Tuesday, June 01, 2010

నా కథ 'స్నేహ మౌక్తికం' 'కౌముది' పత్రిక జూన్ సంచికలో!

అప్పుడెపుడో 'ఆవృతం' అంటూ మొదటిసారి కథ రాసే ప్రయత్నం చేశాను కదా! ఇప్పుడు నేను రాసిన రెండో కథ 'స్నేహ మౌక్తికం', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'జూన్' సంచికలో ప్రచురితమైంది.

నా కథని ప్రచురించి, నాలాంటి కొత్తవారిని కూడా ప్రోత్సహిస్తున్న కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ గారికి, శ్రీమతి కాంతి కిరణ్ గారికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..
-- మధుర

37 comments:

  1. కథ చాలా బాగుందండి. అభినందనలు.

    ReplyDelete
  2. కథ బావుందండి.భాగస్వామి ఇష్టాయిష్టాలను గౌరవించే భార్యాభర్తల మధ్య ఏ అసంతృప్తులూ ఉండవు.

    ReplyDelete
  3. బాగుంది కథ. ఇన్నాళ్లకి ఫొటో కూడా ఛూశాను. అది కూడా బాగుంది.
    అభినందనలు.
    మాలతి

    ReplyDelete
  4. ఇప్పుడే చదివాను, కథ బావుంది వాణీ. ఇంకా చాలా కథలు రాస్తారని ఎదురుచూస్తుంటాను :)

    ReplyDelete
  5. కథ చాలా బాగుంది. మీరు నేరేట్ చేసిన తీరు చాలా కన్విన్సింగ్ గా ఉంది.. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవలసిన తీరు బాగా చెప్పారు .. :-)

    ReplyDelete
  6. మీ వాక్యనిర్మాణం బాగుంది. కథ చెప్పటంలో తప్పటడుగులు మాత్రం చాలానే వేశారు. వాతావరణ నివేదికతో కథని మొదలెట్టటం పెద్ద పొరపాటు. '... వాళ్లిద్దరూ ప్రియనేస్తులని తెలియజేస్తుంది' తరహా వివరాలు అనవసరం. రెండో పేరాలోని సంభాషణతో కథని మొదలెడితే మరింత ఆసక్తికరంగా ఉండేది. ఆ పేరా చదివిన పాఠకులు వాళ్లిద్దరూ ప్రియనేస్తాలని ఎటూ కనిపెట్టేస్తారు. మీరు అదే సంగతి మళ్లీ బల్లగుద్ది మొదటిపేరాలో చెప్పనవసరం లేదు.

    ఇంతకీ, కథ ముసుగులో మీ అభిప్రాయాలు రాసేశారు. ఇలాంటివి కథగా కన్నా వ్యాసాలుగా బాగుంటాయి.

    కౌముదిలో ప్రచురితమైనందుకు అభినందనలు.

    ReplyDelete
  7. మీ కధ,రాధిక గారి కధ ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి.

    ReplyDelete
  8. @ శిశిర,
    ధన్యవాదాలండీ! :-)

    @ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
    మంచి మాట చెప్పారు. ధన్యవాదాలండీ!

    @ మాలతి గారూ,
    మీరు బాగుందన్నారంటే పాసయిపోయినట్టే! ధన్యవాదాలండీ :-)

    @ శేఖర్ పెద్దగోపు, వెంకట్
    ధన్యవాదాలండీ! :-)

    @ రాణీ,
    ధన్యవాదాలండీ! తప్పక ప్రయత్నిస్తాను :-)

    @ Kishen Reddy,
    నా ప్రయత్నం మీకు నచ్చడం సంతోషంగా ఉంది. థాంక్స్ :-)

    @ అబ్రకదబ్ర,
    నా కథని చదవడమే కాకుండా ఓపిగ్గా సలహాలూ, సూచనలు అందించినందుకు ధన్యవాదాలండీ! ఇకపైన మీరు ప్రస్తావించిన విషయాలను తప్పక దృష్టిలో ఉంచుకుంటాను.

    @ నీహారిక,
    అవునా! రాధిక గారి కథ లింక్ ఇచ్చుంటే బాగుండేది కదండీ మరి! :-)

    ReplyDelete
  9. Copy paste of Mr. Abrakadabra's comments.
    __________________________________
    మీరు అదే సంగతి మళ్లీ బల్లగుద్ది మొదటిపేరాలో చెప్పనవసరం లేదు.

