Thursday, October 07, 2010

ఆహా! నెయ్యి రుచి.. అనరా మైమరచి!

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ వేసుకుని, వేడి వేడిగా అప్పుడే కాచిన నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటుంది!
వేడి వేడి ఇడ్లీని కారప్పొడి, నెయ్యిలో ముంచుకు తింటే ఎలా ఉంటుంది!
వేడి వేడి పరమాన్నంలో మధ్యన పెద్ద గురుగులాగా చేసుకుని దాన్నిండా నెయ్యి నింపుకుని తింటుంటే ఎలా ఉంటుంది!
తెల్లవారుఝామున్నే గోదారి స్నానం చేసి, రామాలయానికి వెళ్లి రాముడి దర్శనం చేసుకుని, గోదావరినీ, సూర్యోదయాన్నీ చూస్తూ.. అక్కడ విస్తరాకులో కట్టి ఇచ్చే వేడి వేడి చక్కెరపొంగలి ప్రసాదం గనక తింటే అమృతం రుచంటే ఏంటో యిట్టే తెలిసిపోతుంది ఎవరికైనా!
ఇంకా నేతి గారెలు, బూరెలు, అరిసెలు, బొబ్బట్లు, సున్నుండలు.. వీటన్నీటి రుచి ఎంత అమోఘంగా ఉంటుందీ!
మాట కొస్తే, అసలు ఏ పచ్చడిలో అయినా, కూరలోనయినా నాలుగు నేతిబొట్లు వేసుకు తింటే.. ఆహా.. స్వర్గం అంచుల్లో తేలుతున్నట్టు ఉంటుంది కదూ!
అసలు వీటన్నీటికి ఆ అద్భుతమైన రుచి ఎలా వచ్చిందో తెలుసా? కేవలం నెయ్యి వల్లే!
అమృతం ఎలా ఉంటుందీ.. అని ఎవరైనా అడిగితే 'నెయ్యిలా..' అని ఠక్కున సమాధానం చెప్పేస్తాను నేనయితే.kenyit

అసలు యీ భూప్రపంచం మీద నెయ్యి కంటే రుచి గల పదార్ధం ఏదైనా ఉండే అవకాశమే లేదని నా గట్టి నమ్మకం.

చిన్నప్పుడు, ఎక్కడో ఇంటి వెనకాల నిప్పుల మీద నెయ్యి కాస్తుంటే, మొత్తం ఇల్లంతా ఘుమఘుమలాడిపోయేది. నెయ్యి కాచాక చివరలో అప్పుడే తాజాగా పెరట్లో నుంచి తెంపుకొచ్చిన లేత కరివేపాకు రెబ్బలు వేస్తుంది మా అమ్మ.

ఆ కమ్మటి వాసన తగలగానే అప్పటికప్పుడు భలేగా ఆకలేసేది! నాకొక్కదానికి ప్రత్యేకంగా ఇంకో చిన్న నెయ్యి గిన్నె కావాలని గొడవ చేసేదాన్ని. అప్పటికప్పుడు కాచిన నెయ్యి అయితేనే తినేదాన్ని. ఒకసారి నెయ్యేసుకుని అన్నం కలుపున్నాక, మళ్ళీ ప్రతీ ముద్ద పైన కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని తినేదాన్ని.
"అందరూ అన్నం తినడం కోసం నెయ్యి వేసుకుంటారు. అక్క మాత్రం నెయ్యి తినడం కోసం అన్నం తింటుంది. అయినా అందరూ నెయ్యి వేసుకుంటారు. అక్క మాత్రం నెయ్యి పోసుకుంటుంది" అనేవాడు మా తమ్ముడు చిన్నప్పుడు. ఇప్పటికి కూడా అదే మాట మీద నిలబడతాడనుకోండి. అది వేరే సంగతి! స్వర్ణయుగం అంటే అలాంటి రోజులేనేమో!gigil


నెయ్యి ఫోటో జ్యోతి గారి 'షడ్రుచులు' నుంచి.senyum


ఇప్పుడు నెయ్యి తినడం గురించి నేనో కథ చెప్తాను. "నెయ్యి ఎక్కువ తినకూడదు, ఎందుకంటే.." అంటూ యీ కథని మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు.

