Wednesday, July 07, 2010

మిస్ 'పనిమంతురాలు' - 2

నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎంతటి పనిమంతురాలినో ఇదివరకే చెప్పానుగా! ఆ దొండకాయల ప్రహసనం జరిగినప్పుడు నాకు పదకొండేళ్ళు, ఎనిమిదో తరగతిలో ఉన్నా. ఆ తరవాత తొమ్మిదో తరగతిలోకొచ్చాక ఒక రోజు నాకో చిత్రమైన కోరిక పుట్టింది. ఎలా అయినా సరే నేనే స్వయంగా ఒక కూర చేసేసి ఇంట్లో అందరి చేతా వాహ్వా వాహ్వా అనిపించుకోవాలి అని. అలా అనుకున్నదే తడవుగా మా అమ్మ దగ్గరికెళ్ళి నా కోరిక గురించి చెప్పాను. "ఎందుకులేమ్మా.. ఇప్పుడేదో రోజులు బాగానే గడుస్తున్నాయి. ఏదో నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. నువ్వు వంట చేయడం ఎందుకులే! పైగా రాజు గారి హుకుం ఒకటి ఉందిగా" అంటూ నన్ను వారించే ప్రయత్నం చేసింది. కానీ, మండే సూర్యుడిని ఎవరూ అరచేతితో ఆపలేరన్నట్టు వంట చేయాలనే నా తృష్ణని మా అమ్మ ఆపలేకపోయింది. నేను చేసి తీరాల్సిందే అని పట్టుబట్టడం వల్ల నా ధృడసంకల్పాన్ని సహృదయంతో అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి చివరికి సరే అంది. అప్పుడు ఏం కూర చెయ్యాలా అనిsoal ఒక రెండ్రోజులు పగలనకా రాత్రనకా తీవ్రంగా ఆలోచించగా చించగా ఓ ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఏదో కూర చేయడం ఎందుకు.. అదేదో నాకిష్టమైన బెండకాయ కూర చేస్తే పోలా.. అని. jelir

సరే.. ఇంక అప్పుడు 'బెండకాయ కూర ప్రాజెక్టు' మొదలెట్టాను. అమ్మ వెళ్లి బెండకాయలు కొనుక్కొచ్చి ఇస్తానంది. ఏవీ అక్కర్లేదు.. నేనే స్వయంగా కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకుంటాను. మళ్ళీ తరవాత నువ్వే సగం పని చేసావని సగం క్రెడిట్ నీకొచ్చేస్తుంది. కాబట్టి అలా ఒప్పుకోనని చెప్పా.takbole "సర్లే అయితే, లేత బెండకాయలు అరకిలో తీసుకురా.. చివరలు విరిచి చూడు.." అంటూ ఎలా ఎంచుకోవాలో చెప్పింది అమ్మ. అసలే ఏకసంథాగ్రాహిని కదా.. అమ్మ చెప్పినట్టు తు.చ తప్పకుండా పాటించి కేవలం ఒక గంట సేపట్లోనే అరకిలో లేత బెండకాయలు ఎంచుకుని తీస్కొచ్చుకున్నా! ఇంటికి రాగానే అమ్మ అంది "బెండకాయలు కొనుక్కొచ్చావా.. లేకపోతే స్వయంగా సాగు చేసి పండించి తెచ్చావా.." అని. కానీ, గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళందరినీ ప్రజలు ఇలాగే అంటుంటారు కాబట్టి ఇలాంటి మాటలు పట్టించుకోకూడదని సర్ది చెప్పుకుని నా పనిలో నేను నిమగ్నమయ్యాను. నేను బెండకాయలు ఎలా కోసాను అనే అంకం మీకిప్పుడు వివరించబోవట్లేదు ఎందుకంటే, నేను కూరగాయలు కోసే టెక్నిక్ ని మీరు ఇదివరకే తెలుసుకుని ఉన్నారు కాబట్టి.sengihnampakgigi అలాగే పాపం ఏడుస్తూ ఏడుస్తూ ఉల్లిపాయ కూడా తరిగాను.sedih పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ సిద్దం చేసుకున్నాను. అమ్మ పక్కన నించుని చూస్తాను అంది. ఆహా..ఆశ దోశ అప్పడం.. అదేం కుదరదు.. నా ఫార్ములా కాపీ కొట్టేసి రేపటినుంచి నువ్వు ప్రపంచ ప్రసిద్ధ కుక్ వి అయిపోదామనేగా! నో.. కుదరదు అని ఖరాఖండీగా చెప్పేసి వంటగది గుమ్మం దాటి లోపలికి రానీలేదు. మనలో మన మాట... అసలు కాపీ కొట్టింది నేను. రోజూ అమ్మ చేస్తుంటే పక్కన తిరుగుతూ చూసి నేర్చుకున్న ఫార్ములానే నేను ఫాలో అయింది కూడా! ష్.. యీ మాట ఎక్కడా లీక్ చేయకండి.kenyit

