"యే.. పో.. నువ్వెప్పుడూ ఇంతే! తొండి చేస్తావ్! పంది.."
"నువ్వే పంది.. కుక్క"
"నువ్వే పంది, కుక్క, ఎద్దు"
"నువ్వే పంది, కుక్క, గాడిద, ఎద్దు"
"నువ్వు పది సార్లు పంది, కుక్క, ఎద్దు, గాడిద.."
"నువ్వే.. వంద సార్లు పంది కుక్క.."
"నువ్వు వెయ్యి సార్లు పంది కుక్క.."
"నువ్వే లక్ష సార్లు పంది కుక్క.."
"నువ్వు కోటి సార్లు.."
"నువ్వు మిలియన్ సార్లు.."
"నువ్వు బిలియన్ సార్లు"
"యే.. పో.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే ఒకటి ఎక్కువే!"
"ఎహే.. నువ్వే పో.. నువ్వు ఇన్ఫినిటీ సార్లు పంది కుక్క.."
"నువ్వు ఇన్ఫినిటీ కి ప్లస్ వన్.."
"అహా.. ఇన్ఫినిటీ తరవాత ఇంకేం ఉండదమ్మా పెద్ద! అన్నీటికంటే అదే ఎక్కువ!"
"ఏం కాదు.. నేను ముందే చెప్పాగా.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే ఒకటి ఎక్కువని.. ఇన్ఫినిటీ ప్లస్ వన్"
"అయితే.. నువ్వు యూనివర్స్.. ఇంక అంత కంటే పెద్దది ఏమీ ఉండదు తెల్సా! స్కూల్లో మా టీచరు కూడా చెప్పారు"
"అబ్బ ఛా.. అంత లేదు బాబూ.. నాది యూనివర్స్ ప్లస్ వన్.."
"అయితే పో.. నువ్వు ఎన్ననుకున్నా అంతకంటే నావి రెండు ఎక్కువే! యూనివర్స్ ప్లస్ వన్ కి ప్లస్ టూ"
"దానికన్నా ఒకటి ఎక్కువే!"
"దానికన్నా రెండెక్కువే!"
"ఇంకా దానికి కూడా ఒకటి ఎక్కువే!"
"మళ్ళీ దానికి కూడా.. రెండు ఎక్కువే!"
"ప్లస్ వన్"
"ప్లస్ టూ"
ఓయ్ పిల్లలూ.. ఏంటా గొడవా, అరుపులూ.. ఏం చేస్తున్నారు అసలక్కడ! నోర్మూసుక్కూర్చుని పుస్తకాలు తెరవండి.. అస్సలు భయమూ, భక్తీ లేకుండా పోతుందీ మధ్య మీకు. ఎంతసేపూ ఆటలూ, పోట్లాటలే.. చదువూ సంధ్యా లేకుండా.. అయిదు నిమిషాల్లో నేనక్కడికి వచ్చేసరికి ఇద్దరూ పుస్తకాల ముందు కనపడాలి. లేకపోతే వీపు విమానం మోత మోగిస్తా! - ఇది మా అమ్మ కేక!
అంతే.. ఇంక నేనూ మా తమ్ముడూ.. గప్ చుప్ సాంబార్ బుడ్డి.. మా లెక్కలన్నీ గోదాట్లోకీ, మేం మాత్రం పుస్తకాల్లోకీ..
...........
పైనదంతా చదివాక మీక్కూడా స్కూల్ రోజులు గుర్తొచ్చే ఉంటాయి కదూ! నిన్న రాత్రి నేనూ, మా ఇంటబ్బాయ్ ఇలాగే వాదులాడుకుంటూ అలా ఇన్ఫినిటీ, యూనివర్స్ దాకా వెళ్లి వచ్చాం.. ఇంతా చేసి చివరికి మా వాదన ఎక్కడ ఎందుకు మొదలయ్యిందో మర్చిపోయాం.. ఏదేమైనా నేను మాత్రం కాసేపు స్కూల్ రోజుల్లోకి వెళ్లేసి వచ్చా! మిమ్మల్ని కూడా పంపిద్దామనే ఈ టపా!
Wednesday, January 05, 2011
అంతకన్నా ఒకటెక్కువే!
Subscribe to:
Post Comments (Atom)
34 comments:
LOL..! Plus one ;)
exactly the same way we used to fight
ఇలాగే ఇంఫినిటీ, ప్లస్ వన్ అని కొట్టుకునేవాళ్ళం నేనూ మా చెల్లినూ :)
hahhahhaa.. superb..:)
హహ్హహ్హ బాగుందండి.నేను మా చెల్లి అలా కొట్టుకుంటూ,తిట్టుకుంటూ ఉండేవాళ్ళం.:))
nenu maa friend ilage premani express chesukunevallam. nuvvu entha anna antha kante okati ekkuve ani. aa rojulu gurthukochayyi. thanks for recollecting that days.