అనగనగా ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడట. ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి నెయ్యంటే చాలా ఇష్టమట. అందుకని తెగ తినేవాడట నెయ్యి. అచ్చం నాలాగానే అన్నమాట!jelir
కానీ, వాళ్ళింట్లో ఎక్కువగా పాడి లేకపోవడం వల్ల తనకి కావలసినంత నెయ్యి దొరికేది కాదట. అయినా గానీ, దొరికినంతమటుకు స్వాహా చేస్తూ ఉండేవాడట.
అలా అలా ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడట. పెద్దయ్యాక కూడా నెయ్యి మీద ఇష్టం ఇసుమంతైనా తగ్గలేదట. వాళ్ళింట్లోనే కాకుండా, ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు కూడా నెయ్యి గిన్నె మొత్తం ఖాళీ చేసేవాడట. ఇలా ఉండగా, ఒకసారి ఆ దేశపు రాజు గారు తన కుమార్తె వివాహ సందర్భంగా రాజ్యంలోని ప్రజలందరికీ విందు భోజనం ఏర్పాటు చేసారట. ఆ పెళ్లి విందులో బోలెడన్ని రకాల పిండివంటలు, తినుబండారాలు అడిగినవారికి లేదనకుండా ఎంతైనా సరే వాళ్ళు తృప్తి పడిందాకా వడ్డించాలని రాజు గారు ఆజ్ఞాపించారట.
యీ విందు గురించి విన్న మనోడికి పట్టలేనంత సంతోషమేసిందట. ఇన్నాళ్ళకి నాకెంత కావాలంటే అంత నెయ్యి తినగలిగే అవకాశం వచ్చిందనుకుని వెంటనే బయలుదేరి విందు జరిగే భోజనాలశాల దగరికి వెళ్ళాడట. అక్కడ అందరితో పాటు పెళ్లి బంతిలో కూర్చున్నాడట. అన్నీ వంటకాలు వరుసనే తెచ్చి వడ్డిస్తూ ఉన్నారట. మనోడేమో తెగ ఆత్రంగా ఎదురు చూస్తున్నాడట నెయ్యి ఎప్పుడు తెస్తారా అని. కాసేపటికి ఒక చిన్న చెంచాతో నెయ్యి వడ్డిస్తూ ఒకతను వచ్చాడట.
"ఏంటీ, అంత కొంచెం వడ్డిస్తున్నావ్ నెయ్యి.. నీ సొమ్మేం పెట్టట్లేదుగా! ఆ గిన్నెలో నెయ్యంతా ఒంపెయ్యి.." అన్నాడట.
దానికి ఆ నెయ్యి వడ్డించే ఆయన "బాబూ.. నెయ్యి కొంచమే తినాలి. ఎక్కువ తినడం మంచిది కాదు. అందుకే ఇలా కొంచెం కొంచెం వడ్డిస్తున్నాం" అని చెప్పాడట.
దానికి మనోడు "రాజు గారు.. ఎవరూ ఎంత అడిగితే అంత లేదనకుండా పెట్టమని చెప్పారా లేదా! నాకు ఇంకా పెద్ద పెద్ద గిన్నెల నిండా నెయ్యి కావాలి" అని గట్టిగా అడిగాడట.
"ఎంతైనా వెయ్యడానికి నాకేం అభ్యంతరం లేదు బాబూ.. నెయ్యి ఎక్కువ తాగితే తీరని దాహం వేస్తుంది అని నీ మంచి కోరి చెప్పాను. ఆ పైన నీ ఇష్టం" అన్నాడట ఆ వడ్డించే అతను.
అయినా సరే కావాల్సిందేనని పట్టుబట్టి గిన్నెల కొద్దీ నెయ్యి వేయించుకుని పీకల దాకా లాగించేశాడట మనోడు. అలా గిన్నెలు గిన్నెలు నెయ్యి తాగెయ్యడం వల్ల భోజనం అయిన తరవాత నుంచీ ఒకటే దాహం మొదలయిందట మనోడికి. ఎక్కడ నీళ్ళు కనిపిస్తే అక్కడ తాగుతూనే ఉన్నాడట. కానీ, ఎన్ని నీళ్ళు తాగినా తీరనంత దాహంగా ఉందట. అలా అలా రోజంతా తిరుగుతూ నీళ్ళు తాగుతూ ఊరంతా తిరిగాడట. ఎంత నీళ్ళు తాగుతున్నా కూడా దాహం తీరకపోగా ఇంకా ఇంకా ఎక్కువైపోతోందట. సాయంత్రానికి ఇంక భరించలేక ఇలాక్కాదని చెప్పి దాహం బాగా తీరుతుందని వెళ్లి ఊరి పొలిమేరల్లో ఉన్న నదిలో దూకాడంట. ఇంకేముందీ.. దెబ్బకి చచ్చి కూచ్చున్నాడు. sedih


యీ కథలో నేను తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, 'చాలా ఇష్టం కదా.. బాగుంది కదా.. అని నేను నెయ్యి ఎక్కువెక్కువ వేసుకుని తినకూడదు'.takbole ఇలా అని మా అమ్మ యీ కథ నాకు చెప్పింది.


