Monday, February 02, 2009

నాతో మబ్బుల్లో విహారానికి వస్తారా..??

అయితే మీరు సిద్ధమేనన్నమాట నాతో పాటు మబ్బుల్లో విహరించడానికి. మరింక ఆలస్యమెందుకు.. పదండి మబ్బుల మధురోహల్లో తేలి వద్దాం సారి rindu

అసలు మబ్బుల్ని చూసి మనసు పారేసుకొని వారు ఎవరైనా ఉంటారా అనిపిస్తుంటుంది ఒకోసారి నాకు. ఒంటరిగా కూర్చుని ఆకాశంలో కదిలి వెళుతున్న మబ్బుల్ని చూస్తూ ఉంటే ఎంత బావుంటుందో కదా.tepuktangan చిన్నప్పుడు సాయంత్రాలు ఆడుకునే సమయంలో అప్పుడప్పుడూ చూపులు ఆటల్లోంచి ఆకాశంలోకి పారిపోయేవి. హే.. అటువైపున్న మబ్బు తునక చూసావా అచ్చు ఏనుగు తొండం ఎత్తినట్టుగా ఉంది కదా అని ఒకరంటే... మబ్బు చూడు పరిగెడుతున్న గుర్రాన్ని తలపిస్తుంది కదా అని మరొకరు... మబ్బు రథంలాగా ఉంది కదా.. చూసావా ఇదిగిదిగో కింద వైపు చూడు.. చక్రాలు కూడా కనిపిస్తున్నాయి అని మరొకరు.. ఏనుగు కాదు, గుర్రం కాదు, హంస లాగా ఉంది అని మరొకరు... ఇలా చిన్ని చిన్ని తగాదాలు కూడా వచ్చేవి. కానీ ఎవరి ఊహ నిజమో తేలేలోపు.. గొడవ ఇప్పుడు తేలేలా లేదులే అన్నట్లుగా.. మబ్బులు చల్లగా జారుకునేవి. kenyitఒకోసారి సాయంత్రం పూట కాసేపే వర్షం వచ్చి వెనువెంటనే ఎండ కూడా వచ్చేస్తుంది. అలాంటి వాతావరణంలో బోలెడన్ని మబ్బులు ప్రత్యక్షమౌతాయి ఆకాశంలో.. వేగంగా హడావిడిగా కదిలిపోయే వాటిని చూస్తుంటే మబ్బులన్నీ కలిసి సకుటుంబ సపరివార సమేతంగా పేరంటానికోcelebrate వెళ్తున్నాయేమో.. ఆలస్యమౌతోందని అలా ఉరుకుల పరుగులతో వెళ్తున్నాయేమో అనిపిస్తుంది . దానికి తగ్గట్టుగానే కొన్ని పెద్ద పెద్ద మబ్బులు, మరి కొన్నిచిన్న చిన్నవి తరలిపోతుంటాయి. మబ్బులన్నీకూడా సూర్యాకాంతిలో మరింత తెల్లగా, వెండి పోత పోసినట్టుగా ధగ ధగ మెరిసిపోతుంటాయి.starఇంకా.. మబ్బుల్ని దగ్గర నుంచి చూస్తే బాగా తేలికైన మెత్తనైన దూది లాగా ఉంటాయేమో.. అంత పెద్ద పెద్ద పరుపుల్లాగా ఉన్నాయి కదా.. వాటి మీదెక్కి ఎగురుతూ ఆడుకుంటే ఎంత బావుంటుందో.. హాయిగా మబ్బుల మీద పడుకుని దొర్లుతూ ఉంటే ఎలా ఉంటుందో అని అనిపించేది. చిన్నప్పుడు మా ఇంటి పంచలో సగం గది నిండేంత ప్రత్తిని ఉంచేవారు అప్పుడప్పుడూ.. నేనూ, మా తమ్ముడూ ప్రత్తిలో బాగా ఆడుకునేవాళ్ళం. ప్రత్తిలో ఆడుకోవడమే అంత బావుంటే ఇంక మబ్బుల్లో అయితే ఎంత బావుంటుందో అనిపించేది నాకు. soalకాస్త పెద్దయ్యాక ఎవరో చెప్పారు మబ్బులు దూరం నుంచే అలా కనిపిస్తాయి. దగ్గరికెళ్తే పొగలాగా తేలిపోతుంది.. దూది లాగా ఏమీ ఉండదు అని. అప్పుడు చాలా బాధపడిపోయాననుకోండీ అది వేరే సంగతి.sedih


