Tuesday, February 22, 2011

ఎందాకా వెళ్ళినా..


దిక్కులన్నీ చుట్టేస్తూ సుదూర తీరాలకేసి పరుగులు తీస్తూ అలసిపోయాను.
ఎందాకా వెళ్ళినా నువ్వే ఎదురవుతున్నావు!
నీలాల నింగిలో.. నిండుగా నిశ్చలంగా ఉన్న నీటి కొలనులో..
ఆవేశంగా ఎగిసిపడే కడలి కెరటాలలో.. అన్నిటా అంతటా నువ్వే!
గట్టిగా కళ్ళు మూసుకుని చీకటి లోయలోకి జారిపోయాను..
ఆశ్చర్యం! అంతటి చిక్కటి నల్లటి చీకటిలోనూ నువ్వు స్పష్టంగా కనిపిస్తున్నావు..
శ్వాస మీద ధ్యాస నిలిపి ధ్యానం ఒడిలో సేద తీరాలనుకున్నాను..
చిత్రం! నా ఊపిరి సవ్వడిలో నీ నామ జపమే వినిపిస్తోంది..
నా మనసుని శూన్యంలోకి నెట్టేయ్యడానికి విశ్వప్రయత్నం చేశాను..
విచిత్రం! నీ జాడ లేని శూన్యమైనా నా చేతికి దొరకలేదు..
గుండె చిక్కబట్టుకుని చివరి ప్రయత్నంగా మౌనాన్ని ఆశ్రయించాను..
ఆ నిశబ్దంలో నా గుండె చప్పుడులో నీ ఊసులు వేయింతలై వినిపిస్తున్నాయి..
హృదయం బద్దలైపోతోందా అన్నంత అలవి కాని వేదనని కలిగిస్తున్నాయి..
నా శక్తికి మించిన భారంలా మారిన నిన్ను మోయలేకపోతున్నా!
నీ మీద నుంచి నా ధ్యాస మరల్చాలనే ప్రయత్నం వృథాగా మిగిలిపోతోంది..
ఇలా బాధపడాలనే ఋణమేనా మనిద్దరికీ మధ్యన ఇంకా మిగిలి ఉంది!?
ఇప్పుడు నాకనిపిస్తోంది.. నువ్వు నాలోనే ఉన్నావు.. ఉంటావు కూడా!
నాలో కరిగిపోయి కలిసిపోయిన బంధానివి నువ్వు..
నేనంటూ ఉన్నదాకా నీ నుంచి నేను తప్పించుకుపోలేననుకుంటా!

27 comments:

మనసు పలికే said...

చాలా బాగా రాసారు మధుర:) Superb..

లత said...

చాలా బావుందండీ

భరత్ నునేపల్లి said...

నమస్తే అండి....మీ కవితలని చదువుతుంటే అలౌకిక అనందం కలుగుతుంది నాకు... చాల బాగా వ్రాసారు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

"నీవు లేని శూన్యం కూడా నాక్కనిపించట్లేదు."
చాలా బాగుంది.

హరే కృష్ణ said...

చాలా బావుంది!

Padmarpita said...

బాగుందండి!

Ennela said...

//గుండె చిక్కబట్టుకుని చివరి ప్రయత్నంగా మౌనాన్ని ఆశ్రయించాను...//దీని గురించి నేను ఆలోచించాలి సుమా....చాల కష్టం నాకు...
టపా చాల బాగుందండీ

sneha said...

chala bagundi...marhdura garu..
i have been checking your blog for new updates..atlast...

చెప్పాలంటే...... said...

చాలా చాలా బావుందండీ

praveena said...

chala bagundi..

Arun Kumar said...

చాలా బాగా రాసారు మధుర:)

Unknown said...

మధు సూపర్ ఉంది :) మరి ఇంత మంచి కవితలు అవి రాసేస్తే ఎత్తుకెళ్ళి వాళ్ళ బ్లాగులో పెట్టుకోక ఎం చేస్తారు చెప్పు ??:) హాట్సాఫ్

raaam..... said...

hmm...chala bagundi madhura garu....thnx for gud posts...

veera murthy (satya) said...