నిన్న రాత్రి బాగా నెయ్యి వేసుకుని సుబ్బరంగా మెక్కుతుంటే యీ కథ గుర్తొచ్చింది. ఇంకేముందీ.. కట్ చేస్తే మీరు ఎరక్కపోయి నా బ్లాగుకి వచ్చి ఇలా నెయ్యిలో ఇరుక్కుపోయారు. లక్కీ ఫెలోస్ కదూ!sengihnampakgigi

42 comments:

హరే కృష్ణ said...

నేను నెయ్యి తినను ఓన్లీ వెన్న :)
నెయ్యి కధ అంటే దురాశ దుఖ్ఖానికి చేటు వ్యాపారి కధ చదివాక నెయ్యి తినడం పూర్తిగా మానేసా
పోస్ట్ నెయ్యి కంటే మధురంగా చాలా బావుంది :)
నెయ్యి వ్యతిరేక సంఘం వర్ధిల్లాలి

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగా రాసారు..నెయ్యి లాగా బాగుంది మీ టపా కూడా ...నెయ్యి గురించి చెప్పటమే కానీ అదే చేత్తో రెండు స్వీట్స్ కూడా ఇవ్వచు కదా

Overwhelmed said...

nenu kuda neyyi ante entayina taagesta. :)

Mi kaburlu miss ayyanandi. mi tapallo comments pettadam idi 3 time ee anukunta, miku nenu anta telidu lendi. :)

ఏకాంతపు దిలీప్ said...

నాకు వేడి పప్పు చారులొ వెన్న అంటే పర్లేదు గానీ, లేకపోతే వెన్న అంటే యాక్!
నేను నెయ్యి పార్టీ... ఇక్కడ మంచి గేదే నెయ్యి దొరకదు... అయినా సరే, ఫ్రెండ్ టొమాటో పప్పు చేసేసాడు, వెళ్ళి నెయ్యేసుకుని లాగించేస్తా... నోరూరుతుంది..

bhavani said...

మీ నెయ్యి తప బావుందండి. నాకు కూడా నెయ్యి ఇష్టమే కాని తింటే రేపు ఏమౌతుందో అని భయపడి కాస్త తగ్గించి పది చేమ్చాలతో ఆపేస్తుంటాను. నెయ్యి తిన్నాక మీకుబాగా దాహం వేస్తె కాస్త ఎక్కువ గోవువేచ్చాటి నిల్లు తాగండి. దాహం తగ్గుతుంది. నా అనుభవంతో చెప్పాలెండి.

bhavani said...

మీ నెయ్యి తప బావుందండి. నాకు కూడా నెయ్యి ఇష్టమే కాని తింటే రేపు futurelo ఏమౌతుందో అని భయపడి కాస్త తగ్గించి పది చేమ్చాలతో ఆపేస్తుంటాను. నెయ్యి తిన్నాక మీకుబాగా దాహం వేస్తె కాస్త ఎక్కువ గోరు వెచ్చటి నీళ్ళు తాగండి. దాహం తగ్గుతుంది. నా అనుభవంతో చెప్పాలెండి.

Sravya V said...

హరేకృష్ణ గారి పార్టీ లో మెదటి సభ్యురాలిని నేను :)

మాలా కుమార్ said...

నెయ్యి కథ బాగుంది . అవునూ పూర్ణం బూరె లో మద్యలో గుంట చేసుకొని నెయ్యి పోసుకొనితింటే వహవా . . ఇంకా బొబ్బట్టు లో నెయ్యి సంగతి కూడా మర్చిపోయావు :)

sunita said...

neyyi gurinchi ikkaDa kooDaa chooDanDi.
http://virajaaji.blogspot.com/2010/07/blog-post.html

లలిత (తెలుగు4కిడ్స్) said...

