Saturday, September 03, 2011

నే కలగన్నాను!

నిండు పున్నమి వెలుగుల్లో ఉవ్వెత్తున ఎగిసే సంద్రపు కెరటాల్లోని చైతన్యాన్ని కలగన్నాను..
పరవళ్ళు తొక్కుతూ హుషారుగా పరుగులు తీసే కొండవాగులోని చురుకుదనాన్ని కలగన్నాను.
తొలిపొద్దులో పచ్చటి చివుర్లపై నిలిచిన మంచు ముత్యాలని చుంబించే తూరుపు రేఖల్లోని చిలిపితనాన్ని కలగన్నాను..
కన్నె పూమొగ్గపై అల్లరిగా వాలిపోయి మధుర మకరందాన్ని గ్రోలే తుంటరి తుమ్మెదలోని కొంటెతనాన్ని కలగన్నాను..

నా అరచేతిలో ఎర్రగా పండిన చందమామ లాంటి అందమైన మోముని కలగన్నాను..
నల్లటి చీకటి రాతిరిలోని చుక్కల్లా కాంతులీనుతూ నను మురిపించే కన్నులని కలగన్నాను..
నా దోసిలి నిండుగా పున్నాగల పరిమళాలు నింపేసే తెల్లటి తేటైన నవ్వుని కలగన్నాను..
నా కొంగు చాటున దాగుతూ నా ఒడిలో చేరి గారాలు పోయే పసితనాన్ని కలగన్నాను..
నను మాటల మాయలో పడేసి చెక్కిలిపై ముద్దుని దోచుకెళ్ళే గడుసుదనాన్ని కలగన్నాను..
గోదారి తీరాన వెన్నెల వానలో తడిసి ముద్దైపోయిన అనుభూతిని తలపించే మోహాన్ని కలగన్నాను..
నను అనునయంగా చేరదీసే బలమైన బాహుబంధంలో ఒదిగిపోయి ప్రపంచాన్ని మరచిపోవాలని కలగన్నాను..

నా మనసుకి సీతాకోక చిలుకలా రెక్కలొచ్చి స్వేచ్ఛగా నింగి దాకా ఎగరాలని కలగన్నాను..
చుక్కల పూదోటలోకి విహారానికి వెళ్ళి మెరుపులతో నా చీర చెంగు నింపుకోవాలని కలగన్నాను..
ఆకాశమంత ప్రేమలో మమేకమయిపోయి నేననే నేను మాయమైపోవాలని కలగన్నాను..
ఊపిరాగిపోవాలనిపించేంత గాఢమైన కౌగిలిలో చిక్కుకుపోయి కరిగిపోవాలని కలగన్నాను..
నా కలలేవీ నిజమవ్వలేదనుకున్నాను.. కలలు నిజాలవుతాయా ఎక్కడన్నా అని సరిపెట్టుకున్నాను..
కానీ.. నన్ను నాకే అపురూపంగా చూపిస్తూ నా కలలన్నీ పండిస్తూ నువ్వు నా జీవితంలోకి నడిచి వచ్చావు..
మరీ.. బదులుగా నన్నంతా నీకిచ్చేస్తాను... ఎప్పటికీ నాతో ఉండిపోవూ..!


18 comments:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

అందమైన భావాలతో నిండినట్టి కలలుగనడం కళాహృదయలఅకే సాధ్యము.

//తొలిపొద్దులో పచ్చటి చివుర్లపై నిలిచిన మంచు ముత్యాలని చుంబించే తూరుపు రేఖల్లోని చిలిపితనాన్ని కలగన్నాను.. //
Super like for the above line :)

వంశీ కిషోర్ said...

చాలా చాలా బాగుంది. మీరు కలగన్న కలలన్నియూ మరల మరల నిజమవ్వాలని ఆకాంక్షిస్తున్నాను.

kiran said...

మధుర..కేక అంతే :)
చాల బాగుంది...
అన్ని నా కలల లాగే ఉన్నాయి ...కానీ నువ్వు మాటల్లో పెట్టేసావ్...:)))

ఫోటాన్ said...

అందమైన కలలు అందరూ కంటారు...
ఆ కల ను 'మధురం' గా వర్ణించే కళ మధురకే సాధ్యం...
ఈ వర్ణనకు కామెంట్ రాయడం నాకు అసాధ్యం...

--
HarshaM

శశి కళ said...

jabilanta andangaa,malli poovu anta
haayigaa undi

భరత్ said...

"కానీ.. నన్ను నాకే అపురూపంగా చూపిస్తూ నా కలలన్నీ పండిస్తూ నువ్వు నా జీవితంలోకి నడిచి వచ్చావు..
మరీ.. బదులుగా నన్నంతా నీకిచ్చేస్తాను... ఎప్పటికీ నాతో ఉండిపోవూ.."
"గోదారి తీరాన వెన్నెల వానలో తడిసి ముద్దైపోయిన అనుభూతిని తలపించే మోహాన్ని కలగన్నాను.."