"
నీ భావాలు శూన్యాన్ని పట్టుకునెదాకా వెళ్తున్నాయ్
నీ ప్రయత్నాలు మౌనాన్ని మాటాడించేదాకా వెళ్తున్నాయ్
నీ ఆశ్చర్యం చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
నీ ఎదురుచూపు నింగిలో కూడా నిశ్చలంగా నిలబడుతుంది
నీ పరుగులు దిక్కులని ధిక్కరిస్తున్నాయి.
నీ అలోచనలు అంబరాన్ని వెక్కిరిస్తున్నాయి.... "


ఇ మాటలన్నీ మీ కవితా భావాల సారమే...

అందుకోండి..

మీ భావాల ప్రవానికి తడిసిపొయాం...ధన్యవాదాలు.
-సత్య

kiran said...

chala chala bagundi.. :)
ఇలా బాధపడాలనే ఋణమేనా మనిద్దరికీ మధ్యన ఇంకా మిగిలి ఉంది!? - ii line suuuperbb.. :)

శివరంజని said...

చాలా sweet గా రాసారు మధుర:)

Sobha said...

chala baavundhi

veera murthy (satya) said...

madhuravani garu namaste!

మీకిదే కవితా పోటీకి ఆహ్వానం

http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

-satya

Anonymous said...

చాలా చాలా బావుంది..:)

Anudeep said...

హాయ్ అండి, చాలా బాగా రాశారు... ప్రేమ నిరీక్షణలో ఉన్న అంత్య లోతుల్ని స్పృశించి రాసినట్టుంది. ఇంతకి ఇది ప్రేయసి ప్రియుడు కోసమా? లేక ప్రియుడు ప్రియుడు ప్రేయసి కోసమా? ఇదీ నా సందేహం..

-Anudeep

మధురవాణి said...

@ మనసు పలికే, లత, మందాకిని, హరే కృష్ణ, పద్మార్పిత, చెప్పాలంటే, ప్రవీణ, అరుణ్ కుమార్, రామ్, శివరంజని, శోభ, b,
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

@ భరత్ నూనేపల్లి,
థాంక్యూ! అదంతా కేవలం మీ అభిమానం అని నేనంటాను. :)

@ మందాకిని,
అవునండీ.. సరిగ్గా అదే నేను చెప్పాలనుకున్న భావం! :)

మధురవాణి said...

@ ఎన్నెల,
థాంక్యూ! ఎప్పుడైనా సహజంగా మౌనంగా ఉండటంలో సమస్య లేదు కానీ.. కావాలని పట్టు బట్టి మౌనంగా ఉండాలనుకోడం కష్టమే కదా మరి! :)

@ స్నేహ,
థాంక్యూ! సారీ అండి.. చాలా రోజులు బ్లాగ్ అప్డేట్ చేయలేదు ఈసారి.. :P

@ కావ్య,
హహహ్హా.. కావ్యా.. భలే విషయం కనిపెట్టావ్ గా! నిజంగా అదే కారణం అయితే కాపీ కొట్టబడినందుకు సంతోషించాలేమో! :D

@ కిరణ్,
థాంక్యూ! నాక్కూడా ఆ లైన్ చాలా నచ్చింది. :)

మధురవాణి said...

@ సత్య,
ఇప్పటికిప్పుడు భలే రాసేశారండీ మీరు! నేను రాసినదాని కంటే మీరు రాసినదాంట్లో మరింత భావతీవ్రత ఉందనిపించింది. చాలా బాగుంది. బోల్డు ధన్యవాదాలు.. :)
కవితాపోటీకి ఆహ్వానించినదుకు ధన్యురాలిని.. ఖచ్చితంగా రాసి పంపుతానని మాటివ్వలేను గానీ, ప్రయత్నిస్తానని మాత్రం నమ్మకంగా చెప్పగలను.. :)

మధురవాణి said...

@ అనుదీప్,
హాయ్! సంతోషం కవిత మీకు నచ్చినందుకు..ధన్యవాదాలు! :)
మీ సందేహానికి నా సమాధానం ఏంటంటే, ఇది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా అనుకునే అవకాశమున్న భావం కాబట్టి.. మీకెలా అనిపిస్తే అదే సరైనది అనుకోవచ్చు.. ;)

సుమలత said...

చాలా బాగా రాసారు మధురవాణి గారు సూపర్ ;

మధురవాణి said...

థాంక్యూ సుమలత గారూ! :)

Nagaraju said...

plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystimeblogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines

Thanks