Thursday, November 24, 2011

ఊ అనూ.. ఊహూ అనూ..


"ఏవండీ.. ఇక్కడ కూర్చోవచ్చా?"
".."
"బస్ ఎప్పుడొస్తుందో మీకు తెలుసాండీ?"
"ఊహూ.."
" బస్సు ఎక్కుతున్నారంటే మీరు మా కాలేజీనాండీ?"
"ఊహూ.."


"హాయ్.. నన్ను గుర్తు పట్టలేదాండీ.. నిన్న కలిసాం కదా!"
"ఊహూ.."
".. మర్చిపోయారా.. పోనీ నన్ను మళ్ళీ గుర్తు చెయ్యమంటారా?"
"ఊహూ.."
"అదేంటండీ.. నిన్న కాలేజీనా అనడిగితే కాదన్నారు.. అయితే మీరూ ఇక్కడే చదువుతున్నారన్నమాట!"
"ఊహూ.."
"మరిక్కడున్నారేంటి .. ఎవరన్నా ఫ్రెండ్స్ కోసం వచ్చారా?"
".."


"హాయ్.. ఏంటండీ.. రోజూ ఇదే బస్సెక్కి ఇదే కాలేజీకి వచ్చేది కేవలం ఫ్రెండ్స్ ని కలవడం కోసమేనా?"
".."
"మీ పేరేంటో తెల్సుకోవచ్చా?"
"ఊహూ.."
"ప్చ్.. అయితే మీకు మాటలు రావాండీ పాపం?"
"ఊహూ.."
"మాట్లాడకపోయినా కనీసం పోట్లాడతారేమో అనుకున్నానండీ.. అయితే నా ఉపాయం పని చెయ్యలేదన్నమాట!"
".."
"పోనీలెండి.. రేపు మళ్ళీ ఇదే టైముకి కనిపిస్తారుగా.."
"ఊహూ.."
"నా కోసం కాదండీ.. కాలేజీకి వస్తారుగా అంటున్నా.."
".."


"హాయ్.. చాన్నాళ్ళైంది కనిపించి.. బావున్నారా?"
"ఊహూ.."
"ఏంటీ.. నిజంగా బాగాలేరా?"
".."
"మీరు మూగో కాదో తెలీదు గానీ మిమ్మల్ని చూసీ చూడగానే నాకొచ్చిన మాటలు కూడా మర్చిపోతానండీ నేను.."
".."
"మీరు చాలా అందంగా ఉంటారండీ.."
".."


"ఏడాదిగా చూస్తున్నాను.. మీకు '.. ఊహూ' తప్ప వేరే మాటలేవీ నేర్పించలేదాండీ మీ ఇంట్లో వాళ్ళు?"
"ఊహూ.."
"నాతో మాట్లాడటం మీకిష్టం లేదాండీ?"
"ఊహూ.."
"మీ పక్కన కూర్చోవచ్చాండీ?"
"ఊహూ.."
"బస్ ఎప్పుడొస్తుందో తెలుసాండీ?"
"ఊహూ.."
"మీరంటే నాకు చాలా ఇష్టమండీ.."
".."
"ఒట్టి ఇష్టమే కాదు.. బోల్డు ప్రేమ కూడానండీ.."
".."
"మీక్కూడా నేనంటే ఇష్టమేనా మరి?"
"ఊహూ.."
"నేను మీ చెయ్యందుకోవచ్చాండీ?"
"ఊహూ.."
"ఊహూ.. అంటే .. అని అర్థమాండీ?"
".."

కొన్నాళ్ళు గడిచాక....