ఒక్కటి కూడా మర్చిపోకుండా అవసరమైనవన్నీ వేసి ప్రతీ క్షణం కలియబెడుతూ మొత్తానికి కూర పూర్తి చేసాను. ఇంక నాన్న ఎప్పుడొస్తారా అని గేటు దగ్గర నిలబడి కాలు కాలిన పిల్లిలా ఒకటే తిరుగుతూనే ఉన్నాను. " ఇవ్వాళ నువ్వు వంట చేసావని గేటు దగ్గరున్నప్పుడే తెలుసుకోలేరు కదా మీ నాన్న. కాబట్టి, అక్కడి దాకా వచ్చినాయన ఇంట్లోకి రాకుండా వెనక్కి పారిపోయే అవకాశం లేదు గానీ నువ్వు లోపలి రా" అంటూ అమ్మ పిల్చినా గానీ కోపంగా ఓ చూపు చూసి మళ్ళీ గేటు దగ్గర పచార్లు చేయడం కొనసాగించాను. మొత్తానికి ఎప్పటికో నాన్నొచ్చారు. గేటు దగ్గరినుంచే నేనెంత కష్టపడి బెండకాయ కూర చేసానో హరికథ వినిపించేశాను. నిజానికి మా నాన్నకి బెండకాయ కూరంటే పెద్దగా ఇష్టముండదు. కానీ, ఆ రోజు నేను చేశాను కాబట్టి "ఆహహా..అబ్బో.. ఏం రుచి ఏం రుచి.. అమోఘం.. అద్భుతం.. అమృతంలా ఉంది. అసలు నా బిడ్డ ఎంత రుచిగా చేసింది కూర. ఇన్నేళ్లల్లో నువ్వెప్పుడైనా ఇలా చేసావా అసలు.. నా కూతురి దగ్గర నువ్వు ట్రైనింగ్ తీస్కోవాలి.." అంటూ అమ్మతో చెప్తూ నన్ను తెగ పొగిడేశారు నాన్న. దానికి అమ్మేమో " నిజమే.. అందుకే రేపటి నుంచి మీ రాకుమారి వంట చేసి పెడుతుంది.. మీరు తిని పెట్టండి. నేను ఊరికే కూర్చుని ప్రేక్షకురాలిలాగా చూస్తూ ఉంటాను" అంది. నాన్నలా పొగిడేసరికి నేను దాదాపు మేఘాల దాకా వెళ్లి కాసేపు ఆకాశ విహారం చేసి మళ్ళీ భూమ్మీదకొచ్చాను.angelmenari "నిజంగా బాగుందా నాన్నా.. నిజంగా బాగా చేశానా.." అని ఓ వంద సార్లన్నా అడిగుంటాను ఆ రోజు. చాలాసేపటి తరవాత నాన్న " నిజంగా బ్రహ్మాండంగా చేశావమ్మా.. అద్భుతం అనుకో.. కాకపోతే ఓ చిన్నమాట! ఇప్పుడు మనం అన్నం తిన్నాక మనింట్లో వాళ్ళందరి చేతులూ రెండ్రోజుల దాకా ఇలా పసుప్పచ్చగా ఉంటే బాగోదు కదా! అందుకని, కొంచెం.. ఒక్క రవ్వ పసుపు తగ్గించు ఈసారి. సరేనా! అప్పుడింకా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నీ వంటకి తిరుగే లేదింక.." అన్నారు.tumbukgigil

ఇది జరిగిన కొన్నాళ్ళ తరువాత ఒక రోజు సాయంత్రం నన్నొక్కదాన్నే ఇంట్లో వదిలి అమ్మా, నాన్నా ఇద్దరూ కలిసి సరుకులు తీసుకురావడానికి పక్కనుండే టౌనుకి వెళ్ళారు. వెళ్లేముందే నా కోసం అన్నం, కూర సిద్ధం చేసి వెళ్ళింది అమ్మ. ఆ రోజు గురువారం కాబట్టి వాళ్ళిద్దరూ అన్నం తినకుండా ఏదో ఒక టిఫిను తింటారు. తిరిగొచ్చాక ఏదోకటి చేస్కోవచ్చులే అనుకుని వాళ్ళు బజారుకి వెళ్ళిపోయారు.అప్పుడే నాకో మహత్తరమైన ఆలోచన వచ్చింది.rindu అదేంటంటే.. నా పాక శాస్త్ర ప్రావీణ్యం చూపించడానికి ఇదే సదవకాశం అని. వాళ్ళకోసం ఏం టిఫిను చేద్దామా అని ఆలోచించాను. ఇడ్లీలు, దోసెలు ఎలాగూ ఇప్పటికిప్పుడు చేయలేను, పూరీలు, చపాతీల్లాంటివి చేయడం మరీ రిస్కు. అందుకని బాగా ఆలోచించి ఉప్మా చేద్దామని డిసైడైపోయా. వంటగదిలో కెళ్ళి చూడగానే ఉప్మారవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పల్లీలు, అల్లం.. మొదలైనవన్నీ తేలికగానే దొరికేసాయి. ఇంకేముందీ.. అమ్మ చేస్తుంటే చూసిన అనుభవాన్ని ఉపయోగించుకుని చిటికెలో (అంటే ఓ అరగంటనుకోండి) ఉప్మా చేసేసా!

