Wednesday, September 28, 2011

ఒక దొంగపిల్లి కథ

ఆ మధ్య ఒకసారి బజ్లో అందరం కలిసి పిల్లుల కబుర్లు బోల్డు చెప్పుకున్నాం. అప్పుడు సరదాగా ఒక పిల్లి కథ రాయమని అడిగారు మిత్రులు. ముఖ్యంగా రాజ్ చాలాసార్లు అడిగారు. అప్పుడనుకున్న ఈ కథని రాయడానికి ఇప్పటికి కుదిరింది.
మీరందరూ గబగబా చదివేసి దొంగ పిల్లి కథ ఎలా ఉందో చెప్పండి మరి! :)


ఈ చిట్టి కథని "For kids" వెబ్సైట్ లో చూడండి.

10 comments:

వేణూరాం said...

హిహిహి గుర్తూంచుకొని మరీ రాశారా..? థాంకుల్.. థాంకులు.
చదివొచ్చి/వినొచ్చి చెప్తా ;)

శశి కళ said...

యెమిటి...రాజ్ బుజ్జిగాడా....కెక...
పిల్లి ఏడుస్తూ ఉండే పొటొ చాలా బాగుంది.

'Padmarpita' said...

దొంగ పిల్లి కధను చదివేసానుగా........భలే బాగుంది:-)

ఇందు said...

మధూ చాలాబాగుంది.నేను కథ చదవకుండా నువ్వు చెప్పినది పెట్టుకుని విన్నాను. నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది నీ పేరులాగే. అఫ్కోర్స్ ఫోన్లో విన్నా అనుకో...కానీ ఆ కథ చెప్పేటప్పుడూ నాకు భలే నచ్చింది :) చిన్నపిల్లలకి చెప్పినట్తే భలె చెప్పావ్! :) సో క్యూట్!

నందు said...

దొంగపిల్లి కధ చాలా ముద్దుగా బాగుంది. కధని చెప్పిన తీరు ఇంకా బాగుంది పిల్లలకి బాగా నచ్చుతుంది. గుడ్ జాబ్ మధుర గారూ

మధురవాణి said...

@ వేణూరాం,
మరి రాస్తానని మాటిచ్చాను కదా.. అందుకని రాసేసానన్నమాట! :)

@ శశి గారూ,
అవునండీ.. మన రాజే ఆ బుజ్జిగాడు.. :))
ఆ పిల్లుల బొమ్మలు ఆ వెబ్సైట్ నిర్వాహకురాలైన గీతిక గారు పెట్టారు. బావున్నాయి కదా! :)

@ పద్మార్పిత,
మీరు గుడ్ గర్ల్.. వెంటనే చదివేశారు. థాంక్యూ! :)

@ ఇందు,
హహ్హహ్హహా... థాంక్యూ సో మచ్ డియర్.. అంటే మరి నన్ను కథ చెప్పమంటే అలానే వచ్చేస్తుంది.. చదివినట్టు చెప్పడం రాదన్నమాట! :))

@ నందు,
ధన్యవాదాలండీ! :)

హరీష్ బలగ said...

హలో మధు గారూ.. గుర్తున్నా అనుకుంటా.. చాలా రోజుల తరువాత మీ బ్లాగ్ చూడటం కుదిరింది.. కాని చూసిన వాటికంటే విన్న కథే చాల చాల చాలా నచేసిన్దండీ..Permanent head Damage (Ph .D) అవుతున్న నాకు మళ్ళీ నా పాత మెదడు దొరికినట్టు అనిపించింది ఆ కథ వింటుంటే. చిన్నపుడు మా అక్క అచ్చం మీలాగే చెప్పేది.. కథ వింటున్నంత సేపు ఏం చెప్తున్నారన్నదాని కన్నా ఎలా చెప్తున్నారో అన్నదానిగురించే ఆలోచిస్తూ ఉన్నా.. ఎలాంటి అల్లరి పిల్లలు అయినా మీరు కథ చెప్తే ఖచ్చితం గా అలా మాట్లాడకుండా కూర్చుని వింటారు.. "అప్పుడూ...." అంటూ సాగదీసి చెప్పటం, చివర్లో " ఇంకా అంతే దొంగ పిల్లి కథ అయిపోయిందీ" అంటూ ముగించిన తీరు నాకు బాగా నచేసింది. మా అక్క నా పక్క నే కూర్చుని ఆ కథ నాకు చెప్తున్నట్టు అనిపించింది. కాసేపు నేను అలా చిన్న పిల్లాడిని అయిపోయా.. ప్రత్యేకించి ఆంగ్ల పదాలు లేకుండా జాగ్రత్త పడిన తీరు అద్భుతం. ఒక నిమిషం పాటు మాట్లాడితేనే చదువుకోని వాళ్ళు కూడా ఇంగ్లీష్ పదాలు వాడేస్తున్నారు ఇపుడు.. (నేనయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలిపి మాట్లాడేస్తున్నా ఈమధ్య.).. కానీ ఎక్కడో ఊరు కాని ఊళ్ళో అర్థం కాని భాష (మీకు వచేసుంటుంది గా ఈపాటికి జర్మన్ ) మాట్లాడే మనుషుల మద్య ఉంటూ కూడా ఇంత చక్కని తెలుగు లో కథ చెప్పిన తీరు అభినందనీయం.. రోజూ హిందీ వాళ్ళ మాటలతో నా చెవికి పట్టిన తుప్పు ఈరోజు వదిలిపోయింది మధు గారూ... వీలయితే ఇలా మరిన్ని కథలు మాకు వినిపించండి..

