నేను నీకు ఎంతో అపురూపమైన నేస్తాన్నని చటుక్కున ఒకే మాటలో ముద్దుగా చెప్పేసావు!
నేను మాత్రం మాటరానట్టు నమ్మలేనట్టు కళ్ళింతింత చేసుకుని నీకేసి చూస్తూ ఉండిపోయాను..
నిజంగా నేన్నీకంత నచ్చానా.. నేనంటే నీకంతిష్టమా.. అని బోల్డంత ఆశ్చర్యంగా అడిగాను..
నువ్వేమో వెంటనే బుంగమూతి పెట్టేసి ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అన్నట్టు చూసావు..
అంటే.. కన్నా! నేను నిన్ను అర్థం చేసుకోలేదని కాదురా!
నేను నీ మనసుకి ఇంత దగ్గరగా వచ్చేసానని అనుకోలేదు మరి..
అదిగో.. అంతలోనే చురుగ్గా చూస్తున్నావ్.. నే చెప్పేది పూర్తిగా వినాలి మరి!
అంటే నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావనుకున్నవా.. లేకపోతే చాలా దూరంలోనే ఉండిపోయావా.. అనేగా నీ చూపుల వెనకున్న సందేహం!
నీకూ నాకూ మధ్య దూరం ఉందని అనట్లేదు.. నీకు దగ్గరగానే వచ్చానని అనుకున్నాను.
కానీ.. మన దగ్గరితనాన్ని కొలిచి చూడాలన్న స్పృహ ఎప్పుడూ లేకపోడం వల్ల.. నీకు ఇంత దగ్గరిగా వచ్చేసానని నాకు తెలీలేదు. అంతే!
ఇంత తక్కువ పరిచయంలోనే నీ మనసులో నాకంత విలువైన చోటిస్తావని నేనూహించలేదు.
మళ్ళీ అలా కోపంగా చూడకు మొద్దబ్బాయ్!
ఇక్కడ తక్కువ అన్నది కేవలం కాలాన్ని నిమిషాల్లో రోజుల్లో కొలిచి చెప్తేనే సుమా!
మనం పంచుకున్న ఊహలూ, ఊసులు, భావాలు, జ్ఞాపకాల లెక్కలో కాదు!
ఒకోసారి పెదవి దాటి పలకలేనివి మౌనంలోనే వినిపిస్తాయి..
మాటల్లో పేర్చి చెప్పాలనుకుంటే కొన్ని భావాలు అందాన్ని, అర్థాన్ని కూడా కోల్పోతాయి..
అసలు ఇప్పుడు ఈ క్షణంలో నాకేమనిపిస్తుందో తెలుసా!
మన మధ్య ఈ మాటలన్నీటినీ కరిగించేసి మౌనంతో వంతెన వేయాలనిపిస్తోంది..
ఇప్పుడిక నా మీదున్న అలకని అటకెక్కించి నా కోసం ఒక చిరునవ్వు రువ్వవూ!
Monday, February 28, 2011
నీ స్నేహం!
Subscribe to:
Post Comments (Atom)
21 comments:
ఒక చిరునవ్వు రువ్వవూ! కెవ్వు :)
ruvvandi evaro kani..idhi chusaka ruvvutharu le akka :)
superb ga undhi asusual :)
Idi alakala seasonaaa :-)
- Manchu
//ఈ మాటలన్నీటినీ కరిగించేసి మౌనంతో వంతెన //
ఏం అలకల సీజనో బాబూ , మధుర గారు నా మీద అలిగినట్టున్నారు...ప్రతి పోస్టు లోనూ, ఎక్కడో అక్కడ నాకు "ఖామూష్, చుప్ రహో అనే సందేశం ఇస్తున్నారు..యీ సారి కూడా...వా ఆ....
సున్నితమైన భావాల్ని చాలా హృదయంగా తెర్చిదిద్దారు.. చాలా బాగుంది ....!!!!
భలే ఉంది మధురా..:))
ఎన్నెలె గారూ.. హహ్హ్హహ్హా;)
చాలా బాగా రాసారండి. ముఖ్యంగా "మన మధ్య ఈ మాటలన్నీటినీ కరిగించేసి మౌనంతో వంతెన వేయాలనిపిస్తోంది." ఈ లైను చాలా బాగుంది. మనసుకు హతుకుంది.
chala bavundi madhuravani garu
మధురవాణి గారు
చాలా బాగుంది నా హృదయాన్ని టచ్ చేసారు
చాలా బాగుందండి మధురవాణి గారు..
madhura naku chala chala nachindi.....cute ga sweet ga.......entha bagundo!!!!
naku e image chal chala istamandi..patent file cheddam anukuntoo unaa, e loga meeru bloglo pettesaru.. :)
very nice post
suepr ga undandi..
ఎవరి కోసం రాసింది తెలీదు కానండి అడిగారు కదా అందుకే ఒక :-) రువ్వాను. బాగుంది.మీ మౌనపు వంతెనలు ఇంకా బాగున్నాయి. :-)
@ హరేకృష్ణ,
ఏంటీ.. ప్రాసా? :) :)
@ MY world,
థాంక్స్ తమ్ముడూ.. :) ఇంతకీ సంతోష్ ఇది నువ్వేనా?
