Monday, July 19, 2010

ఒరేయ్ తమ్ముడూ.. నీకు హేప్పీ హేప్పీ బర్త్డే రా!

-->

-->
ఒరేయ్ నీకు గుర్తుందా! చిన్నప్పుడు నీ పుట్టినరోజుకి ఒకసారి మావయ్య కెమెరా తెచ్చాడు ఫోటోలు తీయడానికి. అప్పుడేమో నువ్వు ఎందుకో అలిగి మొహం ముడుచుకు కూర్చున్నావ్! ఆ ఫోటోలు గుర్తున్నాయా?kenyit

-->
ఇంకా.. అన్నీ ఫ్రూట్స్ బొమ్మలుండే ఓ చిన్న నిక్కరేసుకుని మనింటి ముందు సుజుకీ బైకు మీద కూర్చుని ఫోటో దిగావే! అది గుర్తుందా?encem

-->
చిన్నప్పుడు "నాకా డ్రస్సే కావాలి" అని మారాం చేసిన నువ్వు ఇప్పుడు "ఆఫీసు పనితో చాలా బిజీగా ఉన్నానక్కా.. కొత్త బట్టలేం కొనుక్కోలేదు.." అని చెప్తుంటే ఇంకా చిన్నపిల్లోడివి కాదు మరి అనిపిస్తోంది.senyum

అవున్రోయ్.. నువ్విప్పుడు చాలా పెద్దోడివైపోయావురోయ్! ఎందుకంటే మరి ఇవ్వాళ నువ్వు ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావ్ కదా! !celebrate
ఒరేయ్ బాతూ.. నీకు హేప్పీ హేప్పీ బర్త్డే రా!celebrate
--> -->
నీకు గుర్తుందా నువ్వు చిన్నప్పుడు ఏదైనా తెలుగు పుస్తకాల్లో 'హ్యాపీ' అని రాసుంటే చదివి ఇలా 'హ్యాపీ' అని య వత్తుతో ఎందుకు రాస్తారు అని నవ్వేవాడివి కదా!

అందుకే నీకు ఇలా హేప్పీ హేప్పీ బర్త్ డే చెప్తున్నా!sengihnampakgigi


-->
*మా తమ్ముడి పేరు 'భారత్' అని పెట్టారు నాన్న. అది కాస్తా ఇప్పుడు 'భరత్' అయిపోయింది. నేనేమో చిన్నప్పుడు 'బాతూ' అని పిలిచేదాన్ని. ఇప్పుడోసారి ఆ పిలుపు గుర్తు చేసుకుందామని అలా పిలిచాను.sengihnampakgigi

26 comments:

  1. :D Puttina roju Shubakankshalu .... tammudiki ;)

    ReplyDelete
  2. హాప్పీ హాప్పీ బర్త్డే తమ్ముడికి

    ReplyDelete
  3. చిరంజీవి భరత్ కు జన్మదిన శుభాకాంక్షలు...

    ReplyDelete
  4. తమ్మునికి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. హాప్పీ హాప్పీ బర్త్డే మీ తమ్మునికి! !

    ReplyDelete
  6. భరత్ @ భారత్ గారు జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  7. భరత్ కు జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. మరి నా తరపు నుండి కూడా....హ్యాపీ బర్త్ డే:)

    ReplyDelete
  9. భరత్ జన్మదిన శుభాకాంక్షలు.

    "ఒరేయ్ భరత్" ఎంటండి ఈ దౌర్జన్యం... పుట్టిన రోజు అప్పుడు అయిన ఒరేయ్ అనటం మానచ్చుగా.
    ....
    ... ఇట్లు
    ఇద్దరు అక్కలచే "ఒరేయ్" అని పిలవబడుతున్న ఓ తమ్ముడు

    ReplyDelete
  10. మధురవాణి గారు! మీ తమ్ముడికి నా తరుపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి.
    ఒక రోజు లేటుగా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు.