అమ్మావాళ్ళు బజారు నుంచి వచ్చీరాగానే నేను ప్లేట్లలో వేడి వేడి ఉప్మా పెట్టిచ్చేసరికి చాలా థ్రిల్లయిపోయారు. వాళ్ళకోసం నేనింత ప్రేమగా చేసిపెట్టానని మా అమ్మకయితే ఉప్మా తినకుండానే కడుపు నిండిపోయింది. అంచేత ఏదో కొంచెం తిన్నాననిపించింది. నాన్న మాత్రం నేనేదో పంచభక్ష్య పరమాన్నాలు వండిపెట్టినంత సంబరపడిపోయి పుత్రికోత్సాహంతో చాలానే తినేశారు. నాన్న నన్నెలా పొగిడారని మళ్ళీ చెప్పక్కర్లేదుగా మీకు!jelir ఆ తరువాత ఓ గంటకి అందరం పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఎప్పట్లాగే యీ ఉప్మా చేయడం అనే ఘనకార్యాన్ని నేనెంత ఇదిగా చేశాను అనే అంశం గురించి కథలు కథలుగా వర్ణిస్తున్నా వాళ్ళిద్దరికీ! ఇంతలో "ఏంటో ఉప్మా మరీ ఎక్కువ తిన్నట్టున్నా! కొంచెం కడుపులో మంటగా అనిపిస్తోంది" అన్నారు నాన్న. నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా వంటగదిలో ఏ వస్తువుని ఎక్కడి నుంచి దొరకబుచ్చుకున్నాను అని వివరంగా చెప్తున్నా అమ్మకి. ఇంతలో అమ్మ గబుక్కున అరిచింది "ఏంటీ.. ఆ సీసాలో ఉన్న రవ్వతో చేశావా ఉప్మా! నాకప్పుడే అనుమానమొచ్చింది ఏంటా ఉప్మా వాసనేదో కొంచెం తేడాగా ఉందని.. అది ఉప్మారవ్వ కాదే తల్లీ.. ఇడ్లీ రవ్వ" అంటూ. అయ్యో.. అందుకేనేమో పాపం నాన్నకి కడుపులో మంట వస్తోంది అనుకున్నాం. అదృష్టం ఏంటంటే, కొంచెం మంచినీళ్ళు తాగి పడుకున్నాక కడుపులో మంట తగ్గిపోయింది. ఇంతకీ ఇందుమూలంగా తెలిసిన తాత్పర్యం ఏమిటయ్యా అంటే... ఇడ్లీ రవ్వతో కూడా ఉప్మా చేసుకోవచ్చు అని. నోట్ దిస్ పాయింట్!encem

ఆ తరవాత చదువుల కోసం హాస్టళ్ళు పట్టుకు వేలాడటం, వాళ్ళు పెట్టిన గడ్డి తింటూ బతకడం, అడపాదడపా దోశెలు పోయడం, మ్యాగీ నూడుల్స్ చేస్కోడం తప్పించి చేతులు కాల్చుకునే అవసరమూ, అవకాశమూ రెండూ రాలేదు. మళ్ళీ అయిదేళ్ళ క్రితం జర్మనీ వచ్చిన దగ్గర నుంచీ స్వయంపాకం చేస్కోవాల్సిన అవసరమొచ్చి పడింది. ఉద్యోగంతో పాటు అంట్లు తోముకోడం, మార్కెట్ నుంచి సామాన్లు తెచ్చుకోడం, ఇల్లు శుభ్రం చేస్కోడం లాంటి పనులన్నీ నేనే చేస్కోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పుడు నా ఒక్కదాని కోసం వండుకోడమే కాకుండా స్నేహితుల కోసం కూడా రకరకాలు వండిపెడుతూ ఆ ఫోటోలు చూపిస్తే ఇంట్లో అందరూ చాలా ఆశ్చర్యపోతుంటారు. అమ్మకి కూడా కొన్ని కొత్త వంటలు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడూ. ఇంటికెళ్ళినప్పుడు వండిపెడతానంటే మా అమ్మ అసలు ఒప్పుకోదు. అక్కడ రోజూ పని చేసుకోక తప్పదు కదా.. ఇంటికొచ్చినప్పుడు కూడా ఎందుకు. హాయిగా రెస్ట్ తీసుకో అంటుంది. అమ్మప్రేమంటే అదేగా మరి!lovecium

