ప్రియమైన నీకు,
ఏంటీ సంబోధన ఉత్తరంలా అనుకుంటున్నావా.? ఉత్తరమంటే ఉత్తరం కాదు గానీ.. నా మదిలో తిరుగాడుతున్న భావాలని అక్షరాల్లో నింపే చిన్ని ప్రయత్నం చేస్తున్నా..అంతే! ఈ బ్రతుకు బాటలో ఓసారి వెనక్కితిరిగి చూసుకుంటే నీ సాహచర్యంలో అప్పుడే ఇన్నేళ్ళు గడిచిపోయాయా అనిపిస్తోంది. కానీ, ఆ మరుక్షణంలోనే గతం తాలూకు స్మృతులన్నీ వరదలా వెల్లువై మనసును కమ్ముకోగానే నిన్ను కలిసింది నిన్ననే కాదా అనిపిస్తోంది. నీకో చిత్రం చెప్పనా.? నా మదిలోకి ఏ జ్ఞాపకాలు గుర్తొచ్చినా అప్రయత్నంగా అన్నీటిల్లోనూ ముఖచిత్రంలా నీ రూపే నా కళ్ళల్లో కదలాడుతుంది. ఒకోసారి కాస్త కోపం కూడా వస్తుంటుంది.. నువ్వు లేని ఆలోచనలే నాకు రావా అని.!? అప్పుడు ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తానా.. కానీ, అదేం చిత్రమో నీ రాకకి మునుపు నేనెలా ఉన్నానో జ్ఞప్తికే రాదు ఎంత ఆలోచించినా. హన్నా.! నువ్వెంత మాయగాడివి.. నా మనసులో చేరి నా ఉనికినే ప్రశ్నార్ధకం చేసావు. అయినా నిన్నెందుకు ఉపేక్షిస్తున్నానో తెలుసా.? నా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని అద్దింది నీ సాహచర్యమే కదూ.! అందుకన్న మాట.!
నిన్న ఎక్కడో ఏదో చదువుతూ ఉంటే అందులో అసలు ప్రేమంటే ఏంటి అన్న ప్రశ్న వచ్చింది. అప్పుడు నాకు నేనే ప్రశ్నించుకున్నాను ఈ ప్రశ్నకి నాకు నేనిచ్చుకునే సమాధానం ఏంటీ అని. ప్రశ్న వినగానే నువ్వే తలపుకొచ్చావని మరి చెప్పక్కర్లేదుగా.! నువ్వు లేనప్పటి నా జీవితానికీ, నీ తోడుగా చూసిన జీవితానికీ తేడా ఏమిటా అని ఆలోచించసాగాను. కాస్త మేధోమథనం తరవాత నాకు స్ఫురించిందేమంటే.. నీతో పాటుగా నా జీవితంలోకి బోలెడంత సంతోషం వచ్చిందనిపిస్తోంది. అంటే.. నువ్వొచ్చాక ఇబ్బందులు, కష్టాలు, సమస్యలే లేవా అంటే.. అన్నీ ఉన్నాయి. కానీ, ఎన్ని బాధలొచ్చినా గానీ నాలోని సంతోషాన్ని పూర్తిగా మాయం చేయలేకపోయాయి. నీ పక్కన నుంచుంటే నాన్న పక్కనే ఉన్నంత నిశ్చింత, నువ్వు నా చెయ్యి అందుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత సంతోషం, నీ అల్లరిలో చిన్ననాడు తమ్ముడితో ఆడుకున్నప్పటి నిష్కల్మషమైన వాత్సల్యం, నీ తోడులో ఒక అవ్యక్తమైన ఆత్మసంతృప్తి.. ఇదేనేమో ప్రేమంటే అనిపించింది. అన్నట్టు.. మళ్ళీ మళ్ళీ నన్ను నీతో ప్రేమలో పడేలా చేసేదేమిటో తెలుసా నీకు.!? ఎంత సంతోషమైనా, బాధైనా, కష్టమైనా, నష్టమైనా ఏది కూడా నీలో మార్చలేనిదీ, కేవలం నీ కళ్ళలో మాత్రమే మెరిసే, నీకు మాత్రమే ప్రత్యేకమైన చిరు దరహాసం. కళ్ళలో నవ్వు కనిపించడమేంటీ మరీ విడ్డూరం కాకపోతే అనుకుంటున్నావా.? అదే మరి నీ మాయంటే.. నేను చెప్పేది నిజ్జంగా నిజం తెలుసా..! నీ కళ్ళల్లో నాకా మెరుపులాంటి సన్నటి అరనవ్వు కనిపిస్తుంది. అప్పుడు ఆ క్షణంలో అంతకంటే ఈ ప్రపంచంలో అమూల్యమైనదేదీ లేదనిపిస్తుంటుంది నాకు.
ఇంకేం చెప్పనూ.!? చెప్పాలంటే బోలెడున్నాయనుకో.. కానీ, ప్రస్తుతానికి ఇంతే మరి.. మళ్లీ చెప్పాలనిపించినప్పుడొస్తాను.