హ్హ...హ్హ...హ్హ...
hahaha.. ఈ ఇంఫినిటీ, ప్లస్ వన్ గొడవలు మాత్రం ulti :)
hahhahh....nice..:)
హహహ మధుర .. యూనివర్స్ ప్లస్ వన్ చప్పట్లు..భలే రాసావ్ ..నేను మా అక్కా ...ఇలాగే ఇలాగే
యూనివర్స్ టు ద పవర్ అఫ్ యూనివర్స్ :) బాగుంది చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు.
హ హ హ హ హ
అంతకన్న ఎక్కువ నవ్వలేను బాబు :)
సుజ్జి గారి LOL plus one కి plus one :-)
మధురగారు ఒక చిన్న చికాకుతో మూడ్ ఆఫ్ అయి నీరసంగా మీ బ్లాగ్ ఓపెన్ చేశా ఒక్కసారిగా మూడ్ మొత్తం సెట్ అయిపోయింది :-) సూపర్ పోస్ట్ Thanks a lot. అసలు తోబుట్టువుతోనో నేస్తాలతోనో అచ్చం ఇలాగే గొడవపడని వాళ్ళు ఎవరూ ఉండరేమో. నాకు ఇంత హాయిగా గిల్లికజ్జాలు పెట్టుకునే నేస్తాలు ఇపుడు కరువయ్యారు కానీ చిన్నపుడు నేనూ ఇంతే...
హ్హ..హ్హ..మీ టపా చదవకుండానే శీర్షిక చూడగానే చిన్నప్పటి వాదులాటలు గుర్తుకొచ్చాయి. చివరికి ఇంకో డయిలాగు కూడా అనేవాళ్లమండోయ్! నువ్వు ఎన్నన్నా అంతకన్నా ఒకటి ఎక్కువే..నీ నోటికి నా నోటికి తాళం..ఆకాశానికి భూమికి తాళం...
:)చిన్నప్పుడు ఎప్పుడూ ఒకటెక్కువే.
మీరు ఇంఫినిటీ దగ్గరే ఆగారు...మేము..ఇంఫినిటీ టు ద పవరాఫ్ ఇంఫినిటీ కి కూడా వెల్లిపోయేవాళ్ళం...అచ్చం నేను మా తమ్ముడు తిట్టుకుంటున్నట్టే ఉంది.ఆ పందీ...కుక్కా....నక్కా...ఎలుకా...ఇలా ప్రాసల్లో భలే తిట్టుకునేవాళ్ళంలే.మీరన్నట్తే బాల్యంలోకి తీసుకెళ్ళిపోయారు :))
నిజమండీ అచ్చం ఇలానే నేనూ మా అన్నయ్యా కొట్లాడుకొనే వాళ్ళం. కాకపొతే కొంచం చేంజ్.. మా వీపులు విమానాలకంటే ఎక్కువే మొగేవి మేం కొట్టుకొంటేనే ఇంక పెద్దవాళ్ళు కొట్టే అవకాశమేది ? నేనూ మ అన్నయ్యా మా ఇంట్లో ముందున్న వరండాలో కొట్టుకొంటే ఆ సౌండ్ వీధికి ఆవలి వైపున్న ఇంట్లో వంటింట్లో ఉన్న అమ్మమ్మగారికి వినిపించేదంటే ఇంక మరి ఎలా ఉందేదో ఊహించుకోండి..చిన్ననాటి రోజు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు
evarina tidutu unte navvutu vini chivarlo mirror anevallam...ante tittinatitlanni vadike malli velipotayi annamata
భలేఉంది. స్కూల్ రోజుల్ని గుర్తు చేసారు
అన్నట్టు మీకు ఎన్ని కామెంట్లు వచ్చాయో వాటి కన్నా ఒకటి ఎక్కువదీ కామెంట్
hahahahhaaa...bhale undi...ikkadikochchaaka yee titlannee tega missings...
బాల్యపు మధుర క్షణాలను ఎంత మధురంగా గుర్తు చేసారు మధురవాణి గారు :)
LOL'
ఒక ప్రోగ్రాం రాసేయాలి ఇలాంటప్పుడే for clause తో
మధుర వాని గారు నేను మా అన్నయ్యని కొట్టేదాన్ని వాడు మౌనంగా భరించేవాడు :) నో రియాక్షన్ హహ ..
@ సుజ్జీ,
:) దానికి కూడా ప్లస్ వన్..
