Tuesday, January 24, 2012

మాయదారిపురం గోల్డ్ లోన్

"అబ్బబ్బా.. పిల్లల్ని స్కూలుకి రెడీ చెయ్యాలంటే గంటసేపు కష్టపడాల్సి వస్తోంది.."
"
అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే రెండు నిమిషాల్లోనే తీసేస్కోవచ్చు.."

"
చాలా ఆకలేస్తోంది.. బాబూ ఒక చికెన్ బిర్యాని పార్సెల్.."
"
కనీసం అరగంట వెయిట్ చెయ్యాలండీ.."
"
అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే క్షణాల్లో రెడీ.."

"
హబ్బా.. హైదరాబాద్ ట్రాఫిక్లో పార్కింగ్ వెతుక్కోవాలంటే రెండు గంటలు పడుతుంది.."
"
అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే అయిదే నిమిషాలు.."

"
ఓహ్.. ఈ షాప్ కి సండే సెలవంట.. మూసేసి ఉంది.."
"
అదే మాయదారిపురం స్టోర్ అయితే ఆదివారం కూడా నిమిషాల్లో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.."

**************

ఏంటీ.. ఈ పిల్లకి ఉన్నట్టుండి పిచ్చేక్కిందేమో పాపం అని కంగారు పడుతున్నారా.. ఇంకా పరిస్థితులు అందాకా రాలేదు గానీ విషయం ఏంటో వివరంగా చెప్తానుండండి.
నేను పైన చెప్పినవన్నీ ఒక బంగారం తాకట్టు దుకాణానికి సంబంధించిన రేడియో ప్రకటనలు..
అంటే వాళ్ళ ఉద్దేశ్యం.. తిండి, పిల్లలు లాంటి వాటన్నీటి కన్నా గోల్డ్ లోన్ తీస్కోడం ఈజీ కాబట్టి మీకవసరం ఉన్నా లేకపోయినా అర్జెంటుగా వచ్చి తీసేస్కోండి అనా.. లేకపోతే పనీ పాటా చేస్కోడం కష్టం.. గోల్డ్ లోన్ తీస్కోడం సులువు.. అందుకని ఆ పని చెయ్యండనా??
అసలు మీకేమన్నా అర్థమైందా ఈ ప్రకటనల సారాంశం ఏంటో.. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీకెవరికైనా ఈ క్రియేటివిటీలో లాజిక్కు అర్థమైతే దయ చేసి నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి..

నేను వంట పనో, ఇంటి పనో చేస్తున్నప్పుడు హైదరాబాద్ FM రేడియో వింటూ ఉంటాను అప్పుడప్పుడూ. అయిదు నిమిషాలకోసారి వచ్చే వీళ్ళ ప్రకటనలు వినీ వినీ నాలో దాగున్న సృజనాత్మకత వెర్రి తలలు వేసి ఆశువుగా వీళ్ళ కోసం మరి కొన్ని ప్రకటనలు సూచించాలనిపిస్తోంది..

"
అన్నం తినడం వేస్టు.. గోల్డ్ లోన్ తీస్కోడం బెస్టు.."
"
స్నానం చెయ్యడానికి పావుగంట.. గోల్డ్ లోన్ కి రెండే నిమిషాలు.."
"
పరీక్షలు రాయడానికి మూడు గంటలు.. గోల్డ్ లోన్ కి ఐదే నిమిషాలు.."
"
ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం.."

ఎలా ఉన్నాయి స్లోగన్స్.. వాళ్ళ తాహతుకి తగ్గట్టు ఉన్నాయంటారా? మీకింకా బెటర్ అయిడియాలు వస్తే చెప్పండి.. ఎంచక్కా మాయదారిపురం గోల్డ్ లోన్ వాళ్ళు వాడేసుకుని ఇంకా జనాల్ని చావగొట్టేస్తారు.. sengihnampakgigi

సరే సరే.. ఇప్పుడు నాకు ఆకలేస్తోంది.. మా కెఫేటీరియాలో లంచ్ కోసం పది నిమిషాలు ఎదురు చూడాల్సి వస్తుంది. అయినా మాయదారిపురం గోల్డ్ లోన్ ఉండగా అంతసేపు ఎదురు చూడాల్సిన ఖర్మ నాకేం పట్టింది చెప్పండి. అందుకని నేను అన్నం తినడం మానేసి అర్జెంటుగా వెళ్ళి మాయదారిపురం గోల్డ్ లోన్ తీసుకుని వస్తాను. jelir

28 comments:

వేణూ శ్రీకాంత్ said...

