Wednesday, January 12, 2011

ఆలోచనలు..


ఆలోచనలు..

ఏవో లోకాల్లో విహరింపచేస్తాయి..
ఆకాశం అంచులదాకా ఎగరేస్తాయి..
ఊహల సందడిలో ఉర్రూతలూగిస్తాయి..
ఆశల పల్లకీలో ఊరేగిస్తాయి..
కోరికల దీపాలు వెలిగిస్తాయి..
గమ్మత్తైన మత్తులో పడేస్తాయి..

నిరాశల నీడల్ని గుర్తుకి తెస్తాయి..
పదునైన వాస్తవంలోకి తీసుకొస్తాయి..
తలపుల తీరంలో నిలబెడతాయి..
ఇష్టాలూ అభిమానాలూ పెంచుతాయి..
బంధాలూ ప్రేమలూ తుంచుతాయి..
నవ్వులు రువ్వుతాయి..
కన్నీళ్లు జారుస్తాయి..

పున్నమి వెలుగులు విరజిమ్ముతాయి..
అదాటున అమావాస్య చీకట్లోకి తోసేస్తాయి..
సప్తవర్ణ కాంతులతో మెరిపిస్తాయి..
రేయిలోని నలుపంతా తెచ్చి పులిమేస్తాయి..

మనసుని లాక్కెళ్ళి గతానికి కట్టేస్తాయి.
జ్ఞాపకాల సంద్రంలో ముంచేస్తాయి..
మానిపోయిన గాయాల్ని రేపుతాయి..
మనసుకి ముసుగేస్తాయి..
ఓదార్పుని పంచుతాయి..
అలసిన మనసుకి సాంత్వన కలిగిస్తాయి..

ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి..
రూపమూ లేదనిపిస్తాయి..
అంతా ఆనందమే అనిపిస్తాయి..
అదంతా భ్రాంతేనని తేల్చేస్తాయి..

మురిపిస్తాయి.. మైమరపిస్తాయి..
కవ్విస్తాయి.. కైపెక్కిస్తాయి..
కదిలిస్తాయి.. కరిగిస్తాయి..
చెరిపేస్తాయి.. మరిపిస్తాయి..
మాటలకి అందవు.. మౌనంలో దాగవు..
పరుగు ఆపవు.. చేతుల్లో చిక్కవు..

పగలూ లేదూ.. రాత్రీ లేదూ..
అలుపూ లేదు.. అదుపూ లేదు..
నిన్న.. ఇవ్వాళ.. రేపు.. అనుక్షణం..
నన్నొదిలి మాత్రం ఎక్కడికీ పోవు!

28 comments:

అశోక్ పాపాయి said...

Nice feelings....keep writings

భాను said...

ఆలోచనలు
ఇలా అక్షర రూపంలో మమ్మల్ని అలరిస్తాయి. బ్లాగుల్లో వికసిస్తాయి, మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. మీ ఆలోచనలను ఆస్వాదించా:)

శిశిర said...

చాలా బాగా చెప్పారండి.
>>>మాటలకి అందవు.. మౌనంలో దాగవు..
క్లుప్తంగా మొత్తం భావాన్ని చెప్పారు.

లత said...

చాలా బావుంది మధుర గారూ

kiran said...

చాల చాల బాగుంది .. :)

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది మధుర గారు :-)

veera murthy (satya) said...
This comment has been removed by the author.
Padmarpita said...

ఎంత అందమైన ఆలోచనలు...మధురవాణిగారు!

Rachana said...

Good One

శివరంజని said...

sweet మధుర చాలా బావుంది

సి.ఉమాదేవి said...

మధురంగా వినిపిస్తాయి,ఆలోచన రేకెత్తిస్తాయి,అంతరార్థాన్ని
వెతకమంటాయి.ఏవంటారు?మీ కవితలే!

సుమిత్ర said...

భలే "ఆలోచనలు".. అంత శక్తి భగవంతునికే ఉంటుంది
ఆలోచనలు ఆయన సృష్టించిన మహామాయ అందులోపడి కొట్టుమిట్టాడని జీవి లేదు. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి.

హరే కృష్ణ said...

Nice!
చాలా బావుంది

veera murthy (satya) said...

madhura vani garu, oka sari shiva gari bhaavalu chudandi

http://gurivindaginja.blogspot.com/2010/12/blog-post_29.html

-satya

Ennela said...

madhuram..madhuram...

Ennela said...

madhura vani garu , meeku ekkadaina 'neela mohana rara' video dorikite cheptara? internet lo chala vethikaanu...only audio dorikindi...please

మధురవాణి said...

@అశోక్ పాపాయి, శిశిర, లత, కిరణ్, వేణూ శ్రీకాంత్, పద్మార్పిత, రచన, శివరంజని, హరేకృష్ణ, ఎన్నెల,
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

@ భాను,
భలే చెప్పారు! నిజమే! :)

@ సత్య,
భగవద్గీత వాక్యం చాలా బాగుంది. మీ కవిత కూడా! థాంక్యూ! :)

@ C.ఉమాదేవి,
హహ్హహ్హా.. ఇంతటి ఆప్యాయతకి ఏమనగలను.. ఆనందించి మీకు థాంక్యూ అన్న చిన్న మాట చెప్పడం తప్ప. :)

మధురవాణి said...

@ సుమిత్ర,
నిజమే.. ఆలోచనలంటేనే మాయ.

@ SR రావు,
ధన్యవాదాలండీ..

@ సత్య గారు,
లింక్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. శివ గారి కవిత మరింత లోతుగా, వైవిధ్యంగా ఉంది.

@ ఎన్నెల,
ఇంతకీ ఆ 'నీల మోహన రారా' అనే పాట వివరాలు ఏవిటండీ? ఏ సినిమాలో పాట అది? వివరాలు చెప్తే నా దగ్గర ఉందొ లేదో చెప్తాను.

Ennela said...

sorry andee...vivaraalu wrayaledu..

Dr.anand lo paata..suseela gaaridi..neela mohana rara ninnu piliche nemali nerajana..audio link idigo
http://www.raaga.com/player4/?id=192618&mode=100&rand=0.8244947963767917

Thanks andee

మురళి said...

బాగుందండీ..

bharathnunepalli said...

alochanala gurinchi mee varnana adbhutham....naku chala baaga nachindandi....

ప్రణీత స్వాతి said...

wow..superb!! ilaantivi inka inkaa raastoo vundandi.

మధురవాణి said...

@ మురళి, భరత్ నూనేపల్లి, ప్రణీత స్వాతి,
ధన్యవాదాలండీ! :)

Sriharsha said...

chala baga chepparu.....

మధురవాణి said...

@ శ్రీహర్ష,
థాంక్యూ! :)

శివ చెరువు said...

Well written!

మధురవాణి said...

Thank you Siva garu! :)

అనిత said...

ఆలోచనలకు ఆనకట్ట వేయగలమా, అదుపు చెయ్యగలమా!!!

మీ ఆలోచనలని మాకు పంచినందుకు థాంక్స్!!!!