అందాకా సెలవా మరి.?
Thursday, July 09, 2009
ప్రియమైన నీకు...
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
hmm after a long time. what made u miss the flow which rocks the readers this time? :-(
chaala bagundi.... :)
మధురవాణీ,
చదువతుండగానే నాకర్ధంకాని ఒక వాక్యం...మొదటి పేరా చివరి లైన్లు..అయినా నిన్నెందకు ఉపేక్షిస్తున్నానో తెలుసా నా జీవితానికి అందాన్నీ, ఆనందాన్నీ అద్దింది నీ సాహచర్యమేకదూ...అందుకన్నమాట. నాకు తెలిసినంతమటుకు ఉపేక్షించటమంటే నిర్లక్ష్యంచూపటం. మరి అలాంటి భావం మీ రచనలో కనబడలేదు..బహుశా అచ్చు తప్పేమో.
psmlakshmi
బహుకాల దర్శనం.జర్మనీ అందాలను ఆస్వాదించడంలో మైమరచిపోయారా ఏంటి ?
నాకు ఎందుకో మీరు మీ బ్లాగు గురించి వ్రాస్తున్నారనిపిస్తుంది.
Am I correct?
Hi Madhuravani Gaaru,
Chala chala baagundandi...ekkado manasuni kadilinchindi.....Chaduvuthunnanatha sepu raasindi meerena ani peeda aalochanalo padipoyaanu....Meeku naa kruthagnathalu...Manasulothulo poodukapoina chaal vishayaalanu kadilinchagaligaaru..... :)
ప్రేమలేఖలు రాసేటప్పుడు ప్రతి అమ్మాయి అబ్బాయి లకు ఆటొమెటిక్ గా కవిత్వం వచ్చేస్తుంది కదా..చాలా బాగా రాసారు
ఏంటండి మధురవాణిగారు..ప్రేమలేఖలు రాస్తున్నారు..? ఏంటి సంగతి..?? :))
బాగుందండీ...
"నీ రాకకి మునుపు నేనెలా ఉన్నానో జ్ఞప్తికే రాదు"Beautiful!
chaalaa baagundandi.
malli tondaragaa cheppeyandi
@ సృజన,
అయితే ఈ పోస్టు మిమ్మల్ని మెప్పించలేదన్న మాట :(
రాయబోయే టపాలు ఏమనిపిస్తాయో చూద్దాం :)
@ కిషన్ రెడ్డి గారు,
ధన్యవాదాలు.
@ లక్ష్మి గారూ,
ముందుగా ధన్యవాదాలు నా పోస్టు క్షుణ్ణంగా చదివి సూచనలు చేసినందుకు.
ఇకపోతే 'ఉపేక్షించడం' అనే పదాన్ని 'సహనంగా భరించి ఊరుకోవడం' అనే అర్ధంలో నేను వాడాను.
నాకు తెలిసినంతవరకూ ఈ సందర్భంలో ఈ పదం వాడుక సరియైనదే అనుకుంటాను.
ఇదే పదానికి 'నిర్లక్ష్యం చూపడం' అనే అర్ధం కూడా వస్తుందని నాకు తెలీదండీ.
నా పోస్టు చదివి మీకు స్ఫురించిన విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞురాలిని.
@ విజయ మోహన్ గారూ,
బ్లాగు వ్రాయడానికి ఈ మధ్య సమయం కుదరలేదండీ..అదే బహుకాల దర్శనానికి కారణం.
అన్నట్టు జర్మనీ అందాలను బానే ఆస్వాదిస్తున్నాను. ఇక్కడ వేసవి కదా :)
@ నీహారిక,
మీకు బ్లాగు గురించి అనిపించిదన్న మాట. అలాగే కానివ్వండి మరి :)
@ హను,
నిస్సందేహంగా నేనే రాసానండీ ఈ పోస్టు :)
మనసుని కదిలించేంతగా నా పోస్టు మీకు నచ్చడం సంతోషంగా ఉంది.
@ నేస్తం,
అంతేనంటారా నేస్తం ;)
ధన్యవాదాలు.
@ సుజ్జీ,
ప్రేమలేఖలా..నేనా..! నువ్వు మరీనూ ;)
@ మురళి,
ధన్యవాదాలండీ.!
@ పరిమళం,
మీరు 'beautiful' అన్నారంటే సంతోషించాల్సిన విషయమేగా మరి :)
ధన్యవాదాలు.
@ మాలా కుమార్,
ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటి పోస్టు ఎప్పుడు రాయగలనో మరి.. చూద్దాం..!
WOW!!!!
Hmm. Mixed emotions.
అన్ని ఎమోషన్స్ ని సమపాళ్ళలో వ్యక్త పరిచారు. బాగుంది.
@ లక్ష్మి గారు,
ధన్యవాదాలు :)
@ గీతాచార్య గారూ,
హమ్మ్..! :)
@ శేఖర్ గారూ,
ధన్యవాదాలండీ.!
Post a Comment