Friday, May 20, 2011

ఒక బ్లాగు మీ జీవితాన్నే మార్చేస్తుంది!

సభకు నమస్కారం! అంటే, బ్లాగులూ బజ్జులూ అవీ చూడక చాలా రోజులైపోయింది కదాని టైపులో రీ-ఎంట్రీ అన్నమాట! :)
రోజు నేను మీ అందరికీ బ్లాగులు-వాటి విలువ, బ్లాగులు-వాటి ప్రాశస్త్యం, బ్లాగులు రాయడం- తద్వారా జరిగే పరిణామాలు అనే అంశానికి సంబంధించిన ఒక ముచ్చట చెప్తాను. బుద్ధిగా గడ్డం కింద చేతులు పెట్టుక్కూర్చుని సావధానంగా వినండి.

మధ్య బొత్తిగా పనీ పాటా లేకుండా ఖాళీగా కూర్చుని ఏం చెయ్యాలో తోచనప్పుడు నాకు కనీసం గోళ్ళు గిల్లుకునే అలవాటు కూడా లేకపోవడం చేత ఇహ తప్పక 'ఏమైందీ వేళ' అనే ఒక తెలుగు సినిమా చూసాను.

సినిమాలో వీరో వీరోయిన్లు ఇప్పటి స్పీడ్ యుగానికీ, స్పీడ్ ప్రేమలకీ మాత్రం తగ్గకుండా అలా అలా ప్రేమలో పడి మునిగిపోవడం చేత ఇంట్లో వాళ్ళని కూడా ధైర్యంగా ఎదిరించి నిలబడి చక చకా రిజిస్టర్ పెళ్లి చేసేసుకుంటారు. ఒక రెండు డ్యూయెట్లు పాడేసుకున్న తరవాత వన్ ఫైన్ నైట్ టీవీలో వస్తున్న రామాయణం సినిమాలో సీన్ చూస్తూ సీత గురించి మొదలెట్టిన వాదన కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారి నువ్వెంతంటే నువ్వెంతని అరిచేసుకుంటారు. నేను తలచుకుంటే నీకంటే అందమైన వాడిని/దాన్ని క్షణాల్లో పెళ్ళి చేసుకోగలను.. చిటికేస్తే జనాలు క్యూలో నించుంటారు నా చెయ్యందుకోడానికి అన్న రేంజ్ లో ఇద్దరూ చెడామడా తిట్టేసుకుని 'లెట్స్ బ్రేకప్' అనుకుంటారు.

ఒకరి మీద ఒకరికి పీకల దాకా ఉన్న కోపంతో విడిపోయి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి యమా స్పీడ్ గా డైవోర్స్ కూడా తీసేస్కుని రెండో పెళ్ళికి సిద్ధపడతారు. కాబోయే రెండో భర్త/భార్యకి పాత ప్రేమ-పెళ్ళి కథ చెప్తున్నట్టుగానే సినిమా నెరేషన్ నడుస్తుంది మొదటి నుంచీ.
ఇద్దరూ పోటాపోటీగా రెండో పెళ్ళి కోసం నిశ్చితార్థం, పెళ్ళి తేదీ నిర్ణయాలు వగైరా చేసుకుంటూ ఉండగా ఎప్పట్లాగే అనాదిగా వస్తున్న మన తెలుగు సినిమా సాంప్రదాయాన్ని అనుసరించి మనసులో మొదటి భర్త/భార్య మీద కోపం క్రమేణా పోయి మళ్ళీ బోల్డంత ప్రేమ తన్నుకువచ్చేస్తుంటుంది ఇద్దరికీ. అయినా గానీ, ఒకరి కంటే ఒకరు ముందు రెండో పెళ్ళి చేసుకుని తమ గొప్పతనాన్ని ప్రదర్శించాలనే అహంకారంతో పెళ్ళికి సిద్ధపడతారు.

అలా అలా సినిమా క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఊహించని ట్విస్ట్ వస్తుంది. సరిగ్గా రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు పెట్టె టైముకి ఇద్దరికీ జ్ఞానోదయం అయిపోయి రెండో పెళ్ళి కాన్సిల్ చేసుకుని మళ్ళీ వాళ్ళిద్దరూ కల్సుకోడంతో కథ సుఖాంతం అవుతుంది.