    ReplyDelete
  11. తమ్మునికి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  12. మీ తమ్ముడికి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు.. :) ఇలా ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

    ReplyDelete
  13. హలో మధు గారు .. జూలై లో ఇన్ని టపాలు ఎప్పుడు పెట్టేసారండీ!!!?? నేను ఫాలో అవుతున్నానే !!! జూలై లో పెట్టిన అన్ని టపాలు ఇప్పుడే చూస్తున్నా.. ఎలా మిస్ అయ్యానబ్బా ??!!
    పోనీ లెండి .. నాకు మాత్రం వర్షం కోసం ఎదురు చూసి చూసి నిరాశపడ్డ రైతు మీద ఒకేసారి కుంభవృష్టి గా వర్షం పడ్డట్టు అయింది.. ఆ టపాలు అన్నీ చదువుతుంటే ఎం కామెంట్ పెట్టాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోయాను .. అసలు ఇంత రచనా చాతుర్యం ఎక్కడ నేర్చుకున్నారండి?? తక్కువ పొగిడానని ఫీల్ అవ్వకండి.. ఇంకా ఎక్కువే పొగడాలని వుంది . కాని మాటలు రావటం లేదు అంతే. మీకు తెలిసిన ఓ 7 , 8 పొగడ్తలు మీరే పోగిడేసుకోండి ప్లీజ్ ..

    నా కొత్త బ్లాగ్ ఇంకా లేట్ అవుతుంది.. సరే గాని, మీ టపా లో ఎమోటికాన్స్ ఎలా పెడుతున్నారు?

    మరిచే పోయాను.. మీ భారత్ కి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి .....

    ....హరీష్

    ReplyDelete
  14. మీ భారత్ కి జన్మదిన శుభాకాంక్షలు!:)

    ReplyDelete
  15. na peru, mee tammudi peru okate. na peru bharath nunepalli. Many happy returns to bharath...

    ReplyDelete
  16. many many happy returns of the day to your brother

    ReplyDelete
  17. హ్యాపీ హ్యాపీ బర్త్ డే మీ తమ్మునికి! ! పార్టీ బిల్ల్ మీకు...ok నా మధుర గారు

    ReplyDelete
  18. @ హరేకృష్ణ, సుజ్జీ, మాలా కుమార్, రాధిక (నాని), శ్రీలలిత, చిలమకూరు విజయమోహన్, మందాకినీ, నాగార్జున,
    చైతన్య.ఎస్, శిశిర, పద్మార్పిత, కౌండిన్య, సవ్వడి, రాజి, అపర్ణ, హరీష్, అమ్మ ఒడి, భరత్, దివ్య వాని, శివరంజని,

    చాలా సంతోషంగా ఉంది. ఇంత ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు నా తరపునా, తమ్ముడి తరపున కూడా! :)

    ReplyDelete
  19. @ కౌండిన్య,
    హహ్హహ్హా.. దౌర్జన్యం అంటారా? మా తరవాత పుట్టిన మిమ్మల్ని ఒరేయ్ తమ్ముడూ అని పిలవడం మా జన్మ హక్కండీ! ఎందుకంటే ముద్ను పుట్టినందుకేగా ఆ ఛాన్స్ వచ్చింది :-D
    ఈ జన్మకి ఇలా సరిపెట్టుకోవాల్సిందే మీరు. ;-)

    @ శివరంజని,
    ఏంటండీ అంటారూ.. పార్టీ బిల్ మీకు పంపించమంటారా? ఎంతటి సహృదయమండీ మీది! అలాగలాగే.. పంపిస్తానులెండి ;-) :-D

    ReplyDelete
  20. @ హరీష్,
    మీరేదో రీసెర్చ్ పనిలో పడిపోయి చూసి ఉండరులెండి. ;-) అయినా, నా బ్లాగు ఇక్కడే ఉంటుందిగా ఎప్పుడైనా చదవచ్చు. :-) ఏదో మీ అభిమానం కొద్దీ మీకలా అనిపిస్తుంది గానీ అంత రచనా చాతుర్యం ఏమీ లేదండీ నా దగ్గర. అసలు మీరేమో గానీ మీ అభిమానానికి నేను ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. చాలా ధన్యవాదాలండీ! :-) ఆ ఎమోటైకాన్స్ మన బ్లాగుల్లో ఎవరో ఒకసారి చెప్పారండీ ఫైరుఫాక్సు లో ఎలా పెట్టాలి అని. ఇప్పుడా బ్లాగు పని చెయ్యట్లేదు గానీ ఆ టిప్ ప్రకారం నేను అప్పుడు పెట్టిన సెట్టింగ్స్ అలా పని చేస్తూ ఉన్నాయి.

    ReplyDelete
  21. belated wishes: happy b'day 2 ur little brother :-)

    ఏంటి మధుర,మీరు నన్ను పిలువకుండానే మీ తమ్ముడి b'day party చేసేసుకున్నారు అన్యాయం :-(

    ReplyDelete
  22. @ రాధికా,
    విషెస్ చెప్పాం అంతే.. ఇంకా పార్టీ అయిపోలేదు. వచ్చేయ్ తొందరగా! :-)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!