Thursday, May 02, 2013

నా కథ 'ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం' మాలిక పత్రిక చైత్ర మాస సంచికలో..



నేను వ్రాసిన 'ప్రకృతి ఒడిలోబ్రతుకు పాఠం' అనే కథ 'మాలిక పత్రిక' చైత్ర మాస సంచికలో ప్రచురితమైంది. నా కథని ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..


16 comments:

Anonymous said...

కధ ఏకబిగిని చదివించారు. అద్భుతః

Unknown said...

chalaa baagundandi

బాల said...

కథ బాగుంది. మనిషికి బతకడానికి అవసరమైన inspiration ఇచ్చారు. అభినందనలు.

మధురవాణి said...

@ కష్టేఫలి,
ధన్యోస్మి శర్మ గారూ.. :)

@ skvramesh,
ధన్యవాదాలండీ..

@ బాల,
మీకలా అనిపించడం సంతోషమండీ.. ధన్యవాదాలు.

అనంతం కృష్ణ చైతన్య said...

జెర్మనీ కధలసరస్వతండీ మీరు!!..... అద్భుతంగా ఉంది. మీరు ఇంత బాగా కధలు ఎలా వ్రాస్తారో మాలాంటి అభిమానులకు ఒక పాఠంగా ఓ రెండు, మూడు టపాలు వెయ్యండి గురువుగారు.... :)ప్లీజ్

Unknown said...

మధురవాణి గారూ, చాలా కాలం తరువాత ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి కథ చదివిన భావనా, తృప్తీ కలిగింది. చాలా ఆసక్తి గా ప్రతి పదమూ మదిని ముందుకి నడిపింది. ప్రకృతి కదలికలలో సూర్యుడు శలవు పుచ్చుకోవటం నుంచీ, మొదటి వర్షం చినుకుతో సహా పిడుగు పాటు దాకా అంతా కళ్ళ ముందు ఏదో మంచి ఫొటోగ్రఫీ తో సినిమాలా సాగింది కథ. ప్రకృతి ఓడిలో కలిసి మరణం వైపు అడుగులేయాలన్న ప్రయత్నంలో ఆ బడిలో నేర్చుకున్న జీవిత పాఠం తో మళ్ళీ వెనుదిరిగి బ్రతువైపే అడుగులేస్తూ ముగిసిన కథ...సూపర్బ్!
అభినందనలు!

మధురవాణి said...

@ అనంతం కృష్ణ చైతన్య,
అబ్బా.. మోయలేనంత పెద్ద ప్రశంస ఇచ్చారండీ.. మీ అభిమానానికి కృతజ్ఞురాలిని. :)
సరదాగా కబుర్లు చెప్తే వినడం వరకూ బాగానే ఉంటుంది కానీ ప్రైవేట్లు, పాఠాలు అంటే మీరే పారిపోవలసివస్తుంది ఆలోచించుకోండి మరి.. :D

@ చిన్ని ఆశ,
మీరు అంత శ్రద్ధగా ప్రతీ చిన్న విషయాన్ని ఆస్వాదిస్తూ చదవడం చాలా సంతోషాన్ని కలిగించిందండీ. మీ ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు. :)

Unknown said...

నిజంగానే భయపెట్టావు మధురా
బ్లాగ్ ఇక ఆపెస్తున్నవేమో అని
మంచి పోస్ట్ రాసావు
ప్రతి విషయాన్నీ ఒక different కోణం లో చూస్తావు
అది నాకు చాల నచ్చుతుంది
అలాగే చెప్పే విషయం ఏదయినా సరే ఓపికగా చెప్తావు
అల్ ది బెస్ట్ డియర్

Kottapali said...

Every detail is finely crafted. I often complain that Telugu writers write stories in vacuum - this is one excellent case to write in vacuum! :) well done.

Kottapali said...

Another important point - కథ మొదట్లో తుపాకీ ప్రస్తావన తెచ్చావంటే కథ ముగిసేలోగా ఆ తుపాకీ పేలాలి అని బోధించాడు ఛెకోవ్. తెలుగులో చాలా చాలా కథలు వాన చినుకులతోనో, సూర్యుడు అస్తమించడంతోనో, ఏదో ప్రకృతి వర్ణనతో మొదలవుతుంటయి. తీరా మొదటి పేజీ దాటాక ఆ వర్ణనకీ మిగతా కథకీ ఏమీ సంబంధం ఉండదు. మీ వాతావరణ తుపాకీ .. కాదు, ఫిరంగిని పేల్చినందుకు అభినందనలు.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

లలితా గూడ షేర్ చేసిన వెంటనే ఈ కధ చదివాను. ఆ సాంతం ఏక బిగిన చదివేసాను. కధ హృదయానికి అలా హత్తుకు పోయింది. ఎక్కడో జర్మని లో వుండి ఇక్కడ నేపధ్యంలో ఎంత బాగా రాసావు కధని విషాదాంతం చేయక ఒక’ hope and positive angle ‘ లో ముగించావు. .చాల బావుంది.

Unknown said...

మంచి ఇతివృత్తం. బాగా రాసావు మధురా!అభినందనలు! బిజీ వల్ల లేటుగా చూసాను:))

మధురవాణి said...

@ kallurisailabala,
థాంక్యూ శైలూ.. నువ్వు ఈ కామెంట్ 'The End' పోస్టుకి పెట్టబోయి ఇక్కడ పెట్టావనుకుంటాను కదా.. భయపెట్టినందుకు సారీ అమ్మాయ్.. ఈ పోస్టుకి ఆ టైటిల్ బాగుంటుందనిపించి పెట్టాను. :)

మధురవాణి said...

@ Narayanaswamy S.,
Very happy to see your appreciation! మీరు చెప్పిన తుపాకీ సూత్రం భలే ఉందే. కథలు రాసేప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఈ పాఠం. బోల్డు ధన్యవాదాలు గురువు గారూ.. :)

@ పూర్వ ఫల్గుణి,
కథ మీకంత నచ్చినందుకు సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు.

@ సునీత గారూ..
ఇంత బిజీలో కూడా చదివినందుకు బోల్డు థాంకులు.. :)

రాధిక(నాని ) said...

కథ చాలా బాగుంది ..ఎంచుకున్న ఇతివృత్తం,వర్ణన కూడా బాగుంది .అలాగే చక్కని ముగింపు కూడా ..ఆపకుండా ఆశక్తి గా చదివేలా ఉంది .

మధురవాణి said...

Thank you Radhika! :-)