Thursday, August 13, 2009

పేరులో నేముంది..!!

'పేరు'.. ప్రపంచంలో ప్రతీ జీవికీ ఏదో ఒక పేరు ఉంటుంది కదా.. గుర్తు తెలియడం కోసం, ఆనవాలు కోసం. ఆవు, పులి, చిలుక, కొంగ, కప్ప..ఇలా. కానీ, మనుషులకి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో పేరు. మరి మనం సంఘజీవులం, అత్యంత తెలివైన జంతువులం కదా.! సంఘజీవులంటే గుర్తొచ్చింది.. జంతువులు కూడా గుంపులుగా జీవిస్తాయి కదా.. మన డిస్నీ సినిమాల్లో చూపించినట్టుగా పిగ్లెట్, పూ బేర్, టిగ్గర్ లా అన్ని జంతువులు అలా పేర్లు పెట్టే పిలుచుకుంటాయేమో.. ఒక వేళ అదే నిజమైనా మనకి వాటి భాష రాదు కాబట్టి తెలిసే ఛాన్స్ లేదులెండి. దేశంలో, అంటే జర్మనీలో నేను గమనించింది ఏంటంటే, ఒక వందో, రెందొండలో (అటూ ఇటుగా) పేర్లుంటాయి వీళ్ళకి. వాటినే అందరూ పెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకి అమ్మాయిలయితే క్రిస్టీనా, మెలనీ, కారిన్, క్లౌడియా, అంగీలా.. లాంటి కొన్ని పేర్లు, అదే అబ్బాయిలకైతే రాబర్ట్, యార్గ్, యుర్గెన్, యోసెఫ్ (జర్మన్లో J అని Y లాగా పలుకుతారు) వగైరా పేర్లుంటాయి. మనం ఒక యాభైమందిని కలిస్తే ఒకే పేరున్న వాళ్లు కనీసం ఇద్దరైనా ఉంటారు. మీరెన్ని ఊర్లు తిరిగినా మళ్లీ మళ్లీ ఈ పేర్లే వినిపిస్తుంటాయన్నమాట :)

