Wednesday, June 06, 2012

నా కవితకి ఆంగ్లానువాదం - "Enduring Search …"

N.S మూర్తి గారు నడుపుతున్న 'అనువాదలహరి' బ్లాగు మన బ్లాగు మిత్రులందరికీ తెలిసే ఉంటుంది. ఆ బ్లాగులో వివిధ ప్రపంచ భాషల కవితలే కాకుండా అప్పుడప్పుడూ మన బ్లాగర్లు రాసిన తెలుగు కవితల్ని కూడా ఆయన ఆంగ్లంలోకి అనువదిస్తుంటారు.

నేను రాసిన ఒక 'నా అన్వేషణ' అనే కవితని 'EnduringSearch…' పేరుతో ఆంగ్లంలోకి అనువదించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నిజానికి ఆయన రాసిన అనువాదం చూసాక నేను రాసిన దానికన్నా అదే ఎక్కువ నచ్చేసింది నాకు. నేనా మాటంటే "మాతృకలో లేనిది అనువాదంలో ఎలా వస్తుందమ్మా.." అనడం ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనం. జీవితంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎక్కువ జ్ఞానం సంపాదించేకొద్దీ మరింత ఒదిగి ఉండాలనే గుణం అలవరచుకోవాలని ఆయనతో మాట్లాడిన ప్రతీసారీ అనిపిస్తుంది నాకు. :)

ఆయన రాసిన నా కవిత అనువాదాన్ని నా బ్లాగులో భద్రంగా దాచుకోవాలన్న కారణంతో పాటు, అందరూ తప్పక చూడతగిన 'అనువాదలహరి' బ్లాగు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ పోస్టు ద్వారా కొందరికైనా తెలియవస్తుందనీ మూర్తి గారి అనువాదాన్ని ఇక్కడ మళ్ళీ రీ-పోస్ట్ చేస్తున్నాను.
 
మూర్తి గారూ, నా బ్లాగ్ముఖంగా మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

[For the first look and for a finicky reader, it may sound funny and ridiculous(may even sound foolish) when you say you are searching for something you never knew. But if we honestly assess our lives and its pursuits, we would have to, perhaps, admit that our life is a marathon search for something we never knew clearly. Even if we had achieved something, instead of living contented with what we have achieved,  like a child who cries for the toy that it did not have ignoring all that it had, we suffer with a sense of dissatisfaction and a craving for something that we did not achieve. Even at the threshold of death, our search for that unknown shall not cease. Its my opinion that this  poem puts that idea so succinctly.]

Yesterday… today…
Day in and day out…and,
For eons…
I have been on the search ….

What is it that I am seeking after?
Who for I am searching for?
What are the places I am looking about?
But,
Why should I search for, at all?
I don’t know!
It is an infinitum of questions …
With no definite answers.

*


Did I ever allow something
To slip through my hands any where?
I don’t think so.
But yet,
I search for that elusive thing
With the illusion that I own it.
Time is fleeting… days are thawing.
Hopes are vanishing… Faith is retreating
Life is ceasing… and the Spirit, depleting
Yet, that crazy search continues…
Cutting through the dense deep darknesses…
To the limits of horizon and to the depths of oceans
For that evanescent enigmatic something
Till breath snaps
Till spirit saps
My being becomes ethereal…
Maybe,
This search shall endure… ever… for ever!

*********************

నా అన్వేషణ!

[మనకు తెలియని వస్తువుగురించి మనం వెతుకుతున్నామని చెబితే, స్థూల దృష్టికి చిత్రంగానూవంకలు వెతికే వారికిహాస్యాస్పదంగానూ కనిపించవచ్చు. కాని, మీరు అవేవీ పట్టించుకోకుండా, "మీ జీవిత గమ్యం ఏమిటి? మీరేం సాధిద్దామనుకుంటున్నారు?" అని నవ్వుతున్నవారిని ఒక్కసారి అడిగి చూడండి. ఆ నవ్వులు, హేళనలూ ఆగిపోతాయి. ఈ దైనందినజీవితపు పరుగుపందెంలో అందరితోపాటు మనమూ పరిగెత్తితున్నాం. ఎందుకుపరిగెత్తుతున్నామో తెలీదు. దేన్ని సాధించడానికి పరిగెత్తుతున్నామో తెలీదు. ఒకవేళ ఏదైనా సాధించినా, అది ఇచ్చే సంతృప్తి కంటే, సాధించలేని విషయాలిచ్చే అసంతృప్తి ఎక్కువ. జీవిత చరమాంకంలో కూడా ఈ అసంతృప్తి మనల్ని వదలదు.'శిలాలోలిత'లో, రేవతీదేవిగారు రాసిన "దిగులెందుకో చెప్పలేని దిగులు"లాంటి భావన ఇది. ఈ భావాన్ని, మధురవాణిగారు ఇందులో చక్కగా ప్రకటించగలిగేరని నా అభిప్రాయం.]

