Wednesday, January 04, 2012

నా నువ్వేగా!

ఉన్నట్టుండి నువ్వు కళ్ళల్లో కదలాడావు..
క్షణమైనా నిన్ను నా సొంతం చేసుకుందామని చప్పున కళ్ళు మూసేసాను..
నువ్వు తప్పించుకు పారిపోయి నీటి ముత్యంలా మారి కనురెప్పల కొసన నిలిచావు!

ఇంతదాకా కళ్ళలో ఉన్న నువ్వు కన్నీళ్ళలో తేలావు..
మెప్పించినా నొప్పించినా.. మురిపించినా మరిపించినా.. గారం చేసినా గాయం చేసినా..
నువ్వేగా.. నా నువ్వేగా.. నాకు నువ్వేగా కన్నా!

13 comments:

  1. "మధుర"మైన నిన్ను నా కళ్ళల్లో బంధించాను. దయచేసి నన్ను ఏడిపించకు నీ రూపం చెదిరిపోతుంది, కరిగిపోతుంది.

    ReplyDelete
  2. @మధురవాణి గారు దాగని అ కన్నీటి ముత్యానికి కాలం గురించి తెలియదేమో తెలిసుంటే అది కూడా పెరిగి ఓ స్నేహమై మీ కనులముందు వాలేది.. మీ మనసు లాగే అది నిత్య నూతనంగా ఉంది ముత్యం గానే మిగిలిపోతోంది.. ఒక్కోసారి మన మంచితనం వల్ల కూడా మనసు లో ఆ భావన యవ్వనంగా మిగిలిపోతుంది కాని మాటగా వెలుపలకి రాదు....

    ReplyDelete
  3. Simply beautiful...ఎంచుకున్న ఫొటో చాలా ముద్దుగా ఉంది.

    ReplyDelete
  4. అదే .....మనుషుల్ని పట్టి బంధించేది.బాగుంది

    ReplyDelete
  5. మధురాతి మధురం మీ ప్రేమ.

    ReplyDelete
  6. చాలా బాగుంది, ఫోటో మరీ బాగుంది.

    ReplyDelete
  7. @ రాజేష్ మారం, సుభ, పద్మార్పిత, తెలుగు పాటలు, చిన్ని ఆశ, రఘు, సాయి, మాలా కుమార్, వేణూ శ్రీకాంత్..
    స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. :)

    @ రసజ్ఞ,
    అలాగేలెండి.. అస్సలు ఏడిపించను. మీ కళ్ళల్లోనే ఉండిపోతాను. సరేనా!
    ఊరికే సరదాకి అన్నాన్లెండి.. Thanks for the comment! :)

    @ కళ్యాణ్,
    భలే ముచ్చటగా చెప్పారే కన్నీటి ముత్యం గురించి.. బాగుందండీ మీ స్పందన! ధన్యవాదాలు.

    @ కష్టేఫలే,
    బంగారం లాంటి మాట చెప్పారు శర్మ గారూ.. చాలా సంతోషమేసింది మీ వ్యాఖ్య చూసి.. బోల్డు ధన్యవాదాలు. :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!