చిన్నప్పుడు కొంతకాలం నెయ్యిలో చక్కెర కలుపుకిని తినేదాన్ని. మా డాక్టరు warning పుణ్యమా అని చక్కెర మానేశాను. స్వీట్లూ తగ్గాయి. కొన్నాళ్ళు నెయ్యి వాసనే గిట్టేది కాదు.
ఈ మధ్య ఇంట్ళో వెన్న కాచి నెయ్యి చేసుకుంటుంటే మాత్రం...
చిన్నప్పుడు ఆవు నెయ్యి అంటే దేవుడికి మాత్రమే.
అలాంటిది ఇప్పుడు ఆవు నెయ్యే మరి, అయినా ఆ రుచి మరిగాను. ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారు :(

నెయ్యి సంగతి సరే, పెరుగు గురించి నాకు
ఇంకో కథ గుర్తుకు వస్తోంది.
ఒక ఇంట్లో ఒక వ్యాపారి అనుకుందాం ఉంటాడు.
వాళ్ళ పక్క ఇంట్లో ఒక వైద్యుడు ఉంటాడు.
గోడలు సన్నవో ఏమో కానీ, ఈ వ్యాపారస్తుడి (డబ్బు కలవాడు) పక్కింట్లోకి వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి.
రాత్రి పూట అన్నంలోకి పెరుగు అడుగుతాడు ఆ డబ్బు గలాయన.
ఇక్కడ వైద్యుడు తన భార్యతో, "ఏమే, నీకు వడ్డాణం చేయిస్తాను," అంటాడు.
ఇంతలోకి ఆ డబ్బు గలాయన పెరుగు పల్చన చేసుకోవడానికి భార్యని నీళ్ళు అడుగుతాడు.
అప్పుడు వైద్యుడు భార్యతో, "ఏమేవ్, వడ్డాణం కాదు కానీ నీకు బంగారం గొలుసు చేయిస్తాను," అంటాడు.
మళ్ళీ డబ్బు గలాయన భార్యని ఉప్పు అడుగుతాడు.
అప్పుడు వైద్యుడు, "ఏమే, నీకు నగలుఏమీ చేయించలేనే, పక్కింటాయన మజ్జిగలో ఉప్పు కలుపుకుని తింటున్నాడు," అంటాడు.
రాత్రి పూట పెరుగు తింటే అరగదని ఈ కథ చెప్పేది మా అమ్మమ్మ.

సి.ఉమాదేవి said...

మీరు నెయ్యి,నెయ్యి అన్నపుడల్లా నై.. నై అనే డాక్టర్ల హెచ్చరికలే వినబడుతున్నాయి.నెయ్యిని మరిపించే పదార్థం మరేది లేదుకదా!కాని మధురమైన బ్లాగ్ నెయ్యము, నెయ్యిని మరిపిస్తోంది.

శిశిర said...

:) బాగుంది టపా.

నిషిగంధ said...

నేనూ మీ పార్టీనే :-)
మీరు చెప్పిన అన్ని ఐటంస్ తో పాటు దిబ్బరొట్టె ని కింద భాగం, పై భాగం వేరువేరు గా వచ్చేట్టు సగానికి చీల్చి నెయ్యి అలా అలా ధారాళంగా పోసేసి, ఏమీ ఎరగనట్టు మళ్ళా ఆ సగాన్ని మూసేసి అల్లం పచ్చడితో తినడం ఇప్పుడు గుర్తుకొచ్చి మనసు బాధగా మూలిగింది..
ఇంకా నా చిన్నప్పుడు పెరుగన్నంలో కూడా నేయ్యి వేసుకుతినేదాన్ని... కానీ మా అమ్మమ్మ చాలా బలవంతంగా ఆ అలవాటు మానిపించింది :))

రాధిక(నాని ) said...

బాగుందండి మీ నేతిటపా కమ్మగా...నోరూరుతూ...మా అమ్మాయి మీ పార్టీయే నండి .నెయ్యి పోసుకోపోతే దానికి అన్నం తిన్నట్టే ఉండదు.పేరినెయ్యి పక్కన వేసుకుని నాకుతూ అన్నం తింటుంది .హాస్టల్ లో ఎలా తింటావే నెయ్యి లేకుండా? అంటాం మేము.

Anonymous said...

భవాని చెప్పారు..
మీ నెయ్యి టపా బావుందండి. నాకు కూడా నెయ్యి ఇష్టమే కాని తింటే రేపు ఏమౌతుందో అని భయపడి కాస్త తగ్గించి పది చెంచాలతో ఆపేస్తుంటాను. నెయ్యి తిన్నాక మీకుబాగా దాహం వేస్తె కాస్త ఎక్కువ గోరు వెచ్చటి నీళ్ళు తాగండి. దాహం తగ్గుతుంది. నా అనుభవంతో చెప్పాలెండి.

