Wednesday, March 31, 2010

ఎక్కువమంది కోరుకునే ఉద్యోగం ఏది?


ప్రతీ మనిషికీ బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయక తప్పదు. బ్రతుకు తెరువు కోసం వెతుక్కునే అవసరం లేని అతి కొద్ది మంది ధనవంతులకి కూడా ఊసుపోడానికైనా ఏదో ఒక ఉద్యోగం చేసి తీరాలి. ఇంత పెద్ద ప్రపంచంలో మనం చేయాలనుకోవాలే గానీ ఎన్ని రకాల ఉద్యోగాలో ఉన్నాయి. అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే, 'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి' అన్నట్టు ఒక్కొక్కరిది ఒక్కో ఆసక్తి. ఆసక్తి ప్రకారం ఉద్యోగాన్ని ఎంచుకునే వారు కొందరైతే, మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనుసరించి లాభనష్టాలు బేరీజు వేసుకుని, ధనం, కీర్తి పరంగా ఏది ఎక్కువ లాభాదాయకమో బాగా లేక్కలేసుకుని ఉద్యోగం చేయడం. మన దేశంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో రెండో రకానికి చెందినవారే ఎక్కువ మంది ఉంటారని నా అభిప్రాయం ;-)

సరే, విధంగానైనా సరే ఎక్కువమంది ప్రజలు మొగ్గు చూపే ఉద్యోగాలు ఏవి? పని చేయడానికి, లేదా హోదాలో ఉండటానికి జనాలు మక్కువ చూపిస్తున్నారు? అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి సర్వేలు ప్రతీ దేశంలో, ప్రతీ రాష్ట్రంలో చేస్తే ఒక్కోచోట ఒక్కో రకమైన జాబితా తయారవుతుంది కాబోలు! జాబితాని బట్టి ఆయా దేశాల్లో ప్రజల ఆలోచనా విధానం, మనోభావాలు, అక్కడి సామాజిక పరిస్థితులు తదితర విషయాల గురించి ఒక అవగాహనకొచ్చే వీలుంటుంది కదా!

ఇలాంటి ఒక సర్వేని జర్మనీ లో నిర్వహించారట. కాకపోతే, వాళ్ళు సర్వే చేసిందేమిటంటే, అత్యధిక శాతం మంది ఇష్టపడని ఉద్యోగాలు ఏంటీ అని! జర్మనీ వాళ్ళు చేయడానికి ఇష్టపడని టాప్ టెన్ ఉద్యోగాల జాబితా ఇలా ఉంది.

1. ఇన్సూరెన్స్ ఏజెంట్
2. రాజకీయ నాయకుడు
3. సుదూరాలు డ్రైవ్ చేసే ట్రక్ డ్రైవర్లు (మన లారీ డ్రైవర్ల లాగా)
4. రోడ్ స్వీపర్ (రోడ్లో చెత్త ఊడ్చే పని)
5. రైతు, వ్యవసాయదారుడు
6. ఎలిమెంటరీ స్కూల్ టీచర్
7. దాసీ పని (హౌసు-కీపింగ్, ఇంట్లోనో, ఆఫీసులోనో ఒకరి చేతి కింద ఉండి క్లీనింగు పనులు వగైరా చూడటం)
8. బ్యాంకు ఉద్యోగి
9. డాక్టర్
10. జర్నలిస్టు