నిజానికి మన ఆంధ్ర దేశంలో కూడా ఇంతకుముందు ఇలాగే ఉండేదనుకుంటా పరిస్థితి. అంటే వంద శాతం ఇలాంటి పేర్లే కాకపోయినా, ఇంటికో ఇద్దరు శ్రీనివాసులు, ముగ్గురు వెంకటేశ్వర్లు.. అలాగన్నమాట. తాతతండ్రుల పేర్లు పెట్టడంలో కుటుంబసభ్యులందరూ చాలా పోటీ పడేవారు. ఒక టైములో అయితే ప్రతీ ఇంటికీ తక్కువలో తక్కువ ఒక నాగేశ్వరరావు, ఒక రామారావు అయినా ఉండేవారట. మరి అభిమానులా మజాకానా :) ఒకోసారి తల్లివైపు, తండ్రి వైపున్న అందరి పేర్లు కలిసి వచ్చేట్టు పెట్టేసరికి పేరు చాంతాడంత అయిపోయి చివరికి పేరు కాస్తా కుదించబడుతుంది. ఉదాహరణకి 'ప్రసాద్' అనే పేరున్న వాళ్ళెవారికైనా కేవలం 'ప్రసాద్' అని పేరుండటం సాధ్యమా చెప్పండి. మొత్తం పేరు IJKL ప్రసాద్ అనో లేకపోతే OPQRS ప్రసాద్ అనో ఖచ్చితంగా ఉండే తీరుతుంది కదా.. ప్రసాద్ పేరున్న వాళ్ళెవరూ దయచేసి నా మీదకి దండెత్తి రాకండి. మాటవరసకి చెప్తున్నానంతే ;) ఇంతకుముందు తరాలవాళ్ళు చాలావరకు మంచి పేర్లే పెట్టారు. అప్పట్లో పిల్లలు పుట్టగానే దేవుడి పేరు పెడదామా, తాత పేరు, బామ్మ పేరు కలిసోచ్చేలా పెడదాం అని అనుకుని తదనుగుణంగా పెట్టేవారు. అదే కాలంలో అయితే పేరు విషయంలో చాలామందికి ఉంటే ప్రయారిటీ ఏంటంటే.. ఇప్పటిదాకా ఎవరూ కనీ వినీ ఎరుగని సరికొత్త పేరు పెట్టాలని. పేరు విన్నవాళ్లందరూ కూడా థ్రిల్ అయిపోయి, 'wow.. what a unique name.!?' అనో, 'it sounds very peculiar' అనో, లేకపోతే 'అసలు పేరెలా పెట్టరండీ మీరు.. పుస్తకంలో చూసారు.?' అనో ప్రశంసల జల్లు కురిపించేట్టుగా మనం పేరు వెతుక్కోవాలన్నమాట.! అడిగినవాళ్లకి సమాధానంగా మనం గర్వంగా ఒక చిరునవ్వు నవ్వి 'అరబిక్ లో పేరుకి అర్ధం ఫలానా పువ్వనో, లేక గ్రీక్ భాషలో ఒక రాణి పేరనో, లేకపోతే సంస్కృతంలో ఏదో గొప్ప అర్ధం ఉందనో' చెప్పి మన అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని నిరూపించుకోవాలన్న మాట.! నిజానికి ఇలా చేయడం తప్పు కాదనుకోండి. కాకపోతే "జస్ట, త్రష్య, చాస్య, పౌర్మ, క్రధ్య, ప్రమాష్, ప్రరణ్, కర్పణ్, క్రిమిక్.." ఇలాంటి పేర్లు చెప్పి అచ్చ సంస్కృతంలో ఫలానా గొప్ప అర్ధం ఉంది అని చెప్తే మీరు హాశ్చర్యపోతారా లేదా చెప్పండి.? ఎక్కడో విన్నట్టు గుర్తు.. చైనా దేశస్థులు పిల్లలు పుట్టగానే ఏదో పింగాణీ గిన్నె కింద పడేసి, శబ్దం వస్తే పేరు పెడతారని అందుకే, వాళ్ల పేర్లు అన్నీ ఒకలాగే ఉంటాయని.. ఇది నిజమో కాదో తెలీదు కానీ, లెక్కన వాళ్ళకి మనలాగా పేర్ల పుస్తకాలు, అంతర్జాతీయ భాషా పరిశోధన చేసే బాధ తప్పుతుంది కదండీ.! మధ్యనే ఎక్కడో మరో విషయం చదివాను. తమిళనాడులో పిల్లలకి సాంప్రదాయిక తమిళ పేర్లు పెట్టేవారికి ప్రభుత్వం ఏదో బహుమతులిస్తుందని. మధ్య సినిమా పేర్ల విషయంలో కూడా ఇలాంటిదేదో చేసినట్టున్నారు వాళ్లు. సినిమాపేరు తమిళ్ లోనే ఉంటే.. అంటే కిక్, రెడీ, కింగ్, జోష్..ఇలాంటి ఇంగ్లీషు పేర్లు కాకుండా, వాళ్ల భాషలోనే ఉంటే ఏదో పన్ను మినహాయింపు లాంటిది ఉందనుకుంటా.! ఎంతైనా భాష మీద ప్రేమ విషయంలో మాత్రం తమిళం వాళ్ళని మెచ్చుకోవాల్సిందే.. అప్పుడప్పుడూ వాళ్ల వాదనలు భరించడం కొంచెం కష్టమైనప్పటికీ ;)

