Monday, January 24, 2011

మౌనమే మోహన రాగమయే వేళ..

ఒకోసారి నేనొక్కదాన్నే ఉన్నప్పుడో, నిశ్శబ్దంగా ఉండే రాత్రి పూటో పాటలు వినాలనిపిస్తే వినడానికి నాకో ప్రత్యేకమైన ప్లే లిస్టు ఉంటుంది. అందులో ఉండేవన్నీ మంద్రంగా సాగే సంగీతంలో మార్దవంతో నిండిన స్వరాలున్న పాటలే! అదిగో ఆ జాబితాలోని ఒక పాటే ఇది. ఈ పాట హరిహరన్ పాడారు. ఆయన పాడిన ఎన్నో పాటల్లాగే మృదువుగా సాగిపోతుంది ఈ పాట కూడా! సిరివెన్నెల గారి పదాలు ఆయన స్వరంలో అలవోకగా జారిపోతున్నట్టు ఉంటాయి. కీరవాణి గారు స్వరపరచిన బాణీలలో నాకు నచ్చేవాటిల్లో ఈ పాట ముందు వరుసలో ఉంటుంది.

మరుగేల.. నీ మనసుకి ఆ ముసుగేల.. చందమామ లాంటి భామా.. అని అబ్బాయి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మాటలకందని భావాలు చూపుల్లో పలుకుతాయని, చూపులు చేరలేని తావులకి ఊహలు చేర్చుతాయని.. ఎంతందంగా చెప్పారో సిరివెన్నెల గారు!
చుట్టూ పూర్తి నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో ఈ ఒక్క పాటే చెవులకు వినిపిస్తుంటే ఈ పాటలో రాసినట్టు 'మౌనమే మోహన రాగమయే వేళ..' అనిపిస్తుంటుంది నాకు.

ఈ పాట 1999 లో వచ్చిన 'అల్లుడుగారు వచ్చారు' అనే సినిమాలోది. జగపతిబాబు, హీరా, కౌసల్య నటించగా కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీటికి సిరివెన్నెల గారు సాహిత్యం అందించారు. ఈ సినిమాలోనే బాలు గారు పాడిన 'నోరార పిలిచినా' అనే పాట, కీరవాణి గారు స్వయంగా పాడిన 'రంగురంగు రెక్కల' పాట కూడా బాగుంటాయి. ఈ పాట మీక్కావాలంటే ఇక్కడ చూడండి. ఓసారి విని చూడండి.. మీక్కూడా నచ్చుతుందేమో! :)

మరుగేల.. మబ్బు ముసుగేల..
ఓ చందమామా.. ఓ చందమామా..
మనసున మల్లెలు విరిసిన వేళ..
మమతల పల్లవి పలికిన వేళ..
మౌనమే మోహన రాగమయే వేళ..
మరుగేల.. మబ్బు ముసుగేల..
ఓ చందమామా.. ఓ చందమామా..

మాటకు అందని ఊసులు లేవా చూపులలోనా..
చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా..
కనుచూపులో.. చిగురాశలు.. బరువైన రెప్పల్లో బంధించకు..
మది వీధిలో.. స్వప్నాలకి.. సంకెళ్ళు వేసేటి జంకెందుకు..
ఊయలలూపే మృదుభావాలు.. ఊపిరి తీగను మీటే వేళ..
మౌనమే మోహన రాగమయే వేళ..

మరుగేల.. మబ్బు ముసుగేల..

కాంచన కాంతుల కాంచన బాట కనపడలేదా..
కొమ్మన కూసిన కోయిల పాట వినపడలేదా..
ఉలి తాకిన.. శిల మాదిరి.. ఉలికులికి పడుతోంది ఎదలో సడి..
చలి చాటున.. మరుమల్లెకి.. మారాకు పుడుతోందో ఏమో మరి..
చెంతకు చేరే సుముహుర్తాన.. ఆశలు తీరే ఆనందాన..
మౌనమే మోహన రాగమయే వేళ..

మరుగేల.. మబ్బు ముసుగేల..

17 comments:

Srinivasa Raghava said...

me rachana saili chala bavundi...I really enjoyed this.

తృష్ణ said...

మంచిపాటను గుర్తు చేసారు. కాలేజీ స్నేహితులతో ఈ సినిమా చూడటం గుర్తు వచ్చింది..ఈ సినిమాలో రెండు పాటలు నేను రికార్డ్ చేయించుకున్నా. ఇదీ, ఇంకోటి "చాలీ చాలని కునుకులలోన.." మ్యూజిక్ సరదాగా ఉంటుంది.

పరిమళం said...

nice song!

Ennela said...

విన్నట్టు గుర్తు లేదు...వినాలండీ..మీకు నచ్చిందంటే...బాగున్నట్టే...

Poodoori Raji Reddy said...

నాక్కూడా చాలా చాలా ఇష్టమైన పాట. వింటే జీవనోత్సాహం ఉప్పొంగుతుంది.