కొసమెరుపేంటంటే, ఒకసారి నేను మా అమ్మని అడిగాను. "అమ్మా.. నేనెప్పుడూ మనింట్లో వంట చేయలేదు కదా.. నేర్చుకునే ప్రయత్నం కూడా పెద్దగా చేయలేదు. అలా దేశం కాని దేశం వెళ్ళాక వంట గురించి ఏం ఇబ్బందులు పడతానో అని నీకెప్పుడూ అనిపించలేదా.. చాలామంది స్నేహితుల వాళ్ళ అమ్మలు చాలా గాభరా పడతారు, ట్రైనింగ్ కూడా ఇచ్చి పంపిస్తుంటారు. నువ్వేంటి ఆ విషయం గురించి నాకెప్పుడూ ఏమీ చెప్పలేదు" అని. దానికి మా అమ్మ నవ్వి "నువ్వు దొంగమొహందానివని నాకు తెలుసు. ఎప్పుడూ చెయ్యవు గానీ, నువ్వే పనైనా యిట్టే చేయగలవు. పనిమాలా నీకే పనీ నేర్పించాల్సిన అవసరం లేదని నాకెప్పుడో తెలుసు. అందుకే నేనెప్పుడూ వంట విషయంలో నీ గురించి బెంగ పెట్టుకోలేదు. సలహాలు కూడా ఇవ్వలేదు" అని చెప్పింది. స్వయంగా మా అమ్మే అంత గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాక ఇంక నా పనితనం గురించి... ఎనీ డౌట్స్!?encemsengihnampakgigi

30 comments:

  1. నేనేదో పంచభక్ష్య పరమాన్నాలు వండిపెట్టినంత సంబరపడిపోయి పుత్రికోత్సాహంతో చాలానే తినేశారు.
    ఇది సూపర్
    sequel kooda సూపర్ హిట్

    ReplyDelete
  2. అమ్మాయా ..నీ పనితనానికి ఆనందంతో కళ్ళు చమరుస్తున్నై అనుకో..
    బెండకాయ కురేసుకొని ఉప్మా తిన్నట్టుంది అనుకో .. !!

    ReplyDelete
  3. కాకపోతే ఓ చిన్నమాట! ఇప్పుడు మనం అన్నం తిన్నాక మనింట్లో వాళ్ళందరి చేతులూ రెండ్రోజుల దాకా ఇలా పసుప్పచ్చగా ఉంటే బాగోదు కదా! అందుకని, కొంచెం.. ఒక్క రవ్వ పసుపు తగ్గించు సారి.:):):)కేకో ...కేక .
    మదురవాణీ గారు,మీ అమ్మగారు నిజమే చెప్పారు.రొజూ వంట చేయకపోనా సరే చూసినా వచ్చేస్తుంది.ఐతే మీరు అక్కడికి వెళ్ళాక పాకశాస్త్ర ప్రవీణురాలై పోయారనమాట.ఇడ్లీ రవ్వతో కూడా ఉప్మా చేయవచ్చని మా అందరికీ ఒక కొత్త విషయం చెప్పారండిమీరు.

    ReplyDelete
  4. Cheppukundaamannaa koodaa elaa alaa cheyyaalo teliyadu Naaku. Survival kosam chinnappude cheyyi chesukovaalsi vachhindi. Intlo aada dikku nene kadaa. chaduvuthunte kullu puduthondi.

    Anduke irugu dishti, porugu dishti...
    migathadi chadiveyandi.

    ReplyDelete
  5. ఆద్యంతం చాలా ఫన్నీగా రాసారు..క్రితం టపా కూడా చదివానిప్పుడే..చాలా బాగుంది..
    మొత్తానికి ఇప్పుడన్ని వంటలూ మీకు కొట్టిన పిండే అంటారు..అంతేనా! ఏది ఒక మారు మీరు చేసిన ఉప్మాని ఫోటో తీసి పెట్టండి!! :-)

    ReplyDelete
  6. మీకు ఒక విషయం తెలుసా మీ రాశి వారు వంట బ్రహ్మాండంగా చేస్తారు. అందుకే ఇతరులు చేసేవి నచ్చవు.
    బాగా రాసారు.

    ReplyDelete
  7. మొత్తానిక్ పని మంతురాలివి ఐనావన్నమాట . బాగుంది .

    ReplyDelete
  8. మీ నాన్నగారి మెచ్చుకోలుఅ అధ్బుతం అండి
    >>అన్నం తిన్నాక మనింట్లో వాళ్ళందరి చేతులూ రెండ్రోజుల దాకా ఇలా పసుప్పచ్చగా ఉంటే బాగోదు కదా! అందుకని, కొంచెం.. ఒక్క రవ్వ పసుపు తగ్గించు ఈసారి. సరేనా! అప్పుడింకా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నీ వంటకి తిరుగే లేదింక..<< హ హహ్హ

    అవునూ ఇడ్లీ రవ్వతో ఉప్మాచేయవచ్చును మరి ఉప్మా రవ్వతో ఇడ్లీలు చేయవచ్చునా...మీ పనితనాన్ని ఉపయోగించి నా సందేహం తీర్చరూ ప్లీజ్..