ఈ మాటలు చాలా చాలా బాగున్నాయి

సవ్వడి said...

తొలిపొద్దులో పచ్చటి చివుర్లపై నిలిచిన మంచు ముత్యాలని చుంబించే తూరుపు రేఖల్లోని చిలిపితనాన్ని కలగన్నాను..
కన్నె పూమొగ్గపై అల్లరిగా వాలిపోయి మధుర మకరందాన్ని గ్రోలే తుంటరి తుమ్మెదలోని కొంటెతనాన్ని కలగన్నాను..


నల్లటి చీకటి రాతిరిలోని చుక్కల్లా కాంతులీనుతూ నను మురిపించే కన్నులని కలగన్నాను..
నా దోసిలి నిండుగా పున్నాగల పరిమళాలు నింపేసే తెల్లటి తేటైన నవ్వుని కలగన్నాను..
నా కొంగు చాటున దాగుతూ నా ఒడిలో చేరి గారాలు పోయే పసితనాన్ని కలగన్నాను..
నను మాటల మాయలో పడేసి చెక్కిలిపై ముద్దుని దోచుకెళ్ళే గడుసుదనాన్ని కలగన్నాను..


చుక్కల పూదోటలోకి విహారానికి వెళ్ళి ఆ మెరుపులతో నా చీర చెంగు నింపుకోవాలని కలగన్నాను..


these lines are so fresh and so so cute......

భాను said...

చాలా బాగున్నాయి మీ కలలు మధుర గారూ "గోదారి తీరాన వెన్నెల వానలో తడిసి ముద్దైపోయిన అనుభూతిని తలపించే మోహాన్ని కలగన్నాను." చదువు తుంటే ఎక్కడికో వెళ్ళిన అనుభూతి

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

కలలరాణీ,
ఎన్ని కలలొస్తాయో మీకు చక్కగా!!
అవి రాత్రి కళ్ళల్లోకి మాత్రమే కాదు, పగలు కాగితం మీదికీ అలవోకగా వచ్చేస్తాయ్!!!!!!!!!!!!!!!

జైభారత్ said...

మరీ.. బదులుగా నన్నంతా నీకిచ్చేస్తాను... ఎప్పటికీ నాతో ఉండిపోవూ.." అమ్మో ఈ పనిమాత్రం ఎప్పటికి చేయకండే..? ఫోటో అదిరింది...ఇంతకి పుస్తకం మీదకి నక్షత్రాలు రాలుతున్నయా? లేక పుస్తకంలో అక్షరాలే నక్షత్రలై నింగి అంత నిండాయా..? మధుర..

HarshaBharatiya said...

నా మనసుకి సీతాకోక చిలుకలా రెక్కలొచ్చి స్వేచ్ఛగా నింగి దాకా ఎగరాలని కలగన్నాను..
wow............
bavundi andi

Lakshmi Naresh said...

ఇది చదివాక కళ్ళు మూసుకోండి, మీ మదిని ఓ అందమైన భావన అలా తాకి వెళ్తుంది...ఏవో మధురానుభూతులు మీ గుండెని ఓ సరి నొక్కినట్టు అనిపిస్తుంది. బాగుంది.కాని చిన్న విన్నపం.కల కన్నాను అనే పదం ప్రతి వాక్యం చివరలో కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది.ఇది నా అభిప్రాయమే సుమా!భావం మాత్రం బంగారం లా ఉంది.

Raamu said...

Chala chala Bagundi andi

కొత్త పాళీ said...

కలగంటి కలగంటి .. ఇప్పుడిటు కలగంటి .. nice dreams

నేస్తం said...

ప్రతి వ్యాఖ్యం భలే ఉంది మధు..ఈ లైన్ అని చెప్పడానికి లేదు..

మధురవాణి said...

@ అవినేని భాస్కర్, వంశీ, శశికళ, భరత్, సవ్వడి, భాను, భారతీయ, రాము, కొత్తపాళీ, నేస్తం,
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

@ కిరణ్..
అవునా.. అయితే సేమ్ పించ్.. థాంక్యూ! :)

@ హర్షా..
ఎంచక్కా కామెంట్ రాసేసి.. రాయడం రాదంటే ఎలా? థాంక్యూ సో మచ్! :))

@ మందాకినీ గారూ,
హహ్హహ్హా.. నాకింకో కొత్త పేరా? ధన్యవాదాలు.. :)))

@ లోకనాథ్,
ఫోటో నాకు కూడా చాలా నచ్చిందండీ.. ఫోటో మీ కళ్ళకి ఎలా కనిపిస్తే అలా అనేస్కోండి.. :)

@ లక్ష్మీ నరేష్,
ధన్యవాదాలండీ.. అప్పటికలా రాయాలనిపించిందండీ.. నాకేం బాలేనట్టు అనిపించలేదు మరి.. మీరు ఆ పదం తీసేసి చదువుకుంటే సరి.. ఏమంటారూ? :))

coolvivek said...

Sweeeeeeeeeeeetttt!!!

మధురవాణి said...

@ coolvivek,
Thank you! :)