మురళి said...

సినిమా బాగా ఆడలేదు కానీ, పాటలన్నీ బాగుంటాయండీ ఈ సినిమాలో..

Sriharsha said...

pata bavundi..

శివరంజని said...

మధుర గారు బాగుంది సాంగ్ కాని నేను ఇప్పడి వరకు వినలేదు ఈ సాంగ్

raaam..... said...

namastey madhuravani garu....na peru ram..ee madhye mi blog chusa...mi timing tho rasey chinnanati oosulu,mi vari vanta pratapalu lantivanni chala superb...mi abhimani aipoyanandi...hmm..mimmalni follow avutuna..and mi blog lo aa music player yela pettaro cheppi help cheyandi plz...na daggara chala mandi vinakunda miss aipoyina unknown melodies chala unai....avanni pettukunta na blog lo....
thnking u ....
one of ur fans...haha.kidding..

Chakri said...

aa paatalo mounam maaya chestuntey...
meeremo mee maataltho mammalni maaya chestunnaru...
Naaku Keeravani gaarantey chaala istam...
ee cinemalo "Noraara pilichina..""Chaali Chaalani kulukulalonaa...""Rangu rangu rekkala"...paatalu maatramey vinevaadini...

mee rachana dwaara ee paatantey kooda picha istam erpadindi...
nijam ga nijam cheppana...ippudu ee paata on chesi nenu padukuntunna Roju...antha maaya chesaaru mee maataltho...!!

kotta cinemaala gurinchi naado blog undi..machukki oka review chadivi elaa undo cheppandi..naa blog lo
http://chakrimasti.blogspot.com/2011/02/alaa-modalaindi-elaa-undi.html

Unknown said...

Awesome song Madhuravani garu! Like you said, after a long day it is so soothing to my ears and heart hearing this song.

sneha said...

ఈ పాట ఇంతకు ముందు వినలేదు ,చాలా బాగుంది మీరు వివరించి చెపుతుంటే

మధురవాణి said...

@ శ్రీనివాస రాఘవ, పరిమళం, హర్ష,
ధన్యవాదాలండీ!

@ తృష్ణ,
అవునండీ.. ఈ సినిమాలో చాలావరకూ పాటలు బాగుంటాయి. అప్పట్లో మా ఇంట్లో జెమిని టీవీ కొత్తగా వచ్చినట్టు గుర్తు నాకు. ఈ సినిమా ప్రోమో తెగ వేసేవాడు. అందులో "చాలీ చాలని కునుకులలోన.." పాటే ఎక్కువ వేసేవాడు. :)

@ ఎన్నెల, శివరంజని, స్నేహ,
ఒకసారి విని చూడండి. తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా! :)

@ పూడూరి రాజిరెడ్డి,
బాగా చెప్పారు. సేమ్ పించ్! :)

@ మురళి,
నిజమేనండీ! ఎప్పుడో టీవీలో వచ్చినప్పుడు అక్కడక్కడా చూసినట్టు గుర్తు. మరీ చెత్త సినిమాయేం కాదనుకుంటా!

మధురవాణి said...

@ ramareddy,
నమస్తే రామ్ గారూ! మీ అభిమానానికి, ప్రశంసకూ బోల్డన్ని ధన్యవాదాలు. Thanks for following my blog! ఆ పాటల ప్లేలిస్టుని ఈ వెబ్సైట్లో తయారు చేసాను. http://www.mixpod.com/
తప్పకుండా ఆ పాటలన్నీటిని మాకు వినిపించండి మీ బ్లాగులో. :)

@ చక్రి గారూ,
That is so sweet of you! Thank you! నేను బాగుందని చెప్పి పరిచయం చేసిన పాట మీకంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. Surely I'll go through your blog!

@ గీత,
సంతోషంగా ఉందండీ మీకూ ఈ పాట నచ్చినందుకు. Thanks for sharing your response! :)

Chakri said...

//చక్రి గారూ,
తెలుగులో రాసింది తెలుగు ఫాంట్ లో ఉంటే చూడ్డానికి అందంగానూ, చదవడానికి ఆనందంగానూ ఉంటుందని నా అభిప్రాయం. :) //

meeru cheppindi...
100 ki 110% nijam...

kaani konni constraints valla raayaleka potunna...

1st di time...cinema choodagaaney review raayali...nenu aa raatri raasestaa within an hour..appudey demand [;)]

inka maa friends chaala mandiki telugu chadavadam raadandi..:(

రాజ్ కుమార్ said...

nice post madhura gaaru..

మధురవాణి said...

@ చక్రి గారూ,
మీ ఫ్రెండ్స్ కి తెలుగు చదవడం రాకపోతే ఇక చేయగలిగింది ఏం లేదు..ఇలానే కంటిన్యూ అయిపోండి మరి.. :)

@ వేణూరాం,
ధన్యవాదాలండీ!