చల్లనిగాలితెమ్మెరలగిలిగింతలకినీటిఅలలువయ్యారంగాకదులుతున్నాయి.
వాటిపైన పడి మెరుస్తున్న సూర్యకిరణాలను చూస్తుంటేనక్షత్రాలు దిగొచ్చి గోదావరిఅలలపైనతేలియాడుతున్నాయా అన్నట్టుంది.
దూరంగా కనిపిస్తున్న చిన్న చిన్న చెక్క పడవలు క్రమంగా నా కంటికి చేరువౌతున్నాయి. నీలాకాశంలోగూడుచేరేతొందరలోఉన్న పక్షులుఅలుపనుకోకుండాతమపయనాన్నిసాగిస్తున్నాయి.
దూరంగావంతెనపైన పరుగులు తీస్తున్న వాహనాలు చీమల బారుల్ని తలపిస్తున్నాయి.
తూర్పున శ్రీరామచంద్రుడి ఆలయ గాలిగోపురం ఠీవీగా నిలబడి చూస్తోంది. రామాలయానికి దారితీస్తున్న మెట్లు మిమ్మల్ని స్వామి చరణాల వద్దకు చేరుస్తాను రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది.
ఇంతలోకుయ్కుయ్అనిజేబులోఉన్నసెల్లుఫోన్మోగింది. ఏంటాఅనిచూస్తే 'ఓంజావామాతాయేనమః' అనితొమ్మిదిసార్లుటైపుచేసినఎస్సెమ్మెస్ఒకటివచ్చిందిఎవరోస్నేహితుడిదగ్గరనుంచి. ఆతొమ్మిదిసార్లుమంత్రజపంతరవాతయీఎస్సెమ్మెస్అందుకున్నవారుతొమ్మిదినిమిషాల్లోతొంభైతొమ్మిదిమందికిపంపిస్తేఉద్యోగంలేనిసాఫ్ట్వేరుఇంజనీర్లకుతొమ్మిదిరోజుల్లోపేద్దఉద్యోగంవస్తుంది. ఆల్రెడీఉద్యోగంఉన్నవాళ్ళకితొమ్మిదివారాల్లోగొప్పఅప్ప్రైసలు, అలాగేప్రమోషనుగ్యారంటీ. యీఎస్సెమ్మెస్సుఅందుకునికూడాతొమ్మిదినిమిషాల్లోతొంభైతొమ్మిదిమందికిపంపించకపోతేతొమ్మిదిరోజుల్లోవాళ్లకిపింక్స్లిప్రావడంఖాయం. యీఎస్సెమ్మెస్సునిడిలీట్చేస్తేతొంభైరోజుల్లోవాళ్ళునేర్చుకున్నజావాఅంతామర్చిపోవడం, తథ్యం..తథ్యం..! అనిరాసుంది. అదిచూసిప్రశాంత్కిచాలాభయమేసింది. వామ్మోరాకరాకఉద్యోగంవచ్చింది. పైగాక్రెడిట్కార్డుబిల్లులుబోలెడుకట్టాల్సినవిఉన్నాయి. ఇప్పుడుపింకస్లిప్పా..అసలే రెసెషను..ఎందుకొచ్చిన రిస్కూ అనుకునివణికిపోయివెంటనేఆఎస్సెమ్మెస్సునితనఫోనులోఉన్నకాంటాక్టులందరికీపంపించేసాడు. '87 SMS sent' అనిచెప్పిందిసెల్లుఫోను. మిగిలిన13ఎలాగాఅనిఒకక్షణంఆలోచిస్తుంటే, అక్కడేనిలుచున్నమరికొంతమందియువకులమీదికిదృష్టివెళ్ళింది. 'ఏంబాస్.. జాబులోప్రొమోషన్కోసంట్రైచేస్తున్నావా.? నాదగ్గరఒకకిటుకుంది.. చెప్పనా.? అనిఅడిగాడు. మరికాసేపట్లోఆబస్టాపులోసెల్లులన్నీ కుయ్యో మొర్రో అని గగ్గోలు పెట్టాయి.హమ్మయ్యఅనిస్థిమితపడేలోపుతనుఎక్కాల్సినబస్మిస్సయిపోయిందనితెల్సిసిందిప్రశాంత్కి. హా.. అని ఒక ఆర్తనాదం చేసి వేరే దారి లేకఆటోఎక్కాడుప్రశాంత్. ఈ జావా మాత' ఎస్సెమ్మెస్సేమో గానీ బస్సు మిస్సయ్యి జేబుకి పాతిక రూపాయలు చిల్లు పడింది అని గొణుక్కుంటూఆఫీసుకెళ్ళాడు.