జర్మనీ లో రోడ్లు ఊడ్చే పనికి కూడా మిగతా వాటిలాగా బాగానే డబ్బులొస్తాయి కాబట్టి, ఇక్కడ జనాలు కేవలం తమ ఆసక్తి తగ్గట్టే ఉద్యోగాలు చేస్తుంటారు కానీ పైన చెప్పినట్టు మనలాగా రెండో రకానికి చెందిన వాళ్ళు కొంత తక్కువ అని నా ఉద్దేశ్యం. ఏదేమైనా జర్మన్ల లిస్టులో "డాక్టరు, బాంకు ఉద్యోగం, ఎలిమెంటరీ టీచరు, రాజకీయ నాయకుడు" ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మనకైతే అవన్నీ కూడా మాంచి డిమాండున్న ఉద్యోగాలు కదా మరి! మన దేశంలో డాక్టరైతే ఎంచక్కా పది చేతులా డబ్బు సంపాదించచ్చు. కానీ, ఇక్కడ పాపం అలా అడ్డ దిడ్డంగా దోచుకునే అవకాశం ఉండదు డాక్టర్లకి. పైగా డాక్టరు చదువూ, వృత్తీ కూడా బోలెడు కష్టం, శ్రమతో కూడుకున్నవి. అందుకే వీళ్ళు దానికి 'నో' చెప్పారని అనిపిస్తోంది. ఇకపోతే రాజకీయ నాయకుల విషయంలో కూడా దాదాపు ఇదే వర్తిస్తుంది. అదీ కాక, మన దేశంలో రాజకీయ నాయకులవ్వాలంటే 99% మన పుట్టుకతోనే జరిగిపోవాలి కదా మరి ;-) ఇహ మిగతా బ్యాంకు ఉద్యోగాలూ, టీచరు ఉద్యోగాలూ.. వీటిల్లో కూడా సర్కారు వారి ఉద్యోగాలకైతే మన దేశంలో ఎంత డిమాండో చెప్పక్కర్లేదుగా. మనలో మన మాట.. మన రాష్ట్రంలో చాలా మంది అబ్బాయిలు ఎంచక్కా బోలెడు కట్నం వస్తుంది, పైగా సర్కారీ కొలువుల్లో పెద్దగా పని చేసే అవసరం లేకుండానే డిచిపోతుందని.. వీటికే మొదటి వోటు వేస్తారు కదూ! ;-) ఇహ పైన జాబితాలో మిగతా వాటి సంగతి చూస్తే, తక్కిన వాటితో పోలిస్తే అవి కాస్త శ్రమ ఎక్కువ ఉండే ఉద్యోగాలు గనక 'నో' చెప్పారని అనిపిస్తోంది.

సరే, జర్మనీ సంగతెలా ఉన్నా... పై జాబితా వివరాలు చూడగానే మన రాష్ట్రంలో, దేశంలో యీ సర్వే చేస్తే జాబితా ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది నాకు. ఇష్టపడనివీ, ఇష్టపడేవీ రెండు రకాల సర్వేలు చేస్తే ఎలా ఉంటుదంటారూ?

ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జనాల అభిప్రాయం ఎలా ఉండచ్చో నేనూహించి లిస్టు రాస్తున్నా. మీరు కూడా తలా చెయ్యి వెయ్యండి ;-)

ఇష్టపడే ఉద్యోగాలు:


1. అమెరికా ఉద్యోగం ;-)
2. సాఫ్ట్ వేర్ ఇంజనీరు
3. గవర్నమెంటు ఉద్యోగం (టీచరు, బ్యాంకరు, ఏదైనా సరే!)
4. డాక్టరు
5. ఇంజనీరు
6. రియల్ ఎస్టేటు
7. రాజకీయం ( రాజకీయ నాయకుడి ఇంట్లోనో పుడితేనో, లేకపోతే దూరే సందు దొరికితేనో ;-)
8, 9, ..............


ఇష్టపడని ఉద్యోగాలు:

1. వ్యవసాయం
2. పల్లెటూర్లో పని చేయాల్సొచ్చే ఉద్యోగాలు
3, 4, 5...

ప్చ్... సమయానికేమీ తట్టట్లేదు... ఇహ మీరందుకోండి ఇక్కడ నుంచి ;-)


30 comments:

  1. తినేటందుకు అందరికీ తిండిగింజలు కావాలి,కానీ మేము చేసే వ్యవసాయం మాత్రం వద్దు :(

    ReplyDelete
  2. @ గణేష్ గారూ,
    అంతేనంటారా? చూద్దాం.. ఇంకా ఎవరేమంటారో..