ఇంతకీ ఇక్కడ పెళ్ళి ఆగిపోయిన సందర్భంలో వచ్చే ఆసక్తికరమైన అమోఘమైన ట్విస్ట్ గురించే మీకు నేను చెప్పాలనుకుంది.
రిజిస్ట్రార్ ఆఫీసులో హీరో పెళ్ళి సంతకం పెట్టబోయినప్పుడు సదరు రెండో హీరోయిన్ గంభీరంగా 'ఆగు..' అంటుంది.
'నిజంగా నువ్వు నీ మొదటి భార్యని పూర్తిగా మర్చిపోయావా?' అని ఘట్టిగా నిలదీస్తుంది.
ఇంతకు ముందు ప్రశ్న అడిగినప్పుడల్లా 'ఇంకా లేదు.. ప్రయత్నిస్తున్నాను' అని చెప్పిన హీరో గారు ఇప్పుడు మాత్రం 'పూర్తిగా మర్చిపోయాను' అంటాడు.
దానికి రెండో హీరోయిన్ పాపం దీనంగా మొహం పెట్టి ' మాట నిజమైతే నేనెంతో సంతోషించేదాన్ని' అంటుంది.
హీరో మొహం వేళ్ళాడేస్తాడు. చుట్టూ ఉన్న అందరూ నోర్లు తెరుచుకుని చూస్తుంటారు పాపం.

ఇంతలో సరిగ్గా అప్పుడే రెండో హీరోయిను కెవ్వు కేక లాంటి డైలాగ్ చెప్తుంది. 'ఒరే హీరోగా.. నేను నీ బ్లాగ్ ఫాలో అవుతూనే ఉన్నానురా.. నువ్వు నీ మొదటి భార్యని మర్చిపోలేకపోతున్నావనీ, తనని మిస్ అవుతూ బాధ పడుతున్నావని, నన్ను పెళ్ళి చేసుకోవడం కరెక్టా కాదా అని పెద్ద డైలమాలో ఉన్నావని నువ్వు నీ బ్లాగ్లో రాసింది నేను చదివాను. నువ్వు కనీసం పెళ్ళి టైముకన్నా అయోమయం పోగొట్టుకుని కాస్త క్లారిటీ తెచ్చుకుంటావని ఆశించాను. కానీ, నువ్వు బొత్తిగా రొటీన్ తెలుగు సినిమా హీరోలానే పశ్చాత్తాపపడుతున్నావు.. మొదటి భార్యే కావాలనుకుంటున్నావు. ఇహ ఇప్పుడు తరతరాలుగా వస్తున్న తెలుగు సినిమా రెండో హీరోయిను సాంప్రదాయాన్ని నేను కూడా కొనసాగిస్తూ త్యాగం చెయ్యక తప్పట్లేదు' అంటుంది. చివరికి మొదటి వీరోవీరోయిన్లు కలుసుకుంటారు. కథకి శుభం కార్డు పడుతుంది.

అమ్మాయి డైలాగ్స్ చెప్తున్నప్పుడు 'Seenu's Blog' అనీ, అందులో నిజం పేర్లతో హీరో గారు తన స్టోరీని చక్కగా వివరించి రాసి ఉన్న పోస్టునీ చూపిస్తారు. కాకపోతే, అది తెలుగు బ్లాగ్ కాదు ఇంగ్లీష్ బ్లాగనుకోండి. ఏదైతేనేం.. మొత్తానికి హీరో గారు రాసుకున్న బ్లాగు వల్ల కథలో హెంత పెద్ద ట్విస్ట్ వచ్చిందో చూసారా?
దీని బట్టి మీకేం అర్థమయింది? 'ఒక బ్లాగు మీ జీవితాన్నే మార్చేస్తుంది!' అని టేక్ హోమ్ మెసేజ్ అన్నమాట! ;)

24 comments:

తృష్ణ said...

కేప్షన్ బాగుంది.ఎప్పుడూ వినలేదండి సినిమా పేరు. ఎప్పుడు వచ్చిందిది? నటులు ఎవరు?

మధురవాణి said...

తృష్ణ గారూ..
:) ఇప్పుడు సినిమాకి సంబంధించిన లింక్ కలిపాను. చూడండి. వరుణ్ సందేశ్ హీరో ఈ సినిమాలో.

శిశిర said...

బుద్ధిగా గడ్డం కింద చేతులు పెట్టుక్కూర్చుని సావధానంగానే విన్నా కానీ నాకో పేద్ద డౌటు.... ఎంత పనీ పాటా లేకపోయినా, తప్పక చూడల్సొచ్చినా మీకు వరుణ్ సందేశ్ సినిమాలు చూడగలిగే ఓపికా, ధైర్యం ఎలా వస్తుంది? :))
చాలా బాగా రాసారు.

శ్రీలలిత said...

ఈ మీ బ్లాగ్ పోస్ట్ ఎంతమంది జీవితాల్ని మార్చేస్తుందో చూడాలని వుంది...