మధురవాణి అభిమాన సంఘం(మ.అ.స) కార్యకర్త ;-)

ఇందు said...

బాగుంది టపా!. నేను కూడా నెయ్యి ఫాన్ నే కాని ఇంట్లో కాచిన నెయ్యె తింటాను..బైట వాటిల్లో నెయ్యి లో నూనె/డాల్డా కలిపేస్తారని. నెయ్యి వాసన మాత్రం అమోఘం :)

VendiMudda said...

Naaku kuda Neyyi ante chaala istamu. Chicken curry lo Neyyi vesukuni tinte abba bale vuntundi. Inka mamidikaya pappu lo kuda...

భావన said...

హ్మ్... మీ అందరిని చూసేక నేను సీరియస్ గా ఆలోచిస్తున్నా ఈ నెయ్యి గురించి. ముద్దపప్పు ఆవకాయ ను దాటి నా నెయ్యి ప్రియత్వం ఎప్పుడూ పోలా ఎందుకో. నెయ్యి వేసుకుంటే అన్ని చప్ప బడిపోతాయి కదా. ఏం బాగుంటుంది.. :-( చారు లో పప్పులో తాలింపు కు తప్ప.

ఆత్రేయ said...

నాకు మాత్రం ఏ టిఫిన్ ఆయినా చట్నీ లేకుండా ఒక కప్ లో కరిగిన నెయ్యి పెట్టుకొని అందులో ముంచుకు తినటం ఇష్టం ముఖ్యం గా ఉండ్రాళ్ళు ఇడ్లీలు లాంటివి ..పెరుగు కోసమైతే కనీసం ఒక హర్యానా గేదె కొందామని ఉంది ఎప్పటినుంచో ...

జేబి - JB said...

బాగుందండి మీ నెయ్యి కథ.

నాకు పొద్దున్నే వేడివేడి అన్నంలో పళ్ళచింతకాయపచ్చడి/గోంగూర పచ్చడి కరగబట్టిన వేడినేతితో తింటం - ట్ట్టా (లొట్టలు).

నిషిగంధగారు: దిబ్బరొట్టె + అల్లప్పచ్చడి - ఏం కాంబినేషన్ గుర్తుచేసారండి.

అక్షర మోహనం said...

కాచిన నెయ్యి
కమ్మని పప్పు
కా0బినేషన్ సూపర్

శివరంజని said...

బాగుంది టపా!. నేను కూడా నెయ్యి ఫాన్ నే...నేతి బొబ్బట్లు అయితే బొలేడు ఇష్టం

Unknown said...

నేయి గురించి మాబాగా చెప్పారు.....
ఇటువంటి విషయాలు రుచికరంగా వివరించడం మీకు వెన్నతో పెట్టిన విద్య.

ఆ.సౌమ్య said...

నెయ్యి ఫేన్స్ జిందాబాద్....నాకు ఫ్యూచర్, ప్రజంట్ ఏమైనా పోనీ...ముద్దపప్పులో నెయ్యి, పక్కనా నంచుకుందుకి ఆవకాయ ఉంటే చాలు, హాయిగా ప్రాణాలు విడిచేస్తా :D

మనసు పలికే said...

మధుర గారూ.. చాలా బాగుంది మీ నెయ్యి టపా..:) నేను కూడా నెయ్యి ఫ్యాన్‌నే..:) నెయ్యితో పాటు వెన్న పెరుగు పాలు అన్నీ ఇష్టమే.. పాడి కూడా మా ఇంట్లోనే ఉండటం వలన చిన్నప్పటి నుండీ అన్నీ కుమ్మేసేదాన్ని. హాస్టల్‌లో చేరి అన్నిటికీ కరువు తెచ్చేసుకున్నాను..:(

సవ్వడి said...

:)
:):)
:):):)

పరిమళం said...

నెయ్యి ...నేతితో చేసిన వంటలు బాగానే ఉంటాయి కాని బరువు , ఇతర ఆరోగ్యసమస్యలు దృష్టిలో ఉంచుకొని మనస్ఫూర్తిగా తినలేం...అటువంటి బాధల్లేకుండా తినగలిగిన వారు అదృష్టవంతులు!బావుంది మీ టపా :)

..nagarjuna.. said...