మొదటి సారి విమానంలో ప్రయాణించే అవకాశం వచ్చినప్పుడు నాకైతే వేరే ఏమీ గుర్తు రాలేదు మబ్బులు తప్ప. దగ్గరి నుంచీ మబ్బుల్ని చూడచ్చని తెగ మురిసిపోయాను. అచ్చం అలాగే విమానంలోంచి ఆకాశంలో తేలుతున్న మబ్బుల్ని చూడడానికి నాకు రెండు కళ్ళూ సరిపోలేదంటే నమ్మండీ..! rinduజర్మనీ మీదుగా విమానంలో వెళ్తున్నప్పుడు టేక్-ఆఫ్ అయ్యాక కాసేపటికి జర్మనీ-ఆస్ట్రియా సరిహద్దుల్లో ఉన్న మంచు శిఖరాలు (ఆల్ఫ్స్), అలాగే బోలెడన్ని మబ్బులు కనిపిస్తాయి. వాటిని చూసి ఎంత ముచ్చటేసిందో.. చిన్నప్పుడు గోడ మీద నుంచి ఇసుకలో దూకేసినట్టుగా.. ఒక్క దూకులో మబ్బుల మీద పడేట్టు దూకితే భలేగా ఉంటుందేమో అనిపించింది. అదే మాటంటే.. నాతో పాటు ఉన్న నా స్నేహితుడు 'అందుకే మరి నీలాగా ఎర్ర బస్సెక్కి వచ్చే వాళ్ళెవారైనా ఇలాంటి పనులు చేస్తారనే ఇలాంటి చిన్ని చిన్ని, తెరవడానికి వీల్లేని కిటికీలు పెట్టారు తెలుసా' అన్నాడు. అయ్యో.. మబ్బుల్లో విహరించే అవకాశం అందుకే లేదన్నమాట అని ఇంకా ఊహలలోనే తేలుతూ.. అవునా.. నిజమేనా అందుకేనా అలాంటి కిటికీలు పెట్టింది అనేశాను చటుక్కున. దానికి నా స్నేహితుడు అదేదో 'అవాక్కయ్యారా' అనే టీవీ ప్రోగ్రాంలో లాగా షాక్ అయిపోయాడు.blur హమ్మో.. హమ్మో.. ఏదో ఎర్రబస్సు అనుకున్నాగానీ మరీ నీకు ఇంత మేధస్సు ఉందనుకోలేదు అన్నాడు. హ్హి హ్హి హీsengihnampakgigi అనేసి కాసేపు నా మబ్బుల ముచ్చట్లు చెప్పాను తనకి కూడా..!ఆకాశంలో మబ్బుల్ని పరుపులా పరిచి.. కాళ్ళు కిందకి గాల్లో వేలాడేసి కూర్చుని.. చిక్కని వెండి వెన్నెల్లో చుక్కల్ని లెక్కపెడుతూ ఉంటే ఎంత బావుంటుందో కదా..! అంతే కాదు.. అప్పుడు అమ్మ కూడా మన పక్కనే కూర్చుని వేడి వేడి అన్నంలో ఆవకాయ, నెయ్యి వేసి కలిపి గోరుముద్దలు చేసి తినిపించాలి మరి..! నిజంగా అప్పుడెలా ఉంటుందంటారు..? loveమీరూ ఊహిస్తున్నారా..? ఇది కేవలం ఊహే అయినా గానీ.. మనసుకి ఎంత సంతోషాన్నిస్తుందో.. అందుకే వాస్తవంలో కంటే.. ఇలాంటి ఊహల్లో విహరించడమే బావుంటుందనిపిస్తుంది చాలాసార్లు.senyum

సరే మరి.. వేళకి మబ్బుల విహారాన్ని కట్టిపెట్టేసి.. ఇంక టాటా చెప్పుకుందాం..!
మళ్ళీ కలుద్దాం.. అందాకా మీరు కూడా అందమైన ఊహల్లో విహరించి రండి encem

ప్రేమతో..
మధుర వాణి

15 comments:

ఉమాశంకర్ said...