    @ విజయమోహన్ గారూ,
    ఇష్టపడని వాటిలో రాసిన రెండూ 'ఎక్కువ మంది జనాల అభిప్రాయం' అని నా ఊహ. అంతే కానీ, అలా అనుకోడం గొప్ప పని అనేం కాదు! అది ముమ్మాటికీ తప్పే.. అందుకే కదండీ.. అందరూ పల్లెలు, వ్యవసాయం వదిలి వెళ్ళిపోయి.. చివరికి వ్యవసాయ రంగం కుదేలయిపోతోంది.. మన పరిస్థితి ఇలా తయారవుతోంది :-( ఇంకా, మీలాంటి రైతన్నలు ఉండబట్టే అందరికీ నాలుగు మెతుకులు దొరుకుతున్నాయ్. అది మాత్రం వాస్తవం.

    ReplyDelete
  3. అద్దెచ్చ ఇది ప్రతిపచ్చాల కుట్ర అని తెలియచేసుకుంటున్న ... రాజకీయం మాంచి వ్యాపారం అద్దెచ్చ. కాబట్టి అదే మొదటన ఉండాలి.

    ReplyDelete
  4. asalu e udyogam lekunda thini koochunte ee samasyale undavu

    ReplyDelete
  5. meru mareenandee... endulo ekkuva dabbulosthaayante daanloki dookuthaaru janam. anthe thappa oka ishtamantoo eme undadu mana sannaasulaki. konnaallu brahmi jobs velam verri.

    eesaari sweepers ki, toilet cleaning kee ekkuva dabbulosthaayante vaati venta parugu. daaniki coaching centres, inkaa inkaa, inkaa :D

    ReplyDelete
  6. IAS, IPS...లాంటివి కాకుండా.. ఏదో ఒక ఉద్యోగం ఓకే.. :))))

    ReplyDelete
  7. ఏం సాఫ్టువేరు ఉద్యోగం లెండి. కంప్యూటర్ చూసి చూసి బోరెత్తుతోంది. సన్యాసి ఉద్యోగం ఏదయినా వుంటే చూద్దురూ. నేనయితే దానికే ముందు జై కొడతా.

    ReplyDelete
  8. DTP and printing is best
    వివరాలకు
    Praveen Communications Ph: 08942-278374, 08942-645664
    కి సంప్రదించగలరు

    ReplyDelete
  9. Pokiri lo Mahesh babu laagaa self employment aithe ok. :D

    ReplyDelete
  10. వ్యవసాయం పట్ల మీ ఊహ నిజమేనండీ...కానీ మనకు మింగుడు పడని నిజం ఇది.మిగతా ఊళ్ళలో ఏమో గానీ మా ఊళ్ళలో అసలు తమ పిల్లలు రైతు కావాలని కోరుకునే వాళ్ళు మచ్చుకైనా కనిపించరు.

    ReplyDelete
  11. అడ్డ దిడ్డంగ నాలుగు చేతులా సంపాదించి త్వరలో టపా కట్టబోతున్న కాంట్రాక్టరు ఏకైక కూతురుకి మొగుడైతే హాయి హాయి కద?

    ReplyDelete
  12. అయ్యో మధురవాణిగారు, మీరు మరీనూ.. అసలు ఉద్యోగం చేయకుండా జీవితం గడిచే మార్గమేదన్నా వుంటే చెప్పరూ :) [ అడుక్కుతినడం కూడా కష్టమే కదా ;)]

    బాగుందండి, కానీ వ్యవసాయం కష్టమే కానీ అందులో వుండే తృప్తి వేరండి. నాకు గనక ఛాన్స్ వస్తే, ఓ ఇరవై ఎకరాల్లో పొలమేసుకొని, అందులోనే ఇల్లు కట్టుకొని హాయ హాయిగా సాగిపోదమా అని పాడుకోవాలని కోరిక.కానీ అందులో వుండే కష్టాలు అందులో వుంటాయి లెండి.