ప్రశాంత్ ఆ వేళ ఏదో ముఖ్యమైన టీమ్ మీటింగుకి వెళ్ళాల్సి ఉంది మరో పావుగంటలో. సరే, ఈలోపు మెయిల్స్ చెక్ చేసుకుందామనుకున్నాడు. మొత్తం నాలుగుమెయిల్స్ వచ్చాయి. మొదటి మెయిల్లో ఒక క్రాస్ ఫోటో ఉంది. ఈ క్రాస్ ని చూసాకకనీసం పదిమందికిన ఫార్వార్డ్ చేయాలని, మళ్ళీ ఆ క్రాస్ తిరిగి నీ దగ్గరికిఎలాగైనా చేరితే ఆ ప్రభువు కృప ఎల్లప్పుడూ ఉంటుందని రాసుంది అందులో. మెయిల్చూసి కూడా ఫార్వార్డ్ చేయకపోతే వెంటనే అష్టకష్టాలు రావచ్చని హెచ్చరికఉంది. ఆఫ్రికాదేశంలో అలా చేసిన ఎడిసన్ అనే అతనికి ఒక గంటలోపే ఉద్యోగంపోయిందని, ఒక రోజు లోపే యాక్సిడెంట్ అయిందని కూడా రాసుంది. హమ్మో..ఎందుకొచ్చిన గోలలే నాకు అనుకుని చకచకా ఫార్వార్డ్ చేసేసాడు ప్రశాంత్ తనకాంటాక్ట్స్ అందరికీ. ప్రశాంత్ కి వచ్చిన రెండో మెయిల్లో చిట్టి గణేష్ బొమ్మ ఉంది. ఇది మెయిల్లోతిరుగుతూ ఉండే లక్కీ గణేష్, ఇప్పుడు ఇది నీ దగ్గరికొచ్చిందంటే నీకు లక్కువచ్చినట్టే. దీన్ని నువ్వు ఇద్దరికీ ఫార్వార్డ్ చేస్తే నువ్వు కోరుకున్నదిరెండేళ్లలో తీరుతుంది. ఆరుగురికి ఫార్వార్డ్ చేస్తే నీ కోరిక ఏడాదిలోతీరుతుంది. పదిహేను మందికి ఫార్వార్డ్ చేస్తే ఆర్నెల్లలోపు, ముప్పైమందికి ఫార్వార్డ్ చేస్తే మూడు రోజుల్లోనూ తీరుతుంది అని రాసుంది. ఒకవేళఇది చూసి కూడా ఫార్వార్డ్ చేయలేదో, ఇక నీకు ఈ జన్మే కాదు వచ్చే పది జన్మలదాకా దురదృష్టం దెయ్యంలా వెంటాడుతుంది. దిష్టి కొట్టుకుని నీకున్నదంతాఊడ్చుకుపోతుంది అని రాసుంది. అన్ని శాపనార్ధాలు చూసేసరికి ప్రశాంత్ కికంగారొచ్చి వందకి పైనే ఉన్న తన కాంటాక్ట్స్ అందరికీ ఫార్వార్డ్ చేసేశాడు.
ఇక మూడో మెయిల్ నిండా నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ 786 నక్షత్రాలు ఉన్నాయి.ఇవి తారల రూపంలో ఉన్న ఆ అల్లా ఆశీస్సులు. నీకు ప్రేమున్నవారందరికీ ఈ తారలుపంపిస్తే నీకూ, వారికీ కూడా సంపూర్ణాయుష్షు లభిస్తుంది అని రాసుంది. సర్లేఅనుకుని ఫార్వార్డ్ బటన్ నొక్కేశాడు ప్రశాంత్. నాలుగో మెయిల్లో ఐశ్వర్యారాయి, కత్రినా కైఫు, కేట్ విన్స్లెట్టు, జెన్నిఫెర్ లోపెజ్జు..వగైరా భామలఫోజులున్నాయి. ఈ మెయిలు మీకు తెలిసిన అబ్బాయిలందరికీ ఫార్వార్డ్ చేస్తేమీకు ఇంతందంగా ఉండే గర్ల్ ఫ్రెండ్ దొరకుతుంది. ఈ మెయిలు చూడగానేఫార్వార్డ్ చేయలేదో... మీరు నిద్దరలో కూడా జడుసుకునేలాంటి పెళ్ళాంవస్తుంది అని రాసుంది. హమ్మ్..అన్నీటికంటే ఇది మరీ భయంకరమైనరిస్కు...అనుకుంటూ అది కూడా ఫార్వార్డ్ చేసేసాడుప్రశాంత్.
