Thursday, November 25, 2010

ఎంత చిత్రమైనదీ మనసు..!


ఎంత చిత్రమైనదీ మనసు..!
కొన్ని జ్ఞాపకాల్ని వేవేల సార్లు తలచుకున్నా ఇప్పటికీ రవ్వంతైనా తగ్గని పరవశం..
కొన్నింటిని కోటి మార్లు తలచుకున్నా ఎప్పటికీ ఇసుమంతైనా తగ్గని పరితాపం..
మరి కొన్ని స్మృతులు నెమరుకొస్తే ఓ చెంపన ప్రమోదం, మరో చెంపన అంతర్వేదనం..
మటుమాయం చెయ్యాలని ప్రయత్నిస్తున్న స్మృతుల్ని పదే పదే వల్లె వేస్తుంటుంది..
గతంలో ఇగిరిపోయాయని నమ్ముతున్న జ్ఞాపకాల జాడల్ని వెలికి తీస్తుంటుంది..
విస్మరించాలనుకుంటున్న భావాలే చెలరేగి గాయపరుస్తుంటే మౌనంగా భరిస్తుంది..
తనని నొప్పించే తలపులనే మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటుంది..
ఎప్పటికీ వాస్తవంలో జరిగే వీల్లేని ఊహల్లో కాలం వెళ్లబుచ్చుతుంది..
రెప్పపాటులో కరిగిపోయే రంగుల కలల్లో ఆనందం వెతుక్కుంటుంది..
అలుపన్నదే ఎరుగక అవిశ్రాంతంగా నిరంతరంగా ఆలోచనల్లో ప్రయాణిస్తుంటుంది..
ఆ పయనంలో అనుక్షణం ఎన్నెన్నో జ్ఞాపకాలు పోగేసుకుంటూ పదిలంగా గూడు అల్లుకుంటుంది..
నాలో ఉసురున్నంత వరకూ ఈ జ్ఞాపకాల గంధాలే తన ఊపిరి అంటుంది..
తనలో సాగే ఆలోచనాస్రవంతే నా అస్థిత్వానికి నిజమైన ప్రతీకని నమ్మబలుకుతుంది..
ఎంత చిత్రమైనదీ మనసు..!

13 comments:

  1. మీరు పెట్టిన సిత్రం మీరు రాసిన రాత నాకు నచ్చింది.

    ReplyDelete
  2. మధుర వాణి గారూ
    ఆ ఫోటో మీరు తీసార. లేక జై గూగులమ్మ అన్నారా. కవితతో పాటు ఫోటో చాలా బాగుంది.

    ReplyDelete
  3. మధుర గారూ.. చాలా చాలా బాగుంది :)
    >>ఎప్పటికీ వాస్తవంలో జరిగే వీల్లేని ఊహల్లో కాలం వెళ్లబుచ్చుతుంది..
    హిహ్హిహ్హి.. భలే ఉంది..

    ReplyDelete
  4. "ఆ పయనంలో అనుక్షణం ఎన్నెన్నో జ్ఞాపకాలు పోగేసుకుంటూ పదిలంగా గూడు అల్లుకుంటుంది"

    చాల చాల బాగుందండీ .

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. చాలా చక్కగా రాశారు....
    ఈ లైను నాకు బాగా నచ్చింది...
    "కొన్ని జ్ఞాపకాల్ని వేవేల సార్లు తలచుకున్నా ఇప్పటికీ రవ్వంతైనా తగ్గని పరవశం.."

    --హను

    ReplyDelete
  7. chala chala bagundi acham me laga
    ---srividya

    ReplyDelete
  8. చిత్రం , మీ పోస్ట్ రెండూ బాగున్నాయి . చిత్రం మీరే తీసారా ?

    ReplyDelete
  9. మనసులోపలి పొరలలో తవ్వితీసేకొలది వెలువడే జ్ఞాపకాలెన్నో!ఆనందానికి,విచారానికినడుమ మనసు బొమ్మ, బొరుసు రెండు తానై మననే ఆటాడిస్తుంది.ఈ ఆటలో మనసు గెలిచినా,ఓడినా ఫలితం స్వీకరించేది మాత్రం మనమే.మనసుగతి ఇంతే అనుకోక తప్పదు.మీ హృదయాకాశం సూపర్బ్!

    ReplyDelete
  10. @ భాను, మాలా కుమార్,
    ధన్యవాదాలండీ. ఆ ఫోటో నేను తీసింది కాదు. జై గూగులమ్మ అన్నానండీ. :)

    @ అశోక్ పాపాయి, మనసు పలికే, చిన్ని, హను, వేణూ శ్రీకాంత్, హరేకృష్ణ,
    మీ అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

    @ సత్య,
    ఎంతందంగా చెప్పారండీ.. superb!

    @ శ్రీవిద్య,
    So sweet of you! థాంక్యూ! మీరు మరీ అలా పొగిడేస్తే.. నేను ఉబ్బితబ్బిబ్బైపోయి ఎక్కడానికి ఇక్కడ ములగ చెట్లు కూడా దొరకట్లేదండీ! ;)

    @ C.ఉమాదేవి,
    ధన్యవాదాలండీ.. ఎంత బాగా చెప్పారు! నిజమే మనసు బొమ్మా బొరుసూ తనే అయ్యి ఆటాడిస్తుంది. మనసు కూడా ఆకాశంలా ఆది అంతం లేనిది.. ఎప్పటికీ దాన్ని కొలవలేము అన్నట్టుగా ఉంటుందని ఆ హృదయాకాశం పెట్టాను. :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!