    ReplyDelete
  13. @భాస్కర రామి రెడ్డి

    హి హి నేను అల్రెడీ ఇదే ప్లాను తో ముందుకు వెళ్తున్నాను, ఇంకో పది సంవత్సరాల తర్వాత అంటే నాకు 35 వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేరు కు పాడె కట్టాలని డిసైడ్ అయ్యాను

    ReplyDelete
  14. నేను భాస్కర రామి రెడ్డి గారు తో ఏకీభవిస్తున్నాను. నాదీ అదే కోరిక (కాకపోతే పాడే కోరిక లేదు -- పెంచుకునే గేదెలు, కోళ్ళు పారిపోతాయి)

    సరిగ్గా సమయానికి లీడర్ సినిమా లోంచి ,
    బంగారు పంటలే పండుతాయి అని మా తెలుగు తల్లి పాట నడుస్తుంది బాక్ డ్రాప్ లో

    ReplyDelete
  15. @ చైతన్య,
    మీరన్నది నిజమే గానీ, అద్దెచ్చా.. కావాలని కోరికున్నా అందరూ రాజకీయ నాయకులు అయ్యే వీలు లేదు కదా అద్దెచ్చా.. అదంతా వీజీ కాదు మరి! పైన చెప్పినట్టు ఏ రాజకీయ నాయకుడింట్లోనో పుట్టాలి ;-)

    @ ప్రియా,
    పని చేయకుండా తిని కూర్చోగలిగే పరిస్థితే ఉంటే.. అసలు ఈ గోలంతా ఎందుకు? అసలా కథే వేరు!! ;-)
    నువ్వు చెప్పింది కరక్టే.. అందుకేగా నేను మనవాల్లుఎ క్కువ రెండో కోవలోకే వస్తారని అన్నా! :-) మొత్తానికి నువ్వు చెప్పిన స్వీపర్ ఉద్యోగాల విషయం ఏదన్నా అమలు జరిగితే బాగుండు. ఇండియా మొత్తం ఒక్క దెబ్బకి క్లీన్ అయిపోయి తళ తళా మిల మిలా మెరిసిపోద్ది ;-)

    @ సుజ్జీ,
    :-))) అదే.. ఆ 'ఏదో ఒక ఉద్యోగం' ఏదయితే బెటర్ అనేదే ఇక్కడ పాయింటు. హీ హీ హీ ;-)

    @ శరత్ గారూ,
    మరేనండీ.. మహా బాగా చెప్పారు. అసలు బాగా లాభసాటి ఉద్యోగాల లిస్టులో మొదట 'సన్యాసి, స్వామీజీ' ల ఉద్యోగాలే ఉండాలి. వాటిల్లో వచ్చేంత కీర్తి, డబ్బు, పలుకుబడి ఇంకే ఉద్యోగంలోనూ రాదు అంత వీజీగా!! :-)
    అయితే.. ముందా సన్నాహాల్లో ఉండండి మరి మీరు ;-)

    @ కొత్తపాళీ,
    :-)

    ReplyDelete
  16. @ అనానిమస్,
    :-) ఎవరికైనా మీరు సూచించిన జాబు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పిన వివరాలు తెలుసుకుంటార్లెండి ;-)

    @ మిర్చి,
    :-) :-) మీలాంటి యువత అవసరం దేశానికి చాలా ఉందండీ! అదే.. ప్రభుత్వాన్ని తిడుతూ కూర్చోకుండా ఎంచక్కా మీ అంత మీరే self -employment చూసుకోవడం.. వాట్ యాన్ అయిడియా సర్ జీ! ;-)

    @ రవిచంద్ర గారూ,
    మీరన్నది నిజమే! ఒక్క మీ ఊళ్లోనే కాదండీ.. దాదాపు అన్నీ ఊర్లలోనూ అదే పరిస్థితి ఉందని నా నమ్మకం. అందుకే అలా రాశాను. నిజంగానే ఇది మనం చాలా బాధపడాల్సిన విషయం. దీనికి తగ్గట్టు, వ్యవసాయానికి ప్రోత్సాహం రోజు రోజుకీ క్షీణిస్తోంది. ప్రకృతి కూడా సహకరించట్లేదు చాలాసార్లు. సమస్యలకి, ఎదురోడి పోరాడీ పోరాడీ అలసిపోయిన అన్నదాతలు తమ పిల్లలు తమలా కష్టపడకూడదని అలా కోరుకుంటున్నారు :-(

    @ చెప్పుదెబ్బలు-పూలదండలు,
    సూపర్ అండీ మీ అయిడియా! అన్నట్టు... మనవాళ్ళు ఇష్టపడే ఉద్యోగాల లిస్టులో కాంట్రాక్టర్లని కూడా తప్పకుండా చేర్చాల్సిందే! :-)