హమ్మయ్య... ఇంకేం రిస్కులు లేవు అని తీరిగ్గా రిలాక్స్ అవుతున్న ప్రశాంత్‌కి గోడ మీద వెక్కిరిస్తున్నట్టున్న గడియారం కనిపించింది. అందులో అంకెలు, ముళ్ళు బదులు డ్రాకులా మేకప్పు వేసుకున్న వాళ్ళ బాస్ మొహం కనిపించింది. "ఓ మైగాడ్....నేను వెరీ వెరీ ఇంపార్టెంటు మీటింగ్ మిస్సయ్యానురా దేవుడోయ్" అంటూఒక వెర్రి కేక పెట్టాడు.ఆ తరవాత కాసేపటికి బాస్ నుంచి పిలుపొచ్చిందిప్రశాంత్ కి. బాస్ క్యాబిన్లోకి వెళ్ళిన ప్రశాంత్ ఒక గంట తరవాత మొహంవేళ్ళాడేసుకుని బయటికొచ్చాడు.
శిరోభారం వదుల్చుకుందుకు కాఫీ తాగుతూ కూర్చుంటే ప్రశాంత్ కి ఇలాఅనిపించింది. పొద్దున్న పేపర్లో ఏదో పామ్ప్లేట్ చూసి సిల్లీ ప్రకటన...పూర్పీపుల్ అనుకున్నాను. మరి ఎస్సెమ్మెస్సులు , మెయిళ్ళు ఫార్వార్డ్ చేసినేను చేసింది మాత్రం ఏముంది. కాస్త సోఫిస్టికేటెడ్ మూఢనమ్మకం.. అంతేగా!!కాకపోతే ఎలాగూ ఫ్రీ ఎస్సెమ్మెస్సు, ఫ్రీ మెయిలే కదా.. ఫార్వార్డ్ చేసేస్తేఏ రిస్కూ ఉండదనుకున్నానా..? హుమ్మ్..అసలా మాత్రమైనా ఆలోచించానా.? ఒక్క నిమిషంఆలోచించినా ఇదెంత పిచ్చి పనో నాకే అర్ధమయ్యేది. ఈ ఫార్వార్డ్ వ్యథ నుంచితప్పించుకునేది ఎలాగా.. అని ఆలోచిస్తుంటే ప్రశాంత్ కొక అద్భుతమైన ఐడియాతట్టింది. మరుక్షణమే దాన్ని అమలుపరిచేసి ఫార్వార్డ్ మెయిళ్ల నుంచివిముక్తి పొందాడు.
ఇంతకీ ప్రశాంత్ ఏమి చేసాడంటే..తన కాంటాక్ట్స్ లో అందరికీ ఒక ఫార్వార్డ్మెయిల్ పెట్టి అందులో ఇలా రాశాడు. "ఈ ఫార్వార్డ్ మెయిల్ అందుకున్నవారెవరైనా, ఎప్పుడైనా, ఏ కారణం చేతనయినా 'ప్రశాంత్' అనే పేరున్నవ్యక్తులకి ఫార్వార్డ్ మెయిళ్ళు పంపినట్లయితే మీకు ఆయా ఫార్వార్డ్ మెయిళ్లవల్ల వచ్చే అదృష్టం దక్కకపోగా, మీకు జీవితంలో ప్రశాంతత అనేదే లేకుండాపోతుంది."
నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాలు, ఊహలు, ఊసులు, జ్ఞాపకాలు... అన్నీటిని కలగలిపి పూలచెండులా గుదిగుచ్చి ఓ చోట పదిలపరచాలనే చిన్ని ప్రయత్నమే నా బ్లాగులు.