Tuesday, February 02, 2010

"మనుషులెలా వచ్చారు..?" అను ఒక చిట్టి కథ

అనగా అనగా అనగా.. ఒక అందమైన బొమ్మరిల్లు లాంటి చిన్న ఇల్లు. ఇంట్లో ఒక ముచ్చటైన కుటుంబం. అమ్మా, నాన్నా, వాళ్ళకో ముద్దుల చిన్నారి. చిన్నారి పేరు బుజ్జి. బుజ్జి వయసు ఆరేళ్ళు.

ఒక రోజు బుజ్జి తన బొమ్మల పుస్తకంలో చెట్లు, పువ్వులు, పక్షులు, లాంటివన్నీ చూస్తూ ఆడుకుంటోంది. బుజ్జీ వాళ్ళ నాన్నేమో అక్కడే ఒక పక్కన ఒళ్ళో లాప్ టాప్ పెట్టుకుని బిజీగా తన ఆఫీసు పని చేసుకుంటున్నాడు.

బొమ్మల పుస్తకం చూస్తున్న బుజ్జికి ఒక పెద్ద ధర్మసందేహం వచ్చింది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి "నాన్నా నాన్నా.. మరి మనం చూసే యీ రకరకాల పువ్వులు, చెట్లు, పారెట్స్, ఇంకా మన టామీ.. ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎక్కడ నుంచి వచ్చాయి.?" అని అడిగింది.


అప్పుడు బుజ్జి వాళ్ళ నాన్న బుజ్జిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని "అరే బుజ్జీ.. దేవుడు ఒక పెద్ద ప్రపంచం తయారు చేసి, అందులో యీ చెట్లు, జంతువులు, పక్షులు.. వీటన్నీటిని సృష్టించాడు." అని చెప్పాడు.

దానికి బుజ్జి "అది ఓకే..మరి మనుషులం ఎలా వచ్చాం.?" అని మళ్ళీ అడిగింది వాళ్ళ నాన్నని. "దేవుడు మొట్టమొదట ఆడమ్, ఈవ్ అనే ఇద్దరు మనుషుల్ని తయారు చేసాడు. తరవాత వాళ్లకి పిల్లలు పుడతారు కదా.. అలా అలా అలా.. చాలా రోజులయ్యేసరికి ఇంతమంది మనుష్యులు అయిపోయామన్న మాట.!" అని చెప్పాడు బుజ్జి వాళ్ళ నాన్న. అప్పటికి బుజ్జి సందేహం తీరినట్టే అనిపించింది.



ఒక రెండ్రోజులు పోయాక, సాయంత్రం పూట బుజ్జి వాళ్ళమ్మ వంటింట్లో మ్యాగీ నూడుల్స్ చేస్తోంది బుజ్జి కోసం. బుజ్జికెందుకో రెండ్రోజుల క్రితం తనూ, నాన్న మాట్లాడుకున్న విషయం గుర్తొచ్చింది. బుజ్జి వాళ్ళమ్మని కూడా అదే ప్రశ్న అడిగింది "అమ్మా.. మనమందరం మనుషులం ఎక్కడ నుంచి వచ్చాం.?" అని.

దానికి సమాధానంగా బుజ్జి వాళ్ళమ్మ చాలా ఏళ్ళ క్రితం యీ భూమ్మీద చాలా కోతులుండేవి బుజ్జీ.. కోతుల నుంచే క్రమక్రమంగా మనుషులందరూ వచ్చారు" అని చెప్పింది. అప్పుడు బుజ్జి "ఓహో అలాగా" అనయితే అంది గానీ ఒకే ప్రశ్నకి నాన్న ఒక సమాధానం, అమ్మ మరొక సమాధానం చెప్పారేంబ్బా.. అని ఆశ్చర్యపోయింది.