    ReplyDelete
  17. @ భాస్కర రామిరెడ్డి గారూ,
    <<<< అసలు ఉద్యోగం చేయకుండా జీవితం గడిచే మార్గమేదన్నా వుంటే చెప్పరూ >>>>>
    పైన 'చెప్పుదెబ్బలు-పూలదండలు' గారి కామెంటుపై ఓ లుక్కెయ్యండి. అలాంటి తెలివైన అయిడియా ఏదన్నా పాటిస్తే తప్ప, మీ కోరిక నేరవేరదండీ! అయినా, మీకు ఇంకా అవకాశం లేదనుకుంటాను ;-) కాబట్టి, బుద్దిగా ఏ ఉద్యోగం బెటరో ఆలోచించేయ్యండి :-) :-)

    కాసేపు హాస్యం పక్కన పెడితే, మీ కోరిక నిజంగా అభినందనీయం. కేవలం కోరుకోడంతో ఆగిపోకుండా, ఆ పని మీ చేతుల్లో అమలు జరగాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నా! :-)

    @ రాఘవ్,
    మీక్కూడా అభినందనలండీ! మీలాంటి వాళ్ళందరూ తలచుకుంటే.. మళ్ళీ మన వ్యవసాయ రంగానికి మంచి రోజులొస్తాయనిపిస్తుంది. :-)

    @ బాటసారి,
    మీక్కూడా జేజేలు! పాట పాడకపోయినా, మీ కోరిక మాత్రం నిజమవ్వాలని కోరుకుంటున్నా! అయినా, పాటదేముందండీ.. ఎంచక్కా ఓ రికార్డ్ వేస్కుంటే సరి! మీకు బాక్ డ్రాప్ లో వినిపించిన 'బంగారు పంటలే పండుతాయి' పాట నిజమైతే బాగుండుననిపిస్తోంది :-)

    @ మురళి,
    Thank you!

    ReplyDelete
  18. mmmmmmm mmmm gud.......

    intamandi reply ichharu......tama pillalu agriculture cheyalani korukune.......vaaru evaru.

    evarino point cheyadaaniki mana andaram mudu vuntaam.


    enduku entamandi govt schools lo pillalni chadivistunnaru?

    ReplyDelete
  19. @priya

    meeru andukega M.S ki vellindi.....
    2nd comment koncham over anipinchindi "snnasulu anadam"

    koncham controllo vunte baguntundi anukunta

    ReplyDelete
  20. @ వినయ్ గారూ,
    మీ వ్యాఖ్య అర్ధం చేసుకోదగిందే! నిజానికి, ఈ టపా రాయడంలో నా ఉద్దేశ్యం మాత్రం ఎవరినో పాయింట్ అవుట్ చేయాలని మాత్రం కాదు. అందుకే 'మనం' అనే అంటాను నేను చాలాసార్లు.. ఎందుకంటే, మనం మాట్లాడే ఆ so called సమాజం అంటే మనమే కదా! సమాజంలో ఉన్న ప్రతీ ఒక్కళ్ళ వంతు ఎంతో కొంత ఉంటుంది కదా!
    పిల్లల సంగతేమో గానీ, వాళ్ళు మాత్రం భవిష్యత్తులో వ్యవసాయం చేసే ప్రయత్నం చేస్తామని భాస్కర రామిరెడ్డి గారూ, రాఘవ్ గారూ, బాటసారి గారూ చెపుతున్నారు కదండీ! అందుకే వాళ్ళు నిజంగా అభినందనీయులు అన్నాను నేను :-)
    ఇహ పిల్లల విషయానికొస్తే, వాళ్ళేం చేయాలనుకుంటారో వాళ్ళిష్టం.. మన అభిరుచుల ప్రకారం వాళ్ళని జీవితం గడపమనడం నాకు అంగీకారం కాని విషయం. కాబట్టి, ఈ విషయంలో నేనేమీ చెప్పలేను. అన్నట్టు.. ఇది నా స్వాభిప్రాయమే సుమా! కాకపోతే మీరన్నట్టు 'పిల్లలు ఇలా ఉంటే బాగుండు' అని కోరుకోవడంలో తప్పు లేదనుకోండి ;-)
    "గవర్నమెంటు స్కూల్లో పిల్లల్ని చదివించడం"... కేవలం అలా చేయడం చాలా సమస్యలకి నిజంగా పరిష్కారం అవుతుందంటారా? ఏమో.. ఈ ఒక్క విషయమే విస్తృత స్థాయిలో చర్చించాల్సిన విషయం అనుకుంటా!
    మీరన్నట్టు ఏ విషయంలోనైనా ముందు మన గురించి మనం ఆలోచించుకున్నాకనే సమాజం గురించైనా, మరెవరి గురించైనా సరే మాట్లాడాలి. అది మాత్రం నిజం! ఏది ఏమైనా... చాలా ఆలోచింపజేసే వ్యాఖ్య చేశారు. మనస్పూర్తిగా ధన్యవాదాలు!