ఇదేం బాలేదండీ... ఒక వర్గం వారందరు కలిసి మాలాంటి హాస్టల్ మెస్సు బాధితులు మరింత బాధపడేలాగా ప్లానుచేసి ఇంటిభోజనం గుర్తొచ్చేట్టు రాయడం బాలేదండీ...ఒకరేమో తోటకూర, పాలకూర అని లొట్టలేయించారు..మీరేమో ఆవకాయలో నేయ్యి, వేడి వేడి అన్నంలో నెయ్యి అని ఊరిస్తున్నారు.... నాకేమో అవన్నీ కళ్లముందు బ్రేక్ డాన్సులు, కథకళి ఆడుకుంటూ కనిపిస్తున్నాయి.... ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలి... అని ఘ్హాట్టిగా అడుగుతున్నాం అద్దేచ్చా...

అసలు సంగతి..., వేడి వేడి అన్నంలో మాడ్చిన కారం (ఎండు మిరపకాయల్ని నూనెలో అలా అలా గోళించి కరివేపాకు వేసి దంచాలి ) లొనో.., పచ్చికారంతో చేసిన టమాట పచ్చడిలోనో.., టమాట పప్పులో, పాలకూర పప్పులో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా.....అబ్బబ్బా.....స్వర్గం అంచులుగాదు ఏకంగా స్వర్గలోకపు సింహాసనంమీదే ఉంటాం... :)

Bhãskar Rãmarãju said...

>>నెయ్యి ...నేతితో చేసిన వంటలు బాగానే ఉంటాయి కాని బరువు , ఇతర ఆరోగ్యసమస్యలు దృష్టిలో ఉంచుకొని మనస్ఫూర్తిగా తినలేం...

పరిమళంగారూ - ఇది కేవలం అపోహ మాత్రమే...

Raghuram said...

నాదీ ఇందు గారి మాటే, మీ నెయ్యొపాక్యానం బ్రహ్మాండం.

రఘురాం

మాలా కుమార్ said...

దసరా శుభాకాంక్షలు .

జయ said...

చాలా బాగుందండి. నెయ్యిలో ఇంత మజా ఉందని నాకు తెలీదు. ఎందుకో మొదటి నుంచీ నేను నెయ్యికి కొంచెం దూరమే, ఏవొ కొన్ని ఐటెంస్ లో తప్ప. మా అమ్మమ్మ ఇంట్లో నెయ్యి కాచేది. మా అమ్మైతే ఇప్పటికీ కూడా. మీకు కలకాలం నెయ్యి కోరిక సమృద్ధిగా తీరుగాక, మీ కథలో లాగా మాత్రం జరగకుండా:) దసరా వంటకాల్లో బాగా లాగించారా మరి...

మధురవాణి said...

@ హరేకృష్ణ,
అయితే మీరు నాకు పూర్తిగా వ్యతిరేకం అన్నమాట! వెన్నంటే నేను అరవై అడుగుల దూరం పరిగెడతాను. ఓన్లీ నెయ్యే తింటాను. ;) అన్నట్టు, ఆ వ్యాపారి కథేంటో మాకూ చెప్పొచ్చుగా!

@ పరుచూరి వంశీకృష్ణ,
స్వీట్లు సీన్లోకొస్తే మళ్ళీ నెయ్యి విషయం పక్కదారి పడుతుంది కదండీ.. అందుకే ఓన్లీ నెయ్యి గురించే చెప్పాను. అయినా, స్వీట్లంటే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. ;)

@ జాబిలి,
నెయ్యి విషయంలో మీరూ నా జట్టేనన్నమాట అయితే! :)
నా బ్లాగులో మీ పేరుతో పెట్టిన కామెంట్స్ చూసానండి. కాబట్టి, మీరు నాకు బాగా తెలుసు. :) నా కబుర్లు మిస్సయ్యారని చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండీ! అంటే, నా ఉద్దేశ్యం నా కబుర్లు మీకు నచ్చినందుకు హ్యాపీగా ఉంది అనన్నమాట! :)

@ ఏకాంతపు దిలీప్,
నేనూ మీలాగే! వెన్న అంటే యాక్! కనీసం పప్పుచారులో కూడా తినలేను. మీ కామెంట్ చూసాక నాక్కూడా టమాటా పప్పు తినాలనిపించింది. అదీ ఆవకాయ నెయ్యేసుకుని. ;)

మధురవాణి said...