    ReplyDelete
  9. మీ టపా చూస్తుంటే నాకు మా అమ్మాయే గుర్తొచ్చింది. చిన్నప్పుడు వంటింటి వైపు తొంగి కూడా చూసేది కాదు. వాళ్ళ డాడీ వెనకాలే అన్నం తినేసి, చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయేది. నేను కూడా ఏమీ చెప్పలేదు. పెళ్ళయ్యాక ఎన్ని నేర్చుకుందో. ఇప్పుడు తనని చూస్తే నాకెంత ఆశ్చర్యమేస్తుందో. పిల్లలని అలాగే పెంచాలని నాకు అనిపిస్తుంది. " నాకు వంట చెప్పకపోవడం వల్ల అన్నీ ఇప్పటికి నేర్చుకున్నాను. చిన్నప్పుడు వంట ఎందుకు నేర్పలేదు?" అనడిగింది మొన్న. అందుకు ఒక కారణం అందరు కూతుళ్ళ లాగే తను కూడా వాళ్ల డాడీ కి బంగారు తల్లి అవడం. అది కాకుండా నేను అనుకుంటున్న దేమిటంటే, ఈ వంటా, వార్పూ, బాధ్యతలూ, భవసాగరాలూ ఇవన్నీ పెద్దయ్యాక ఎలాగూ తప్పవు. కాని అలాంటప్పుడు మనసు అలసిపోయినప్పుడు ఒక్కసారి బాల్యాన్ని గుర్తుచేసుకుని, అమ్మా, నాన్నల గారాన్ని, అప్పుడు అనుభవించిన దర్జానీ తలచుకున్నప్పుడు అది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది, అటువంటి టానిక్ ఎవరికైనా కావలసి వుంటుంది. అందుకనే ఆ బంగారు బాల్యాల ఙ్ఞాపకాల కోసమే పనులేమీ నేర్పించలేదని చెప్పాను. మరి నేను చేసిన పని సరయినదో కాదో నాకే తెలీదు.

    ReplyDelete
  10. మధురవాణి గారూ మీ పనులు చూస్తుంటే నాకు మా చెల్లి పనులే గుర్తొస్తున్నాయండీ.తనూ అంతే ఏ పనీ చేయదు కానీ చేసిందంటే ఆ పనికి తిరుగుండదు.

    ReplyDelete
  11. అదేదో సినిమాలో పాట అంతా పాడీ ఆఖరు లో "అప్పుడు నా వయసైదేళ్ళూ ఆ వచ్చినది మా నాన్నారు" అని పాడినట్లు నెమ్మది గా రిలీజ్ చేసారా అప్పుడు నేను ఎనిమిది అని. బాగుంది. మొత్తానికి కధ చివరలో పనిమంతురాలై పోయారు ఐతే..

    ReplyDelete
  12. సూపర్ గా రాసారు మీ రెండు సాహస ప్రాజెక్టులు.
    శ్రీ లలిత గారు: అయితే అమ్మాయిలంతా ఇలా పెళ్ళయ్యాక చేసుకున్నోళ్ళమీద ప్రయోగాలు చేసి పెర్ఫెక్ట్ అవుతారన్నమాట!!!!!

    ReplyDelete
  13. మధురవాణీ డోంట్ వర్రీ! పెళ్ళి అయిందంటే అన్ని తిక్కలూ కుదురుతాయి.నాకలాగే కుదిరాయి. పెళ్ళికి ముందు కుక్కర్ మూతకి గాస్కెట్ ఉంటుందని కూడా తెలీదు. ఇప్పుడు (అంటే..పుష్కరమవుతోందనుకోండి పెళ్ళయి)కుక్కర్లో వంటలు అని ఒక పుస్తకం రాసేయగలను. వంట ఒక పెద్ద బాధ్యత బెడదకానే కాదు.

    ఇంటిని ఎప్పటికప్పుడు నీట్ గా అప్ డేట్ గా ఉంచుకోవడం కొంచెం కష్టం!పిల్లలొచ్చాక మరీ! అదొక్కటీ ప్రాక్టీస్ చేయి చాలు!

    కానీ ఎందుకో పాపం ఆ అబ్బాయి మీద ఒక పక్క మనసులో గాఢంగా జాలేస్తోందోయ్!

    ReplyDelete
  14. Nice funny blog.. I waited for the sequel to finish before I wrote some thing. You received cool comments.

    Wow.. my kind of daddy.. I understand his emotions..

    Anyways..Alls well that tastes well in the end, I guess..

    I too whip-up some prized dishes which started purely as a survival instinct....

