నేను కొద్ది నెలల క్రితం రాసి పంపిన కథ 'అక్షరస్వప్నం', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'మార్చి' సంచికలో ప్రచురితమైంది.
నా కథని అంగీకరించి ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..
28 comments:
Congratulations Madhuravani gaaru...
-- Anudeep
మధురవాణి గారు..నేను మీ కధ చదివాను..చాలా చక్కగా రాసారు...
అభినందనలు
కథ చాలా బాగుంది మధుర.
కథ చదివిన తరువాత కళ్ళు చెమర్చాయి.
మరెన్నో కవితలు, కథలు,శీర్షికలు రాయాలని కోరుకుంటూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ
మీ అభిమాని
అరుణ్
ఏంటండీ ఇలా ఏడిపించేస్తే ఎలా :(:(
చాల బాగుంది మీ కథ నిర్మలంగా:) :) మీలా :)
మధురవాణి గారు,
నిజంగా జరిగిన కథా? అని అనుమానం వేసింది.. కంగ్రాట్స్.. బాగా రాసారు ఎప్పటిలాగే.
మధురవాణి గారు, బాగా రాశారు గానీ, ఏంటి మేం మీకు రాయాల్సిన ఉత్తరాలు కదూ అవి! ఎలాగూ మాకు చేతకాదని మా అందరి ప్రతిరూపంగా స్వప్నదీపికని సృష్టించారా? హి..
ఏం కాదులేండి , నెట్వర్క్ లేని ఏ కొండ ప్రాంతానికో వెళ్ళి ఉంటుంది. వస్తుంది. (మరి అందరి ప్రతిరూపం అనేశాను. మరి అందరు క్షేమంగా ఉండాలని చెప్పకపోతే మిత్రబృందం ఊరుకోవద్దూ!)
మధుర గారు చదువుతున్నంతసేపు ఎదో ఫీలింగ్...................... చాలా బాధేసింది ...బాగా రాసారు
కధ బాగుంది. ముగింపు చాలా బాగుంది. మనకు దగ్గిరగా వచ్చినవాళ్ళ గురించి అల్లా అనుకోవడం సహజమే.
కౌముది లో కామెంటు పెట్టటానికి ప్రయత్నించాను. కానీ కుదరలేదు.
అభినందనలు కౌముదిలో మీ కధ వచ్చినందుకు.
Congratulations madhuravani gaaru..
'Swapna Deepika'.... mee kadha loni ee name chala bagundi.
and concept inka bagundi. chala realistic ga undi.
అబినందనలు మధురవాణి గారు
మీ కద చదివాను చాలా బాగా రాసారు
అభినందనలు.శైలి బావుంది.మరెన్నో కవితలు, కథలు, వ్రాయాలి.
congratulations ....madhuravani garu!
ఇదివరకు ఉత్తరాల కథలుండేవి. కౌముదిలోనే మన నిషిగంధగారు రాసిన సీరియల్లే ఉంది, ఊసులాడే ఒక జాబిలట! ఇప్పుడు ఈమెయిల్ కథ! వొచ్చే కథ SMSలతోనో, ట్వీట్‌లతోనో రాస్తారా? :)
Sweet story.
ఐనా మీ ఆడలేడీస్కి ఇదేమి పైశాచిక ఆనందమో, చదివినవాళ్ళు ఒక కనీసం ఒక కర్చీఫు తడిసేట్టు ఏడిస్తేగాని మీకు తృప్తి కలగదు గామాలు.
Congrats Madhura.........u r rocking :))
అస్సలు అస్సలు బాగోలేదు మధురగారు... క్రితం సారి కూడా ఇలానే ఆ 'కాలం తెచ్చిన మార్పు' అంటూ ట్రాజెడి పండించారు... ఇప్పుడు కూడానా
two much serene and touching
katha chala aparipakvanga undi.....pcchh...ento mee standard thaggipothondemo anipisthondi....pellaindi kada...concentration cheyyadam kashtame mari :-)
మధురా, మీ కథ చదివానండీ. చాలా బావుంది. ముగింపు చదివేటప్పటికి మనసు ఏదో తెలీని బాధతో బరువెక్కింది.
పద్మవల్లి
మధురవాణి గారు కౌముదిలో మీరు రాసిన కధ (అక్షరస్వప్నం) చదివానండి...చాలా బాగా రాశారు...
hahahahahha nice 1
Heart touching...
Chala Chala Bavundi
భలే రాశారు. ఇది నిజంగా జరిగిన వాటి ఆధారంగా రాశారా. అధ్బుతంగా ఉంది.
ట్రాజెడి కథలు ఎక్కువ కాలం అలా మనసులో ఉంది పోతాయేమో అనిపిస్తుంది.
@ అనుదీప్,
థాంక్యూ! ఇంతకీ కథెలా ఉందో చెప్పనేలేదే? :)
@ ప్రవీణ,
నా కథ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.. ధన్యవాదాలండీ..