    ReplyDelete
  21. ప్రతి పూటా అన్నం ముందు కూర్చున్నవాడికి ఆ క్షణం ఎప్పుడో ఒకసారి రైతు గుర్తిరాక మానడు. ఐనా ఆ పని మనకు వద్దు అనుకోవటానికి కారణాలు అనేకం, ఇప్పుడు వ్యవసాయం జూదంగా మారింది పెట్టిన డబ్బు తిరొగి వస్తుందో లేదో, వచ్చింది గిట్టుబాటూ కాదు.
    చిన్న రైతుకు అన్నీ పోను సంవత్సరానికి పదివేలు మిగిలితే అది గొప్పే. తాను చేసే శ్రమ పక్కనుంచి పెట్టే డబ్బైనా తిరిగిరాకపోతే ఆ పని ఎవరుమాత్రం కోరుకుంటారు? (మీలాంటి మేథావులు చదువుకున్నవారే దెశంకోసం త్యాగంచేసి ఇకపై వ్యవసాయం చేయాలి :)
    పొట్టకూటికోసం ఇంకేమీ చేయలేక ఏదోలా వ్యవసాయాన్ని నమ్ముకున్న బక్క రైతులే ఇప్పుడు.

    భాస్కరరెడ్డిగారు మీరు సేద్యం చేయాలనుకుంటున్నా రాబోయే ఆరోజులు చిన్నా చితకా రైతులవి కాదండీ, అప్పటికల్లా రియలెన్స్ లాంటి సంస్థలు, లేదూ విదేశీ కంపెనీలూ మన దేశ వ్యవసాయాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటాయి. భూములు వాళ్ళ చేతుల్లో పెట్టి అక్కడే ఉద్యోగాలు చేసుకోవడం ఉత్తమం అనుకుంటారు.

    ReplyDelete
  22. @వినయ్,

    కంట్రోలూ రోకలీ తర్వాత కానీండీ,

    నేను చేస్తున్నది ఎమ్మెస్ కాదు. అదెప్పుడో అయిపోయింది. ప్రస్తుతం కమ్ప్యూటరోరియంటెడ్ నంబర్ థియరీ లో రీసెర్చ్. కాంబినటోరిక్స్. అది నేను ఎన్నాళ్ళుగానో కలలు కని, ఆర్థిక స్థోమత లేకపోయినా కిందా మీదా పడి చదువుకుంటున్నాను. అంతే తప్ప ఏదో ఫ్యాన్సీగా సాఫ్ట్వేర్ అని కాదు చదువుతోంది. I'm passionate about math, and using computers technology as a means of attaining my goal.

    నేను సన్నాసులంది "కమ్ప్యూటరోళ్ళని తప్ప వేరే వాళ్లను చేసుకోను, అబ్బాయికి కనీసం గ్రీన్ కార్డన్నా ఉండాలి, ఏవో నాలుగు కోర్సులు నేర్చుకుంటే అమేరికా పోవచ్చు" అనుకునే వాళ్ళని. Those are people who even don't know what passion means, and have no specific goal.