    I keep experimenting with unconvensional stuff.. Salads.. sometimes to my mother's surprise/disgust/nausea... Yuckie... ఇదేంట్రా.. ఇదేదో పచ్చి కాకరకాయ పచ్చడి లా ఉందీ.. అంటుంది ...

    Hahhhaaa.. Still.. when it comes to cooking, practice makes one perfect.

    Nice read, Girlie.. It stirred nostalgia.. Keep going..!!

    All the best.. !!

    ReplyDelete
  15. మీరు మిస్ 'పని'మంతురాలు కాదు...మిస్ 'హనుమంతు'రాలు ....!!!

    ReplyDelete
  16. సుజాతగారు చెప్పింది నిజమే, పెళ్ళి అయితే తిక్కలన్నీ కుదురుతాయి. ఆవిడ చెప్పినట్టు నాకూ కుక్కర్ కి గ్యాస్ కట్టు ఉంటుందని చాలా యేళ్ళ వరకు తెలెదు :P

    నేనిలాగే ఓసారి మైదాపిండి దోస వేసా...ఆ experiment లో తేలినదేమంటే, మైదాపిండితో దోస వేస్తే పెనం కి అంటుకుని రాదు అని :D

    ReplyDelete
  17. పైన ఎవరికో డవుటొచ్చింది ఉప్మా రవ్వతో ఇడ్లీ చేస్తారా అని.. చేస్తారు ..బ్రహ్మాండం గా చేస్తారు.. మొన్న ఇడ్లీ రవ్వ కాసింత తక్కువయ్యింది అని ఉప్ప్మ రవ్వ కలిపేసి మరీ ఇడ్లీ చేసా ..మధురా ఎలాగైనా నువ్వు నేనూ ఒక జట్టు :)

    ReplyDelete
  18. బాగుంది అండి మీ టపా! మా ఇంటిలో కూడా చిన్నప్పుడు నాకు , మా అక్క కి అమ్మ అసలు పనే చెప్పేది కాదు. తెగ గారాబం అన్న మాట! మా బావ గారిని చూసి తెగ జాలి వేస్తుంది అనుకోండి ఇప్పుడు, ఏ ఫంక్షన్ అయినా ఆయన కే వంట ఇంటి తిప్పలు.
    కానీ చిన్నప్పుడు నుండే ఆడ , మగ పిల్లలకి అన్ని పనులు నేర్పాలి అండి. ఒకానొక సమయం లో మా ఇంటిలో మూడు నెలలు వరస పెట్టి నేను వండా ! అప్పటి వరకు వంట ఇంటి ముఖం తెలియని నేను అమ్మ ఇచ్చే డైరెక్షన్ల తో.. కొంచెం ఇబ్బందే !
    ఒక సారి, పిండి ఒడియాలు కూర చేసా! అమ్మ నాన్న గారు తెగ మెచ్చుకున్నారు. అమ్మ తో ఇంకా ఎలా వుంది, ఎలా వుంది అని అడిగి మురిసిపోతున్నాను. ఇంతలో నాన్న గారు పెరటి వైపు వెళ్లి వాంతులు :(
    ఏమి చెప్పుతాము !

    ReplyDelete
  19. @ హరే కృష్ణ,
    మరి పుత్రికోత్సాహం అలానే ఉంటుందండీ! ;-) క్రమం తప్పకుండా నా పోస్టులు చదువుతూ మీ ప్రోత్సాహాన్ని అందజేస్తున్నందుకు ధన్యవాదాలు! :-)

    @ భాస్కర రామిరెడ్డి ,
    థాంక్సండీ! :-)

    @ సుజ్జీ,
    అదీ నేను వండిన పసుపెక్కువైన బెండకాయ కూరలో ఇడ్లీ రవ్వతో చేసిన ఉప్మా వేసుకు తిన్నట్టేనా నీకనిపిస్తోంది!? ;-)

    @ రాధిక (నాని)
    నిజంగా పసుపు విషయం అలానే చేశానండీ! :P మరీ అంత పాకశాస్త్ర ప్రావీణ్యం వచ్చిందని కాదు గానీ, ఇప్పుడు పర్లేదండి. ఇహ ఇద్లీరవ్వతో ఉప్మా అమ్ల్లీ ఎప్పుడూ ట్రై చేసి చూడలేదండి. మీరే చెప్పాలి ఇంకా విషయం! ;-)

    @ Srujana Ramanujan ,
    దిష్టి కూడా తీసినందుకు థాంక్స్ :-) మేము చిన్నప్పుడు చూపించిన పనితనమంతా మీరిప్పుడు గీతాచార్య గారి దగ్గర చూపించండి. ముచ్చట తీరినట్టుంటుంది. ;-)

    @ శేఖర్ పెద్దగోపు,
    థాంక్సండీ! ఇంత పనితనం ఉందని చెప్పాక కూడా మీరు ఋజువులు అవీ అడక్కూడదన్నమాట! ;-)