పేర్ల గురించి ఎప్పుడనుకున్నా నాకు మా తమ్ముడి గురించి రెండు విషయాలు తప్పక గుర్తొస్తుంటాయి. మొదటిది ఏంటంటే, వాడు చిన్నగా ఉన్నప్పుడు, అంటే రెండో తరగతో చదివే రోజుల్లో స్కూల్లోనో, బయటో పేరు చూసొస్తే ఇంటికొచ్చి నాకు కూడా పేరే పెట్టమని గొడవ చేసేవాడు. ఉదాహరణకి ఒకసారి మా స్కూల్లో 'సంజవరావు (సంజీవరావు)' అనే అబ్బాయిని చూసొచ్చి, తనకి కూడా అదే పేరు పెడతారా చస్తారా అని మా అమ్మ బుర్ర తినేసాడు. 'సంజవరావు' కంటే నీకున్న పేరే బాగుందిరా అని ఎంత చెప్పినా వినడే అసలు. చివరికి మా అమ్మ బాగా ఆలోచించి 'అలా కాదురా నాన్నా.. నీకా పేరు పెట్టడం కుదరదు. నీకు కేవలం '' అనే అక్షరంతో మొదలయ్యే పేరు మాత్రం పెట్టాలి. వేరేవి పెట్టకూడదు. అది రూలు అంతే' అని గాఠ్ఠిగా చెప్పేసింది. పాపం.. అమ్మ వీడి తెలివిని చాలా తక్కువగా అంచనా వేసిందని అప్పుడు తెలీలేదు. తరవాత కొన్ని రోజులకి మా వీధిలో ఒకళ్ళింటికి వాళ్ల మనవడు వచ్చాడు ఊరినుంచి. మా తమ్ముడు ఆడుకోడానికి వెళ్లి అబ్బాయి పేరు 'భాస్కర్' అని తెలియగానే ఆట వదిలేసి పరుగు పరుగున ఇంటికొచ్చేసాడు. సీన్ అర్ధమయ్యిందిగా మీకు.. అదేనండీ, వాడి పేరు అర్జంటుగా 'భాస్కర్' అని మారుస్తారా లేదా అని.. అమ్మని పీకి పాకం పెట్టేసాడు. నీ పేరే బాగుంది అంటే వినిపించుకోడాయే.. రోజు నుంచీ వాడి పేరుతో పిలిస్తే అసలు పలికేవాడు కాదు భాస్కర్ అంటేనే పలుకుతా అనేవాడు. మా టైం బాగుండి చుట్టాలబ్బాయి నాలుగురోజుల తరవాత వెళ్ళిపోవడం వల్ల 'భాస్కర్' కథ ఎలానో మర్చిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు నాకు భాస్కర్ అనే తమ్ముడు ఉండేవాడేమో ;) ఇంతకీ మా తమ్ముడి పేరు చెప్పనేలేదు కదూ..! మా నాన్నగారు దేశం మీద ప్రేమ కొద్దీ వాడికి 'భారత్' అని పేరు పెట్టారు. అందరూ 'భరత్ భరత్' అని పిలిచి చివరికి అది కాస్తా 'భరత్' అయిపోయిందని ఇప్పటికీ మా నాన్న బాధపడుతుంటారు పాపం :( మరో సంతేంటంటే, అప్పట్లో 'భరత్ అరుణ్ ' అనే ఒక క్రికెటర్ ఉండేవాడని నాన్న సరదాగా అప్పుడప్పుడూ వాడిని 'భరత్ అరుణ్' అనేవారట. అది విని నేను కూడా అలా పిలుద్దామని 'భరాతర్' అని పిలిచేదాన్న. మీ తమ్ముడి పేరేంటమ్మా అని ఎవరొచ్చి అడిగినా చక్కగా 'భరాతర్' అనే చెప్పేదాన్న. అందరూ మళ్లీ మళ్లీ అడిగి నవ్వేవారని అప్పట్లో అర్ధం కాలేదు మరి :( ముహూర్తంలో అలా పిలిచానో గానే, మొన్న మొన్నటిదాకా కూడా మా కజిన్స్ అందరూ వాడిని అలాగే పిలిచేవారు. విషయం ఇలా బ్లాగులో నిలబడి టాం టాం చేశానని తెలిస్తే తప్పకుండా గొడవకొచ్చేస్తాడు. అంతే కాదు, వచ్చి ఇప్పుడు నేను చెప్పబోయేది గుర్తు చేసి కక్ష కూడా తీర్చుకుంటాడు. అదేంటంటే.. అదే నేను చెప్పాలనుకున్న రెండో సంగతి.