@ భవాని,
నేనూ అచ్చం మీలానే భయపడి పది చెంచాల నెయ్యితో ఆపేస్తుంటానండీ! ;) మంచి చిట్కా చెప్పినందుకు చాలా చాలా థాంక్స్. :)

@ శ్రావ్య వట్టికూటి,
అయితే మీరు నాకు వ్యతిరేకం అన్నమాట! :)

@ మాలా కుమార్,
పూర్ణంలో నెయ్యేసుకునే టెక్నిక్ నాకు తెలీదు ఇప్పటిదాకా :( ఈసారి ట్రై చేస్తాను. బొబ్బట్లు గురించి నేను చెప్పానుగా! నెయ్యి గుర్తొచ్చిన ఆనందంలో మీరు అది చూడటం మిస్సయిపోయుంటారు! ;)

@ సునీత,
చాలా రుచికరమైన నెయ్యి టపా చూపించారు. ధన్యవాదాలు! :)

మధురవాణి said...

@ లలిత (తెలుగు4కిడ్స్),
నెయ్యికి అంత వీరాభిమానులై ఉండి ఇంత చిన్న కథకి బెదిరిపోతే ఎలాగండీ మనం? ;) మీరు చెప్పిన పెరుగు కథ చాలా నచ్చింది నాకు. భలే సరదాగా ఉంది. నాకో కొత్త కథ తెలిసింది కూడా! కథ మొత్తం చాలా కష్టపడి టైపు చేసి చెప్పారు. మీకు బోలెడు ధన్యవాదాలు. :)

@ C.ఉమాదేవి,
నెయ్యేసుకు తినేప్పుడు మాత్రం నా చెవులు అసలు పని చెయ్యవండీ! ;) నా బ్లాగు గురించిన మీ ప్రశంస చూడగానే ఒక పెద్ద గిన్నెడు నెయ్యేసుకుని అన్నం, ఆవకాయ తిన్నంత ఆనందంగా ఉంది. ధన్యవాదాలు! :)

@ శిశిర,
ధన్యవాదాలు! :)

@ నిషిగంధ,
మీరు చెప్పిన దిబ్బరొట్టె అయిడియా వింటుంటేనే రుచి తెలిసిపోతోంది. అర్జెంటుగా ట్రై చేసెయ్యాలి. :) పెరుగన్నంలో నెయ్యా? మీరు నన్ను దాటిపోయారు సుమీ నెయ్యి తినడంలో! ;)

కొత్త పాళీ said...

హమ్మ్, చిన్నప్పణ్ణించీ విజయా డెయిరీ వారి డబ్బా నెయ్యి పాలిట పెర్గినవాణ్ణి కావడంతో నెయ్యి పట్ల ఎప్పుడూ అంత "ఇది" లేదు!
కానీ చిన్నప్పుడు ఇంట్లో పాడితో పెరిగినవాళ్ళకి తరవాతిరోజుల్లో కష్టంగా ఉంటుందనుకుంటా.
బాగుంది నేతి పురాణం

మధురవాణి said...

@ రాధిక (నాని),
మీ అమ్మాయి కూడా నా జట్టేనన్నమాట! అదేంటోనండీ.. హాస్టల్లో ఎలా ఉంటామో మరి.. ఇంటికి వచ్చీ రాగానే నెయ్యి లేకుండా మాత్రం ముద్ద దిగదు. అదంతే! ;)

@ అనానిమస్,
మీరేంటండీ భవాని గారి కామెంటే మళ్ళీ రాసారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ, మరీ అభిమాన సంఘం పెట్టేంత సీన్ నాకు లేదేమోనని నా అభిప్రాయం. :)

@ ఇందు,
ధన్యవాదాలు! నాక్కూడా మీలాగే బయట కొనే నెయ్యి అస్సలు ఇష్టం ఉండదు. అసలు నేనెప్పుడూ ట్రై కూడా చెయ్యలేదు. :)

@వెండిముద్ద,
మామిడికాయ పప్పులో నెయ్యి ఓకే గానీ, చికెన్లో నెయ్యా? కొత్తగా వింటున్నానండీ ఈ సంగతి!

@ భావన,
మా ఇంట్లో వాళ్ళది కూడా అచ్చం మీ అభిప్రాయమేనండీ! నెయ్యి ఎక్కువేసుకుంటే రుచీ పచీ లేకుండా చప్పగా ఉంటుందని. :)

మధురవాణి said...

