మనం
ఎప్పుడైనా ఎవరికైనా కోపం తెప్పించాం అనుకోండి.
అబ్బా.. అంటే ఊర్లో వాళ్ళందరికీ
కాదులెండి.. మనల్ని అమితంగా ప్రేమించే వాళ్ళూ, మనం ప్రేమించే వాళ్ళూ
అయిన మన ఇంట్లో వాళ్ళో,
ప్రాణ స్నేహితులో.. ఇలాంటి వాళ్లకి ఎప్పుడైనా కోపం తెప్పించామనుకోండి. అప్పుడా కోపం
పోగొట్టాల్సిన బాధ్యత కూడా మనదే కదా..
అప్పుడేం చేస్తాం? ఎలాగోలా బతిమాలో బామాలో వాళ్ళ అలక తీర్చడానికి
ప్రయత్నిస్తాం. ముందు "నువ్వు బంగారు కొండవి, వజ్రాల తునకవి, వరాల మూటవి.." అని
బోల్డు పొగిడేస్తాం. అవన్నీ ఉత్తి పొగడ్తలు అని
తెలుస్తున్నా వాళ్ళ కోపం పోగొట్టడానికి
మనం పడుతున్న తాపత్రయం చూసి ఆ కోపమొచ్చిన వాళ్ళకి
కూడా కొంచెం నవ్వొస్తూ ఉంటుంది. కానీ అప్పుడే కోపం
మాత్రం పోదు. ఇంకా మొహం
అలా ఉమ్మ్.. అని పెట్టుకు చూస్తుంటారు
బింకంగా. అప్పుడేం చేస్తాం మరింక.. ఉహూ.. ఇలా పొగడ్తలతో
కాదని చెప్పి నిజంగా వాళ్ళు మనకెంత అపురూపమో, వాళ్ళ మీద మనకెంత
ప్రేముందో, వాళ్ళు దూరం అయితే మనకి
ఎంత బాధ అవుతుందో చెప్పడానికి
నానా రకాలుగా ప్రయత్నిస్తాం. మనం ఎలాంటి మాటల్లో చెప్పినా సరే ఆ మాటల
వెనకున్న నిజమైన ప్రేమలోని ఆప్యాయపు తడి వాళ్ళని తాకుతుంది.
నిజాయితీగానే వాళ్ళ కోసం బెంగపడుతున్నామని,
బోల్డు ప్రేమగా బతిమాలుతున్నామని గ్రహించి మనం దిగులు పడుతూ
ఉంటే ఇంక చూడలేక కోపమంతా
కరిగించేసి కిలకిలా నవ్వేస్తారు. ఇంకేముంది.. అప్పుడింక కథ సుఖాంతమే కదా!
:-)
సరిగ్గా ఇలాంటి ఓ సన్నివేశం ప్రేమలో ఉన్న ఓ జంటకి వస్తే వాళ్ళిద్దరి మధ్యన జరిగే మాటల్ని అందమైన పాటలా రాస్తే ఇదిగో ఈ పాటలా ఉంటుందన్నమాట. ఈ పాట తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీకూ నాకూ డాష్ డాష్' అనే సినిమాలోది. సినిమా పేరు కొంచెం తేడాగా ఉంది గానీ పాట మాత్రం బాగుంటుంది. సినిమా గురించి నాకస్సలేం తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఒకోసారి కొన్ని పాటలు విన్నప్పుడు చాలా నచ్చుతాయి. పొరపాటున ఆ సినిమానో, వీడియోలో చూసామంటే అప్పటి దాకా ఆ పాట మీద ఉన్న ఇష్టం కూడా పోయే ప్రమాదం ఉంది. అంత భయపెట్టేస్తాయి మరి. అంచేత ఈ సినిమా చూసే ధైర్యం చెయ్యలేను మరి. కానీ, మీకు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవాలని ఉంటే మాత్రం ఈ సినిమా గురించి రాజ్ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి. :-)
ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన యశ్వంత్ నాగ్ ఇందులో కొన్ని పాటలు కూడా పాడాడు. ఈ పాట మాత్రం నరేష్ అయ్యర్, చిన్మయి చాలా చక్కగా పాడారు. రాసిందెవరో మాత్రం తెలీలేదు. ఈ సినిమా పాటల సాహిత్యం అంతా సాయి ఆనంద్, బాలాజీ అనే ముగ్గురు రాసారట. వాళ్ళ ముగ్గురిలో ఈ పాట ఎవరు రాసారో తెలీదు మరి.
సినిమా జోలికి వెళ్ళకుండా కేవలం పాటలు మాత్రం విని చూడండి. నచ్చే అవకాశం ఉంది.. "నువ్వే నేనననా. నేనే నీవననా..", "ప్రాణం అని తలచి.." అనే రెండు పాటలు కూడా బాగుంటాయి.
నేను చెప్తున్న పాట సాహిత్యం ఇదే..
నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..
నాపై అలకే చూపెడితే ఏమౌతా..
నీలో నేననుకున్నాను.. వేరేగా లేననుకుంటాను..
నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా..
నా కన్నుల్లో బొమ్మవి నువ్వు.. నా గుండెల్లో తోడువి నువ్వు..
నాలో ఉన్నది ప్రతి అణువూ నీ ప్రేమా..
నా పెదవుల్లో మాటవు నువ్వు.. నా అడుగుల్లో నడకవు నువ్వు..
నీలో నాలో ఉన్నది ఒకటే ప్రేమా..
నిన్ను చూస్తూ ఉంటే చాలు.. చిన్నబోవా మందారాలు..
వెన్నెలంతా మూట కడితే నువ్వే అంటాను..
చేతిలోనే చెయ్యే వేసి నీడలా నువ్వుంటే చాలు..
ఇంతలాగా వెంటపడుతూ పొగడొద్దంటాను..
నీ నీలి కళ్ళే నీలాకాశం అంటున్నా.. కలనైనా నిన్ను వదిలి ఒంటరిగా లేను..
ఈ లోకమంతా నన్నే కాదని అనుకున్నా.. నా లోకమే ఇక నీవని నిన్నే చేరనా..
మంచువో మత్తువో.. ఎదను వదలదు నీ ధ్యాస..
హాయివో మాయవో.. మనసు కదలదు నువ్వు లేక..
ఏ మంత్రమేసావిలా....

నీటిలో చిరు ముత్యం లాగా.. నేలపై తొలి పచ్చిక లాగా..
నువ్విలా నా పక్కన ఉంటే ఎంతో ఆనందం..
రామచిలుకకి గోరింకల్లే.. తార పక్కన చంద్రుడి మల్లే..
ఇద్దరం ఒకటైపోతే ఇంకెంతో అందం..
నీ కళ్ళతోనే ఈ లోకం మొత్తం చూస్తున్నా.. ప్రతి నిమిషం నీతో గడిపేస్తూ ఉన్నా..
నీ మాటలోనే తియ్యని భాషే వింటున్నా.. కలవరించి నీ పేరే జపమే చేస్తున్నా..
ఊపిరే నీదిలే.. నన్ను కాదని అనకెపుడూ..
ప్రాణమే లేదులే.. నువ్వు జంటగ లేనప్పుడు..
నూరేళ్ళు సాగేందుకూ....