నేను ఎనిమిదో తొమ్మిదో చదివే రోజుల్లో ఒక వేసవి సాయంత్రం హాయిగా నవారు మంచాలేస్కుని ఇంటి వెనక పెరట్లో కూర్చుని, ప్రతీ చిన్న పదానికీ కామెడి చేస్తూ నేనూ, తమ్ముడూ బాగా నవ్వుకుంటున్నాం. అప్పుడు మా అమ్మమ్మ కోసం వాళ్ల భక్తి సంఘం నాయకురాలు, వాళ్ల పిన్ని అయిన ఒక బామ్మ గారు వచ్చారు. పాపం, వాళ్ల కబుర్లకి అంతరాయం కలుగుతుందని అమ్మమ్మ మా ఇద్దరినీ అరిచింది కాసేపు నోర్మూసుకుని కూర్చోమని. ఇహ చేసేదేమీ లేక మేము కూడా వాళ్ల మాటలు వినక తప్పింది కాదు. వచ్చిన బామ్మ గారి మాటల్లో ఒక వాక్యం మా ఇద్దరినీ బాగా ఆకర్షించింది. ఆవిడ ఏమన్నదంటే.. 'అదే అమ్మాయ్.. మా నచ్చత్రమ్మోళ్ళ పెనివిటి తమ్ముడికిచ్చింది, మన ఎంకాయమ్మ చెల్లెల్నే గదూ..' అనుకుంటూ ఏవేవో చెప్పుకున్నారు. ఆవిడ వెళ్ళిపోగానే మా అమ్మమ్మని అడిగాము మేమిద్దరం 'నచ్చత్రమ్మ' ఎవరని? అదేం పేరూ అయినా.. 'నచ్చత్రమ్మా' అనుకుంటూ.. దానికి అమ్మమ్మ 'ఆవిడ వాళ్ల చెల్లెలులే..అయినా నవ్వడం ఏంటి అసలు.. పెద్దాచిన్నా లేకుండా.. అంత నవ్వొచ్చే విషయమేంటి అసలు అక్కడ.. ఆవిడ వెళ్లి వేరేవాళ్ళ దగ్గర చెప్పదూ.. ఫలానా వాళ్ల మనవడు, మనవరాలు అస్సలు బుద్ధిమంతులు కాదు అని.. మీకసలు మాత్రం భయం, భక్తీ లేకుండా పోతున్నాయి' అని చిన్నపాటి ప్రైవేటు చెప్పేసింది. అసలు 'నచ్చత్రమ్మ' అంటే ఏంటి.? ముందు అర్ధం చెప్తారా.. లేదా.? అని మేము ఎదురాడాం. ఇంతలో అమ్మ కూడా వచ్చింది. 'అబ్బ ఏం పిల్లలో ఏమో నాయనా.. ఒకటే గోల.. మీరు ఇంటికొచ్చారని రెండు వీధులవతల దాకా తెలిసిపోతుంది తెలుసా.? అందరూ అడుగుతూ ఉంటారు' అని విసుక్కుంది. సరే.. గోల ఆపుదాం కదా అని 'నచ్చత్రమ్మ' అంటే 'నక్షత్రం' అని లేరా.. వాళ్ళేదో అలా పలుకుతున్నారు గానీ' అని చెప్పింది. ఇహ చూస్కోండీ..ఆపకుండా ఒక అరగంటైనా నవ్వుతూనే ఉన్నాం మేమిద్దరం.. అంత మంచి పదాన్ని ఇంత ఘోరంగా మార్చేసారా అనుకుంటూ.. అప్పుడే, మా తమ్ముడు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం కూడా తీసేస్కున్నాడు. అదేంటంటే, భవిష్యత్తులో మా అమ్మాయికి 'నక్షత్రమ్మ' అని పేరు పెట్టాలని. ఒకవేళ కాస్త మోడ్రన్ గా ఉండాలని అనుకుంటే 'నక్షత్ర' అని పెట్టుకోవాలంట. రోజు మా ఇంటిల్లిపాదీ మాములుగా నవ్వలేదు మేము. విధంగా ఆలూ లేదూ, చూలు లేదూ, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా, రోజే మా అమ్మాయికి నామకరణం జరిపేసాడు మా తమ్ముడు. ఇప్పటికీ విషయం గుర్తు చేసుకుని నవ్వుతూనే ఉంటాం మేమందరం. నిజంగా భవిష్యత్తులో అమ్మాయి పుడితే, నేను పేరు పెట్టుకున్నా, వాడు మాత్రం 'నక్షత్ర' అనే పిలుస్తాడనడంలో నాకే సందేహమూ లేదు. అందుకని నేను కూడా వాడి కూతురు కోసం ఒక విచిత్రమైన పేరు వెతుకుదామనుకుంటున్నా.. వీలైతే మీరూ చెయ్యి (అదేనండీ.. ఓ పేరు) వేయండి ;) అంతే కాదండోయ్.. అత్యుత్తమ పేరు సూచించినవారికి 'విచిత్రనామ పితామహ' అనే బిరుదు కూడా ఇవ్వబడుతుంది. ఇక మీదే ఆలస్యం.!