మధుర వాణి గారు,
చిన్నప్పుడు మబ్బుల్ని చూసి ఆకారాలు పోల్చునేవాళ్ళం పందేలు వేసి మరీ. కానీ వాటికంటే, మేడమీద మంచమ్మీద వెల్లకిలా పడుకొని పైన వేగంగా పరిగిడే మబ్బుల్ని చూస్తూంటే కాసేపటికి అవి స్థిరంగా ఉండి మనమే కదులుతున్నట్టు అనిపించేది..

నాకు మాత్రం విమానం లోంచి కింద ఉన్న మబ్బుల్ని చూసినప్పుడల్లా చిన్నప్పుడు చూసిన పౌరాణిక సినిమాలు గుర్తొస్తాయి ఇప్పటికీ. నారదుడు "నారాయణ..నారాయణ" అంటూ విహారం చేసేసీనో, లేకుంటే ఏ కైలాసమో, ఏ ఇంద్రసభో.... ( నలుపు తెలుపు సినిమాలు మాత్రమే, వాటిల్లో ఉన్న ఫీల్ ఎందుకో కలర్ సినిమా మేఘాల్లో ఉండదు.. )

నేస్తం said...

ఉమా శంకర్ గారన్నట్లు మబ్బులను ,వెన్నెలని బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోనే చూడాలి.. చాలా బాగా రాసారు మదుర వాణి గారు

మందాకిని said...

మధురవాణి గారూ,
చిన్నప్పుడే నేనూ మబ్బులపై విహారం చేశానండోయ్!
ఎంతైనా పౌరాణిక సినిమాలు చూసేటప్పుడు ఆ దేవకన్యలు మబ్బుల మీద నాట్యాలు చేసినప్పుడు నేనూ మావాళ్ళు అలా చేస్తునట్టు కలల లోకంలో విహరించి వచ్చేదాన్ని.

laxmi said...

మధురవాణిగారు, మీ టపాతో నిజంగానే గగన విహారం చేయించేసారు కదా :) నాకైతే అలా అలా మబ్బుల పరుపు మీద కూర్చుని కాళ్ళు కిందకి వేళ్ళాడేసి మా అమ్మ చేత్తో గోరు ముద్దలు తింటున్న అనుభూతి వచ్చేసింది. ముచ్చటైన పోస్ట్

subhadra said...

abba chitakotesaru...........
nanu mabbulo viharanki tisukellinanduku
thanks.....meetho next prayananiki
nenu ready yeppudu tisukellutunnaru.

శ్రీనివాస్ పప్పు said...

'అందుకే మరి నీలాగా ఎర్ర బస్సెక్కి వచ్చే వాళ్ళెవారైనా ఇలాంటి పనులు చేస్తారనే ఇలాంటి చిన్ని చిన్ని, తెరవడానికి వీల్లేని కిటికీలు పెట్టారు తెలుసా' అంటే 'అవాక్కయ్యారా'...నిజమే మరి...

ఇంకొక్క మాట..వేడీ వేడి అన్నంలో వెన్నవేసుకుని(కరిగి వెంటనే నెయ్యి అవాలి అదీ కిక్కు)ఆవకాయ కలిపి ప్రయత్నించండి,వేరే మబ్బులు ఊహించుకోక్కర్లేదు...

ఉమాశంకర్ గారు కూడా మాలాగే అన్నమాట..

మురళి said...

'నల్లని మబ్బులు గుంపులు గుంపులు..' 'నీలి మేఘమా జాలి చూపుమా..' తదితర పాటలన్నీ హం చేస్తూ మీ పోస్ట్ చదివేశాను. చిన్నపుడు ఎక్కువగా పౌరాణిక సినిమాలు చూడడం వల్లేమో నేనుకూడా మబ్బుల్లో నారదుడి కోసం వెతికేవాడిని. 'కొంచం మబ్బు తప్పుకుంటే నారదుడు కనిపిస్తాడు కదా' అనుకుంటూ.. ఆవకాయ అన్నంలోకి పెరుగు మీద మీగడ ట్రై చేయండి..(జిహ్వకో రుచి)

మురళి said...

..అన్నట్టు నా బ్లాగుకి మీరిచ్చిన కాంప్లిమెంట్ (ముచ్చటైన బ్లాగు) కి ధన్యవాదాలు

శరత్ 'కాలం' said...

