Tuesday, July 10, 2012

నీకే నువ్వు అర్థం కావా ఎన్నాళ్ళైనా.. నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా!


ఇది 2005 లో వెంకట్ కూచిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మొదటి సినిమా' అనే సినిమాలో పాట. నవదీప్, పూనం బజ్వా జంటగా నటించారు. ఈ అమ్మాయి ఎక్కువ సినిమాల్లో రాలేదు గానీ చాలా ముద్దుగా ఉంటుందనిపిస్తుంది నాకైతే.
ఈ సినిమా హిట్ అయిందో లేదో తెలీదు గానీ నాకైతే నచ్చింది. కథ, కథనం చాలా కొత్తగా, వైవిధ్యంగా అనిపించింది. ఒక అమ్మాయి జీవితం కేవలం ఒకే రోజులో జరిగిన రకరకాల సంఘటనల ఆధారంగా మారిపోవడం.. సిండ్రెల్లా కథలా ఉంటుంది కొంచెం. బహుశా అందుకే నాకు నచ్చిందేమో మరి! :)

ఈ సినిమాలో పాటలన్నీ సిరివెన్నెల గారే రాసారు. స్వరాజ్ సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు పాటలన్నీ బాగుంటాయి. ఈ పాటలు ఎక్కువ మందికి తెలిసుండవేమో, నా బ్లాగులో పరిచయం చెయ్యాలని చాలా రోజుల నుంచీ అనుకుంటున్నా. మిగతా పాటల గురించి వీలు వెంబడి రాస్తాను. అన్నీటిల్లోకీ, ఈ పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. అందమైన సాహిత్యానికి, చక్కటి సంగీతానికి తోడుగా శ్రేయా ఘోషల్ మధుర స్వరం తోడవ్వడమే దానికి కారణం. పాట వీడియో కూడా బాగుంటుంది చూడటానికి.

ఒకోసారి ఎందుకో తెలియని దిగులుగా, అయోమయంగా, విషయం ఏంటో కూడా సరిగ్గా అర్థం కాని తిక్కలో ఉన్నప్పుడు నాకీ పాట గుర్తొస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మొదటి నాలుగు వాక్యాలు సిరివెన్నెల గారు నా గురించే రాసారేమో అనిపిస్తుంది..  :)))

నీకే నువ్వు అర్థం కావా ఎన్నాళ్ళైనా.. నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా!
ఏం కోరుతోంది అన్వేషణ.. మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా!

నీకేం కావాలో అడగాలనుకుంటే ప్రశ్నంటూ ఉండాలిగా..
నీ భావం ఏదో చెప్పాలనుకుంటే స్పష్టంగా తెలియాలిగా..
ఉయ్యాలలో పసిపాపలా.. కల ఆటలో అలవాటులా..
ఆరాటమే నెడుతుండగా పరుగెత్తకే తడబాటుగా..
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా!

నీకే నువ్వు అర్థం కావా ఎన్నాళ్ళైనా.. నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా!

ఈనాటి దాకా నీతోనే ఉందా నువ్వెతికే ఆ పెన్నిధి..
చేజారే దాకా నీకే తెలీదా పోయిందనే సంగతి...
నీ గుండెలో ఈ సవ్వడి ఇన్నాళ్ళుగా లేదే మరి..
ఏ గువ్వకో గూడైనది.. కనకే ఇలా బరువైనది..
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా!

నీకే నువ్వు అర్థం కావా ఎన్నాళ్ళైనా.. నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా!
ఏం కోరుతోంది అన్వేషణ.. మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా!

11 comments:

Unknown said...

ఈ సినిమా నేను కూడా చూసాను...
సిరివెన్నెల గారి లిరిక్స్ మనసుని చదివినట్లు గా చక్కగా రాసారు....
శ్రేయ గొంతు అద్బుతం కదా..చెప్పేదేముంది.
థాంక్స్ ఫర్ సాంగ్ :))

శ్రీ said...