వేళ రాత్రి భోజనాల దగ్గర బుజ్జీ, వాళ్ళ అమ్మా, నాన్నా అందరూ కలిసి కూర్చున్నప్పుడు బుజ్జి అడిగింది "నాన్నా.. మనుషులెక్కడి నుంచి వచ్చారు అంటే.. నువ్వేమో దేవుడు సృష్టించాడు అని చెప్పావు. అమ్మనడిగితే మనుషులు కోతుల నుంచి వచ్చారు అని చెప్పింది. ఇంతకీ ఇందులో ఏది కరెక్టు? నాకు కన్ఫ్యూజింగా ఉంది" అని.

బుజ్జీ వాళ్ళమ్మ కూడా ఆసక్తిగా చూస్తోంది బుజ్జీ వాళ్ళనాన్న ఏమని చెప్తాడా సమాధానం అని. అప్పుడు బుజ్జీ వాళ్ళ నాన్న ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా చెప్పాడు. "మ్మ్.. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదురా బుజ్జీ.. చాలా సింపుల్.. నువ్వడిగిన ప్రశ్నకి నేనేమో నా వైపు కుటుంబం గురించి చెప్పాను. అమ్మేమో తన వైపు కుటుంబం గురించి చెప్పింది. అంతే.!!

ఇంక కథ అయిపోయింది. ఇప్పుడు మీరు నవ్వాలన్న మాట.! హీ హీ హీ...gelakgulingsengihnampakgigi

27 comments:

... said...

Ha ha ha .... Maa nannagaru iche samaadhanam la undhi achamgaaa :D

Rani said...

హీ హీ హీ...

పరిమళం said...

హ ..హ్హ ..హ్హా ....మీ బుజ్జి భలే ఉందండీ !

శిశిర said...

హ్హ..హ్హ..హ్హ..

ప్రేరణ... said...

:) :) :)

Hima bindu said...

-:):)

Padmarpita said...

బుజ్జి తరుపున నా సందేహం.....
బుజ్జి ఎవరి పోలికో మరి???:):):)

చిలమకూరు విజయమోహన్ said...

:D కానీ బుజ్జికి సందేహం తీరిందంటారా?
:) కానీ నన్నేమో అయోమయంలో పడేశారే! నేనేమో ఇన్నాళ్ళూ మానవులంతా మనువు సంతానమనుకుంటున్నాను ప్చ్ కాదా? :D

చైతన్య said...

మీరు నవ్వాలని గుర్తుచేసే దాకా ఆ సంగతే మర్చిపోయానండి! :D

బుజ్జి భలే ఉంది :)

సుజ్జి said...

Hahahahaha... ;)

Srujana Ramanujan said...

యెహిహీ యెహిహీ యెహిహీ.

ఆల్రెడీ విన్నదే కదా???

Anonymous said...

అదా సంగతి. :) థాంక్స్. మీబుజ్జి ఇలాగే ప్రశ్నలడుగుతూ, చాలా చాలా కథలు చెప్తుందని ఆశిస్తూ ... మాలతి

మురళి said...

సరేగానీ, బుజ్జీ వాళ్ళ నాన్నకి భోజనం దొరికిందా అండీ మరి?? :-)

శ్రీలలిత said...

ఈమధ్య పిల్లలు మరీ తెలివి మీరిపొయేరుకదా...
మీ బుజ్జి లాంటిదే మా చిట్టి వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి అడిగిందిట.. ఏమనంటే...
"మామ్...నన్ను ఏ వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నావు?" అంటూ..
మరిప్పుడు మీరూ నవ్వాలన్నమాట..హి హి హీ....

Srujana Ramanujan said...

వాళ్ళమ్మ నాలాంటిదైతే తప్ప ఖచ్చితమ్గా పస్తులే :-)

Srujana Ramanujan said...

BTW how to get those beautiful smilies?

Also forgot to mention, picture selection is excellent

శేఖర్ పెద్దగోపు said...

బుజ్జి వాళ్ళ నాన్నది బాడ్ టేస్ట్ అన్నమాట...:-):-)

భావన said...

:-))

ప్రణీత స్వాతి said...

పాపం..బుజ్జి వాళ్ళ నాన్న. !!

మధురవాణి said...

