Thursday, November 08, 2012

కాలం చెల్లని జ్ఞాపకం.. 'నువ్వు'



నేటికి అది ఎంత గొప్ప అనుభవమైనా రేపటికి గతం ఒడిలో తల దాచుకోవలసిందేనట..
ఎంత చిక్కటి అనుభూతి తాలూకు భావగాఢతైనా పాతబడే కొద్దీ ఇగిరిపోవలసిందేనట..
గత వైభవపు ఆనవాళ్ళైనా కాలరక్కసి కరాళ నృత్యపు చిందుల్లో అణిగిపోవలసిందేనట..
ఎంతటి ఘన చరిత్రలైనా మరపు మారాణి కరకు చూపుల ధాటికి సమసిపోవలసిందేనట..
పాటి దివ్య స్మృతులైనా వర్తమాన ప్రవాహపు వెల్లువలో పడి కొట్టుకుపోవలసిందేనట..
ఎన్ని రమ్యమైన రంగుల కలలైనా కనులు విప్పి వెలుగు సోకిన క్షణం వెలిసిపోవలసిందేనట..
ఎంతటి తీవ్ర మనోవేదనైనా జీవితచక్ర పరిభ్రమణంలో నలిగి బలహీనపడవలసిందేనట..
కానీ.. ఇదంతా నిజమే అయితే....
మరి నీ జ్ఞాపకాలు మాత్రం రోజురోజుకీ పదునెక్కుతూ నేను మోయలేని బరువైపోతున్నాయేం!
ఎన్నాళ్ళయినా ఎన్నేళ్ళయినా గతంలోకి జారుకోనని మారాం చేస్తూ ప్రస్తుతంలోనే బంధీలయిపోయాయేం!

31 comments:

సుభ/subha said...

మధుర గారి భావాలు ఎన్ని సార్లు చదివినా చదువుతూనే ఉండాలనిపిస్తుందట :)

శిశిర said...

అవును.. ఏం?

Unknown said...

poetry and pic both are so nice....

భాస్కర్ కె said...

చక్కగా రాశారండి.అభినందనలు.

రాధిక(నాని ) said...

ఎంతటి తీవ్ర మనోవేదనైనా జీవితచక్ర పరిభ్రమణంలో నలిగి బలహీనపడవలసిందేనట.. చాలా బాగుంది.

చాణక్య said...

అమ్మాయిగారూ.. చెప్పి చెప్పి నాకే బోర్ కొడుతోందండీ! మీరు బాగానే రాస్తారు. బాగానే రాయగలరు. అదంతే! :)

Anonymous said...

కాలం అంతే :)

జయ said...

జ్ఞాపకానికి గతమెలా ఉంటుంది? :)
ఇది కవిత కాదు,జీవితమే ఇది.....ఎంత బాగుందో.

kiran said...

em madhu..enduku madhu...ela ..?? how..???
finally wowww!!:)

చెప్పాలంటే...... said...

baagaa raasaru indu

Ananth said...

good question! :)

సుజాత వేల్పూరి said...

మాటలు ఇంత అలవోగ్గా ఎలా దొరుకుతాయో నీకు మధూ!అదీనూ ఒట్టి మాటలా...గట్టిగా గుండెను గుప్పిట బిగించి పట్టే తేనె వూటలు...

జ్యోతిర్మయి said...

ఆ జ్ఞాపకాలు కాలధర్మానికి అతీతంగా ప్రవర్తిస్తున్నాయి.
బహుశా అమృతం తాగేశాయేమో...

Ananth said...

missed the pic last time.. that was too apt.. too good... :)

ధాత్రి said...

చాలా చాల చక్కగా ఉంది..:)

Unknown said...

మధుర జ్ఞాపకాలకీ, మిగతా జ్ఞాపకాలకీ ఉన్న తేడా అదేనేమో.
ఎప్పటిలానే భావం మధురంగా చెప్పారు మధురవాణి గారూ! :)

స్వాతిశంకర్ said...

చాలా బాగుంది మధుర గారు !!

ఇందు said...

Hmmmmmmmmmmm!!! :)

మధురవాణి said...

@ సుభ,
ఆహా.. నిజమే! ధన్యోస్మి.. :)

@ శిశిర,
ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు టీచరమ్మ గారూ.. మీరే చెప్పాలి.. :D

@ skvramesh, Ananth,
ఫోటో గూగుల్ ఇమేజెస్ నుంచి తీసుకున్నానండీ.. ధన్యవాదాలు.

@ khadeerbabu md, the tree, రాధిక, చెప్పాలంటే, ధాత్రి, స్వాతి..
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ చాణక్య,
హహ్హహ్హా.. పాపాయి గారూ.. థాంక్యూ థాంక్యూ.. :)

@ కష్టేఫలే,
అంతేనంటారాండీ.. :)

@ జయ,
గతమన్నది ఎరుగనిదే జ్ఞాపకం అంటారా అయితే! :)
మీ అభిమానపూర్వక స్పందనకి ధన్యవాదాలు.

@ కిరణ్,
తిరిగి నన్నే ప్రశ్నలు అడక్కూడదు అమ్మడూ.. చదివిన వాళ్ళే సమాధానం చెప్పాలి మరి! ;)
థాంక్యూ సో మచ్.. :)

మధురవాణి said...

@ సుజాత,
అమ్మయ్యో.. ఎంత పెద్ద ప్రశంసో! ధన్యురాలిని! బోల్డు బోల్డు థాంకులు మీకు.. :)

@ జ్యోతిర్మయి,
అబ్బా.. ఎంత తియ్యటి మాట చెప్పారండీ.. నిజ్జంగా నిజమే! :D
ధన్యవాదాలు.

@ చిన్ని ఆశ,
అంతేనంటారా.. థాంక్యూ సో మచ్.. :)

@ ఇందు,
:-)

Unknown said...

Madhura garu mee abhimaana samgam lo cherinanduku chala santhoshapadu thunnanu madhuramyna mee vani ni mee baniga maarchi kavitha madhuvu srustimcharu meeku abhinandanalu

SaiRaja said...

wow.. how nice to read it again and again..

SaiRaja said...

Wow.. it is great , read again and again..

మధురవాణి said...

@ arjun malli,
మీ అభిమానానికి కృతజ్ఞురాలిని. ధన్యవాదాలండీ.. నా ప్రపంచానికి స్వాగతం.. :)

@ SaiRaja,
థాంక్సండీ.. :)

leela said...

Its very interesting poetry

Anonymous said...

మారాము చేస్తూ బందీ కావడమేమిటో - రెంటికీ పొసగలేదు.

Anonymous said...


మారాం చేస్తూ బందీ కావడం అన్నది అనుభవమయితే కాని తెలియదు, మాటలు చాలవు వర్ణించడానికి, పొసగకపోవడం లేదనడం సరికాదు.

మధురవాణి said...

@ లీల,
ధన్యవాదాలండీ..

@ అనానిమస్ 1,
పోనీ బందీలైపోయి మారాం చేస్తున్నాయంటే పర్లేదంటారా? ;-)
మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలండీ..

@ అనానిమస్ 2,
Thank you so much for your response! :)

Madhu Pemmaraju said...

Very nice reflections!!! meeru inkonni lines raasthe baagundedhi anipinchindhi :)

మధురవాణి said...

@ Madhu Pemmaraju,
Thank you so much! :)