.........హరీష్

మధురవాణి said...

@ హర్ష గారూ,
చాన్నాళ్ళకి కనిపించారు.. PhD లో తలమునకలై బిజీ బిజీగా ఉన్నారన్నమాట! చాలా సంతోషంగా అనిపించిందండీ నా కథ మీకు మీ అక్కని, చిన్ననాటి రోజుల్ని గుర్తు తెచ్చినందుకు.
ఈ క్రింది లింక్ లో ఇంకో కథ ఉంది.. చిట్టి కప్ప కథ. అది కూడా వినొచ్చు మీరు తీరిగ్గా ఉన్నప్పుడు.
http://forkids.in/2011/07/21/%E0%B0%92%E0%B0%95-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA-%E0%B0%95%E0%B0%A5/

మీ సుదీర్ఘ వ్యాఖ్యకి, ప్రశంసకి బోల్డు ధన్యవాదాలు. :))

హరీష్ బలగ said...

డాడీ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ....... చూడండి ఈ ఆంటీ (పెళ్లి అయింది కదా.. ;-) ) నా పేరు మర్చేసిందీ :-(
ఏంటి ఏడుస్తున్నారా? ఎంత అరిచినా మా నాన్నగారికి ఈ అంతర్జాలం, బ్లాగులు లాంటివి తెలీదు లెండి.. కాబట్టి మిమ్మల్ని ఏమి అనరు. ఏడవకండి..నేను కూడా ఏడవట్లేదు..
అన్నట్టు ఎల్లుండి మా నాన్నగారి జన్మదినం కూడా .. మీరు కూడా విష్ చేసారని చెప్తా లెండి.. మరి అలాగే మీ డాడీ కి కూడా నేను విష్ చేశా అని చెప్పండి. (కావాలంటే నా పేరు మీద మీరు ఒక గిఫ్ట్ కుడా పంపించండి మీ డాడీ కి.. పర్లేదు.. :-) )
మరో మంచి కథ చెప్పినందుకు థాంకులు.. ఇంకా వినలేదు లెండి, ఎలాగు బాగానే ఉంటుంది కదా.. విన్నాక మళ్ళీ చెప్తా..
.... హరీష్ (ఈసారి అయినా సరిగా రాయండి. హర్ష కాదు.. లేదంటే మా డాడీ కి జర్మనీ కి టికెట్స్ బుక్ చేస్తా జాగ్రత్త. )

మధురవాణి said...

@ హరీష్ గారూ,
అయ్యయ్యో.. పొరపాటయిపోయింది.. క్షమించెయ్యండి ఈ సారికి.. ఇంకోసారి మీ పేరు తప్పు పలకను గాక పలకను..
అయినా, ఒక్కసారి పేరు తప్పుగా పిలిచినందుకు ఆంటీ అని పిలిచేస్తారా.. ఇదన్యాయం కాదూ? :(
మీ విషెస్ అందించానండీ.. అలాగే, నా తరపున మీ నాన్నగారికి ముందే శుభాకాంక్షలు అందించినందుకు థాంక్స్.. :)
హరీష్ హరీష్ హరీష్... చూసారా ఎంత సరిగ్గా పలికానో మీ పేరుని.. అందుకని ఇంక మీరు జర్మనీకి టిక్కెట్లు కొనే ప్రయత్నం వాయిదా వేస్కోండి.. సరేనా! :))
అయినా సాటి PhD వారిగా పరధ్యానంలో చేసే ఇలాంటి చిన్న తప్పుల్ని చూసీ చూడనట్టు పోవాలి మీరు.. :)