Wednesday, January 02, 2013

జర్మనీయం - దోసెడు మంచు పూలు.. గుప్పెడు గుండె ఊసులు..


సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జనవరి' సంచిక విడుదలైంది.
ఈ జనవరి సంచికతోనే కౌముది కోసం నేను రాస్తున్న "జర్మనీయం -
దోసెడు మంచు పూలు.. గుప్పెడు గుండె ఊసులు.." అనే శీర్షిక మొదలైంది.

నాకీ అవకాశమిచ్చిన కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

శీర్షిక పేరే చెప్పేస్తోందిగా... అక్కడ నేనేం కబుర్లు చెప్పబోతున్నానో!  
మరి ఈ నెలకి నా 'మంచు పూల మధు మాసం' చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..

5 comments:

Anonymous said...

మాలాటి కాలు కదపలేని వారికి మంచి వాక్చిత్రం చూపించారు.

ధాత్రి said...

అబ్బ..దోసెడు మంచుపూలతో ఎన్ని పరిమళాలు మూటగట్టుకొచ్చారో మధురగారు..కాసేపు వేరే లోకానికి తీసుకెళ్ళారు.
ఆ బుడతలు చేత తెలుగు వంటలు..పాటలు రుచి చుపించడం భలే అనిపించింది.
Happy New Year..:))

జ్యోతిర్మయి said...

మీ జర్మనీ కబుర్లు మా అమ్మాయికి కూడా చదివి వినిపించాను మధుర గారు. అచ్చం న్యూయార్క్ లాగా అనిపించిందట. మీ మాటల్లో జర్మనీ కబుర్లు మధురంగా వున్నాయి. అభినందనలు.

Unknown said...

దోశడు మంచు పూలతో బోలెడు జర్మనీ అనుభూతులు పంచుకున్నారు. మన వంటల రుచి చూపించి, పిల్లలతో ఆడుతూ, పాడుతూ గడప(గలగ)టం ఎంతో మధురం. "మంచుమావులు" is very expressive word :)
మరు సంచికలో మరిన్ని మంచుపూల దోసిళ్ళకై ఎదురుచూస్తూ...

మధురవాణి said...

@ కష్టేఫలే,
నేను చెప్పే కబుర్లు మీకు నచ్చితే అంతకన్నా భాగ్యమా శర్మ గారూ.. ధన్యవాదాలు. :)

@ ధాత్రి,
మా మంచు పూల పరిమళాలు మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. థాంక్యూ సో మచ్..
మీక్కూడా Happy New Year!

@ జ్యోతిర్మయి,
ఓహో.. మీ న్యూయార్క్, మా జర్మనీ ఒకేలా ఉంటాయన్నమాట కొన్ని విషయాల్లో.. :))
చదివి వినిపించినందుకు మీకు, శ్రద్ధగా విని పెట్టినందుకు మీ పాపాయికి ధన్యవాదాలండీ..

@ చిన్నిఆశ,
మంచు పూలతో పాటు మంచు మావులు కూడా నచ్చాయన్నమాట మీకు.. థాంక్యూ థాంక్యూ..
మీకు నచ్చేలా మరిన్ని కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తానండీ.. :)