నిన్నా నేడూ పగలూ రాత్రీ అనుక్షణం నిర్విరామంగా వెతుకుతూనే ఉన్నాను..
యుగయుగాల నుంచీ సాగుతోందీ వెతుకులాట..
దేని కోసం వెతుకుతున్నాను?
ఎవరి కోసం వెతుకుతున్నాను?
ఎక్కడని వెతకాలి?
అసలెందుకు వెతకాలి?
ఏమో.. అన్నీ ప్రశ్నలే తప్ప జవాబుల్లేవు!
నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్లోంచి జారవిడిచానా?
లేదనుకుంటాను..
అయినా నాదైనదేదో ఈ ప్రపంచంలో ఉందన్న భ్రాంతితో వెతుకుతూనే ఉన్నాను..
కాలాలు కదలిపోతున్నాయ్.. రోజులు తరిగిపోతున్నాయ్..
ఆశలు చెదిరిపోతున్నాయ్.. నమ్మకాలు చెరిగిపోతున్నాయ్..
ఆయువు కరిగిపోతోంది.. ప్రాణం ఇగిరిపోతోంది..
ఇంకా ఇంకా చీకటిని చీల్చుకుంటూ ఆకాశపు అంచుల దాకా.. సముద్రపు లోతుల దాకా..
ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
ఊపిరి కొడగట్టే దాకా.. ప్రాణం కడగంటే దాకా..
నా అస్థిత్వం ఆవిరైపోయే క్షణం దాకా..
ఈ నా అన్వేషణకి అంతనేదే లేదేమో!

25 comments:

  1. నేను ఇంతకుముందు ఈ కవిత చదవలేదు. మొదట ఇంగ్లీష్ అనువాదం చదివి బాగుందనుకున్నాను. తరువాత ఒరిజినల్ చదివి చాలా బాగుందనిపించింది. మూర్తిగారు చెప్పినట్టు 'దిగులెందుకో చెప్పలేని దిగులు' అనే భావనలా ఉంది.

    ప్రతీ మనిషి జీవితంలోనూ ఉండేదే ఇది. కానీ నూటికి తొంభై జీవితాలు ఆ వెతుకులాటని, అసంతృప్తిని గుర్తించకుండానే ముగిసిపోతాయి. అవే సుఖమైన జీవితాలేమో అనిపిస్తుంది. తృప్తి ఉండదు, అసంతృప్తి తెలియదు. :)

    ఇక ఈ అంతులేని అన్వేషణని పదాల్లో పట్టి చూపడం చాలా కష్టం. కానీ మీరు చాలా వరకు సఫలీకృతులయ్యారనిపించింది. కంగ్రాట్స్!

    ReplyDelete
  2. abinandhanlu,
    chaala bhaagunnai kavitha mariyu anuvadhamu

    ReplyDelete
  3. Cool అండి..మధురవాణి గారు, కవిత బాగుంది, మీరన్నట్టు అనువాదం కూడా చాలా బాగుంది.

    ReplyDelete
  4. కవిత తెలుగులో ఎంత బాగుందో ఆంగ్లానువాదంలోనూ అంతా బాగుంది. మీకూ, ఎన్.ఎస్.మూర్తిగారికీ హృదయపూర్వక అభినందనలు.

    ReplyDelete
  5. >>> ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..

    అది ఏదో తెలిస్తే జీవితానికి అర్ధం తెలిసినట్టే.

    అనువాదం, తెలుగు లో కవిత రెండు చాలా బాగున్నాయి.

    హృదయ పూర్వక అభినందనలు.

    ReplyDelete
  6. original and translation both are laudable

    ReplyDelete
  7. "అవే సుఖమైన జీవితాలేమో అనిపిస్తుంది. తృప్తి ఉండదు, అసంతృప్తి తెలియదు. :)"

    ఏమి చెప్పితివి సోదరా!! చాలా నిజం!

    చాణక్య కామెంట్ చూసి పోస్ట్ లోకొచ్చాను. పైకి స్క్రాల్ చేసి చదివాను. నాకెందుకో ఇంగ్లీష్ అనువాదం ఇంకొంచెం బావున్నట్లనిపించింది.