    మీరు కూడా అలాంటి వాళ్ళే అయితే సారీ, :D

    ReplyDelete
  23. @madhuravaani gaaru

    hahha meeru adigindi full time agriculture gurinchi ante gaani time pass agriculture gurinchi kaadu anukunta.

    ofcourse vaallu adi cheyadaanikaina ready gunnaru great.

    nenu govt schools enduku mention chesaanu ante enta mandi....10 mandiki use ayalaga(kalasi) jeevistunnaru ani.

    endukulendi.......manam discuss chesesariki mana era ayipotundi...

    ReplyDelete
  24. @ Vinay,

    endukulendi.......manam discuss chesesariki mana era ayipotundi...

    అదీ నిజమేలెండి :-) :-)

    ReplyDelete
  25. Maduravani gaaru Meeru cheppindhi 99% correct. But a small correction due to this recission
    ->S/W engg ki demand thaggindhi,
    ->Govt empki waitage perigindhi.

    Nenu IIIT loo M.Tech complete chesaanu. Last month maa grand-maa valla intiki vellanu. Almost 4 yrs tharuvaatha vellanu anukuntaa mothham veedhi loo vaallandharoo palaka rinchadaaniki vachharu.

    Kusala-prasnalu aiena tharvaatha, Vachhina vallandharoo naakoka free-advice ichaaru. "Baabu D.SC Notification vachhindhi raa, Apply cheya raa. Yemchakka mana badi looney 'Master' gaa chesukondhuv gaani" ani.

    On that time god only knows "My expressions on face"
    ~v!jju

    ReplyDelete
  26. Ika naa preference ki vasthey.. Max inkoka 10(up to my-35) yrs job chesi, Bankloo balance sufficient maintain chesukoni,

    -> 'Keralaa' loo kaani, 'KoonaSeema' loo gaani oka bussiness start chesi, Haaiegaa aa pachhani-palleyloo life long adukuntaa, paadukuntaa settle aiepoothaa. v!jju

    ReplyDelete
  27. @ v!jju,
    మీ నానమ్మ వాళ్ళ ఊరిలో ఆ సంఘటన జరిగినప్పటి మీ ఫేసు ఊహించుకుంటే చాలా నవ్వొస్తోంది. ఇప్పదూ పరిసితి లాగే ఉందిలెండి. అయినా, రేసేషన్ ప్రభావం తగ్గిపోయిందంటున్నారుగా మళ్ళీ! మీ భవిష్యత్ ప్రణాళిక మాత్రం చాలా బాగుందండీ! మీ కోరిక నెరవేరి హాయిగా కోనసీమలో సెటిల్ అవాలని నేనూ కోరుకుంటున్నా! :-)

    ReplyDelete
  28. mana desam lo vyavasayam tho paatu yenno cheti vruttulu unnai..avanni already kuntu padipoyayii...Manishi prakruti lo oka bhagam ani marichipoyi dadapuga padi samvatsaralu ayyindani naa nammakam..yendukante..computer ane gudi banda manishi medaku katti padindi gata padiyeellaloonee..
    Vyavasayam, cheti vruttulu..evanni prakruti lo kalisi poye jeevana vidhanalu..vaatilo yento anandam..kani eppudu manalo chala mandi chestunna job yentayyaa ante.."Compuuteerrr engineer, analyst, thokka tholu"..evanni vadilesi podamaa antee..chadivinadi antha nirupayogamenaa ani badha..
    kani mee blog valla..manadaram oohinchukunee oohalani atleast blog lo ayina chusukune adrustam kalugutundii :)
    naku nachina jobs antee
    1. naku bommalu cheyyadam anthaga radu..kani bommalu chesee vallaki oka society establish cheyyadam
    2. Teacher job..toorpu godavari lo yee maarumoola palletoorilonainaa..may be oka school kuda petti free education evvochu..
    3. Vyavasayam ani chepdamante..eppativaraki yeppudu polam lo digaledayeee..naadi mechanical gabatti..raithannalaku veeluga manchi panimutlu chesukuntee better emo..
    4. yemina naalugu raallu venaka vesukunii..palletoori lo painter ga settle ayyipovadam..

    oosipoka oohalaki keyboard echi rasina sodi..

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!