నేను ద్వేషించే ఈ దూరానికేం తెలుసు.. అది నాకు దగ్గరయ్యి ఎంత వేదన కలిగిస్తోందో! నేను ప్రేమించే ఆ దగ్గరితనానికీ తెలీదు.. అది దూరమైపోయి నన్నెంతగా వేధిస్తోందో!
నిజంగా దూరం ఇంత దగ్గరా.. ఎందుకిలా క్షణక్షణానికీ నాకు మరింతగా దగ్గరైపోతోందీ? దగ్గరితనం నిజంగా ఇంత దూరమా.. ఎందుకిలా నాకు అల్లంత దూరంలోనే ఆగిపోతోందీ?
మన మధ్యనున్న దగ్గరితనాన్ని చెప్పడానికి మాటలే కరువైపోతాయి.. కానీ, అదే దూరాన్ని కొలిచి చెప్పడానికి మాత్రం లెక్కలేనన్ని కొలమానాలు.. ఎంత విచిత్రం!
అనాయాసంగా రెప్పపాటులోనే నాకు ఇంత దగ్గరగా వచ్చేసిన నిన్ను దూరంగా తోసెయ్యడానికి మాత్రం ఎందుకసలు నాకున్న బలం సరిపోనట్టు ఉంటుంది?
అసలు దగ్గరవ్వడం ఎందుకు దూరమైపోడానికేనా? మరి అలాగైతే దూరమయ్యేది మాత్రం మళ్ళీ దగ్గరవ్వడానికి ఎందుకు కాదు!?
ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరమనే లెక్కే సరి అయితే.. దగ్గరయ్యేప్పుడు మన మధ్యనున్న దూరం క్షణాల్లో చేరువైపోయేంత దగ్గరగా అనిపిస్తుంది కదా.. మరి మనం దూరమైపోతునప్పుడు మాత్రం అదే దూరాన్ని కొలవలేనంత పెద్దదిగా ఎదిగిపోతుంది.. ఎందుకలా!?
నువ్వు దగ్గరగా ఉన్న క్షణాల్లో మొత్తం లోకాన్నే మర్చిపోతుంది మనసు.. దూరాన ఉన్నప్పుడు మాత్రం ప్రపంచంలోని బాధనంతా తనలోనే నింపుకున్నంతగా కృంగిపోతుంది.. ఎందుకలా?
అసలు మనమెప్పుడు ఇంత దగ్గరయిపోయామో మరపుకొచ్చేసినట్టుంది. ఎంత ఆలోచించినా గుర్తుకి రావడం లేదు.. కానీ, దూరమౌతున్న ఇప్పటి క్షణాలు మాత్రం శిలాక్షణాలుగా మారి శాశ్వతంగా మనసు మీద ముద్రించుకుపోతున్నాయి.. దూరానికెందుకు ఇంతటి జ్ఞాపకశక్తి?
అరక్షణంలో నేనే నువ్వైపోయేంత దగ్గరితనం మన సొంతం.. ఎన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణించినా చేరువ కాలేనంత దూరం కూడా మన సొంతమే కదూ!
అసలు ఎంతో దూరం దూరం అని వగచడం తప్ప, ఆ దూరం ఎంతని కొలవలేని నిస్సహాయతలో, ఈ దూరాన్ని ఈ జన్మకి కరిగించలేమన్న నిజాన్ని గుర్తించడానికి ఇష్టపడక అదే దూరాన్ని నిత్యం నిందిస్తూ ఎలా బతకడం?
అల్లంత దూరాన ఉన్న ఆ చందమామని కూడా చేరుకోగలిగిన ఈ యుగంలో ఇలా ఎన్నటికీ చేరుకోలేని ఈ దూరాభారాలు ఇంకా ప్రపంచంలో ఉండటం ఎంత చిత్రమో కదా!
ఒకోసారి చేరువలో కన్నా దూరంలోనే ఆనందం ఉంటుందేమో! జాబిల్లిని ఎంత దూరం నుంచి చూస్తే అంత అందం, ఆనందం కదూ.. దగ్గరికెళ్ళి చూడాలనుకుంటే ఆ అందం చెదిరిపోతుందేమో!
నిజమై నీ ఎదుటకొచ్చి నీకు దూరంగా నిలబడిపోడం కన్నా నీ కన్నుల్లో కలలాగా నీలోనే నిలిచిపోవడమే సౌఖ్యమేమో!
Monday, February 27, 2012
ఎంతెంత దూరం!?
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
Lovely :))
"దగ్గరయ్యేప్పుడు మన మధ్యనున్న దూరం క్షణాల్లో చేరువైపోయేంత దగ్గరగా అనిపిస్తుంది కదా.. మరి మనం దూరమైపోతునప్పుడు మాత్రం అదే దూరాన్ని కొలవలేనంత పెద్దదిగా ఎదిగిపోతుంది.. "
Truly said!!
-sree
నువ్వు దగ్గరగా ఉన్న క్షణాల్లో మొత్తం లోకాన్నే మర్చిపోతుంది మనసు.. దూరాన ఉన్నప్పుడు మాత్రం ప్రపంచంలోని బాధనంతా తనలోనే నింపుకున్నంతగా కృంగిపోతుంది.. ఎందుకలా?
అసలు మనమెప్పుడు ఇంత దగ్గరయిపోయామో మరపుకొచ్చేసినట్టుంది. ఎంత ఆలోచించినా గుర్తుకి రావడం లేదు.. కానీ, దూరమౌతున్న ఇప్పటి క్షణాలు మాత్రం శిలాక్షణాలుగా మారి శాశ్వతంగా మనసు మీద ముద్రించుకుపోతున్నాయి.. దూరానికెందుకు ఇంతటి జ్ఞాపకశక్తి?
chala baga chepparandi madhura garu...duranga unte premanuragalu balapadthay antaru...but ade duram manasunu krungipoyela chesthundi..