    Yes, the quest.. the search....
    has been going on, and no hopes as of yet that it will come to a fruitful end someday :(

    I wonder God hasn't had the time to develop a Google engine yet :)
    Sometimes Cntrl+F won't work, we need a massive intelligent search engine to suggest us some prompts..."is this what you are searching for" అని. Traditionally, that prompting role is played by our closest friends/well-wishers.
    In the world filled with 'I-know-it-all' people, those species are being driven out, to the extinction.

    ReplyDelete
  8. తెలుగులో కవిత,అనువాదం రెండు చాలా బాగున్నాయి.
    హృదయ పూర్వక అభినందనలు.

    ReplyDelete
  9. అన్వేషణ ,మనిషిని మానసిక, సామాజిక. శాస్త్ర. సాంకేతిక రంగాలలో ఇంత స్థాయికి తీసుకు వచ్చింది.తత్వ వేత్తలు ,శాస్త్ర వేత్తలు,చేసింది ఇదే!అలాగే మనిషి తన దైనందిన జీవితంలో పడి జీవిత ప్రవాహం లో కొట్టుకుపొతూ దేనికోసమో అన్వేషిస్తున్నాడు.స్పష్టత లేదు జీవితం పట్ల.తన అంతరంగాన్ని శోధించి సత్యాన్వేషణ వైపు జీవితాన్ని మళ్లిస్తే బాగుంటుంది. కవితలలో ఇది ఒక కొత్త భావన.trnslation is very nice.congratulations to both of you.

    ReplyDelete
  10. అన్వేషణ మనిషిని ఉన్నతమైన పథంలోకి నడుపగలిగిననాడు ఫలితమెప్పుడు సమాదరణీయమే. అలాకాని నాడు అసంతృప్తి పెరిగి అన్వేషణ నిష్ఫలమవుతుంది.In the present scenario everyone appears to be busy but at the end of the day dissatisfaction peeps in,then the human mind tries to search in the vacuum.

    ReplyDelete
  11. అనువాదం చాలా బావుంది!

    original \m/ :)

    ReplyDelete
  12. నేనిదివరకే చదివేశానండీ! మళ్ళీ చదివానీరోజు!! బాగుంది.

    ReplyDelete
  13. కుమార్‌గారూ తెలుగే బాగుంది. ఇది మీరు ఒప్పుకుని తీరాలి. (ఎందుకంటే నాకు ఇంగ్లీష్‌లో యాభై మార్కులే వచ్చేవి కాబట్టి.) :P

    'Traditionally, that prompting role is played by our closest friends/well-wishers.
    In the world filled with 'I-know-it-all' people, those species are being driven out, to the extinction.'

    So true!!

    ReplyDelete
  14. తెలుగులో యెంత చక్కగా భావాలు అమరాయో...అనువాదం లో కూడా అలాగే అమరాయి.
    మంచి బ్లాగ్ పరిచయం చేసావు మధురా...కంగ్రాట్స్

    ReplyDelete
  15. హృదయపూర్వక అభినందనలు మధురా!
    నీ కవిత ఇదే నేను చదవడం.. నాకైతే చాలా నచ్చింది.. ఇలాంటివి రాస్తే చదవాలన్నది నా కోరిక ;-)
    ఆంగ్లానువాదం చాలా బాగా చేశారు.. చెప్పకుండా ఉన్నట్లైతే అసలు ఏది ముందు రాయబడిందో తెలిసేది కాదేమో!? :-)

    ReplyDelete
  16. Wonderful, అనువాదం ఎంతో బాగుంది.
    Original ఆణిముత్యం కనుకే అంత నాణ్యంగా అనువాదమూ వచ్చింది.
    అభినదనలు చిన్న కుట్టి గరూ...oops...Dr.మధురవాణి గారూ! ;)
    Congratulations N.S.మూర్తి గారూ, for such a wonderful translation in which you kept the originality as is.

    ReplyDelete
  17. @ చాణక్య, the tree, జలతారువెన్నెల, శ్రీలలిత, బులుసు సుబ్రహ్మణ్యం, puranapandaphani, కుమార్ N, అనూరాధ, oddula ravisekhar, పద్మార్పిత, C. ఉమాదేవి, హరేకృష్ణ, కష్టేఫలే, శశికళ, నిషిగంధ, చిన్నిఆశ, venky, tanmayanand
    కవితకి స్పందించి అభినందించిన మిత్రులందరికీ నా తరపునా, మూర్తి గారి తరపునా హృదయపూర్వక ధన్యవాదాలు.