@ మంచు,
హహహ్హా.. మీరు మొదలెట్టిన అలకల సీజన్ ఇలా అందరి బ్లాగులకీ పాకినట్టుంది.. :)
@ ఎన్నెల,
ఇదన్యాయం అధ్యక్షా.. నేను ఖామోష్, చుప్ రహో అనే పదాలు ఎక్కడా వాడలేదని మనవి చేసుకుంటున్నాను. :D అయినా, మిమ్మల్ని మాట్లాడొద్దని నేను చెప్పగలనా? ఎన్నెలకి కోపం వస్తే తట్టుకోగలమా మేమందరం.. చెప్పండి.
మనలో మన మాటా.. ఏదో ఫ్లో లో వందంటాం.. మీరు అవన్నీ సీరియస్ గా తీసుకోకూడదు.. ఏదో చూసీ చూడనట్టు పోవాలి.. :)
@ మనసు పలికే,
థాంక్యూ అపర్ణా! :)
@ తేజస్వి, అరుణ్, స్పందన, సుమలత, ఈశ్వర్, ఇందూ, వేణూరాం,
మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
@ గిరీష్,
ధన్యవాదాలండీ! పేటెంట్? అంటే.. ఈ ఫోటో మీరు తీసినదేనా? నేను గూగుల్లోంచి తెచ్చి పెట్టాను. :) లేకపోతే, మీరూ మీ బ్లాగ్లో ఈ ఫోటో పెట్టి ఏదన్నా రాయాలనుకున్నారా? అలా అయితే రాసెయ్యండి.. ఒకో బొమ్మకి వేర్వేరు భావాల్ని అద్దినట్టు ఉంటుంది కదా! :)
@ క్రాంతి కుమార్ మలినేని,
రాసింది ఎవరి కోసమైనా చదివిన వారందరూ తలా ఒక చిరునవ్వు రువ్వితే బావుంటుంది కదండీ! :) నా బ్లాగుకి స్వాగతం.. మీ స్పందనకి ధన్యవాదాలు..
photo nenu tiyadatama..recent gane camera konna, inka antha technology raledu naku :).. kani naku a pic chala chala istam anduke ala rasa..nenu meela rayalenu, naku antha kavitvam radu mari :)
perfect girl's thoughts!!!
But i never ever can understand..girl's thoughts! huh!!!
ఇది చదవటం నాకు కాకా కాక కాక తమిళ్ సినేమాలో సూర్యా, జ్యోతికల సంభాషణ గుర్తుకు వచ్చింది. ఒక సన్నివేశంలో జ్యోతిక తను సుర్యాని ఎందుకు ప్రేమిస్తున్నాదో చెపుతూ పోతుంటే సూర్యా నన్నే ఎందుకు అని అడుగుతూంటాడు. ఆ సినేమాలో రచయిత సుజాత గారు సంభాషణ లను చాలా క్రిస్ప్ గా, పదును గా రాస్తారు. ఇక విషయానికి వస్తే జ్యోతిక కేరక్టర్ తన భావాలను పేపర్ మీద పేడితే మీరు పైన రాసిన టపాలాగా ఉండి ఉండేదని పించిది. మీలాంటి వారికి గౌతం మీనన్ ప్రేమ సినెమాలు బాగా నచ్చుతాయి. వీలైతే చూడండి కాక కాక, వినయ్ తాండి వరువాయా మొద|| వాటిని.
@ గిరీష్,
ఓహో.. మీకూ నచ్చేసింది ఈ బొమ్మ అంటారా? నాలా రాస్తేనే ఆ బొమ్మ వాడాలని రూల్ లేదు కదా.. ;) మీకే సందర్భంలో బాగుంటుందనిపిస్తే అక్కడ వాడెయ్యండి.. అదేంటో చూడాలని నాక్కూడా ఉత్సాహంగానే ఉంది.. ఇక మీరు రాయడమే ఆలస్యం మరి! :)
@ ప్రదీప్,
:)) అమ్మాయి ఆలోచనలని అర్థం చేస్కోడానికి అలా అలా ప్రయత్నిస్తూ ఉండండి.. ఉన్నట్టుండి ఏదో ఒక రోజు చప్పున అర్థమైపోతుంది.. అప్పుడు మాత్రం "ఓస్.. ఇంతేనా! ఇంత సులువా అమ్మాయి మనసుని అర్థం చేస్కోడం.." అనిపించేస్తుంది మీకే! :)
@ శ్రీకర్,
మీ వ్యాఖ్య చాలా సంతోషాన్ని కలిగించిందండీ! మీరూహించింది కూడా కరక్టే!
ఆ కాక్కా కాక్కా సినిమా నాకు తెలీదు కానీ గౌతం మీనన్ తీసిన 'సూర్యా సన్నాఫ్ కృష్ణన్' , 'ఏం మాయ చేసావే'.. నాకు చాలా చాలా నచ్చాయి.. :)
ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక నాకు ఆ కాక్కా కాక్కా సీన్ చూడాలని ఉంది.. కానీ, నాకు తమిళ్ రాదే.. ప్చ్.. :(
Post a Comment