అనుదీప్ said...

తెలుగు సినిమాకి ఎంత ధౌర్భాగ్యం పట్టింది. ఆకరికి వరుణ్ సందేష్ ని కూడా భరించాల్సివస్థుంధి...కర్మరా బాబు..

Kranthi said...

ముందుగా ఆ సినిమా చూసిన మీ ధైర్యానికి ఒక "ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ". వెన్నెల కిషోర్ కామెడి బాగుంటుంది,మిగతా అంతా రొటీనే.అమీర్‌పేట్ పరిస్థితులు మాత్రం పక్కాగా దించేసాడు.:-).కాకపోతే ఎవరూ అంతగా గమనించని ఆ బ్లాగ్ పాయింట్ పట్టుకోవడమే కేక.దీనికి ఇంకో ఓఓఓఓఓఓఓ.

మాలా కుమార్ said...

ఈ సినిమా గురించి నేనూ ఎప్పుడూ వినలేదు . మొత్తానికి ఓ బ్లాగ్ జీవితాన్నే మార్చెస్తుందన్నమాట :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

మాట వరస కి కాదండీ నిజ్జంగా నిజంగా హాహాహాహాహః

Anonymous said...

story చాల బాగుంది. మాటలు మత్రం త్రివిక్రం తొ రాయించండి.

thanks,
Bharat.

ఇందు said...

మధురా....నీకు ఇంత ఓపిక ఎక్కడినించి వచ్చిందీ??? అసలు వరుణ్సందేష్ ఒక హీరో....అతనితో ఒక సినిమా...అదీ ఆ డొక్కు కాన్సెప్ట్తో తీసిన చెత్త సినిమా చూసిన నీ కళ్ళకి జోహార్లు! :)) రామక్రిష్ణ గారు తన బ్లాగ్లో ఈ సినిమా గురించి ఏకిపారేసారు!!
http://indhradhanassu.blogspot.com/2010/12/blog-post.html
ఆ దెబ్బకి నేను ఈ సినిమా ఈ జన్మలో చూడకూడదని డిసైడెడ్!! పాపం నీకు తెలియక బలి అయ్యవ్!! :(( పర్లేదులే...ఈసారికి లైట్ :)

Unknown said...

chala "blaaga" raasarandi..

Raghav said...

సరిపోయింది ఇంకా మీ జీవితం మారిపోయిందేమో అని టెన్షన్ పడ్డాను. ;)

SHANKAR.S said...

అసలు అందరూ వరుణ్ సందేశ్ అంటే ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారో నాకు అర్ధం కావటం లేదు. మహా మహా హరికృష్ణ, బాలకృష్ణ నుంచి నిన్న మొన్నటి నితిన్ వరకు ఎవరు హీరో అని చెప్పుకున్నా బుద్ధిగా తల ఊపి చూసిన మన తెలుగు వాళ్లకి వరుణ్ సందేశ్ ని భరించడం ఒక లెక్కా. అసలు నన్నడిగితే కనీసం నటిస్తున్నాడని కూడా అనిపించనంత అద్భుతంగా, అసలది నటనా అని చిత్తూరు నాగయ్యకే అనుమానం వచ్చేంత అపూర్వంగా నటించగల పై తరగతికి చెందిన మహా నటుల కోవ వాడే వరుణ్ సందేశ్. ఎమోషనల్ సీన్స్ లో కూడా కడుపుబ్బా నవ్వించగల అతని నటనా చమకృతిని కించపరచి హేళన చేయుట బ్లాగ్మిత్రులారా మీకు తగదు.

మధురవాణి గారూ అసలు ఆ సినిమా అక్కడిదాకా చూశారంటేనే తెలుస్తోంది. మీరూ తెలుగు సినిమా అభిమానుల ఆత్మాహుతి దళ సభ్యులని. జోహార్లు కామ్రేడ్.

సుభద్ర said...

Em chestam madhura ye telugu cinema dorikinaa apurupamE desam kani desam lo untee!!nenu chusanu ee cinemaa~~yala ayinaa mana southvalladi dodda manasu >>nice post..

రాజ్ కుమార్ said...

ఓహ్.. మీరు వరుణ్ సందేశ్ సినిమాల్ కూడా చూస్తారా? ;);)హహహ బావుందండీ..

శంకర్ గారూ.. మీ కామెంట్ రచ్చ.. ;)

kiranmayi said...