"ఏవండీ.. ఏవండోయ్.. మిమ్మల్నే పిలిచేది.. ఎంత పిలిచినా పలకరే అసలు?"
"
.."
"
ఇందాకటి నుంచీ నేను గొంతు చించుకుని మరీ చెప్పేది మీరేమన్నా ఆలకిస్తున్నారా?"
"
.."
"
అసలు నిన్న మీకేం చెప్పాను.. పని చేసుకొచ్చారా?"
"
ఊహూ.."
"
మీరేం మనిషండీ బాబూ.. కనీసం ఒక్కసారన్నా నేను చెప్పిన పని చెప్పినట్టు చేసుకొచ్చారా?"
"
ఊహూ.."
"
సరేలే.. భోజనంలోకి గుత్తి వంకాయ కూర చేసాను. సరిపోతుంది కదా.."
"
.."
"
పక్కనుంచి శోష వచ్చేలా నేనింతలా మాట్లాడుతుంటే మీరేం బదులివ్వరేంటండీ.. మూగవారైపోయారా ఏంటి??"
"
.."
"
మధ్యన మీరు చాలా మొద్దుమొహంలా తయారవుతున్నారండీ.. సంగతేమన్నా తెలుస్తోందా?"
"
.."
"
రెండేళ్ళుగా చూస్తున్నాను.. మీకు '.. ఊహూ' తప్ప వేరే మాటలేవీ నేర్పించలేదాండీ మీ ఇంట్లో వాళ్ళు?"
"
ఊహూ.."
"
అసలు పెళ్ళి కాకముందు ఎన్నేసి మాయ మాటలు చెప్పారండీ.. అంటే అవన్నీ అబద్ధాలే కదూ?"
"
.."
"
అంటే నిజంగా అబద్ధాలు చెప్పారు అనేనా??"
"
.."
"
నా మీద మీకు బొత్తిగా ప్రేమ లేకుండాపోయింది కదూ?"
"
.."
"
అసలు నాతో మాట్లాడటం కూడా మీకు నచ్చట్లేదు కదూ!"
"
.."
"
చీ చీ.. మీ మాయ మాటలు నమ్మి మిమ్మల్ని పెళ్ళాడటం నాదే బుద్ధి తక్కువయ్యింది.."
"
.."
"
హూ..నా ఖర్మ కాకపోతే... అయినా మీలాంటి మనిషితో ఇంక మాటలనవసరం.."
"
.."
"(*&&^%^$
£(&*($£&($%*£"
"^&*(%*(
£%^$&**)(^%&$£"

ఏదో వస్తువు నేల మీద పడి భళ్ళున బద్దలైన శబ్దం..

"
.. అయ్యయ్యో.. కింద ఎలా పడిపోయింది? సర్లే.. పోతే పోయిందిలే.. నువ్వేం బాధపడకు.. ఇంతకీ మీ ఫ్రెండ్ స్నేహ ఏమంది అప్పుడు.. చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేసావేంటి?"
"................
tension"


టపా వెనక ఉన్న చిన్న పిట్ట కథేంటంటే మన శిశిర ఉంది కదా.. అదేనండీ.. తన 'ఎదసడి' ని మధురంగా తన అక్షరాల్లో నింపి మనకి వినిపిస్తూ వుంటుందే.. శిశిర.. తను చిన్నప్పుడు బాగా విన్న పాట ఒకదాని కోసం వెతుకుతూ మీకేమైనా తెల్సా అని నన్ను అడిగారు. " అనూ.. ఊహూ అనూ.." అని మురళీకృష్ణ సినిమాలోని పాట అది. అయితే తను వెతికినప్పుడు దొరకలేదట. దానిక్కారణం ఏంటంటే, ప్రేమలో ఉంటుంది గానీ ఊహూ ఎందుకుంటుందిలే అనుకున్నారట తను. అయితే నేనీ పాట వెతికి పంపాక "అయితే ప్రేమలో ఊహూ కూడా ఉంటుందా.. అదెలాగో మీరే చెప్పాలి మధురా.." అన్నారు సరదాగా. అది చూసి నవ్వుతున్నప్పుడు వచ్చిన సరదా ఆలోచనే టపా అన్నమాట! :)

అమ్మాయ్.. శిశిరా.. ఇప్పుడు అర్థమైందా.. ప్రేమలో లు, ఊహూ లు రెండూ ఉండే అవకాశం ఉందని.. :)

46 comments:

Chandu S said...

చాలా బాగుంది

Unknown said...

"ఊ.."
చాలా బాగుందండీ!

రసజ్ఞ said...