ముగించేద్దాం అనుకుంటూ ఉండగా మరో విషయం జ్ఞాపకానికి వచ్చింది. నాకొక చిచ్చర పిడుగు లాంటి మరదలు ఉంది. దానికి నాలుగైదేళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ పేరు మోటుగా ఉందని 'శిరీష' అనీ, వాళ్ళ పెద్దమ్మ పేరు 'అనూహ్య' (టీవీ ప్రభావమనుకుంటా ;) అనీ మార్చేసింది. ఎవరడిగినా అదే చెప్పడం కాకుండా వాళ్ళ నాయనమ్మకి కూడా వార్నింగ్ ఇచ్చేసింది ఇకనుంచీ తన పేరు 'శిరీష' అనే చెప్పాలని ;) అదే వయసులో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్న వాళ్ళ అక్క పేరు సామ్రాజ్యం అని ఏదో చెప్తుంటే..'అదేం పేరు.. సముద్రం అని పెట్టలేకపోయారా.?' అనేప్పటికి మా అందరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినంత పనయ్యింది. అదేమరి జనరేషన్ గ్యాప్ అంటే ;)

29 comments:

మురళి said...

అయ్యో..అయ్యో..తమ్ముడి కూతురికి పేరింకా వెతకలేదా మీరు? ఇంత వెనుకబడిపోయారా? మనలో మన మాట.. మీ తమ్ముడిది మంచి టేస్టు.. మీ అమ్మాయి పేరు భలే ఉంది :-)

మేధ said...

తెలుగు వర్ణమాల లోని ఏదో ఒక అక్షరం కేవలం ఒకే-ఒక్క అక్షరం తీసుకుని పెట్టేయండి.. అంత విచిత్రమైన-వింత పేరు ఎవరూ పెట్టలేరు :))

Just Kidding.. By the way, మీ అమ్మాయి పేరు బావుంది :)

Anonymous said...

మా కజిన్ వాళ్ళ అమ్మాయి పేరు "గాయత్రి", మా అబ్బాయికి నోరు తిరక్క 'ఒన్ టూ త్రీ " అనేవాడు.ఇప్పటికి ఆ పిల్ల ఇద్దరు పిల్లల తల్లి అయినా అలాగే పిలుస్తాడు

రవి said...

పేర్ల పిచ్చి ముదిరి, విచిత్రమైన పేర్లు విన్నాను నేను, మా పాపాయి కోసం పేరు వెతికేటప్పుడు. "రుహాన్ గంధర్వ", "నారాయణ నయనాశ్రిత్", "పురుష్", ఇలా...ఇలాంటివి విని భళ్ళున వాంతి చేసుకుని, తిరిగి కోలుకున్న తర్వాత సింపుల్ గా "సంహిత" అన్న పేరు పెట్టాము.

Venky said...

బాగా చెప్పారు..మా 5 నెలల బాబు పేరు కొసం కూడా చాలా ఆలొచించాల్సి వచ్చింది..ఎందుకంటే నా పేరు కూడ ఛాన్స్ ఉంటే మార్చుకొవాలని నా ఆశ...మొత్తానికి వాడి పేరు "సుహాస్" అని పెట్టాము ..పేరు కు తగ్గట్టె వాడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు..ఇప్పుడు నాకు వాడి కి కరెక్ట్ పేరు పెట్టాను అని సంతొశం..

తమిళన్ said...

హ్రిహ్చి ......ఎలా వుంది పేరు?

మాలా కుమార్ said...

పేర్ల ప్రహసనం భలే సరదాగా వుందండి .