@ ఆ.సౌమ్య, రాధిక (నాని), గీత_యశస్వి, మేధ, నేస్తం,
అయితే సేమ్ పించ్ మీ అందరికీ.. :) :) అందరికీ ధన్యవాదాలు.
@ మనసు పలికే, కిరణ్, లలిత,
థాంక్యూ! :)
@ గీత_యశస్వి,
ఎంతసేపూ గొడవలు పడ్డానికే కాకుండా ప్రేమని చెప్పడానిక్కూడా ఇది పనికొస్తుందన్నమాట! మంచి అయిడియా కదూ! :)
@ భాను,
ఇది వాడినట్టు గుర్తు లేదండీ నాకు. అప్పటికి నాకంత మ్యాథ్స్ పరిజ్ఞానం లేదేమో మరి. ;)
@ మాలా కుమార్,
మీ నవ్వుల పువ్వులు ఏరుకున్నానండీ! థాంక్యూ :)
@ వేణూ శ్రీకాంత్,
మీ కామెంట్ చూసి చాలా సంతోషపడ్డానండీ! మొత్తానికి ఈ టపా మీ చికాకు పోగొట్టేసినందుకు హ్యాపీ.. నిజమేనండీ.. అందుకే అందరూ కాసేపలా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్లి రావాలనే పోస్ట్ చేశాను. :)
@ సిరిసిరి మువ్వ,
టైటిల్ పెట్టేప్పుడు ఈ సందేహం వచ్చింది. అందరికీ ముందే తెలిసిపోతుందేమోనని. ఇప్పటికి మీరొక్కరే ఆ మాటన్నారు. వెరీ స్మార్ట్! :) మీరు చెప్పిన డైలాగు నాకు తెలీదండీ.. భలే బాగుంది..నాకు చాలా నచ్చేసింది. థాంక్యూ!
@ శిశిర,
ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా! ;)
@ ఇందు,
మీరూ భాను గారి జట్టేనన్నమాట! చిన్నప్పుడే కాదు నాకైతే ఇప్పటికీ తిట్లంటే అవే! :D
@ ఆనంద్,
హహ్హహ్హా.. నిజంగా అంతలా కొట్టేసుకునేవాళ్ళా అయితే మీరు! నేనయితే సైలెంట్ గా గిచ్చడం, మా తమ్ముడేమో కొట్టడం.. సౌండ్ వినిపించదు కాబట్టి.. చాలాసార్లు వాడిని నేనేమీ అననట్టే ఉండేది. ;)
@ సంజు,
ఈ టెక్నిక్కేదో తెలీదండి నాకు. భలే ఉందిగా.. సరదాగా.. :)
@ శంకర్,
హహహ్హా.. సరేనండీ.. అలాగే! :)
@ ఎన్నెల,
మిస్సయిపోడం ఎందుకండీ.. ఎవరినో ఒకళ్ళని దొరకపుచ్చుకుని మనకి వచ్చిన తిట్లన్నీ వాడెయ్యడమే! ;)
@Onvitha,
థాంక్యూ! :)
@ హరేకృష్ణ,
మేం మీలాగా బ్రహ్మీస్ కాదు కదా.. అందుకే ఇలాంటి తెలివైన అయిడియాలు రాలేదనుకుంటాను. ;) మీరన్నట్టు ఈ తరం పిల్లలు ఇలా చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు కదా! :)
@ కావ్య,
హహ్హహ్హా.. అయితే మీరు అప్పట్లోనే చిన్న సైజు రౌడీ అన్నమాట! :)
sooper :)
@ పరుచూరి వంశీ కృష్ణ,
థాంక్యూ! :)
నాకు అయితే మా అమ్మా దెబ్బలను గుర్తు చేసారు. టపా టపా కొట్టేసేది. నేను కుడా చాలా అల్లరి చేసేదాన్ని.
@ మయూరి,
హహ్హహ్హా.. అవునా! మా అమ్మ మాత్రం వీపు విమానం మోత మోగిస్తా అని బెదిరిస్తూ ఉండేది తప్ప ఎప్పుడూ కొట్టేది కాదు. ;)
nice post
థాంక్యూ డేవిడ్ గారూ! :)
హ హ హ...చాలా రోజులయ్యాక వచ్చాను మీ blog కి...
నేనూ మా పిన్నీ ఇలా తిట్లు కనిపెట్టి మరీ తిట్టుకినేవాళ్ళాం..చిన్నప్పుడు
@ స్ఫురిత,
అవునండీ చాన్నాళ్ళకి కనిపించారు. అయితే, మీకూ మీ చిన్నప్పటి రోజులు గుర్తొచ్చా యన్నమాట! :)
Post a Comment