అబ్బా మీ బ్లాగ్ లో కామెంట్ రాయాలంటే రెండు నిముషాలు పడుతుందీ.. అదే మాయదారిపురం గోల్డ్ లోన్ ఐతే క్షణాల్లో రెడీ :-)

ఫోటాన్ said...

>>>>>>"ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం.."<<<<

కేవ్వ్వ్వవ్వ్వ్వ్.... :)))))))

గిరీష్ said...

Super.. :)

రాజ్ కుమార్ said...

ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం..

ఇది హైలైట్.. ;)

రాజ్ కుమార్ said...

వెంకటేష్ బాబు ని అడిగితే మీకు కావల్సిన ఇన్ఫో కరెక్ట్ గా వస్తాదేమోనండీ ;)
అక్కడికేదో ఫ్రీగా ఇస్తున్నట్టూ వెధవ బిల్డప్పూ వీళ్ళూనూ..

ట్రింగ్..ట్రింగ్..

మీ బ్యాంక్ లో గోల్డ్ లోన్ హెయిర్ కటింగ్ లాంటిది[20నిమిషాలు]
మా మనప్పురం లో గోల్డ్ లోన్ గుండు గీయటం లాంటిది[2నిమిషాలు]

తలకట్టు లేని అక్షరం కన్నా తాకట్టు పెట్టు బ్యాంకే మిన్న.. రండి మాయదారిపురానికి

ట్రింగ్..ట్రింగ్..

ఆ.సౌమ్య said...

>>ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం<< కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

మాయదారిపురం గోల్డ్ లోన్ కి ఒక్క నిముషమేగానీ రేడియో పీక నొక్కడానికి ఒక్క సెకెను చాలు :)))

జయ said...

మొత్తానికి ఆ మయదారిపురానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినట్లున్నారే:))) మీ గోల్డ్ జాగ్రత్తండి బాబు. వాళ్ళిలాగే మాయ చేసేస్తారు.

రాజేష్ మారం... said...

:) :)

జ్యోతిర్మయి said...

:))

నిషిగంధ said...

నాకు నిజంగానే కాసేపు అర్ధం కాలేదు, మధురా.. అర్ధమయ్యాక... :))))

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> "ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం.."

అహా. మాయదారిపురం లో గోల్డ్ లోన్ తీసుకొని తీరుబడిగా ఉరేసుకోవచ్చు నా?

తెలుగు పాటలు said...

ఏమిటి మధురవాణి గారు డబ్బులు కాసే చెట్టే ఉండాలా మరచిపోయారా మనపూరమా మజాకానా ఈ యఫం ఆర్ జే లా బాధ బరిన్చాలేకపోతున్నాం మరి బరించలేని వాళ్ళు అంటే బిగ్ ల వచ్చే రాక్ స్టార్ రవి (వీడికి స్టార్ అని ఎవడు ఇచ్చాడో) అంటా వీడు మారి పరమ బూతులు వాడుతాడు.. ఆర్ జే అనే వర్డ్ కి మీనింగ్ లేకుంట చేస్తున్నారు.. వాగటం వస్తే ఆర్ జే అయిపోవచ్చు అని ఈ మద్యనే తెలిసింది

స్ఫురిత said...

ఇది చదివి నవ్వాపుకోడానికి 5 నిమిషాలు పట్టింది... గోల్డులోనైతే ఇంతసేపు పట్టదు కదా...:)))

"చిన్ని ఆశ" said...

అన్నం అర గంటలో ready అయ్యి మన ప్లేట్ లో ఉంటే ముద్ద నోట్లో పెట్టుకోటానికి అర సెకను...
మాయదారి గోల్డ్ లోను నెలరోజుల్లో వచ్చేసి అన్ని లావా దేవీలు చూసుకుని చేతుల్లోకి తీసుకోటానికి రెండు నిమిషాలు....
ఈ మాయదారి అడ్వర్టైజ్ మెంట్లు విని మోసపోయేంత మాయదారిలోకం లో హైదరాబాదు జనాలున్నారంటారా?
ఊరికే రేడియోల్లోనూ, TV ల్లోనూ విసిగించటం తప్ప...
;)

శేఖర్ పెద్దగోపు said...

మధుర బ్లాగు చదూతున్నప్పుడు స్నో ఫ్లేక్స్ పైనుండి క్రిందకు పడటానికి ఒక నిమిషం...అదే దురదపురం గోల్డ్‌లోన్ అయితే పావు నిమిషం...:-))

'Padmarpita' said...

మీరు పండించిన నవ్వులే చాలు...
గోల్డ్ వద్దు లోన్ వద్దు..హ హా:-)

రసజ్ఞ said...

