుంది.

చేదైనా బాధైనా.. అన్నీ మామూలే..
మేడైనా కీడైనా.. ఎన్నో కొన్నాళ్ళే..
మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే..
ఎటు వైపున్నా నీ తీరం కలిసి వస్తుందే..

ఈ ఆల్బంలోని పాటలన్నీ ఒకే చోట 'రాగా'లో వినొచ్చు.

6 comments:

Sai said...

నేను సినిమా పాటలు పెద్దగా వినను అండీ.. కానీ ఈ పాట చాలా బాగుంది..
ధ్యాంక్యూ...

శ్రీ said...

కసిరే వేసవైనా.. ముసిరే వర్షమైనా..
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా!
మసకే కమ్ముకున్నా.. ముసుగే కప్పుకున్నా..
కనులే కలలు కంటే నిద్దరేం కాదని అంటుందా!
మంచి సాహిత్యం...మాకు పంచినందుకు అభినందనలు...
@శ్రీ

వేణూశ్రీకాంత్ said...

ఎస్ మంచి పాట.. ఈ సినిమాలో పాటలు అన్నీ బాగానేఉంటాయ్..

నిషిగంధ said...

నాకు ఈ సినిమాలో పాటలన్నీ చాలా ఇష్టం..
అన్నిట్లోకి ఫస్ట్ ఫస్ట్ నచ్చేది -- ఉరికే చిరు చినుకా.. సిరులొలికే చెలి చెలకా
ఈ పాట లిరిక్స్ కూడా నాకు బాగా నచ్చుతాయి :-)

అసలిలా పాటలన్నీ బావుండే సినిమాలు చాలా తక్కువ కదా!

మధురవాణి said...

@ సాయి, శ్రీ, వేణూ శ్రీకాంత్, నిషిగంధ..
ఈ పాటలు మీక్కూడా నచ్చినందుకు సంతోషం. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

@ నిషిగంధ,
ఉరికే చిరు చినుకా.. కూడా ఇష్టమే నాకు. అవున్నిజమే.. ఒకే ఆల్బం లో దాదాపు అన్నీ పాటలూ బాగుండటం అరుదైన విషయమే! :)

మధురవాణి said...

@ webtelugu

Thanks for your compliment.

I'm happy with my blog readership that I've now. Thanks!