    ReplyDelete
  20. @ నీహారిక,
    అవునాండీ.. ఈ విషయం నీకు తెలీదు ఇప్పటి దాకా.. Interesting! థాంక్సండీ! :-)

    @ మాలా కుమార్,
    అవునండీ.. ఏదో కొంతవరకూ నయమే ప్రస్తుతానికయితే! :-)

    @ నాగార్జున,
    మీరు ఊరికే సరదాకే అడిగినా గానే, ఉప్మారవ్వతో నిజంగానే ఇడ్లీలు చేసుకో వచ్చండీ.. అదికూడా instant ఇడ్లీలు. ఉప్మారవ్వలో పుల్లటి పెరుగు కలిపి, కాస్త ఉప్పు, బేకింగ్ సోడా, నీళ్ళు కూడా కలిపి దానితో ఇడ్లీలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే వేడి తగ్గాక కొంచెం గట్టిగా అయిపోతాయి. ఇది కనిపెట్టింది నేను కాదు కాబట్టి మీరు ధైర్యంగా ఫాలో అయిపోవచ్చు. మా అమ్మ చెప్పింది ఈ రెసిపీ. నేను కూడా ట్రై చేసాను. అప్పటికప్పుడు ఇడ్లీ తినాలనిపిస్తే సింపుల్ గా అలా చేస్కోవచ్చు. నేస్తం గారు కూడా ఉప్మారవ్వ వాడచ్చు అన్నారు. ఓసారి చూడండి. :-)

    @ శ్రీలలిత,
    మీ ఆలోచన, మీరు చేసిన పనీ ఖచ్చితంగా సరైనవేనండీ! మా అమ్మ కూడా దాదాపు ఇలాగే ఆలోచిస్తుంది. అందుకే పెద్దగా ఏ పనులూ చేయించలేదు చిన్నప్పుడు. ఎలాగూ పెద్దయ్యాక చేస్కోక తప్పదు కదా అని. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. :-)

    @ రాజి,
    అయితే మీ చెల్లీ, నేనూ ఒకే జట్టన్నమాట! ;-)

    ReplyDelete
  21. @ భావన,
    అలా చెప్పానంటారా? స్కూల్లో ఉన్నప్పుడు అని చెప్పినట్టున్నానే! హా.. అయినా అప్పుడైనా, ఇప్పుడైనా మనం (అంటే నేను ;-) గొప్ప పనిమంతులమా కాదా అనేదే కదండీ ప్రశ్న! ;-) :-D

    @3g,
    ధన్యవాదాలండీ! మీరు చెప్పిన పాయింటు మాత్రం కేక! మరంతే కదండీ.. ఎవరో ఒకళ్ళ మీద ప్రయోగాలు చేస్తేనే కదా పని వచ్చేది! ఏరికోరి చేసుకున్నప్పుడు ఆ మాత్రం ప్రయోగాలు తట్టుకోవాలి కదా మరి! :-) :-)

    @ సుజాత,
    నిజమేనండీ మీరు చెప్పింది. :-) ఇల్లు నీట్ గా సర్ది ఉంచుకోడం.. అనేది చెప్పడానికి ఒక వాక్యం చాలు గానీ.. హమ్మో అదెంత కష్టమైన పనో! అందులో కనీసం ఒక PhD అయినా చేయాల్సినంత అవసరం ఉంది నాకైతే!
    పాపం.. గాఢంగా జాలేస్తుందంటారా? హేవిటో.. ఎవరో ఒకళ్ళు ఇలా త్యాగాలు చేయకపోతే ఎలా చెప్పండి. అయినా, కష్టాలు మగాళ్ళకి కాకపోతే మానులకొస్తాయా!? ;-) :-D

    @coolvivek,
    హమ్మో.. కాకరగాయ పచ్చడా.. :-o మీరన్నట్టు నిజంగా వంట విషయంలో Practice makes us perfect ! అయితే, మీరూ మా నాన్నలానే అన్నమాట! And.. thanks a lot for your encouraging words! :-)

    @ sivaprasad nidamanuri ,
    ధన్యవాదాలండీ! :-)

    ReplyDelete
  22. @ santhosh reddy,
    మరీ పొగిడేస్తున్నారు. ఏదో మీ అభిమానం! ;-) నిజంగానే, ఇలాంటిది ఒక సామెత ఉంది తెలుసా మీకు.. "హమునంతుడి తమ్ముడు పనిమంతుడనీ.." అంటారు. ఎందుకంటే, మరి ఆయన్ని వెళ్లి చూసి రమ్మంటే ఏకంగా కాల్చి వచ్చారు కదా! ;-)

    @ సౌమ్య,
    కుక్కర్ కి గ్యాస్ కట్టు ఉంటుందని నాకెప్పుడో తెలుసుగా.. ఎందుకంటే, కళ్ళకి ఎప్పుడూ కనిపిస్తుండేది వంటగదిలో ;-) మీ మైదా పిండి ప్రయోగం బాగుంది. చాలా పెద్ద విషయం కనిపెట్టారు సుమండీ! :-D

