నేను కొన్నాళ్ళ క్రితం రాసి పంపిన కథ 'సాహచర్యపు అంచున', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూలై' సంచికలో ప్రచురితమైంది.
నా కథని అంగీకరించి ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..
19 comments:
బాగుంది మీరు వ్రాసిన కథ. ఒక పాత్ర మనోగతంతో కథ నడిపించారు. బాగా వ్రాశారు. అభినందనలు మధురవాణి గారు!
congrats,
గుండె పట్టేసింది.
You have truly captured the most feared and painful phases of seeing the beloved one through the dark- hopeful times, clearer times when reality sinks in and life goes on..exceptional work Madhura garu!!
మధుర గారు :)ఇంతేనేమో జీవితం అంటే
Katha bagundi madhu!
ఎన్నో అనుకుంటాం, భయపడతాం..కాలం జీవినాన్ని నడిపిస్తుంది. కథాంశం బావుంది, చాలా చక్కగా వ్రాశారు. అభినందనలు మధుర గారు...
మనిషి ఎపుడూ ఒంటరికాడు...
ఒక్కరూ ఉన్నా తలపులు, జ్ఞాపకాలతోనే ఉండేది...
చనిపోయినపుడు ఓదారుస్తారు చూడండి...
"ఈ రోజు ఉన్న బాధ రేపటికి తగ్గుతుంది" అంటారు...
కథ, కథనం,..ముగింపు బాగున్నాయి...
మదురవాణి గారూ!అభినందనలు మీకు..
@శ్రీ
Congrats మధుర గారు !!
This is undoubtedly your best.You have set the right tempo with the first two lines of the story and carried it till the climax with excellent narration. Keep it up.
చాలా బావుంది, మధురా.. నీ నించి నేను ఆశించేవి ఇలా వైవిధ్యం ఉన్న రచనలే! చాలా పరిణితితో రాసినట్లు ఉంది.. కీప్ గోయింగ్ :-)
మధూ, నీ భావుకత్వంతో నిండిన రచనలకి అలవాటు పడిపోయిన నేను, నీనుంచి ఇంత పరిణితి ఉన్న అంశంతో కధ చూసి కొంచెం ఆశ్చర్యపోయాను.
చాలా బావుంది మధూ. ఇంతేనేమో, ఎవరున్నా, లేకపోయినా ఆగని నిరంతర జీవనయానం.. మనిషి బ్రతుకు.
Congrats Dear!
@ నిరంతరమూ వసంతములే, the tree, ఇందు,
కథ బావుందని అభినందించిన మిత్రులకి ధన్యవాదాలు.
@ కష్టేఫలే,
హ్మ్మ్.. ఏం చేస్తాం మరి.. మనసుని కష్టపెట్టేవి కూడా జీవితంలో ఒక భాగమని ఒప్పుకోక తప్పదు కదా శర్మ గారూ!
స్పందించినందుకు ధన్యవాదాలు.
@ Madhu Pemmaraju,
Thank you for your appreciation! It feels really nice to hear that I was able to translate all those complex feelings into my story.
@ జ్యోతిర్మయి, శ్రీ,
మీరు చెప్పింది నిజమేనండీ.. అదే మనిషి జీవితంలో ఉన్న చిత్రం. స్పందించినందుకు ధన్యవాదాలు.
@ స్వాతి శంకర్,
హ్మ్మ్.. నేను మీకు సమాధానం చెప్పలేనేమో వదినా.. "ఇంతేనా జీవితం అంటే?" అని మనం ఎంత ప్రశ్నించుకున్నా చివరికి "బహుశా ఇంతేనేమో జీవితం అంటే!" అని సరిపెట్టుకోడం మినహా వేరే ఏం చెయ్యగలమో తెలీడం లేదు.
@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషంగా అనిపించిందండీ.. ధన్యవాదాలు.