మధురా
గడ్డం కింద చెయ్యి పెట్టుకుని, పక్క మీద బోర్లా పడుకుని బుద్ధిగా చదివేసా. మీ బ్లాగ్ మీ జీవితాన్ని మార్చేసిందేమో అని, లేదా ఇంకెవరి జీవితాన్ని మార్చేసిందేమో (ఇదైతే ఇంకా ఇంటరెస్టింగ్ గా ఉంటుందేమో కదా) అనుకున్నా. మీ పోస్ట్ లో నాకు నచ్చిన విషయం ఒకటుంది. అదేంటంటే, చాలా మంది నాన్చుడు గాళ్ళ లాగ కాకుండా సినిమా కధఫుల్ గా చెప్పేశారు. ".... ఈ చత్త తరవాత ఎం జరుగుతుందో చూడాలంటే ఈ పిచ్చ సినిమా చూడండి" అని చెప్పకుండా. నేను చాఆఆఆఆఆఅలాఆఆఆఆ రోజుల తరవాత reentry ఇచ్చాను. ఒకసారి మా ఇంటికి I మీన్ బ్లాగ్ కి రారాదు?
శంకర్ గారి కామెంట్ అదుర్స్

Anonymous said...

ఈ సినిమాకి బ్లాగ్ దిద్దిన కాపురం అని పేరు పెట్టి ఉంటే హెంత బావుండేది!

Sriharsha said...

హహహహహ.
కాప్షన్ బావుంది ........

హరే కృష్ణ said...

ఒక బ్లాగ్ జీవితాన్ని మారుస్తోందో లేదో తెలియదు కాని ఈ సినిమా డౌన్లోడ్ చేసి మరీ జ్వరం తెచ్చేసుకొని సీజన్ జ్వర్రాలు సడన్ గా వాతావరణం చేంజ్ అయ్యిందని భానుడి ని తిట్టేస్తున్న నా పరిస్థితి ఏం కావలె :)
వచ్చే పోస్ట్ లో ఆ బ్లాగారిష్టాలను మొరపెట్టుకుంటాను తాత్కాలిక సెలవు :)

మధురవాణి said...

@ శిశిర,
అంటే శిశిరా.. అప్పుడప్పుడూ అన్నా అమ్నకసలు ధైర్యం ఉందా.. ఉంటె ఎంత ఉందీ? అలాగే ఓపిక కూడా ఎంత ఉందీ అనేది తెల్సుకోవడానికి ఇలాంటి చిట్కాలు పాటిస్తూ ఉంటానన్నమాట నేను.. అదన్నమాట సంగతి! ;)

@ శ్రీలలిత,
అలా అయితే పర్లేదండీ.. కానీ, వాళ్ళందరూ ఈ సినిమా చూసాక కలిగిన కోపంలోనో, విరక్తిలోనో నా జీవితాన్ని మార్చకుండా ఉంటే అదే పదివేలు! :)

@ అనుదీప్,
అదేంటండీ అంత మాటనేశారు? కింద శంకర్ గారు చెప్పింది చూడండోసారి.. :)

@ క్రాంతి,
ఇలాంటప్పుడే నేనూ నాక్కూడా ధైర్యముందని గుర్తిస్తూ ఉంటాను.. ;)
అవునండీ.. కిషోర్ కామెడీ నాకూ నచ్చింది. సినిమాలో చూపించింది పూర్తిగా కొట్టి పడెయ్యలేమని మొత్త్తనికి మీరొకరు చెప్పారు ఇప్పటికి.. :)

మధురవాణి said...

@ మాలా కుమార్,
మరేనండీ.. నాకూ ఈ సినిమా చూసాకే ఆ విషయం తెలిసింది.. :)

@ బులుసు గారూ,
మాటవరసకి కాకుండా నిజ్జంగానే ధన్యవాదాలు.. ;)

@ భరత్,
అయ్యా బాబోయ్! ఇది ఆల్రెడీ తీసేసిన సినిమా అండీ.. మనం మళ్ళీ తీస్తే కేసులూ అవీ వేస్తారేమో! :P

@ ఇందూ,
హహహ్హా.. ఇందూ.. పాపం అప్పుడప్పుడూ ఇలాంటి సాహస కార్యాలు చేయ్యాలనిపిస్తుంటుంది నాకు.. తర్వాతా మళ్ళీ కొన్నాళ్ళ దాకా బుద్ధిగా ఉంటామనుకో.. :)

మధురవాణి said...