    ఇంతకీ, కథ ముసుగులో మీ అభిప్రాయాలు రాసేశారు. ఇలాంటివి కథగా కన్నా వ్యాసాలుగా బాగుంటాయి.
    __________________________________
    I've read the story yesterday it self, but lazy enough to comment :), luckily Mr. Abarakadabra posted them.

    ReplyDelete
  10. @ వీరుభొట్ల వెంకట గణేష్,
    Thanks for your response. As I said above, will try to improve. :-)

    ReplyDelete
  11. కథ బావుందండి ! కథ మీరు రాసి జ్యోతిక చిన్నప్పటి ఫోటో పెట్టారేంటండి :)

    ReplyDelete
  12. మధుర ఈ కధ ఇంతకి ముందు ప్రొద్దులో చదివాను.. కధలో రాసిన అమ్మ పాత్రను చాలా చోట్ల చూసాను కూడా.. అభినందనలు

    ReplyDelete
  13. @ Sravya Vattikuti,
    మీరు భలే వారండీ! జ్యోతిక ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నా బ్లాగు మీదకి గొడవకొచ్చెయ్యగలరు సుమా ;-)

    @ నేస్తం,
    ఆ కథ గురించి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. కానీ, పొద్దులో వచ్చిన ఆ కథ కాకుండా ఇప్పుడు ఇంకో కథ కౌముదిలో వచ్చిందండీ! దాని గురించే ఈ పోస్ట్ వేసాను. మీరు పాత కథ లింక్ ఒక్కటే చూసినట్టున్నారు. క్రిందన కౌముది కి లింక్ ఇచ్చాను. అది చూడలేదనుకుంటా కదా! :-D

    ReplyDelete
  14. chala chala nijamina vishyanni rasaaru madhuravani garu..chala bagundi, ala maragaligitey bagundunu ankutunna chala rojulanundi..pryatnam sagutooney vundi.

    ReplyDelete
  15. మధురవాణి గారు! కథలో మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. కథకి పెట్టిన పేరు సరిగ్గా సరిపోయింది. బాగా రాసారు. రాస్తూ ఉండండి.
    " ఆవృతం " చదివాను. నాకు పెద్దగా నచ్చలేదు. ఈ కథ కూడా అలాగే ఉంటుందనుకున్నాను. కాని ఆశ్చర్యపరిచారు. చాలా బాగుంది.

    ReplyDelete
  16. బాగా రాసేరు కధ. congratulations and wishing you good luck in new endeavors. :-). కధ ఎలా రాయాలో నాకు తెలియదు కాబట్టీ సలహాలు ఇవ్వలేను నేను :-(

    ReplyDelete
  17. @ vidya,
    మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. మీ ప్రయత్నం విజయవంతమవ్వాలని కోరుకుంటున్నాను :-)

    @ సవ్వడి,
    అయితే ఆ కథ కాకపోయినా, ఈ కథ మీకు నచ్చిందంటారు. చాలా సంతోషమండీ! :-)

    @ భావన,
    Thanks for your wishes. సలహాలంటూ ప్రత్యేకంగా చెప్పకపోయినా, చదివితే బాగుందనిపించిందా, బాగోలేదనిపించిందా అని చెప్తే చాలండి. దాని బట్టి, అసలు నేను రాసేది చదివే వాళ్లకి ఏమనిపిస్తుందో నాకు తెలుస్తుంది కదా.. అదన్నమాట సంగతి! అయినా కథల కంటే, మీ లేఖలే బాగుంటాయండీ! :-)

    @ హరేకృష్ణ,
    ధన్యవాదాలండీ! :-)

    ReplyDelete
  18. కథ బాగుందండి. అభినందనలు.

    ReplyDelete
  19. ఇవాళ చదవటం కుదిరింది...మీ ఫోటో, కథా రెండూ బాగున్నయి.

    ReplyDelete
  20. Hi, Your story is very nice. good luck

    ReplyDelete
  21. @ తృష్ణ, Kamal, స్ఫురిత, Mannam
    నా కథను ఓపిగ్గా చదివి మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు! :-)

    ReplyDelete
  22. Madhura.. Mi kadha chadavaledandi inkaa.. Kani ee comments chusi mimmalni ventane chudalani velli chusesanu.. Enta cutega unnaro. Compare ee anukondi, but laila la anipincharu.. magha maasam epudostundo.. ani padukuntu parigettutunnatlu. ha ha..

    miku comment rayatam ide first. miru naku telusulendi baagane mike nenu telidu. ha ha.

