Monday, January 05, 2009

లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే.. చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం..!

హాయ్ హాయ్ అందరికీ..
పైన టైటిల్ లో కనిపిస్తున్న పాటనే వేళ నేను మీకు గుర్తు చేయబోతున్నాను. నిన్ననే నా బ్లాగులో ఒకరు వ్యాఖ్యలో గుర్తు చేసారు పాట గురించి. పాట అంటే నాకెంత ఇష్టమంటే.. రెండు రోజులకొకసారైనా పాట నా పెదవులపై చేరి పలకరిస్తూ ఉంటుంది :) ఒకోసారి ఏదయినా ప్రయాణాల్లో ఉన్నప్పుడు.. కిటికీ పక్కనో కూర్చుని మెల్లగా నాలో నేనే పాటలు పాడుకోవడం నాకు అలవాటు. భయపడకండి.. మరీ పెద్దగా పాడనులే.. :) అలా ఏదయినా పాటని కూనిరాగం తీద్దాం అనుకున్నప్పుడల్లా.. అప్రయత్నంగా నా మదిలోకొచ్చే పాట.. పాట..! నేను ఇంటర్ చదివే రోజుల్లో మా క్లాసులో సునంద అని ఒకమ్మాయి ఉండేది. ఎప్పుడు పాట పోటీ పెట్టినా అమ్మాయికే మొదటి ప్రైజ్ వచ్చేది. అంటే అంత బాగా పాడేదన్నమాట. ఒకసారి పోటిలో అమ్మాయి పాడగా పాట మొదటిసారి విన్నాను. అప్పుడే ఎంత నచ్చేసిందో నాకు..! మళ్ళీ అక్కడా ఇక్కడా కాస్త వినడమే తప్ప.. ఆ పాట ఏ సినిమాలోది.. ఎవరు పాడారు అనేది చాల రోజుల దాకా నాకు తెలీదు. మొత్తానికి ఒరిజినల్ పాటని వినే భాగ్యం ఎన్నో ఏళ్ళకి కలిగింది నాకు. ఇప్పుడు మాత్రం తెగ వినేస్తూ ఉంటాననుకోండీ :) అవండీ మరి.. పాటతో నాకున్న అనుభూతులు :)

ఇక పాట సంగతులకొస్తే.. 1995 లో ప్రముఖ నటీమణి శ్రీమతి సుహాసినీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇందిర' అనే సినిమాలోనిది. ఆవిడ దర్శకత్వం వహించిన సినిమా ఇప్పటిదాకా ఇదొక్కటే అనుకుంటా.. అరవిందస్వామి హీరోగా నటించారు. హీరోయిన్ ఎవరో తెలీదు. నేనెప్పుడూ సినిమా చూళ్ళేదు :( నిజానికి సినిమా అనేది ఒకటుందని జనాలకి కాస్తో కూస్తో తెలుసంటే క్రెడిట్ అంతా చక్కటి సంగీతాన్ని అందించిన AR రెహమాన్ కే చెందుతుంది. ఈ పాటకి సాహిత్యం వెన్నెలకంటి గారందించారు. పాట చాలా చిన్నది. అంటే ఒకటే పల్లవి, ఒకటే చరణం. పాటకి రెండు వెర్షన్స్ ఉంటాయి. అమ్మాయి పాడే పాట సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది. పాటని హరిణి పాడారు. అబ్బాయి పాడే పాట చరణం ఒకటే మార్పు.. వేదనతో కూడుకుని ఉంటుంది. పాటని హరిహరన్ పాడారు. పాట పాడినప్పుడు హరిణి వయసు నిండా పదహారేళ్ళు కూడా లేవు. అంతే కాదు..ఇదే తన మొదటి పాట సినిమాల్లో..! హరిణిని మీరిక్కడ చూడచ్చు.