    @ చాణక్య,
    << ప్రతీ మనిషి జీవితంలోనూ ఉండేదే ఇది. కానీ నూటికి తొంభై జీవితాలు ఆ వెతుకులాటని, అసంతృప్తిని గుర్తించకుండానే ముగిసిపోతాయి. అవే సుఖమైన జీవితాలేమో అనిపిస్తుంది. తృప్తి ఉండదు, అసంతృప్తి తెలియదు.
    కదా.. నేనూ ఎప్పుడూ ఇదే మాటనుకుంటూ ఉంటానండీ.. :)

    @ బులుసు గారూ,
    << అది ఏదో తెలిస్తే జీవితానికి అర్ధం తెలిసినట్టే.
    అవును గానీ గురువు గారూ, అదెప్పటికైనా మనకి తెలుస్తుందంటారా అసలు? ;)

    ReplyDelete
  18. @ కుమార్ N,
    సేమ్ పించ్.. నాక్కూడా ఇంగ్లీషు అనువాదం కొంచెం ఎక్కువ నచ్చిందండీ..
    బాగా చెప్పారండీ.. మీరు చెప్పిన ప్రతీ మాటతో ఏకీభవిస్తాను. :)

    @ oddula ravisekhar,
    మీరు చెప్పింది నిజమేనండీ.. నిరంతరాన్వేషణే మనిషి జీవితాన్ని ముందుకి నడిపిస్తుందేమో అనిపిస్తుంది. జీవితం కొన్ని ప్రశ్నలకి సమాధానాల్ని చూపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనలో కొత్త కొత్త ప్రశ్నల్ని రేపుతూ ఎల్లప్పుడూ మనల్ని అన్వేషించమంటూనే ఉంటుంది. మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    @ C. ఉమాదేవి,
    హ్మ్మ్.. మరో కోణాన్ని, కాదనలేని నిజాన్ని గుర్తు చేసారు.

    ReplyDelete
  19. @ కష్టేఫలే,
    శర్మ గారూ మళ్ళీ మళ్ళీ చదివి వెన్ను తడుతున్నందుకు బోల్డు కృతజ్ఞతలు. :)

    @ నిషిగంధ,
    ఇంకా ఇలాంటివి రాయాలంటావా.. హుమ్మ్.. ఏమో నిషీ, ఏదో తోచింది రాసేస్తున్నా ప్రస్తుతానికి.. చూద్దాం మళ్ళీ ఇలాంటివి రాయాలనిపిస్తుందేమో ఎప్పుడన్నా.. ;)

    @ చిన్నిఆశ,
    నేనీ మధ్య నాకు తెలీకుండానే ఏదైనా కొత్త పోస్టు రాస్తే మీ కామెంటు కోసం ఎదురు చూస్తున్నాను. Thank you so much for your affectionate words. :)

    ReplyDelete
  20. Meditative thoughts..!
    A very common but unexpressed self aptly worded in the original..andhuke translation antha baaga kudirindhi..thanks to you both and keep it flowing..!!!

    ReplyDelete
  21. @ Madhu Pemmaraju,
    Thanks for your kind words! :)

    ReplyDelete
  22. అన్నీ తెలుసు అని అనిపిస్తున్న
    ఈ అన్వేషణా ఆగదు ఆ ఆర్తి దాగదు

    రెండూ బాగున్నాయి.....ఉపోద్గాతం కూడా :))

    *చాణక్య గారు ......లాల్ సలాం

    ReplyDelete
  23. "ఊపిరి కొడగట్టే దాకా.. ప్రాణం కడగంటే దాకా..
    నా అస్థిత్వం ఆవిరైపోయే క్షణం దాకా..
    ఈ నా అన్వేషణకి అంతనేదే లేదేమో!"


    మధురవాణి గారూ! నా ఊహ నిజమయితే, ఈ కవిత రాసేసిన తరువాత కాసేపు ఆ కవితను అలా చూస్తూ ఉండిపోయుంటారు మౌనంగా..(assuming that you wrote it on అ paper first).. నేనయితే అదే చేసాను. పైన రాసిన 4 లైన్లు మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నా.. కవిత అంతా ఏదో ఒక ఆర్ద్రత (చాలాసేపు ఆలోచించాక ఇదే సరయిన పదం అనిపించింది. సరయినదేనా??) నిండి ఉంది. తేలికయిన పదాలు, బరువయిన భావాలు. ఒక టన్ను దూదిని మోస్తున్నట్టు గా..

    చించేశారు..ఎప్పటిలాగే.. :-)
    ...... హరీష్

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!