హహహ బాగుందండీ! అన్నం తినడం మానేసి అర్జెంటుగా వెళ్ళి మాయదారిపురం గోల్డ్ లోన్ తీసుకుని వస్తాను అన్నారు ఇంకా నయ్యం అన్నం బదులు గోల్డ్ తిన్నారు కాదు! వాడేదో అప్పనంగా ఇస్తునట్టు!

@ రాజ్ కుమార్ గారూ

తలకట్టు లేని అక్షరం కన్నా తాకట్టు పెట్టు బ్యాంకే మిన్న హహహ!

Anonymous said...

బాగుంది.

మనసు పలికే said...

అమ్మా మధురా..;) ఎందుకు ఇంత కక్ష మా మీద??? FMలోనే విని నవ్వుకోలేక చస్తున్నాం. ఇప్పుడు నీ క్రియేటివిటీ కూడా తోడయ్యింది :D.. టపా సూపరు.

రాజ్, వేణు గారి వ్యాఖ్యలు కూడా అదుర్స్..

kallurisailabala said...

మధురా! నాకు అర్ధం కాని విషయం ఏంటంటే మీ అవసరాలకి డబ్బు గురించి బెంగ ఎందుకు బంగారం లోన్ తీసుకోండి అంటున్నాడు బానే ఉంది కాని ఆ బంగారం లేకపోతె పరిస్థితి ఏంటి ?మంచి పోస్ట్ రాసావు. నాకు నచ్చింది

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్,
మీరు సూపర్ గా అసలు.. నా బ్లాగు కామెంట్లకే ఎసరు పెట్టేశారు.. :)))

@ ఫోటాన్, గిరీష్, రాజేష్ మారం, జ్యోతిర్మయి, కష్టేఫలె..
నేస్తాలందరి నవ్వులకి బోల్డు థాంకులు.. :)))

@ రాజ్ కుమార్,
హహ్హహ్హా.. నిజమే.. గోల్డ్ లోన్ గుండు గీయడం లాంటిదే.. సరైన పోలిక చెప్పారు.. మీ ప్రకటనలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాయల్టీ చెల్లించి వాడుకోమని చెప్దాం మాయదారిపురం వాళ్లకి.. ;)

మొన్నీ మధ్య ఒక జోక్ చూసాను రాజ్. ఏ సినిమాలోదో తెలీదు. 'అలా మొదలైంది' సినిమా క్లైమాక్స్ లో వచ్చే తాగుబోతు అబ్బాయి ఉంటాడు చూడు.. అతనిది జోక్.. నాగార్జున, వెంకటేష్ ఇద్దరూ కలిసి తెగ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండీ నన్ను అంటాడు. ఎందుకంటే.. నాగార్జున చెప్పాడని కళ్యాణ్ జ్యూయేలర్స్ లో బంగారం కొని వెంకటేష్ చెప్పాడు కదాని తాకట్టు పెట్టేశాను అంటాడు.. భలే నవ్వొచ్చింది అది చూసి.. :))))

మధురవాణి said...

@ ఆ. సౌమ్య,
మీ అయిడియా బాగుంది గానీ.. పాటల కోసం కదా మనం రేడియో వినడం.. అయినా, వీళ్ళు ఎన్ని డబ్బులిస్తారో తెలీదు గానీ మరీ ఐదు నిమిషాలకోసారి వాయించేస్తుంటాడు వీళ్ళ ప్రకటనలతో.. నిజంగా హింసే అది మాత్రం..

@ జయ,
వామ్మో.. మాయదారిపురానికి బ్రాండ్ అంబాసిడరా.. వద్దులెండి.. అంత మహద్భాగ్యం నాకెందుకు.. :P
మరేం పర్లేదు..నా దగ్గర తాకట్టు పెట్టేంత గోల్డ్ లేదులెండి.. ;)
అయినా, మరీ ఈ రేంజ్ లో ప్రకటనలిస్తే అసలెవరైనా నమ్ముతారా అని సందేహం.. :)

@ నిషిగంధ,
ప్రకటనలు విన్న కొత్తలో నాదీ అదే పరిస్థితి నిషీ.. కానీ, వాళ్ళంత తొందరగా వదలరు కాబట్టి.. మళ్ళీ మళ్ళీ విని అర్థమైంది వాళ్ళ ఘోష పాపం.. :P

@ బులుసు గారూ,
బ్రహ్మాండంగా ఉరేస్కోవచ్చంటండీ.. వాళ్ళ గోల్డ్ లోన్ తీసుకున్నాక ఇంక మిగిలేది అదేగా మరి.. :)))

మధురవాణి said...