సంగీతం అంటే మాత్రం ఇష్టం ఉన్నా గానీ.. పాటల్ని ఖచ్చితంగా విని తీరాల్సిందే..! ఒకసారి వింటే చాలు.. మనల్ని వెంటాడుతూ ఉంటుంది పాట. అసలు పాట గురించి అంటే.. నేను ఇలా ఆపకుండా చెప్తూనే ఉంటాను గానీ.. ఇంక ఇక్కడితో ఆపి.. మీకు ఒకసారి పాట సాహిత్యం చూపిస్తాను.


హరిణి పాడిన పాట


లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే..

చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం..!
కాసే వెన్నెలకు.. వీచే గాలులకు.. హృదయం కుదుటపడదే..
అంత చేదా మరి.. వేణు గానం..!
కళ్లు మేలుకుంటే.. కాలమాగుతుందా.. భారమైన మనసా..
.... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాద.. ఏకాంత వేళ..!

లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే..
చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం..!


ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా..
ఏదో అంటుంది కోయెల పాట రాగం ఆలకించరా..
అన్ని వైపులా మధువనం.. పులుపూయదా అనుక్షణం..
అణువణువునా జీవితం.. అందచేయదా అమృతం..


లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే..
చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం..!
కాసే వెన్నెలకు.. వీచే గాలులకు.. హృదయం కుదుటపడదే..
అంత చేదా మరి.. వేణు గానం..!


హరిహరన్ పాడిన పాట


లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే..
చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం..!
కాసే వెన్నెలకు.. వీచే గాలులకు.. హృదయం కుదుటపడదే..
అంత చేదా మరి.. వేణు గానం..!
కళ్లు మేలుకుంటే.. కాలమాగుతుందా.. భారమైన మనసా..
.... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాద.. చేరుతూ వేళ..!

లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే..
చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం..!


ఎటో పోతుంది నీలి మేఘం.. వర్షం వెలిసిపోదా..
ఏదో అంటుంది కోయెల శోకం.. రాగం మూగపోదా..
అన్ని వైపులా మధువనం.. ఎండిపోయెనే క్షణం..
అణువణువునా జీవితం.. అడియాసకే అంకితం..


లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే..
చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం..!
కాసే వెన్నెలకు.. వీచే గాలులకు.. హృదయం కుదుటపడదే..
అంత చేదా మరి.. వేణు గానం..!
కళ్లు మేలుకుంటే.. కాలమాగుతుందా.. భారమైన మనసా..
.... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాద.. ఏకాంత వేళ..!

లాలీ లాలీ.. అను రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే..
చిన్నపోదా మరి.. చిన్నిప్రాణం..!


అన్నట్టు.. ఈ పాట దృశ్యీకరణ కూడా బావుంటుంది. ఓ లుక్కెయ్యండి మరి..!





16 comments:

  1. చాలా చాలా Thanks

    ReplyDelete
  2. I thought this song is from Maha Nadhi (Kamal's movie)... thanks for the great lyrics...

    ReplyDelete
  3. abbaa chaala manchi paata gurtu chesaaru :)

    ReplyDelete
  4. నిజమండి. నేను కూడా ఇలాగే రైళ్ళలో బస్సుల్లో పాడుకునే పాట ఇది... ఛి ఛి వేరే అర్థం వచ్చినట్టుంది... కిటికీ దగ్గర కూర్చోనేసుమండి...!! రెహ్మాన్ సంగీతం కోసమే ఈ సినిమా చూసాను.. సుహాసిని దర్శకత్వం బాగున్నా నిరాశ పరిచే చిత్రం. ఇదే చిత్రంలో "ఏ బల్లకట్టు బుల్లెబ్బాయ్.." పాట సాహిత్యం కూడా బాగుంటుంది. వీలైతే వినండి.