ఊహూ కాని ఊ!

చిలమకూరు విజయమోహన్ said...

ఆ.. ఆహా...

నందు said...

చాలా బాగుంది ఈ టపా.. అందరిచేతా ఓహో అనిపిస్తుంది :) ...

రసఙ్ఞ నేను చదువుతుంటే నీకీ టపా చూపించాలనిపించింది కానీ నాకంటే ముందే కామెంట్ రాసి ముందున్నావ్...

కృష్ణప్రియ said...

:) బాగుంది బాగుంది.

జ్యోతిర్మయి said...

:):)

శిశిర said...

హహ్హహ్హా.. ఇంత వివరంగా చెప్పాక కూడా అర్థమవకుండా ఉంటుందా మధురా! చాలా బాగా అర్థమయింది.. ఇంకో విషయం కూడా అర్థమయింది.. ఏ విషయమైనా అర్థమవ్వాలంటే అనుభవముండాలని. :D
Brilliant.. ఆ ఒక్క మాట మీద ఇంత పెద్ద పోస్టా! నేనెప్పుడూ పిల్లల డౌట్స్ ని ఇంత క్లియర్ గా క్లారిఫై చేసి ఉండను. ఉండండి. నాకున్న డౌట్స్ అన్నీ మెయిల్ చేసేస్తా మీకు.. అప్పుడు మధుర రాసే బోల్డు అందమైన టపాలు చదువుకోవచ్చు.

సుభ/subha said...

ఊ..ఇదన్నమాట సంగతీ!

వేణూశ్రీకాంత్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ మధురా :-))))

శిశిర said...

ఇంతకీ ఈ పాటలో "ఊహూ" అంటే "అవునా!, అలాగా!" అన్న అర్థం అనుకుంటా. :)

sunita said...

baagundi:)))

ఆ.సౌమ్య said...

భేష్ భేష్...ఊ కొట్టాలనిపించేంత చక్కగా ఉంది ఆలోచన!

వనజ తాతినేని/VanajaTatineni said...

ఊ... అన్నా ,ఆహ్ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు పాట గుర్తుకు తెప్పించారండీ.. బాగుంది..

Anonymous said...

బావుంది

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

ఊ.. ఊహూ...
:-)

kiran said...

భలే...భలే ..బలేగుంది పోస్ట్ :D ..
avidea బాగుంది :)

Anonymous said...

"కొన్నాళ్ళు గడిచాక..." అంటే ఆరునెలల తరువాతనా? అంటే 'ఆర్నెల్లలో వారు వీరవుతారు - వీరు వారవుతారు' అంటుంటారు కదా?

MURALI said...

బాగుంది :)

Unknown said...

ఊ. బావుంది.. ఊహూ.. చాలా బావుంది.. :)

రాజ్ కుమార్ said...

ఊ..ఊ..ఊ.. హిహిహిహ్

చాలా బాగుందండీ

సిరిసిరిమువ్వ said...

ఊ..ఊ..చాలా బాగుంది.

అసలు టైటిల్ చూసి ఆ పాటి గురించి వ్రాసావేమో అనుకున్నా:)

ఇందు said...

మధు: టపా బాగుందా ఇందూ??
ఇందు: ఊ...
మధు: అంటే బాగున్నట్టేగా లేదా మొహమాటపడుతున్నావా??
ఇందు:ఉహూ..
మధు: నిజమే చెప్తున్నావా?
ఇందు:ఊ..
మధు:చావగొట్టకు తల్లోయ్!!
ఇందు:ఉహూ...
మధు:వామ్మో!
ఇందు:ఉహుహుహ్హాహుహుహహ్హాహ్హా!!

కత పవన్ said...

:((

:))

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఊ అంటాం
ఉహూ అనం.
దహా.

murthy said...

చదవడానికి బావు౦ది.అనుభవ౦లోకి మాత్ర౦ చాలా బాధాకర౦గా ఉ౦టు౦ది..
నైస్ పోస్ట్ మధురగారు.

గిరీష్ said...