భావన said...

హ హ హ బావున్నాయి మీ పేర్ల ప్రహసనాలు.. మీ అమ్మాయి పేరు బాగుంది నవ్వుతాలికైనా మంచి పేరు తెచ్చుకున్నారు, మీ మరదలికి తమిళన్ గారు సూచించిన పేరు బాగుంది నా వోటూ దానికే...

భాస్కర రామిరెడ్డి said...

భలేచెప్పారండీ కబుర్లు. ఇంతకీ భాస్కర్ మేనకోడలికి నక్షత్ర అని పెడితే, అది జర్మనీలో ఎలా పిలుస్తారో అలో చించారా? పేరు బాగుంది. అన్నట్టు మీ భాస్కర్ బాగున్నారా?

Anonymous said...

అజభీ దఫపా విశ్వేసకీ స్వాముల లాగా

అనఅరు అహగౌ కాపాల స్వామిణి అని పెట్టండి

శరత్ కాలమ్ said...

యు ఎస్, కెనడాల్లో పేరు పెట్టేముందు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు కాస్త పెద్దయ్యాక తోటి పిల్లలు ఎగతాళి చేసి ఏడ్పించకుండా ముందే జాగ్రత్త పడాలిట. మా మాజీ టర్కిష్ కోలీగ్ అలా ఆలోచించనందున వాళ్ళ పాపకు చాలా ఇబ్బంది ఎదురయిందంట. మా ఇంకో కోలీగ్ అడగ్గా అడగ్గా వాళ్ల అమ్మాయి పేరు చెప్పాడు. వాళ్ల అమ్మాయి పేరు సున!

పరిమళం said...

పేరులో నేముందీ అంటే పేరులో ఏముందీ అనుకున్నా ...పేరులోనే ఉందన్న మాట !

Anonymous said...

మీ అమ్మాయికో ముద్దు పేరు డిసైడ్ చేసా .."నక్కి" ఎలా ఉంది! హి హి హి

నేస్తం said...

పేరు కు సంబందించి చాలా వ్యాసాలు చదివాను ..అల్టిమేట్ ఇది..ఇంతకు మించి చెప్పలేను అంత బాగా రాసారు :)

Subrahmanyam Mula said...

మధురవాణి గారు,

మీ బ్లాగు పోస్టులు బావున్నాయి. తప్పక రాస్తూ ఉండండి.

నా కవితపై మీ కామెంట్లకి ధన్యవాదాలు. కింది లంకె చూడండి..

http://etiodduna.blogspot.com/2009/08/blog-post_15.html

కొత్త పాళీ said...

నవ్వలేక చచ్చా

Vinay Chakravarthi.Gogineni said...

baagundi...........
ilane nenu maa akka anukunnam.........
sep date ichharu tanaki.....nenu eppudo cheppa ammayi pudite sujatha ane pilustanani

ఉమాశంకర్ said...

టపా బాగుందండీ... అలానే వ్యాఖ్యాతలు చెప్పిన పేర్లు కూడా బావున్నాయి...

Srujana Ramanujan said...

"అత్యుత్తమ పేరు సూచించినవారికి 'విచిత్రనామ పితామహ' అనే బిరుదు కూడా ఇవ్వబడుతుంది."

హమ్మయ్య. అమ్మాయిలకి శ్రమ తగ్గించేశారు. :-D

BTW Franz అనేది కూడా ఇక్కడ ఎక్కువగా పెట్టుకునే పేరులా ఉంది. ఇప్పటికే ఎనిమిది మంది పైన చూశాను మరి. Franz Schmidt... అలా అన్నమాట

గీతాచార్య said...

ఈ మధ్య విన్న సరిక్రొత్త పేరు...

కాష్ట. అబ్బో! అద్దిరిందనుకున్నా. ;-)

kumar said...

nenu mee tammudi paapa ki oka peru suggest chestunna.."vichitra"

మధురవాణి said...