    @ నేస్తం,
    ఆహా.. నేస్తం గారూ.. నన్నూ మీ జట్టులో చేర్చేసుకుంటే ఇంకేం కావాలి. సెలెబ్రిటీ ఇమేజ్ వచ్చేసినట్టే నాకు. హీ హీ హీ ;-) :-D

    @ కృష్ణ,
    అయితే మీ అక్క కూడా నాకు ఎదురొస్తారన్నమాట! పాపం.. మీ బావ గారూ! ;-) పాపం మీ వడియాల వంట ప్రయోగం కూడా వికటించిందన్నమాట! మీరు చెప్పింది చాలా నిజమండీ.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా కాస్తో కూస్తో వంట తెలిసుండాలి. అది మనకే చాలా ఉపయోగం. :-)

    ReplyDelete
  23. ముందుగా " మిస్ పనిమంతురాలు " కి నేను రాసిన కామెంట్ ని మీరు ఎంతో ఓపిగ్గా చదివి, దానికి జవాబు రాసినందుకు ధన్యవాదాలు. నన్ను అన్యథా భావించక సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. పని వత్తిడి లో పడి ఆలస్యంగా జవాబు రాస్తున్నాను.మీ బ్లాగ్ ని చూస్తేనే తెలుస్తోంది మీరు ఎంత sportive గా విషయాలను తీసుకుంటారో. మీరు రాసిన రెండవ భాగం "మిస్ పనిమంతురాలు -2 " కూడా చదివాను. ఆద్యంతం నవ్వుతూనే ఉన్నాను. కూతురికి మంచి పేరు వస్తే అది తల్లి గొప్పదనం, కొడుక్కి మంచి పేరు వస్తే అది తండ్రి గొప్పదనం అంటారు. అలా మీకు ఇంత మంది ఫాన్స్ ఉండడం, అందులోనూ అందరూ మిమ్మల్ని పోగిడే వాళ్ళే ఉండడం, మీరు ఇంత independent గా, మరొకరికి ఆదర్శంగా ఉండడం ఇన్ని మంచి లక్షణాలు మీలో ఉన్నాయంటే అది కేవలం మీ అమ్మగారి వల్లనే, ఆవిడ మీకు నేర్పిన పాఠాల వల్లనే అని చెప్పకనే మాకు తెలిసి పోతోంది. మరిన్ని మంచి బ్లాగులతో మమ్మల్ని కడుపుబ్బా నవ్వించాలని కోరుకుంటున్నాను.

    మీ శ్రేయోభిలాషి

    ReplyDelete
  24. @ అనానిమస్,
    శ్రేయోభిలాషి గారూ.. మీ ప్రశంసకు బహుధా కృతజ్ఞురాలిని. నా బ్లాగు పోస్టులు మీకు నచ్చుతున్నందుకు సంతోషంగా ఉంది.తప్పకుండా ఇక ముందు కూడా రాసే ప్రయత్నం చేస్తుంటాను. మరోసారి ధన్యవాదాలు! :-)

    ReplyDelete
  25. మధుర గారు!, మీ టపాలన్ని గత రెండు రోజులు గా చదివి పూర్తిచేసాను. మీ ఈ పనిమంతురాలు టపా చదివి అసలు ఒక రేంజి లో నవ్వాను అనుకోండి. ఇంకా మీ మామ కబుర్లు...అదేనండి చందమామ కబుర్లు, మీ బంగారం కబుర్లు మీ పూతోట కబుర్లు చాలా బాగా వ్రాసారండి. నేస్తం గారిలా మీ కబుర్లు బాగున్నాయి, అసలు మీ బ్లాగు హరే క్రృష్ణ గారి బ్లాగు ద్వార తెలిసింది.

    రఘురాం.

    ReplyDelete
  26. @ రఘురాం గారూ,
    చాలా సంతోషంగా ఉందండీ! మీరు నిజంగా చాలా గ్రేట్ సుమా! నా బ్లాగంతా రెండ్రోజుల్లో చదవాదమే కాకుండా, పోస్టుల పేర్లు గుర్తు పెట్టుకుని మరీ కామెంట్ పెట్టారు. మీరంత ఓపిగ్గా చదివినందుకు బోలెడన్ని ధన్యవాదాలు. నేస్తం గారితో పోలిస్తే అవార్డ్ వచ్చినట్టేనండీ! :)

    ReplyDelete
  27. Hello Madhu gaaru,

    Mee vanta praaveenyam chala baagundhi andi.. entha ayna mee deggara nerchukovalsina vishayam undhi.. I`m saying about upma....

    ReplyDelete
  28. @ అనుదీప్,
    హహ్హహ్హా.. అంతేనంటారా? థాంక్యూ! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!