    Aruna.

    ReplyDelete
  23. @ అరుణ,
    నేను మీకు బాగానే తెలుసన్నారంటే నా బ్లాగు ఎప్పటినుంచో చూస్తున్నారన్నమాట! చాలా థాంక్సండీ. కామెంట్ చేసినందుకు కూడా థాంక్స్. ఇప్పుడు మీరూ నాకు తెలిసిపోయారుగా ;-)
    మీరు అందమైన దృష్టితో చూసి ఉంటారు కాబట్టి.. అలా కనిపించి ఉంటాను. Anyways, thanks for that and keep visiting my blog :-)

    ReplyDelete
  24. మధురవాణి గారు.. ఒక చిన్న విన్నపం.. మొదటి కథ లాగే మీ రెండవ కాదని కూడా ఇక్కడే రాసే ప్రయత్నం చేయరూ? నేను కౌముదిలో మీ కథని తెరవలేకపోతున్నాను.
    (నేను కౌముదిలో గొల్లపూడి గారి కాలమ్ ప్రతివారం చదువుతాను)
    దయచేసి మీరు కొంచెం సమయాన్ని వెచ్చించి ఆ కథని ఇక్కడకూడా ప్రచురిస్తారని ఆశిస్తూ..
    - రాము మాదారపు

    ReplyDelete
  25. @ ramakrishna- iit kgp,
    ధన్యవాదాలండీ!

    @ Madarapu,
    రామూ గారూ, ఒకోసారి కౌముది లో ఫాంట్ ప్రాబ్లం వస్తుంటుంది. రిఫ్రెష్ చేసినా, వేరే బ్రౌజర్లో చూసినా సరిగ్గా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకది కుదరపోతే, మీ ఈమెయిల్ id తెలియజేస్తే నేనే pdf పంపించగలను.Thanks for the comment.

    ReplyDelete
  26. ఈ రోజు కౌముది లో మీ కథ చదివాను...నేటి తరం ఆలోచనలను ప్రతిబింబించే విధం గా ఉంది :-)), ఇలాగే రాస్తూ ఉండండి....may God bless u :-))

    నాకు చాలా రోజులు గా మీ పేరు, మీరు ఎలావుంటారో తెలుసుకోవాలని చిన్నపాటి కుతూహలం...కథ కి చివర లో మీ గురించి,మీ ఫోటో కూడ చూసి చాలా ఆనందం గా అనిపించింది :-)

    ReplyDelete
  27. చాలా చిన్న కథ తో చాలా పెద్ద విషయాన్నీ చాలా సింపుల్ గా చెప్పారు. మనస్పర్థలతో ఉన్న భార్య భర్త లెవరన్నా ఈ కథ చదివితే అసలు వాళ్ళ సమస్య మూలం ఎక్కడుందో ఇట్టే అర్థం అయిపోతుంది.

    ఇలాంటి కథలు ఇంకా రాస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  28. @ రాధిక,
    So sweet of you! Thank you! :-)

    @ స్థితప్రజ్ఞుడు,
    thanks for the comment. నా కథని గురించిన మీ అభిప్రాయం చూసి చాలా సంతోషమేసిందండీ! తప్పకుండా ప్రయత్నిస్తాను :-)

    ReplyDelete
  29. అన్నట్టు మధురవాణి గారు.....

    మీ కథ చదివిన ఆవేశం లో నేను కూడా ఒక కథ రాసా...మీ కథలో ఉన్నత డెప్త్ లేదనుకోండి...

    మీరు చదివి మీ అభిప్రాయం తెలిపితే.....సంతోషిస్తా...

    చదవటమే కాకుండా ఓ నలుగురు బ్లాగ్మిత్రులతో బ్లాగారనుకోండి.....అంతే...ఇహ మాటల్లేవ్....

    లంకె ఇదిగో....
    http://sthithapragnudu.blogspot.com/2010/06/blog-post_15.html

    ReplyDelete
  30. Madhuravani garu,

    mee javabuku dhanyawadamulu..
    naa e-mail id rama@indiayouth.info
    dayachesi naaku ee katha pdf pampagalarani manavi..
    dhanyawadamulu :-)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!