Wednesday, March 30, 2011

ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది?

బాలల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న డిజిటల్ పత్రిక "జాబిల్లి" కోసమని నేనొక చిట్టి కథ రాసాను. అందరూ చదివి ఎలా ఉందో చెప్పండి.

అలాగే, ముచ్చటైన జాబిల్లిని మీ పరిధిలో మీకు తెలిసిన పిల్లలలందరికీ, అలాగే చిన్న పిల్లలున్న తల్లిదండ్రులందరికీ పరిచయం చెయ్యండి. మరింతమంది బాలలకి జాబిల్లి వెలుగుల్ని పంచండి.

జాబిల్లి కోసం రాయాలనే నా ప్రయత్నానికి సహకరించి ప్రోత్సహించిన "జాబిల్లి" ఎడిటర్ రమ్యగీతిక గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.


14 comments:

Arun Kumar said...

కథ బాగుంది.

సుజ్జి said...

:D Good start madam!

Unknown said...

Nice story..

Anonymous said...

అన్నిటికన్నా తియ్యనైనది చక్కెర కాకున్నా, ఉప్పు మాత్రం కానే కాదండి. 'ఉప్పులేక రుచి పుట్టగనేర్చునటయ్య భాస్కరా' అని శతకంలో అన్నారు కాని తియ్యనైనదయ్యా భాస్కరా అని ... ఆహా .. వినలేదు.
నావోటు రాజుగారి మొదటమ్మాయికే, రెండో అమ్మాయి బుద్ధి వంకర. :)
ఈ సైంటిస్టేమంటున్నారో చూడండి:
http://stason.org/articles/wellbeing/health/Stevia-The-Sweetest-Substance-on-Earth.html

ramya said...

దేన్నొదిలి ఐతే ఉండలేమో అదే తియ్యనైనది :)

జాబిల్లి పట్ల మీ శ్రద్దకు థాంక్యు మధుర గారు.

పిల్లల కోసం మరిన్ని రాయాలి మీరు.

Sriharsha said...

Nice story....

Sriharsha said...

దేన్నొదిలి ఐతే ఉండలేమో అదే తియ్యనైనది :)
@ramya: Nice Comment

తృష్ణ said...

కథ బాగుందండీ. పిల్లలకోసం ఏదైనా చేయటం నిజంగా చాలా ఉత్సహవంతమైన పని.keep it up.

@snkr గారూ, స్టీవియా ను నే దాదాపు మూడేళ్ళ నుంచీ వాడుతున్నానండి. దాని గురింఛి నేను రాసిన టపా లింక్ http://trishnaventa.blogspot.com/2010/01/blog-post_05.html

Jai Telangana said...

Katha manchi gundandi. Chinna pillalaki manchi patam.

Koncham pedoolakaite, 'raama naamame' anninnti kante teeyadainadani, ramadasu garu cheppindru.

భరత్ నూనెపల్లి said...

మీ కథ చాలా బాగుందండి....

మధురవాణి said...

@ అరుణ్, సుజ్జి, ప్రసీద, శ్రీహర్ష, తృష్ణ, భరత్ నూనేపల్లి, జై తెలంగాణా,
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు! :)

@ తృష్ణ,
అవునండీ.. పిల్లల కోసం రాయడం చాలా సరదాగా అనిపిస్తుంది. :)

మధురవాణి said...

@ Snkr,
మీరు చెప్పారే భాస్కర శతకంలోని ఒక వాక్యం.. సరిగ్గా అదేనండీ ఈ కథలో చెప్పదల్చుకున్నది కూడా! రాజు గారి రెండో అమ్మాయి బుద్ధి వంకర కాదు గానీ, ఇది నా అనువాదం వల్ల వచ్చిన సమస్య అనుకుంటాను.
బహుశా "What is the sweetest thing in the world?" ని తెలుగులో ప్రపంచం లోకెల్లా మధురమైనది ఏది అనో, రుచికరమైనది ఏది.. అని అనువదించి ఉండాల్సిందేమో! :P
అలాగే, కింద రమ్య గారి కామెంటు చూసారా.. అదేనండీ ఈ కథలో పాయింటు! :)

@ రమ్య,
చాలా చక్కగా ఒక్క వాక్యంలో భలే చెప్పారండీ! పిల్లల కోసం రాయడానికి తప్పక ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. :)

హరే కృష్ణ said...

"ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది?"
సాల్ట్,నమక్~ఉప్పిడియా

చిట్టి కధ చాలా బావుంది! ఆభినందనలు :)

మధురవాణి said...

@ హరే కృష్ణ,
:) :) థాంక్యూ!