సూపరండి..ఉహూ..సూపరో సూపరు..ఊఊఊ.. :)
Brilliant!

హరే కృష్ణ said...

:))
LOL!

శివరంజని said...

ఏవండి మధుర గారు మీరు చాలా చాలా చాలా బాగా రాస్తారండి ...............
అదేంటండి నేను నిజం చెబుతుంటే అలా *ఉహూ* అంటారేమిటండి ............... ...............

నిజంగా మీరు చాలా చాలా చాలా బాగా రాస్తారండి ...

అదేంటండి ఊ అనరు ఉహూ అనరు .

.నేను మీ ఫేన్ ని అండి ...నిజం గా మీకు పెద్ద ఫేన్ ని అండి ...

ఏవండి ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వండి ...

అదేంటండి ఊ అని ఉహూ అని చెప్పకుండా అలా వెళ్ళిపోతారు ( J/K) :P

వంశీ కిషోర్ said...

ఊ...

..nagarjuna.. said...

ఓఓఓఓ

అంటే అర్ధం కాలేదనా?
ఊహూ

ఓ అర్ధం అయిందనా

చాలునండి, హ్యాపీస్
ఓహో

జైభారత్ said...

"ఊ.."

మధురవాణి said...

@ చందు S, చిన్ని ఆశ, రసజ్ఞ, చిలమకూరు విజయమోహన్, నందు, కృష్ణప్రియ, శిశిరా, జ్యోతిర్మయి, సుభా, వేణూశ్రీకాంత్, సునీత, సౌమ్యా, వనజ వనమాలీ, శ్రీకాంత్, లలిత, అవినేని భాస్కర్, కిరణ్, మురళీ, ప్రసీద, రాజ్ కుమార్, సిరిసిరిమువ్వ, ఇందూ, కత పవన్, బులుసు సుబ్రహ్మణ్యం, మూర్తి, గిరీష్, హరేకృష్ణ, శివరంజని, వంశీ కిషోర్, నాగార్జున, లోకనాథ్...
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అందరి వ్యాఖ్యలు చూసి సంబరంగా అనిపించింది. నేను సరదాగా చెప్పిన కథకి మీరందరూ 'ఊ..' కొట్టినందుకు బోల్డు థాంకులు.. :))

మధురవాణి said...

@ శిశిరా..
హహ్హహ్హా.. అయితే ఇదంతా అనుభవసారం అంటావా? పోనీలే శిశిరా.. నువ్వొద్దనుకున్నా సరే ముందు ముందు నీక్కూడా బోల్డు జ్ఞానం వచ్చేస్తుంది మాలాగా.. ;)
నీ మెయిల్ చూసి నవ్వుకున్నాక రిప్లై ఇవ్వబోతుంటే సరదాగా ఇలా పోస్ట్ రాద్దామని అయిడియా వచ్చింది. :)
హహ్హహ్హా.. ఇంకా నయం అలాగనిపించింది కాబట్టి సరిపోయింది.. ఈ మధురని చిన్న డౌట్ అడిగితే చాలు చాటభారతం రాసేస్తుంది అని భయపడి ఇంకెప్పుడూ సందేహాలేవీ అడగనంటావేమో అనుకున్నా! :)))
ఆ పాట డ్యూయెట్ కదా.. వాళ్ళిద్దరూ గారాలు పోతూ ఊ.. ఊహూ.. అని పాడుకుంటున్నారన్నమాట.. కాబట్టి అక్కడ ఊ అన్నా ఊహూ అన్నా భావం ఒకటే.. ;)

@ వనజ వనమాలి,
మీరు చెప్పిన పాట ఏ సినిమాలోదండీ.. నేనెప్పుడూ వినలేదనుకుంటా!

@ తెలుగు భావాలు,
"కొన్నాళ్ళు గడిచాక..." అంటే ఆర్నెల్లు గడిచాక అని కాదండీ.. "పెళ్ళయ్యాక" అని.. :D

మధురవాణి said...