    అరిపిరాల

    ReplyDelete
  5. నేను మొదటిసారిగా మా క్లాస్మేట్ ఒకమ్మాయి పాడితే విన్నాను. తర్వాత ఎలాగోలా కష్టపడి ఈ పాట ఆడియో అయితే సంపాదించగలిగానుగానీ వీడియో మాత్రం ఇదే మొదటిసారి చూడటం. వీడియో బాగానే ఉంది కానీ పాట విని నేను ఉహించినంతగా లేదు. పాట సాహిత్యంతో పాటు వీడియో కూడా జతపరచినందుకు దన్యవాదములు.

    ReplyDelete
  6. ఈ పాట వింటే నిద్ర రాదుగానీ హాయిగా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. పాటతో గొంతు కలపాలనిపిస్తుంది. అంత చక్కగా పాడింది హరిణి. ఇక ఇందిరలో హీరోయిన్ సుహాసిని చెల్లెలే!పేరేదో ఉండాలి. కొన్ని పాటలు ఎంత మధురంగా ఉన్నా, చప్పున జనాదరణ పొందవు, ముఖ్యంగా ఇలా నెమ్మదిగా సాగే పాటలు. కానీ సంగీతాభిమానులు వాటిని పట్టుకోగలరు.

    thanks for a beautiful song madhuraa!

    ReplyDelete
  7. manchi paatani parichayam chesaru. thanks

    ReplyDelete
  8. స్వతహాగా నేను సినిమాలు తక్కువగా చూస్తాను. కానీ ఈ పాట విన్న తరువాత తప్పని సరిగా ఈ చిత్రమేమిటో తెలుసు కోవాలనిపిస్తంది.

    ఇంతకీ ఎందులోది ఈ పాట?

    ReplyDelete
  9. చక్రవర్తి గారూ,
    నా బ్లాగులో మొదటిసారి కామెంటినందుకు ధన్యవాదాలు :)
    ఎంచేతనో గానీ.. మీరు ఈ పోస్టులో రాసిన రాతలని చూసినట్టుగా లేరు :(
    రెండో పేరాగ్రాఫ్ లో బోల్డు అక్షరాల్లో రాసాను సినిమా పేరు 'ఇందిర' అని.. :)

    ReplyDelete
  10. మధురవాణి - నేను ఈ సినిమా థియేటర్ లో చూసాను. అప్పటి నుండి ఈ పాట అంటే మాహాఇష్టం నాకు. ఎన్నో ఎన్నో రేయిలు ఈ పాట వింటూ నిద్రపోయాను. ఇంకొక పాట నాకిష్టమైంది నీరాజనం లోని 'ఈ విశాల ప్రశంత ఏకాంత సమయములో ' అని MS రామా రావుగారు పాడింది. ఆ పాట కూడా దీనికి మల్లే చాలా ప్రశాంతంగా ఉంటుంది.

    ఈ పాట ప్రభావం ఇప్పటికే హరిణి పాడే పాటలంటే చెవి కాలు తల కోసుకుంటూ ఉంటా..

    ReplyDelete
  11. మధుర వాణి గారు,
    నాకు తెలిసి ఆ పాట రాసింది సీతారామశాస్త్రి గారు. రెహ్‌మాన్ , వేటురి కలయిక లొ వచ్చిన పాటల్లో భావం వ్యక్తపరచిన తీరు ఎందుకో హత్తుకోదు.

    ReplyDelete
  12. Lyricist is Vennelakanti not veturi or sr sas3. http://www.arrahman.com/v2/discography/films-telugu-indira.html

    ReplyDelete
  13. @ అనానిమస్,
    చాలా థాంక్సండీ.. తప్పు సరిజేసినందుకు. పోస్ట్లో కూడా మార్చాను. :-)

    ReplyDelete
  14. FOr all the bunch of Harini songs jumpintothisLink: http://home.iitk.ac.in/~rowthu/musico.html
    or
    http://home.iitk.ac.in/~rowthu/musicnew.html

    ReplyDelete
  15. ee cinema lo remaining sonsg koodaa baguntayi . e ballekattu bullabbayi song and eruvaaka song also superb

    i also like this song so much

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!