
నన్ను దాటి ఎక్కడికీ నీ పయనం..
నా చిరునవ్వుని నీతో పాటు తీసుకెళ్ళిపోతావా..
నా చూపుల్లో నువ్వు వెలిగించిన కాంతి రేఖల్ని చీకటిగా మారుస్తావా..
నాలో నువ్వు శృతి చేసి పలికించిన రాగాల్ని మూగబోమంటావా..
నా అరచేతిలో నువ్వు గీసిన అదృష్ట రేఖని చెరిపేస్తావా..
నీ స్పర్శతో నా బుగ్గల్లో పూసిన మెరుపుల్ని మాయం చేస్తావా..
నా మనసుకి నువ్విచ్చిన కొత్త రెక్కల్ని తెంపుకుపోతావా..
నా పాదాలకి నువ్వు నేర్పిన పరుగులని ఆపమని శాసిస్తావా..
నా వయసుకి నువ్వు అద్దిన సప్తవర్ణాలని వెలిసిపోమంటావా..
నీ నవ్వులతో ప్రాణం పోసుకున్న నా ప్రేమలతని వాడిపోమంటావా...
సదా నీ పేరునే పలవరించే నా గుండె లయని ఆగిపొమ్మంటావా..
ప్రేమించడమెలాగో నేర్పించావు గానీ.. మానడమెలాగో చెప్పనే లేదే..!
13 comments:
ఇంత సున్నితంగా అడిగితే..... మరచిపొమ్మని అనడానికి మనసెలా వస్తుంది చెప్పండి?:-)
@మధురవాణి గారు అసలు అలాంటి ప్రేమ వాడిపోదండి ... అమావాస్య చంద్రుడు అలిగినంత మాత్రాన మరునాడు చీకటి రాకుండా ఉంటుందా ఏంటి .. ఏదోక విధంగా వచ్చేస్తుంది ... మీ విన్నపం అలా ఉంది మరి, కావున ప్రేమ ఎక్కడికి పోదు ..
చాలా బావుంది
@ పద్మార్పిత,
హహ్హహ్హా.. అంతేనంటారా? అనకపోతే మంచిదేననుకోండి.. కానీ, ఒక వేళ అలా అంటే మాత్రం మనం తిరిగి ఇంత కన్నా ఏమనగలం చెప్పండి.. ;)
@ కళ్యాణ్,
అమావాస్య చంద్రుడు అలిగినంత మాత్రాన మరునాడు వెన్నెల రాకుండా పోతుందా అనేనా మీ ఉద్దేశ్యం? లేకపోతే చీకటనేనా?
మీరు పొరపాటున రాసారో, నాకు సరిగ్గా అర్థం కాలేదోనని సందేహంగా ఉందండీ..
ఏమైనా.. మీ ఆశావాద దృక్పథం బావుంది.. ధన్యవాదాలు. :)
@ లత,
ధన్యవాదాలండీ! :)
@మధురవాణి గారు నా ఉద్దేశం చీకటని అండి .. చంద్రుడు అలుగుతాడు కాబట్టి అమావాస్యకు రాడు కాని చీకటి అలగకుండా బుజ్జగిస్తుంది కాబటి మరునాడు సర్లే పోనీ అని వంక పెట్టుకొని నెలవంకలా వచేస్తాడు ... అలాగే మీ బుజ్జగింపుకు ప్రేమ తిరిగి రాకుండా ఉంటుందా అని నా ఉద్దేశం... :)
@ కళ్యాణ్ గారూ,
బావుందండీ మీ ఊహ... చందమామ సర్లే పోనీ అని వంక పెట్టుకుని నెలవంకలా వచ్చేస్తాడంటారా నా కోసం!
How sweet! :)
అయితే నేను జాబిల్లి కోసం ఎదురు చూస్తూ బుజ్జగిస్తున్న చీకటినంటారు.. అమావాస్య అయిపోగానే చందమామ వచ్చేస్తాడంటారు. అంతేగా! :)
Thanks for your explanation!
@madhuravaani gaaru anthe anthe andi :) dhandhemundhi parledhu meeku dhanyvadhaalu
:))
Bhavundhi...
అమ్మా మధుర..నేను చెప్పానా...నిన్ను వదిలి వెళ్తున్నా అని..ఇలా post రాసేసావ్ :P
బాబోయ్ తల్లి మధుర..కేక :))
@ భారతీయ,
థాంక్స్.. :)
@ కిరణ్,
హహ్హహ్హా... అంటే కిరణూ.. ముందే ఇలా చెప్పెసాననుకో.. అప్పుడు వదిలి వెళ్తున్నానని అసలెవరూ చెప్పలేరు కదా... అదన్నమాట నా దూ(దు)రాలోచన.. థాంక్యూ.. :))
మధూ.. రచనంతా ఒకెత్తైతే, ఆ చివరి లైన్ మరొక ఎత్తు. అద్భుతం అంతే :):)
థాంక్యూ అప్పూ డియర్.. :)
Post a Comment