@ అరుణ్,
మీ అభిమానానికి ధన్యవాదాలండీ! నాకు చేతనైనంత వరకూ తప్పక రాసే ప్రయత్నం చేస్తాను.. :)
@ ఆహ్లాద,
అయ్యో..ఏడిపించేసానంటారా? కొన్ని కథలంతేనండీ.. మనం మార్చలేం! ;) మీ కామెంట్ కూడా ఆహ్లాదంగా ఉంది మీ పేరులాగే! ధన్యవాదాలు! :)
@ కృష్ణప్రియ,
ధన్యవాదాలండీ! నిజంగా జరిగిందా అంటే.. ఏమో.. జరిగే ఉండొచ్చు కదా! అంటే జరగడానికి చాలా ఆస్కారం ఉందీ అంటాను! నిజంగా జరిగిన సంఘటన ఆధారంగానే రాశాను! :)
@ మందాకినీ,
హహహ్హా...భలే చెప్పారండీ! That's so sweet of you! నేనంత పెద్ద రచయిత్రిని కాదని నాకు బాగా తెలుసు కదా.. అందుకని అలా ఏం అనుకోలేదు! కానీ, మీరన్నట్టు స్వప్నదీపిక అక్షరాల మీది అభిమానానికి ప్రతిరూపమే! మీ ఆశావాదం బాగుంది! :)
@ శివరంజని,
థాంక్స్ శ్రియా.. :)
@ బులుసు సుబ్రహ్మణ్యం,
ధన్యవాదాలండీ! నిజమే.. అలా అనుకుంటేనే మన మనసుకి బాగుంటుంది.. అందుకే అలా ముగించాను కథని.. :)
@ సుమ,
అయితే స్వప్న దీపిక పేరు మీకు నచ్చిందన్నమాట.. సంతోషం! ధన్యవాదాలండీ! :)
@ సుమలత,
సంతోషం.. ధన్యవాదాలండీ!
Hai Madhuravaani garu, 1st of all Congratulations to gave us a nice story and your parants know about your future that is why they named "madhura vaani". The meaning of your name you are showing in your words. Best of luck for future words.
Sri Devi
హలో మధుగారూ..
ఇదేంటండీ బాబూ.. చాలా రోజుల తరవాత ఇప్పుడు వీలు కుదిరి మీ బ్లాగ్ ఓపెన్ చేస్తే ఇలా సెంటిమెంట్ తో చంపేశారు..
నాకు ఏడవడం సరిగా రాదండీ.. కాబట్టి నేను ఏడవట్లేదు, ఏమి అనుకోకండి. :-(
పొగడటం మానేస్తున్నా అని కూడా ఇంతకుముందే చెప్పేసాను.. కాబట్టి ఈసారికి ఇలా సరిపెట్టుకోండి.
....హరీష్
@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
ధన్యవాదాలండీ! రాసే ప్రయత్నం చేస్తాను.. :)
@ సత్య, ఇందు, అనానిమస్ 2, శ్రీహర్ష,
అభినందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
@ కొత్తపాళీ,
నిషిగంధ గారి ఊసులాడే జాబిలట నాకు చాలా చాలా నచ్చేసిన నవల. :) హహ్హహ్హా.. SMS , tweets తో కథా.. అయిడియా బానే ఉంది.. ఎవరన్నా రాస్తారేమో చూద్దాం! :)
మీరు మరీ చెప్తున్నారు.. అక్కడికి కేవలం ఆడ లేడీసే ఇలా రాస్తారన్నట్టు.. మేము దీన్ని ఘాట్టిగా ఖండిస్తున్నాం అధ్యక్షా! :D
@ నాగార్జున,
అంతేనంటారా? ఈ మధ్య బొత్తిగా సీరియస్ టైపులో రాస్తున్నానంటారా? సరే అయితే, ఈసారి సరదా సరదాగా రాస్తానేం.. సరేనా! :)
@ అనానిమస్ 1,
మీరు ఊహించుకుంటున్న నా స్టాండర్డ్స్ ఏంటో నాకు తెలీదు గానీ, నేను మాత్రం నాకు తోచినట్టు మాత్రమే రాయగలను. అలాగే, నేను అత్యంత శ్రద్ధ వహించి కూర్చుని రోజంతా బ్లాగు రాస్తూ కూర్చోను. బ్లాగు రాయడం అనేది నేను చేసే ఎన్నో పనుల్లో ఒకటి.. అని మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.
@ పద్మవల్లి, డేవిడ్,
ధన్యవాదాలండీ!
@ వాసూ,
ధన్యవాదాలు.. నాక్కూడా అలాగే అనిపిస్తుందండీ కొన్ని కథలు చదివినప్పుడు.. చిరకాలం గుర్తుండిపోతాయి.. బహుశా అందులో ఉండే ఎమోషన్స్ వల్లనేమో మరి! మీ ప్రశ్నకి సమాధానం పైన కృష్ణప్రియ గారికి చెప్పాను. చూడండి.
@ శ్రీ,
That's so sweet of you! మీ ప్రేమపూర్వక అభినందనలకీ, ప్రశంసకి ధన్యవాదాలు! :)
@ హరీష్,
హహ్హహ్హా.. చదివిన వాళ్ళందర్నీ ఏడిపించేద్దామని రాయలేదండీ.. కానీ, చూడబోతే చాలామందిని కదిలించినట్టున్నా! :P
సరే అలాగే కానీండి.. మీరెలా అంటే అలాగే! :)
Post a Comment