తెలతెల్లటి మబ్బు తునకలు పల్చగా
పరుచుకున్న ఆకాశం విరబూసిన మల్లెపొదలా, అప్పుడే పుట్టిన పాపాయి నవ్వులా
స్వచ్ఛంగా, అందంగా
ఉంది. ఎవరో మబ్బుల చాటున దాగుండి దోసిలి పట్టి సుతారంగా ముత్యాలు
వెదజల్లుతున్నట్టు అలవోకగా నింగి నుంచి జారుతున్న సనసన్నటి వాన చినుకులు.. ఆగి ఆగి
వీస్తున్న గాలి అలలపై తేలుతూ మెలమెల్లగా చెట్టు సిగలో నుంచి జారి నేలని
తాకుతున్న ఎర్రటి గుల్మోహర్ పూలరేకులు..