Thursday, November 26, 2009

ఎందువలనా అంటే..!?

ఉషోదయాన పచ్చటి చిగురులపైన, పసిమొగ్గలపైన నిలచిన నీటిముత్యాలను చూస్తే నాకెందుకంత ఆనందమంటే చెప్పలేను..
తెల్లవారుజామునే చెట్టు కింద తెల్లని తివాచీలా పరచుకున్న పారిజాతాలను చూస్తే నాకెందుకంత పులకింతంటే చెప్పలేను..
సాయంసంధ్యలో అరవిరిసిన సన్నజాజులతో నిండిపోయిన తీగను చూస్తే నాకెందుకంత పరవశమంటే చెప్పలేను..
వినీలాకాశంలో ఠీవీగా నించుని అల్లరిగా చూస్తున్న నెలవంకని చూస్తే నాకెందుకంత మైమరపంటే చెప్పలేను..
నల్లని రేయిలో మిణుకు మిణుకుమంటూ మెరిసే నక్షత్రాలను చూస్తే నాకెందుకంత కేరింతో చెప్పలేను..
వసంతంలో విరగబూసిన పూదోటని చూస్తే నాకెందుకంత మురిపెమంటే చెప్పలేను..
శరచ్చంద్రుని వెన్నెల వెలుగులు చూస్తే నాకెందుకంత తన్మయత్వమంటే చెప్పలేను..
హేమంతంలో ఎడతెరిపి లేకుండా వర్షించే జడివానని చూస్తే నాకెందుకంత ఉల్లాసమంటే చెప్పలేను..
శిశిరంలో కురిసే మంచుపూలను అద్దుకుని శాంతిసందేశంలా కనిపించే ప్రకృతిని చూస్తే నాకెందుకంత ప్రశాంతతంటే చెప్పలేను..
రెక్కలు విప్పి స్వేచ్ఛగా మబ్బుల్లో విహరించే విహంగాన్ని చూస్తే నాకెందుకంత సంతోషమంటే చెప్పలేను..
నీ పక్కనుంటే.. నీ చేయందుకుంటే.. నాకెందుకింత నిశ్చింతంటే చెప్పలేను..
నా చిన్ని మనసు చిరుస్పందనలకి కారణమేమని బదులివ్వగలను.!?

14 comments:

  1. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...పునరాగమనానికి స్వాగతం.

    ReplyDelete
  2. నాకెందుకు పిచ్చి పిచ్చిగా ఇది నచ్చిందంటే నేను చెప్పలేను

    ReplyDelete
  3. So nice.

    Welcome back. After a long time.

    ReplyDelete
  4. చాలా రోజుల తర్వాత కనిపించారు.. బాగుందండీ కవిత.. టైటిల్ చూసి నేను 'సప్తపది' లో 'గోవుల్లు తెల్లన..' పాట గురించి అని పోరాబడ్డా..

    ReplyDelete
  5. "నీ పక్కనుంటే.. నీ చేయందుకుంటే.. నాకెందుకింత నిశ్చింతంటే చెప్పలేను..
    నా చిన్ని మనసు చిరుస్పందనలకి కారణమేమని బదులివ్వగలను.!?"

    అద్భుతం. :)

    ReplyDelete
  6. మీ కవిత చూసి మనసెంత పరవశించిందంటే..... చెప్పలేను.

    ReplyDelete
  7. అన్ని స్పందనలకు కారణమేమంటే చెప్పలేను
    కాని ఈ అందమైన కవిత ఎందుకు బాగుందంటే మాత్రం చెప్పగలను
    ఎందుకంటే అందులోని అనుభూతులన్ని ఇక్కడో అక్కడో ఎక్కడో అనుభవించినవి కాబట్టీ. చాలా బాగుంది మీ భావన ను వ్యక్తీకరించిన తీరు.

    ReplyDelete
  8. చాలా బాగుంది. ఎందువలనా అంటే? అని చదివి నేను కూడా గోవుల్లు తెల్లన. గోపయ్య నల్లన్ పాట గుర్తు చేసుకున్నాను.


    మీ కవిత చదువుతుంటే నాకెందుకో నా తవిక ఒకటి గుర్తుకు వస్తోంది. వీలుంటే మీరూ చదవండి.


    http://premikudu1.blogspot.com/2009/07/blog-post_18.html

    ఎందువలనా అంటే ఆక్షణంలో మనం మనం గా ఉంటాము. మనకంటే భిన్నమైన వాటన్నిటిలో మనమే లీనమవుతాము. మనకూ వాటికీ ( మిరు పోలిక చెప్పిన వాటికీ ) మధ్య అభేదాన్ని దర్శిస్తాము.

    అర్థం కాలేదు కదూ... సరే నా తవిక చదవండి. ఏమైనా అర్థమవుతుందేమో... :)

    ReplyDelete
  9. chala bagundi me kavita

    ReplyDelete
  10. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  11. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
    ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
    మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
    http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
    ధన్యవాదములు
    - భద్రసింహ

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!