Tuesday, February 23, 2010

గోదావరి ఒడ్డున..




గోదావరి ఒడ్డున సాయంసంధ్యాసమయంలో నించున్నాను.

పడమటన బంగారుబంతిలా మెరుస్తున్న సూరీడు మెలమెల్లగా గౌతమి ఒడిలో మమేకమైపోతున్నట్టుంది.


చల్లని గాలి తెమ్మెరల గిలిగింతలకి నీటి అలలు వయ్యారంగా కదులుతున్నాయి.
వాటిపైన పడి మెరుస్తున్న సూర్యకిరణాలను చూస్తుంటే నక్షత్రాలు దిగొచ్చి గోదావరి అలలపైన తేలియాడుతున్నాయా అన్నట్టుంది.


దూరంగా కనిపిస్తున్న చిన్న చిన్న చెక్క పడవలు క్రమంగా నా కంటికి చేరువౌతున్నాయి.
నీలాకాశంలో గూడు చేరే తొందరలో ఉన్న పక్షులు అలుపనుకోకుండా తమ పయనాన్ని సాగిస్తున్నాయి.
దూరంగా వంతెనపైన పరుగులు తీస్తున్న వాహనాలు చీమల బారుల్ని తలపిస్తున్నాయి.


తూర్పున శ్రీరామచంద్రుడి ఆలయ గాలిగోపురం ఠీవీగా నిలబడి చూస్తోంది.
రామాలయానికి దారితీస్తున్న మెట్లు మిమ్మల్ని స్వామి చరణాల వద్దకు చేరుస్తాను రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది.


18 comments:

పరుచూరి వంశీ కృష్ణ . said...

చాలా బాగుంది ఫోటో .....మంచి టపా

హను said...

good one, anDichala bagumdi.

Hima bindu said...

ఫోటో చాల బాగుంది .గోదావరి ఒడ్డున నేను ఉన్నట్లుంది.

jeevani said...

చాలా బావుందండీ.

అక్షర మోహనం said...

goddari oddu
ontarigaa padava
eto teeskelli..

మురళి said...

ఫోటో, కవిత పోటీ పడుతున్నాయండీ.. గోదారి కళ్ళముందు మెదిలింది..

శిశిర said...

బాగుందండి.

పరిమళం said...

ఓసారలా గోదావరి ఒడ్డుకు షికారెల్లి వచ్చినట్టున్దండీ .........

జయ said...

చాలా బాగుందండి. నా పాపికొండల ప్రయాణమే నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. అది నేనెప్పటికి మర్చిపోలేని గుర్తు.సాయం సంధ్య లో గోదారి అందం మిల మిలా మెరిసిపోతోంది.

కెక్యూబ్ వర్మ said...

హాయిగొలిపే టపా..
ధన్యవాదాలు..

రాంగోపాల్ said...

మధుర గారు,
ఫోటో మరియు కవిత చాలా బాగున్నయి.
మీకు హొళి శుభాకాంక్షలు

సవ్వడి said...

nice one

మధురవాణి said...

@ వంశీ, చిన్ని, మురళి, రాంగోపాల్,
ధన్యవాదాలు. ఈ ఫోటో నేను తీయలేదు. గూగులమ్మ ఇచ్చింది. కాబట్టి, ఈ ఫోటోకి వచ్చిన ప్రశంసలన్నీ ఆ ఫోటోగ్రాఫర్ కే చెందుతాయి :-)

@ హను, జీవని, కొత్తపాళీ, శిశిర, కెక్యూబ్ వర్మ, సవ్వడి,
గోదారి అందం మీ అందరికీ కూడా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు :-)

@ పరిమళం, జయ, చిన్ని, మురళీ,
నాక్కూడా గోదారి జ్ఞాపకాలు తలపుకొచ్చి, వాటంతటవే ఇలా అక్షరాల్లో పరుచుకున్నాయండీ.!

@ అక్షరమోహనం,
మీ గోదారి హైకూ బావుందండీ.!

శ్రీవాసుకి said...

ఫోటో, కవిత బాగున్నాయి.

మధురవాణి said...

@ శ్రీవాసుకి,
ధన్యవాదాలండీ :-)

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగుందండి కవిత...ఫోటో కూడా...

Anonymous said...

Sorry for my bad english. Thank you so much for your good post. Your post helped me in my college assignment, If you can provide me more details please email me.

మధురవాణి said...

@ శేఖర్ పెద్దగోపు,
చాలా ఆలస్యంగా ధన్యవాదాలు. ;)

@ అనానిమస్,
నా పోస్టు మీ అసైన్మెంట్ కి ఉపయోగపడిందంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు వీలుంటే ఎలా ఉపయోగపడిందో కాస్త వివరంగా చెప్పగలరు. ధన్యవాదాలు.