@ తెలుగు పాటలు,
ఈ డబ్బుల చెట్టు కాన్సెప్ట్ కూడా వీళ్ళదేనాండీ.. నేను వినలేదు అయితే.. మిస్సయ్యానేమో..
నేను అప్పుడప్పుడూ రేడియో మిర్చి, రెడ్ FM వింటూ ఉంటానండీ.. బిగ్ FM ఎప్పుడూ వినలేదు. కొంతమంది రజ్ లని భరించడం కష్టమేనండీ.. అయినా వాళ్ళని మాత్రమే తప్పు పట్టలేం.. వాళ్లకి కాల్ చేసే శ్రోతలు కూడా అదే స్థాయిలో హింసిస్తుంటారు.. :P

@ స్ఫురిత,
మీరు సూపరండీ.. అసలు పాయింట్ టక్కున క్యాచ్ చేశారు.. :)))

@ చిన్ని ఆశ,
ఏమోనండీ మరి.. అన్ని డబ్బులు పోసి ప్రకటనలిస్తున్నారంటే, వాళ్ళ వ్యాపారం బాగానే సాగుతోందేమో మరి.. మనకి తెలీదు. ఆ మధ్య ఒకసారి ఏదో గొడవలు కూడా అయినట్టున్నాయి. ఒకసారి పేపర్లో ఏదో న్యూస్ వచ్చింది. ఎవరో వీళ్ళు మోసం చేశారనో ఏదో కేసు పెట్టినట్టున్నారు.. నాకు సరిగ్గా గుర్తు లేదిప్పుడు.. ఇలాంటివి ఎంతమంది నమ్ముతారో మనకి తెలీదు మరి!

మధురవాణి said...

@ శేఖర్ పెద్దగోపు,
హహ్హహ్హా... బాగుంది మీ ప్రకటన.. :))

@ పద్మార్పిత,
బంగారం లాంటి మాట చెప్పారు. ఈ తాకట్లూ అవీ మనకొద్దు గానీ
మీ బంగారాన్ని దగ్గరే భద్రంగా ఉంచుకోండి.. :))

@ రసజ్ఞ,
ఏంటండీ నిజంగానే అన్నం బదులు గోల్డ్ లోన్ కోసం వెళ్ళాననుకున్నారా ఏవిటీ! మరీ అంత ఘోరాలు తలపెట్టనులెండి.. :)
వాళ్ళ ప్రకటనలు అలానే ఉంటాయండీ అప్పనంగా ఇస్తున్నట్టు.. :))

@ మనసు పలికే,
నువ్వెక్కడా కనిపించట్లేదు కదా అపర్ణా.. ఇలా బంగారం పేరు చెప్తేనన్నా బయటికొస్తావేమోనని ఈ పని చేశానన్నమాట.. సరదాకి అంటున్నాలే.. థాంక్స్ ఫర్ ది కామెంట్.. :))))

@ శైలబాల,
అదే మరి తెలివంటే.. ఏదో సామెత చెప్పినట్టు.. "ఆయనే ఉంటే మంగలితో ఏం పనీ అని.." :))
ఇది వాళ్ళ వ్యాపార సూత్రం శైలూ.. మీరు బంగారం తాకట్టు పెట్టుకునేట్టయితే వేరే ఎవ్వర్నో కాకుండా మమ్మల్నే బాగు చెయ్యండి అని.. అంతే గానీ మేమేదో మిమ్మల్ని ఉద్ధరిస్తాం అని కాదు కదా! :)

Raj said...

హ హ హ.. మీరు కూడా ఈ Ad భాదితులేనన్నమాట.. ఇంత కాలం నేను ఒక్కడినే అనుకునే వాడిని..

ఇంతకీ ఈ టపా వ్రాయటానికి ఎంత సమయం పట్టింది? అదే ఋణం తీసుకోటానికి ఒక్క నిమిషమే... :)

మధురవాణి said...

@ Raj,
హహ్హహ్హా... భలేవారే.. FM రేడియో వినే వాళ్ళలో కనీసం సగం మంది అయినా వీళ్ళ ప్రకటనలని హింసలాగే ఫీలవుతారని నా నమ్మకం.. కాబట్టి బాధ పడకండి.. మీరొక్కరే కాదు.. :)))
బాగుంది మీ ప్రకటన కూడా.. :D

ప్రసీద said...

పొయ్యి మీద మాగీ పెట్టండి.. అది ఉడికే రెండు నిమిషాల్లో మహామాయపురం వారి గోల్డ్ లోన్ ఇంటిఖి తెచ్చేసుకోండి. హాయిగా మాగీ తినండి.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

మధురవాణి said...

@ ప్రసీద,
హహ్హహ్హా.. వాట్ యాన్ ఐడియా మేమ్ సాబ్! :))))