@ ...
అయితే కథలో బుజ్జి మీరే అనుకుందాం కాసేపు ;)
@ రాణి, పరిమళం, శిశిర, ప్రేరణ, చిన్ని, జీవని, సుజ్జీ, భావన,
:-) :-)
@ పద్మార్పిత గారూ,
ఇంకా సందేహమెందుకు.? కథలో లాజిక్ చెప్పింది బుజ్జి నాన్నగారే కాబట్టి.. ముద్దుల కూతుర్ని తన పార్టీలోనే కదా లేక్కేసుకుంటాడు మరి ;-)
@ మోహన్ గారూ,
ష్..గట్టిగా అనకండి. అసలే రెండు ఆప్షన్స్ తోనే బుజ్జికి కన్ఫ్యూజింగా ఉంది పాపం. మీరు మూడో ఆప్షన్ ఇస్తే మరింత కష్టమవుతుంది ;-)

మధురవాణి said...

@ చైతన్య గారూ,
హీ హీ.. అందుకే కదండీ నేను నవ్వాలని గుర్తు చేసింది చివర్లో ;-)
బుజ్జి బాగుంది కదూ.. నాక్కూడా బాగా నచ్చింది :)

@ మాలతి గారూ,
ధన్యవాదాలు :) మరిన్ని బుజ్జి కబుర్లంటే..ఆలోచించాలి మరి!! :)

@ మురళీ గారూ,
ప్చ్.. ప్లేట్లో ఆల్రెడీ భోజనం ఉంది కదండీ..ఆ రోజుకి బతికిపోయినట్టే!! ;-)

@ శ్రీలలిత గారూ,
హ్హ హ్హ హ్హా.. హమ్మా..ఎంత మాట..ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్కున్నావ్ అందా మీ చిట్టి.. ఇప్పటి బుజ్జాయిలు నిజంగా సీమటపాసుల్లా ఉన్నారండీ బాబూ ;-)

@ శేఖర్ గారూ,
బుజ్జి వాళ్ళ నాన్నది బాడ్ టేస్ట్ అంటారా.. అదేం కాదండీ.. ఏరికోరి తెచ్చుకున్న సరైన టేస్టే..కాకపోతే అబ్బాయిలందరికీ పెళ్లి కాకముందు ఒకలా కనిపిస్తే, పెళ్ళయ్యాక మరోలా కనిపిస్తాయిలెండి చాలా విషయాలు ;-)

మధురవాణి said...

@ ప్రణీత గారూ,
ఏంటండీ పాపం అని బుజ్జి వాళ్ళ నాన్నని అన్నారు..వాళ్ళమ్మ పాపం కాదంటారా:? ;-)

@ సృజన,
నీకు ఆల్రెడీ తెలిసిందేనా ఈ బుజ్జి కథ :)
ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను..'ఆయుష్మాన్భవ' అనే ఒక బ్లాగ్ ఉండేది. ఆ బ్లాగరు (అమరవాణి గారనుకుంటాను పేరు) ఈ స్మైలీస్ ఎలా పెట్టుకోవాలని అప్పుడొక పోస్ట్ రాస్తే, అప్పటికప్పుడు పెట్టేసాను. firefox add-on ఏదో పెట్టుకుని, ఇంకా HTML లో ఏవో మార్పులు చేయాలనుకుంటా..! అప్పుడేం చేసానో నాకిప్పుడు గుర్తు లేదు. ఆ పోస్టు కోసం కూడా వెతికాను. కానీ, దురదృష్టవశాత్తూ ఆ బ్లాగ్ లింక్ ఇప్పుడు పని చెయ్యట్లేదు :( కాబట్టి, ఈ విషయమై ఎవరైనా technical experts ని అడిగితే సబబేమో..!

Vinay Chakravarthi.Gogineni said...

baagundi..............

కొత్త పాళీ said...

బుజ్జి భలే భలే :)

శ్రీలలిత గారూ .. ఇదింకా టూమచ్ అసలు

మధురవాణి said...

@ వినయ్, కొత్తపాళీ,
ధన్యవాదాలు :-)

HarshaBharatiya said...

Hahahaha

మధురవాణి said...

@ శ్రీహర్ష,
థాంక్యూ.. :) :)