@ ఆత్రేయ,
నాకేమో, ఏ టిఫిన్ అయినా గానీ, నెయ్యిలో కారప్పొడి కలుపుకుని (అందరిలా కారప్పొడిలో నెయ్యి కాకుండా;) తినడం చాలా ఇష్టమండీ! పెరుగు మీద మాత్రం మరీ అంత మనసు లేదు నాకు! ;) ఇంతకీ మీ ఆలోచన ఎప్పుడు అమలుపరుస్తున్నారు మరి?

@JB-జేబి,
ధన్యవాదాలు. మీరు కూడా సూపర్ కాంబినేషన్ గుర్తు చేసారండీ! :)

@అక్షరమోహనం,
మీ మాటకి మారుమాట్లాడకుండా సరే అనెయ్యాలి ఎవరైనా సరే! :)

@శివరంజని,
ధన్యవాదాలు. నెయ్యి పార్టీలో మీరూ సభ్యులేనన్నమాట! :)

@ ధరణీరాయ్ చౌదరి,
నా కబుర్లు మీకు నచ్చుతున్నందుకు కృతజ్ఞురాలిని. ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ఆ.సౌమ్య,
ఇహనుంచి మీరేనండీ మన నెయ్యి సంఘానికి అధ్యక్షులు. :)

@ మనసు పలికే,
ధన్యవాదాలు. అయితే నువ్వు లక్కీ అన్నమాట! అవును.. హాస్టల్లో ఉండటం వాళ్ళ ఉన్న సవాలక్ష నష్టాల్లో ఇదొకటి. :(

@ సవ్వడి,
అలా మూడు వరుసలలో పెట్టిన ఆరు స్మైలీలకు అర్థం ఏవిటండీ? :)

@ పరిమళం,
ధన్యవాదాలు. అలా అనుకుంటాం గానీ, కేవలం నెయ్యి వల్లే బరువు పెరిగిపోమని నా ఉద్దేశ్యం. ఆ విషయమే భాస్కరరామరాజు గారు కూడా బల్ల గుద్ది మరీ చెప్తున్నారు చూసారా? :)

@భాస్కరరామరాజు,
మీ మాట విన్నాక ఇంకొంచెం ఎక్కువ నెయ్యేసుకుని తింటున్నానేమోనని నా అనుమానం ;)

మధురవాణి said...

@ నాగార్జున,
అయ్యయ్యో క్షమించాలి.. మీరు పాపం హాస్టల్లో ఉన్నారని తెలీక అలా పొరపాటుగా ఈ టపా రాసేసాను. అయినా, నాడో సందేహం, మీరు ఎంచక్కా ఒక సీసా ఆవకాయ, ఒక సీసా నెయ్యి హాస్టలుకి తీస్కెళ్ళలేదా?
మీరు చెప్పిన మాడ్చిన కారం, టమాటా పచ్చిమిరపగాయ పచ్చడి, పప్పు.. అవన్నీ నాకూడా చాలా ఇష్టమండీ! నిజమే.. అవి తింటుంటే ఏకంగా స్వర్గంలోనే ఉంటాం! ;)

@ రఘురాం,
ధన్యవాదాలండీ! :)

@ మాలాకుమార్,
ధన్యవాదాలండీ! మీరు పండుగ బాగా జరుపుకున్నారని తలుస్తాను. :)

@ జయ,
అసలు మజా అంటేనే.. నెయ్యి అనుకోవచ్చండి. ;) మీ ఆశీస్సుకి బోలెడన్ని ధన్యవాదాలు! లేదండీ..ఈ పండగకి ఏదో ఒక్క స్వీటుతో సరిపెట్టేసాను. :)

@ కొత్తపాళీ,
ధన్యవాదాలు. అవునండీ.. ఇంట్లో అలాంటి స్వచ్చమైన నెయ్యి రుచి తెలిసిన వాళ్ళు బజార్లో దొరికే విజయా నెయ్యి, మధురా నెయ్యి రుచి చూసే ధైర్యం చేయలేరనుకుంటాను. :)

Anudeep said...

Madhu gariki,

Neyyi gurinchi manchi katha cheppinandhuku danyawadhalu... okka neyyi aney kadhandi edhaina anthey... Mitham ga tintey aarogyam athi ga tintey anaarogyam andi..

మధురవాణి said...

అనుదీప్,
నెయ్యి కథ మీక్కూడా నచ్చినందుకు సంతోషంగా ఉంది. మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు. :)