@ ఇందు,
హహ్హహ్హా... థాంక్యూ డియర్! :)))
ఇంతకీ చివర్లో ఆ నవ్వేంటమ్మడూ.. వికటాట్టహాసమా? ;)

@ కత పవన్,
ఆ స్మైలీలకి అర్థం ఏంటి బాబూ? మొదటి సగానికి ఏడుపూ రెండో సగానికి నవ్వోచ్చిందనా? :P

@ మూర్తి గారూ,
హ్మ్మ్.. నేను మాత్రం సరదాకే రాసానులెండి.. :)

@ శివరంజని,
హహ్హహ్హా... :))))))
నేను ఎక్కడికీ వెళ్ళిపోలేదు.. పెన్ను తెచ్చుకోడానికి వెళ్లాను... నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ నీకే ఇద్దామని.. :))))))

Disp Name said...

మధురా

వాణీ
ఊహూ
మధురవాణీ
ఊ, ఊహూ
జర్మనీ ?

బెర్లిన్ ?
ఊహూ !

చాలా బాగా రాసారు
చీర్స్
జిలేబి.

నేస్తం said...

ఊ అను ఉహు అను

ఊ.ఉహు అనేసా:)
కాని చాలా బాగా రాసావ్ మధు..అంతే అంతే ఇలాగే జరుగుతుంది పర్ఫెక్ట్

నిషిగంధ said...

:)))) చాలా బాగా రాశావ్, మధురా.. ఊ.. ఉహూ లకి ఎంత శక్తి ఉందో కదా, వారు వీరయ్యారు :)))

ఏకాంత్ said...

నన్ను, నా లాంటి వాళ్ళని ఇంకా guilty గా చేయటానికే రాసారు కదూ..... నన్ను నేనే పాత రోజులతో ఇలానే బోల్డు పోల్చేస్కుని బాధ పడిపోతుంటే మళ్లీ ఇక్కడ కుడానా ?? ఇంక మారి పోవాల్సిందే ... మళ్లీ ఊ ఉహూ ల నుండి మాటల్లోకి వచ్చేయాలి ... నా బంగారం ని surprise చేసేయాలి ....thanks మరి వెళ్ళొస్తా

మధురవాణి said...

@ జిలేబి,
హహ్హహ్హా.. బాగున్నాయండీ మీ ప్రశ్నలూ సమాధానాలూ రెండూ.. అన్నీ సరిగ్గా చెప్పారు.. :)))))
ధన్యవాదాలండీ..

@ నేస్తం,
థాంక్యూ థాంక్యూ.. వారు వీరయ్యే మేజిక్ అంతా ఊ ఊహూల్లో ఉందో, ఇంకెందులోనన్నా ఉందో మరి! ;) :D

@ నిషిగంధ,
నిషీ... థాంక్యూ సో మచ్... it feels great to see your comment! :)

@ Arun K,
హహ్హహ్హా... పోనీలెండి.. మీరు ఆ మార్పుని గుర్తించి మళ్ళీ మారాలనుకుంటున్నారు.. Nice to hear it.. Good luck! Thanks! :)

పద్మవల్లి said...

మధురా...ఊ..:-))

అలా ఊ ఊ అంటూ ఎదుటి వాళ్ళకి చిర్రెక్కించే వాళ్ళలో నా ప్లేస్ మొదటి వరుస లోనే. :-)))

మధురవాణి said...

హహ్హహ్హా పద్మ గారూ.. Thanks for the comment! :)

pallavi said...

అబ్బ... ఏం రాసారండి...జస్ట్ రెండు పదాలు use చేసి పెళ్ళికి ముందు మరియు పెళ్లి తర్వాత ఎలా ఉంటారనేది చాలా బాగా present చేసారండి.. పసందైన పోస్ట్ !!! వహ్.. simply superb ...enjoyed very much ... tq

శోభ said...

ఊ.. ఊహూ.... చాలా మంచి టపా మధురవాణిగారు. నిజ్జంగా నాకు భలే నచ్చేసింది.

మధురవాణి said...

@ పల్లవి గారు, శోభ గారు..
నా టపా మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ ప్రశంసకి ధన్యవాదాలండీ.. :)

SaiRaja said...

Thanks -baagundi