@ మురళి గారూ,
అవునండీ.. చూడబోతే చాలా వెనుకబడిపోయినట్టే ఉంది నేను :(
అసలు ఈ పోస్టు రాస్తున్నప్పుడే ఇలా మా తమ్ముడి కూతురికి కూడా నేనో విచిత్రమైన పేరు వెతకాలి అన్న ఆలోచన వచ్చిందండీ.! మొత్తానికి వాడు పెట్టిన పేరు బావుందంటారు ;)
@ మేధ గారూ,
సూపెర్ ఐడియా ఇచ్చారండీ.! 'బండిర' అదేనండీ.. ' ఱ' అని పెడితే ఎలా ఉంటుందంటారూ.!? :)
@ హరేఫల గారూ,
123.. భలే సరదాగా ఉందండీ మీ అబ్బాయి పెట్టిన పేరు :)
@ రవి గారూ,
మీరు విన్న పేర్లు నిజంగానే చాలా భయమ్కరంగానే ఉన్నాయండీ.! మీ పాప పేరు మాత్రం చాలా చాలా బాగుంది. నన్నెవరైనా అడిగితే 'సంహిత' అనే పేరు కూడా సజెస్ట్ చేస్తాను ఇక నుంచి :)
@ వెంకీ గారూ,
మీ బాబు పేరు కూడా చాలా బావుందండీ..! నా స్నేహితురాలి కొడుకు పేరు కూడా అదే.
అయితే మీ సుహాస్ సార్ధకనామధేయుడన్నమాట.! బహు బాగు :)

మధురవాణి said...

@ తమిళన్ గారూ,
'విచిత్రనామ పితామహ' అనే బిరుదు మీకే ఇవ్వాలేమోనండీ.. ఎక్కువమందికి మీరు చెప్పిన పేరే నచ్చినట్టుంది.
ఇంతకీ.. మనలో మన మాట.. 'హ్రిహ్చి' ఏ భాషా పదమండీ.? అర్ధం ఏమిటంటారూ.? నాకైతే ఏదో హిడింబి, తాటకి వాళ్ళ వంశస్థుల పేరులాగా వినిపిస్తున్నది ;)
@ మాలా గారూ,
మరి ఆ టాపిక్కే అలాంటిది కదండీ ;)
@ భావన గారూ,
మొత్తానికి మా తమ్ముడు పెట్టిన పేరు చాలామందికి నచ్చిందన్నమాట.. ఈ విష్యం వాడికి చెప్పాలి సుమా.. :)
@ భాస్కర్ గారూ,
మీకు భలే అవుడియా వచ్చిందండీ..నిజమే..జర్మనీ లో ఎలా పిలుస్తారో ఊహించడం కష్టమే.. నాకు తెలిసి దాన్ని కుదించి.. ఏ 'నఖా' అనో.. 'నత్రా' అనో పిలుస్తారు కాబోలు. ముందు ఇలాంటి నోరు తిరగని పేరు పెట్టినందుకు మా అమ్మాయి మమ్మల్ని ఏమంటుందో.. ప్రైవేటు చెప్పేస్తుందేమో రోజూ స్కూల్ నుంచి వచ్చాక ;)
@ అనానిమస్ గారూ,
హమ్మో.. ఏవిటండీ ఆపేరు..కనీసం నేనయినా దాన్ని సరిగ్గా గుర్తుంచుకుని చెప్పాలి కదండీ.. ఫలానా పేరని..నా వల్ల కాదండీ.. ఈ వింత పేరు గుర్తుంచుకుని పలకడం.. మరో పేరేదయినా చెపుదురూ.. :)

మధురవాణి said...

@ శరత్ గారూ,
మీరు చెప్పింది నిజమేనండీ..ఇండియాలో అయినా కూడా ఈ రోజుల్లో పిల్లలకి ఏ పేరు పెట్టాలో జాగ్రత్తగా చూస్కోవాలి. లేకపోతే అందరూ ఏడిపించే ప్రమాదం ఉంది. ఇంతకీ 'సున' అంటే.. ఆపిల్లని సునామీ అనేవారేమో పాపం :(
@ పరిమళం గారూ,
అవునండీ.. అంతా పేరులోనే ఉంది కదా మరి ;)
@ అమ్మాయి గారండీ,
మీరు ఏకంగా నాకే ముద్దు పేరు పెట్టేశారాండీ.!? ఇంతకీ 'నక్కీ' అంటే ఏవిటండీ అర్ధం.? నా మీద ఇంత కక్ష ఎందుకో తెలుసుకోవచ్చా మీకు ;)
@ నేస్తం గారూ,
చాలా ధన్యవాదాలండీ.! చక్కటి పోస్టులతో మమ్మల్నందరినీ తెగ నవ్వించేసే మీకు నా పోస్టు నచ్చిందంటే, నేను పండగ చేస్కోవాల్సిన విషయమే మరి ;)
@ సుబ్రహ్మణ్యం గారూ,
నా బ్లాగుని దర్శించినందుకు ధన్యవాదాలు. నా అభ్యర్ధన మన్నించి మీ రచనల లింకులు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండీ.!