సిరివెన్నెల గారి సాహిత్యమంటే...
చెప్పనక్కర్లేదు...
ఆయన్ని చాలా సార్లు అనకాపల్లిలో చూడటం జరిగింది...
10 సార్లు నంది అవార్డు తెచ్చుకున్న మహానుభావుడు..
చక్కటి సాహిత్యం...
శ్రేయా ఘోషల్..కొత్తవారిలో నా అభిమాన గాయని..(హిందీ)
మంచి పాట మరోసారి గుర్తు చేసారు మథురవాణి గారూ!
@శ్రీ

భాస్కర్ కె said...

nice song andi andi

జలతారు వెన్నెల said...

ఈ అమ్మాయి నాకు కూడా చాలా ముద్దుగా అనిపిస్తుందండి.
పాట ఇప్పుడే వినటం. చాలా బాగుంది.
మొదటి నాలుగు వాఖ్యాలు నిజంగానే చాలా బాగున్నాయి.
నిజంగానే మనకు మనం అర్ధం కావేమో, మనసేమంటుందో వింటున్నాకూడా!!!

హరే కృష్ణ said...

మొదటి రోజు విజయవాడ లో ఈ సినిమా చూసి బుక్ అయిన వాళ్ళలో నేనూ ఒకర్ని :)
సాహిత్యం ఈ బ్లాగు దయవల్ల వింటున్నా


సిరివెన్నెల గారు \m/

Anonymous said...

జ.వెన్నల గారి కామెంట్ లో మొదటి లైన్ తో ఏకీభవిస్తూ..వారి కామెంట్ కి డిటో పెడుతున్నా ... :))

అలాగే యాండీ గారి కామెంట్ లో లాస్ట్ లైన్ తో ఏకీభవిస్తూ వారి కామెంట్ ని కాపీ పేస్టు చేస్తున్నా..
*సాహిత్యం ఈ బ్లాగు దయవల్ల వింటున్నా*

--
Photon

రాజ్ కుమార్ said...

BINGO BINGO...
Poonam naa fav :) :) :)
cinema kooda baagane untundandi..
ee song super..picturisation kooda ;)

lyrics ippati varakoo observe cheyya ledu.. :( :( thnx for sharing :)

మధురవాణి said...

@ శేఖర్,
ఈ సినిమా ఎక్కువ మంది చూడల్దేమో అనుకున్నాను. అయితే మీరూ చూసారన్నమాట.. :)
అవును.. సిరివెన్నెల గారి పాటల గురించి కొత్తగా చెప్పేదేముంటుంది..
థాంక్స్ ఫర్ ది కామెంట్.

@ శ్రీ,
సిరివెన్నెల గారిని అన్నిసార్లు కలిసారా? ధన్యులు సుమా! :)
థాంక్స్ ఫర్ ది కామెంట్.

@ the tree,
థాంక్సండీ.. :)

@ జలతారు వెన్నెల,
అయితే సేమ్ పించ్ అన్నమాట.. :)
ఈ పాట మీకూ నచ్చినందుకు సంతోషం. థాంక్స్ ఫర్ ది కామెంట్. :)

మధురవాణి said...

@ హరే కృష్ణ,
ఓ.. అయితే నీకీ సినిమా అస్సలు నచ్చలేదా? :P
నేను థియేటర్లో చూడలేదులే.. ఇంట్లో చూసాను. నాకు బానే అనిపించింది మరి.. :)
థాంక్స్ ఫర్ ది కామెంట్.

@ ఫోటాన్,
నేను కూడా వాళ్ళిద్దరికీ చెప్పిన థాంక్స్ కాపీ పేస్ట్ చేసి నీకు చెప్తున్నాలే.. తీస్కో.. :D

@ రాజ్ కుమార్,
ఓహో.. నీ ఫేవరెట్స్ లిస్టు లో ఈ అమ్మాయి కూడా ఉందన్నమాట.. గుడ్ గుడ్.. :)
అయితే అమ్మాయిని చూస్తూ చూస్తూ పాట లిరిక్స్ మీద దృష్టి పెట్టలేదన్నమాట.. :)))
థాంక్స్ ఫర్ ది కామెంట్.

Unknown said...

బాగుంది పాటా, సాహిత్యమూ
ఎప్పుడూ వినలేదు, వినగానే ఆకట్టుకుంది. పిక్చరైజేషనూ చక్కగా ఉంది.
మరోమారు మంచి పాటని పరిచయం చేశారు.

మధురవాణి said...

@ చిన్నిఆశ,
ధన్యవాదాలండీ! :)