ఇది మనసు చేసే చిత్రం. చా...లా చక్కాగా చెప్పేరు.
"నేను ద్వేషించే ఈ దూరానికేం తెలుసు.. అది నాకు దగ్గరయ్యి ఎంత వేదన కలిగిస్తోందో! నేను ప్రేమించే ఆ దగ్గరితనానికీ తెలీదు.. అది దూరమైపోయి నన్నెంతగా వేధిస్తోందో!"
"అసలు ఎంతో దూరం దూరం అని వగచడం తప్ప, ఆ దూరం ఎంతని కొలవలేని నిస్సహాయతలో, ఈ దూరాన్ని ఈ జన్మకి కరిగించలేమన్న నిజాన్ని గుర్తించడానికి ఇష్టపడక అదే దూరాన్ని నిత్యం నిందిస్తూ ఎలా బతకడం?"
"నిజమై నీ ఎదుటకొచ్చి నీకు దూరంగా నిలబడిపోడం కన్నా నీ కన్నుల్లో కలలాగా నీలోనే నిలిచిపోవడమే సౌఖ్యమేమో!"
చాలా చాలా బాగుంది!
నువు ఎప్పటిలాగే రాసావ్..!బాగా ..!
సమీపించని దూరం- సమాప్తమవ్వని దగ్గరితనం
రెండింటిని బాగ పరిచయం చేసావ్..
నాకు అనుభవం లేక పరిచయమనే అంటున్న :)..
అక్కా!
"కాంతి సంవత్సరం" ఈ బహుతిక్కశాస్త్రాన్ని మళ్ళీ గుర్తుచేసినందుకు మరిన్ని ధన్యవాదములు.. :)
ప్రతి వాక్యం కవితాత్మకంగా విరిసింది. అభినందన!
అల్లంత దూరాన ఉన్న ఆ చందమామని కూడా చేరుకోగలిగిన ఈ యుగంలో ఇలా ఎన్నటికీ చేరుకోలేని ఈ దూరాభారాలు ఇంకా ప్రపంచంలో ఉండటం ఎంత చిత్రమో కదా!.... ఈ వాక్యాలు... మానవ సంబందాలలో ఉన్న వెలితిని ఒంటరితనాలను చాలమట్టుకు ఆలోచనలో పడేస్తాయ్... ఎప్పటిలాగే మీ రచనలో ప్రేమ .. హృదయాల తడి...మరల మమ్మల్ని తడిపేసిందండి.
దగ్గిరతనం మరీ దగ్గిరయి పోయినపుడు, ఆ దగ్గిరతనం దూరమయితే ఎంతగా వాపోతామో తెలియక, దగ్గిరతనానికి విలువనివ్వక దూరం చేసుకుంటుంటాము. దూరం పెరిగిపోయినపుడు, దూరమైపోయిన దగ్గిరతనానికీ - మనకు మధ్య, ఎంతటి దూరం ఏర్పడిందోనని వాపోతుంటాము. మళ్ళీ ఆ దూరాలు తగ్గి, దగ్గిరయితే ఎంత బాగుణ్ణో అని కలలు కంటాము. కోన్ని కొన్ని దూరాలనూ దూరం చేసుకుందామని ప్రయత్నించినకొద్దీ, దగ్గిరవుతూ పోతాయి. కొన్ని కొన్ని దూరాలు, కొద్ది పాటి ప్రయత్నంతోటే దూరమయి, 'ఏంటి మరీ ఇంత దగ్గిరతనమా' అనిపిస్తాయి. కథ మళ్ళీ మొదలు.
నిజమై నీ ఎదుటకొచ్చి నీకు దూరంగా నిలబడిపోడం కన్నా నీ కన్నుల్లో కలలాగా నీలోనే నిలిచిపోవడమే సౌఖ్యమేమో!
Excellent!!
@ శేఖర్, Sree, naveen gfxdesigner, puranapandaphani, కష్టేఫలే, అనుదీప్, నంద కిషోర్, Dr.Acharya Phaneendra, లోకనాథ్, తెలుగు భావాలు, హరేకృష్ణ..
స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. :)
@ నందకిషోర్,
"సమీపించని దూరం- సమాప్తమవ్వని దగ్గరితనం" --- ఈ మాట చాలా నచ్చింది. బాగా చెప్పారు.
హన్నా.. బహుతిక్క శాస్త్రమా.. ఆ చదువులు చదివిన వారెవరైనా వచ్చి పోట్లాడగలరు జాగ్రత్త.. :))
@ తెలుగు భావాలు..
Simply superb! ఎంతందంగా చెప్పారండీ.. దగ్గరితనం, దూరాలా గురించి రాద్దామనే నేనూ ఇలా ప్రయత్నించాను. నేను రాసినదాని కంటే మీరు రాసిందే ఎక్కువ నచ్చేసింది నాకు. Thanks for the comment! :)
"నేను ద్వేషించే ఈ దూరానికేం తెలుసు.. అది నాకు దగ్గరయ్యి ఎంత వేదన కలిగిస్తోందో! నేను ప్రేమించే ఆ దగ్గరితనానికీ తెలీదు.. అది దూరమైపోయి నన్నెంతగా వేధిస్తోందో!"
అద్భుతం గా చెప్పారు
Thanks Bharath! :)
Post a Comment