@ సుందర్,
థాంక్సండీ! :)

@ రాఘవ్,
హహ్హహా.. అలా అనుకున్నారా? అలాంటి ప్రమాదాలేమీ జరగలేదులెండి.. :)

@ శంకర్,
అబ్బబ్బా.. మీ కామెంట్ చూసి ఎంతసేపు నవ్వానో! నేను తెలుగు సినిమా అభిమానుల ఆత్మాహుతి దళ సభ్యురాలినా? హహహహ్హహా.. మీకసలు భలే అయిడియాలు వస్తాయండీ బాబూ! :D

@ సుభద్ర,
నిజమేనండీ! సరిగ్గా చెప్పారు.. అది చాలా ముఖ్యమైన కారణం ఇలా అన్నీ సినిమాలూ చూడటానికి.. :)

@ రాజ్,
మీ కామెంట్ నాకెలా కనిపించిందంటే.. ఓహ్.. మీరు తరచూ గోదాట్లో దూకుదాం అనుకుంటూ ఉంటారా?.....అని.. ;)

మధురవాణి said...

@ కిరణ్మయి,
హహహ్హహహ్హా.. భలే చెప్పారండీ! ఈ సినిమాని అలా సస్పెన్స్ లో పెట్టి వదిలేసి చూడమంటే, ఆ తర్వాతా ఆ చూసిన వాళ్ళందరూ వచ్చి నన్నూ, నా బ్లాగునీ లేపేస్తారేమోనన్న భయంతో అలా మొత్తం కథ చేప్పేసానండీ! :D
మీ ఇంటికి తప్పకుండా వస్తానండీ! :)

@ మురళి,
:))

@ తేటగీతి,
హహహ్హహహా! మురళీ గానం బ్లాగర్ మురళి గారు కూడా సరిగ్గా ఇదే అన్నారండీ బజ్లో! మురళీలు ఇద్దరికీ ఒకే అయిడియా వచ్చిందన్నమాట! :)

@ శ్రీహర్ష,
:) :) థాంక్స్!

@ హరే కృష్ణ,
ఆ.. ఏంటండీ.. ఏదో అంటున్నారు? ఏంటో.. సిగ్నల్స్ సరిగ్గా లేనట్టున్నాయండీ.. సరిగ్గా వినిపించట్లేదు.. నేను రాసిన పోస్ట్ వల్ల ఈ సినిమా చూసి చాలా సంతోషించాను.. థాంక్స్ అంటారా? అయ్యో పర్లేదండీ.. ఏదో మీ అభిమానం.. (హమ్మయ్యా.. ఎలాగైతేనేం! హరే కృష్ణ గారి చేత తిట్లు తినకుండా త్పపించుకున్నాను. ;))

జైభారత్ said...

మధుర గారు నమస్తే (వాణిని కావాలనే తీసేసా)...చాల రోజులు గా మీ బ్లాగ్ చూస్తున్న చాల డిఫరెంట్ గా అనిపించింది.. అపట్టికప్పుడు మనసుని పట్టుకు ఊపేసి నిలువ నిడలేకుండా కంటిమీద కునుకు లేకుండా చేసిన విషయాలన్నీ ఐపోయాక తీరిగ్గా నా అబిప్రాయాలను షేర్ చేస్కుందామనే...నాకు బాగా నచ్చింది ఒక పోస్ట్ చేయని ఉత్తరం ఇది చాల చాల బావుంది మనసుకు హత్తుకుంది.. చాలామంది జీవితం లో ఇలాంటి అనుభూతి ఉంటుందని నా ఫీలింగ్...ఒక్క సారిగా ఆ ఫిల్ లోకి తీసుకెళ్ళారు జ్యాపకాల పొరలను స్పుర్శించటం ఘాడస్మృతులను మనకే తెలియని మన మార్మిక భావాలను ఒడిసి పట్టుకోవడం అంత వీజీ కాదు మధురంలో మునిగిన సీతాకోక(మీ) లా...సరి కద మైకం వదలడానికి ఈ రోజుకి బేరీజు వేస్కుని చుస్కోడానికి గతంకంటే వర్తమానం కాస్త కష్టంగా అయ్యబాబోయ్ ఆ ప్రేమ తీపులకు మనసుకి తిమ్మిరెక్కి ఒక్క ఉదాటన ఆ రోజుల్లోకి వెళ్లి మడత పెట్టిన మనసుని రివ్వు రివ్వు నా సాగిపోవే అని వర్తమానాన్ని తాడుగా పట్టుక్కుర్చోమా తాడు వదిలేస్తేనే కద బావుండేది కానీ ఆ తెగింపు చలం రాజేశ్వరికుంది గాని ఇంత కాలానికైనా మనకులేక పోయింది కద ... మీ జ్యాపకం కొన్ని గాయాల్ని రేపింది అనడం అతిసేయోక్తి కాదు... మధుర రచనలు చేసే మధుర గారు..
సుజ్జి-మధుర, బాపు-రమణులా..