మధురవాణి said...

@ కొత్తపాళీ గారూ,
గురువు గారూ.. మీరీ మాట అన్నారంటే.. నేను బాగా రాసినట్టే లెక్క. మిమ్మల్ని నవ్వించగలిగినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు :)
@ వినయ్ గారూ,
మీరెంత మంచి తమ్ముడండీ.. చక్కటి పేరు పెట్టారు 'సుజాత' అని. మీ అక్కకి పండంటి 'సుజాత' పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@ ఉమాశంకర్ గారూ,
ధన్యవాదాలు. భలే భలే పేర్లు తెలిసాయి కదండీ ఈ టపా వల్ల ;)
@ సృజన,
అవును.. ఇక్కడన్నీ అలాంటి పేర్లే పదే పదే వినిపిస్తుంటాయి. ఒకే పేరు ఏడెనిమిది సార్లు వినే అవకాశం భేషుగ్గా ఉంది ;) నువ్వు కూడా ఏదయినా పేరు చెప్పాల్సింది. కావాలంటే.. 'విచిత్రనామమాతామహ' అనే బిరుదు ఇచ్చేదాన్ని కదా సృజనా..! :)
@ గీతాచార్య గారూ,
'కాష్ట' నా.? హమ్మో.. మాములుగా అదరలేదండీ.. ఒక రేంజ్ లో అదిరింది పేరు..!
వామ్మో.. వింటేనే నాకేదోలాగా ఉంది. ఇంకా రోజూ అలా పిలిస్తే ఎలా ఉంటుందో ;)
@ కుమార్ గారూ,
పేరులో విచిత్రమున్నా వినడానికి అంత విచిత్రంగా లేదు కదండీ.. చక్కగా ఉంది కూడానూ.. అలాక్కాకుండా పలకడం, అర్ధం-పర్ధం అన్నీ విచిత్రంగా అనిపించే పేరు కావాలన్న మాట ;)

Unknown said...

Madhura vani garu,
mee tammudi kooturiki peru..

భూత రక్షతి, .. ఒక పేరు.. చాలా ఇంకా కావాలా?

హరీష్ బలగ said...

అక్కలంతా ఇంతేనా.. మీ తమ్ముడు మీ అమ్మాయికి అంత మంచి పేరు పెడితే, మీరు ఇంత కుట్ర పన్ని, పనిగట్టుకుని మరేఎ విచిత్రమయిన పేరు వెతుకుతారా !!
అన్యాయం.. అక్క, డౌన్ డౌన్ .. అక్క డౌన్ డౌన్.

కాని బండిర (ఱ) పేరు మాత్రం కేక..

మధురవాణి said...

@ sita,
'భూత రక్షతి' అంటే -- మేమందరం భూతాలు కాబట్టి మమ్మలందరినీ రక్షిస్తూ ఉంటుందనా మీ ఉద్దేశ్యం? ;-) :-D

@ హరీష్,
ఏంటండీ.. మీరు కూడా అక్కల దౌర్జన్యాన్ని ఎదుర్కుని పోరాడే తమ్ముళ్ళ సంఘంలో ఉన్నారా? అయినా విచిత్రమైన పేరు వెతుకుతా అన్నా గానీ.. పిచ్చి పేరు వెతుకుతా అనలేదు కదండీ! ;-) :-D
'బండిర' (ఱ) నచ్చినందుకు థాంక్స్ :-)

Anonymous said...

Bagundi andi ...saradaga....maa chuttala ammayiki "greeshma" ani peru undi..