@ నిషిగంధ,
థాంక్యూ సో మచ్ నిషీ.. ఫలితం ఎలాగున్నా నా ప్రయత్నం నేను చేస్తుంటాను. :)
@ పద్మవల్లి,
అయితే మిమ్మల్ని సర్ప్రైజ్ చేసానన్నమాట.. థాంక్యూ సో మచ్! :)
మధురవాణిగారూ,
కౌముదిలో మీ "సాహచర్యపు అంచున" కథ చదివాను. బాగుంది. నా మట్టుక్కి ఇది మీ కుటుంబంలోనో స్నేహితులలోనో దగ్గరగా చూసిన ఒక వ్యక్తి నిజ జీవిత కథ అయి ఉండొచ్చుననిపించింది. అంత వాస్తవంగా ఉంది చదవడానికి. ఒక్కొకసారి దుఃఖం అమితంగా వచ్చినపుడు కళ్లంట నీళ్ళుకూడ రావు. అది సహజమే. అలాగే పోయిన వ్యక్తి స్మృతులుకూడా ఒక్కసారిగా మనల్ని వీడవు. అవి కాలక్రమంలోనే మరుగున పడతాయి. ఈ అభివ్యక్తి మీదాంట్లో బాగా కనిపించింది.
"పరిస్థితులకి తగ్గట్టుగా మనం సర్దిచెప్పుకుందికి, ధైర్యం చెప్పుకోడానికి ఏదో ఒక సిద్ధాంతం కావాలి మనిషికి"...
ఇది అక్షరాలా నిజం. దాన్ని ఆత్మవంచన అనుకున్నా, జీవితానికి రాజీ పడిపోవడమన్నా నాణేనికి రెండు వైపులే. మనం ఎటునుంచి చూస్తున్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి తాత్త్విక విషయాలు మీకు నల్లేరుమీద బండినడక అనిపిస్తుంది నాకు.
చివరగా ఒక్క మాట. ఇది కథకి సంబంధించని విషయం: ఇది కథ క్రింద రాదేమో. దీన్ని ఒక "ఘటనిక" అనవచ్చునేమో. కథకి ఉండవలసిన conflict, climax" ఇందులో లేవు.
అభినందనలు
@ nsmurty,
మూర్తి గారూ.. కథ చదివి ఇంత వివరంగా మీ స్పందన తెలియజేసినందుకు చాలా సంతోషమైంది. బోల్డు ధన్యవాదాలు.
ఎంతో కొంత ఊహలూ, ఆలోచనలూ కలగలిపి కథలు రాసినా అసలు కథలో ఆత్మా అనేది మన నిజ జీవిత అనుభవాల్లోంచో, మన కళ్ళ ముందు చూసిన వాటిల్లోంచో వస్తాయని నేను నమ్ముతాను. ఇదీ అలా పుట్టిన కథే! తాత్వికత అనేంత పెద్ద పెదాన్ని గురించి నేను చెప్పలేనేమో గానీ, ఎక్కువ ఆలోచించే అలవాటున్న వాళ్ళకి మాత్రం ఆ మనోమథనంలో నుంచి ఇలాంటి భావాలు పుట్టుకొస్తుంటాయి అప్పుడప్పుడూ. :)
ఇకపోతే వివిధ రకాలైన సాహితీ ప్రక్రియల గురించి నాకస్సలు అవగాహనే లేదు. అయితే దీన్ని కథ కన్నా ఘటనిక అంటే బాగుంటుందంటారా.. సరే, అలాగే అనేద్దాంలెండి. మీ విశ్లేషణాత్మక వ్యాఖ్యకి మరోసారి ధన్యవాదాలు.
Madhuravani Garu,
I read the story.You conveyed the feelings very well. I am not sure what is the best way to handle the death of you near and dear ones.
These are particularly scary thoughts for NRIs because they are so far away from their parents.
Great job. Keep writing.
Thanks
@ Raghu Sagili,
I'm glad that you liked my story. Thanks for the compliments!
బరువైన వృత్తాంతం !చాలా బాగా రాశావ్
Thanks Radhika! :-)
Post a Comment