మొత్తానికి మబ్బుల్లో తేల్చారు నన్ను :)

ఉష said...

మీపేరంత మధురంగా వుందీ మబ్బుల్లో విహారం, బ్లాగుల్లో చదివి నచ్చి దాచుకున్న ముచ్చటిది "అందమైన అనుభూతి పట్టు కొమ్మ అందించేది, తీయనిది కాకుండుట ఎట్లు?
అందుకే అనుభవంలోకి రానిదేదైనా అనుభూతుల్లో ఆనందించేద్దాం!" సరేనా మరి...

మధుర వాణి said...

వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
@ ఉమాశంకర్ గారూ, నేస్తం, మురళి గారూ,
నేను పాత సినిమాలు చిన్నప్పుడు చూళ్ళేదండీ... అందుకేనేమో మీలాగా నాకు నారదుడు గుర్తు రాలేదు :(
కానీ.. దేవలోకాలు, మబ్బుల్లో పుష్పక వాహనం, మబ్బుల్లో ఫైటింగులు, చంద్రుడు, వెన్నెల, పిల్ల గాలికి ఊగే లతలు, పూల ఉయ్యాలలు.. వీటి ఆనందం ఆస్వాదించాలంటే మన పాత సినేమాలేనేనండీ..ఎంత బాగా తీసేవారో కదా.. Black and white సినిమాల్లోనే ఆ అందమంతా ఉండేది :)
@మందాకినీ గారూ..
అయితే మీరు దేవకన్యల్లా నాట్యం చేసేసేవాళ్ళన్న మాట :) చిన్నప్పుడు మా కజిన్స్ అందరూ వస్తే మా ఇంట్లో ఒక గదిలో టేప్ పెట్టుకుని, తలుపులు వేసి మరీ.. నాట్యానికి సంబంధించిన పాటలు పెట్టుకుని ఇదే పనిలో ఉండేవాళ్ళం మేము కూడా..:)

మధుర వాణి said...

@లక్ష్మి గారూ..
మీక్కూడా ఆ చక్కని అనుభూతిని నా పోస్టు కలగజేయగాలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.

@సుభద్ర గారూ..
మీక్కూడా ఈ విహారం నచ్చినందుకు సంతోషం. మళ్ళీ మీరెప్పుడంటే అప్పుడే. మీరు లేకుండా నేనే విహారానికీ వెళ్ళనులెండి ఈ సారి :)

@శ్రీనివాస్ గారు,
ధన్యవాదాలు. నీకెందుకు వెన్న వాసన నచ్చదండీ.. అందుకే మా అమ్మ అంటూ ఉంటుంది.. ఇది మరీ విడ్డూరం కాకపోతే.. గిన్నెలు గిన్నెలు నెయ్యి పోసుకుని మరీ తింటావు. వెన్న మాత్రం కనీసం వాసన కూడా పడదా..అని.. నిజంగానే ఎందుకో నచ్చదు మరి..:(

మురళి గారూ..
ధన్యవాదాలు. చిన్నప్పుడు అలా మీగడేసుకుని తిన్న జ్ఞాపకం. ఈ మధ్య ఎప్పుడూ తినలేదండీ.. ఇప్పుడు అంత మంచి మీగడ దొరికే ఛాన్స్ కూడా లేదు లెండి :(

మధుర వాణి said...

@శరత్ గారూ..
అయితే మబ్బుల్లో తేలారన్నమాట :) అయితే ఈ post ఉద్దేశ్యం నేరవేరినట్టేనండీ :)

@ఉష గారూ..
మీకు నా రాతలు అంతగా నచ్చాయంటే.. అది నా అదృష్టంగా భావిస్తాను.
మిమ్మల్ని కదిలిస్తే చాలు.. భావుకత పొంగి ప్రవహిస్తుందండీ..! వ్యాఖ్యలు రాయడంలో కూడా మీకు మీరే సాటి :)

Anonymous said...

మధురవాణి గారు, మీ శైలి చాలా బాగుంది. Simple and sweet. Simple conceptని ఎంత బాగా వర్ణించారు.

Anonymous said...

I like the helpful info you provide in your articles. I'll bookmark your blog and check once more here regularly.
I am rather sure I will be told plenty of new stuff proper
here! Best of luck for the next!