Monday, January 16, 2012

నా కథ 'ఒక ప్రయాణం - ఒక పరిచయం' 'మాలిక పత్రిక' సంక్రాంతి సంచికలో..

నేను వ్రాసిన 'ఒక ప్రయాణం - ఒక పరిచయం' అనే కథ 'మాలిక పత్రిక' సంక్రాంతి సంచికలో ప్రచురితమైంది. నా కథని ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..

15 comments:

  1. అభిననదనలు మధురవాణి గారూ...

    ReplyDelete
  2. అభినందనలు మధురా.. కథ బాగుంది..

    ReplyDelete
  3. అభినందనలు మధురవాణి గారూ! చాలా బాగుంది నిజ జీవితంలో జరిగినట్టు ఉంది. వారిద్దరినీ అలా కలపడం చాలా బాగుంది.

    ReplyDelete
  4. అభినందనలు మధురవాణి గారూ! కథ సుఖాంతం అవడం బాగుంది.

    ReplyDelete
  5. కథ ప్రచురితమయినందుకు congrats మీకు, "మధురవాణి - బ్లాగ్" కి మీరు రాసిన caption చాలా బాగుంది.

    ReplyDelete
  6. @ రాజ్, జ్యోతిర్మయి, వేణూ శ్రీకాంత్,
    థాంక్యూ సో మచ్ నేస్తాలూ.. :)

    @ రసజ్ఞ,
    ఇది నిజ జీవితంలో జరిగిన కథ కాదు గానీ మీకంత సహజంగా అనిపించినందుకు సంతోషంగా ఉంది. థాంక్యూ! :)

    @ కొత్తావకాయ గారూ,
    మీకు నచ్చిందా అయితే.. ధన్యోస్మి.. :)

    @ రామకృష్ణ,
    డబుల్ థాంక్సండీ మీకు.. :))

    @ శైలబాల,
    థాంక్యూ డియర్.. :)

    ReplyDelete
  7. కథ చాలా బాగుంది. సుఖాంతం చేసి ఆసక్తికరంగా ముగించారు. కలసిన మనసులు అనుకోకుండా ఒకటవటం చాలా థ్రిల్లింగ్.

    ReplyDelete
  8. హలో మధుగారూ! ఈసారి నేను మీ కథ ని పొగడటం లేదు.. నమ్మరా? నిజం... నాకు కథ అంతగా ఏమి నచ్చలేదు..మిమ్మల్ల్ని పొగిడి పొగిడి అలిసిపోయిన నాకు ఇన్నాళ్ళకి ఇలా నచ్చలేదని చెప్పే అవకాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు.. ఎందుకు నచ్చలేదంటే......
    1. మీ కథలో మీరే కనిపించారు.. మొదటి భాగం లో సంభాషణలు మధురే మాట్లాడుతోంది అని అనిపించేలా ఉన్నాయి. నాకు సంకీర్తన బదులు మధుర స్టైల్ కనిపించింది. ఇది మీ రచనా శైలి కి విరుద్ధంగా ఉంది. ఇంతకుముందు మీ కథల్లో మాకు ఆ క్యారెక్టర్ ఎ కనిపించేది..
    2 . కథ కొంచెం కంగారు లో రాసారా? .. తొందరగా ముగించేయ్యాలి అన్నట్టు రాసారు.
    3 . కథ పాతది లాగే అనిపించింది.
    అసలు విషయం ఏంటి అంటే ఈ కథ మీరు రాసారు కాబట్టే నాకు నచ్చలేదు. ఇంకెవరయినా రాసి ఉంటె ఖచ్చితంగా పోగిడేవాడిని.. మీ రచనల స్థాయిని ఈ కథ అందుకోలేకపోయింది..

    (మమ్మీఈఈఈఈ ... అని ఏడుపు వినిపిస్తోంది.. మీరు కాదు కదా??!!! )

    ReplyDelete
  9. @ చిన్నిఆశ,
    ధన్యవాదాలండీ.. :)

    @ హరీష్ బలగ,
    పోన్లెండి.. ఏదోక అవకాశం ఇచ్చాను కదా మీకు.. :)))
    Thanks for your honest feedback.. Points noted! :)

    అన్నట్టు.. నేనేం ఏడవట్లేదు.. అందుకని నన్ను మెచ్చుకుంటూ అర్జెంటుగా ఒక పెద్ద డబ్బా చాక్లెట్స్ పంపించండి.. :)

    ReplyDelete
  10. ఆ అలాగే. అడ్రస్ చెప్పండి. polo holes పంపిస్తా. రోజుకొకటి తింటూ పండగ చేస్కొండి.

    ReplyDelete
  11. @ హరీష్ బలగ,
    ఏంటీ.. polo పంపిస్తారా.. అది కూడా రోజుకోటి తిని పండగ చేస్కోమంటారా.. అబ్బ.. ఈ మాత్రానికే సిక్కిం బంపర్ లాటరీ ఆఫర్ ఇచ్చినట్టు చెప్తున్నారుగా.. :P మీకెందుకులెండి అంత కష్టం.. పోస్టల్ ఖర్చులు దండగ.. మీ పేరు చెప్పుకుని నేనే polo కొనుక్కుంటాలే.. :))

    ReplyDelete
  12. భలే ఉంది కథ .లాస్ట్ ఎలా ఎండ్ చేస్తావా అనుకుంటూ చదివా :)నాకు ప్రయాణం ,ఇష్క్ సినిమాలు గుర్తొచ్చాయి . రాసే స్టైల్ చాలా బాగుంది .

    ReplyDelete
  13. ​@ రాధిక (నాని),
    థాంక్స్ రాధికా.. ఈ కథ రాసేసిన తర్వాతే ఇష్క్ సినిమా వచ్చినట్టుంది. ఇంకెవరో కూడా అన్నారీ మాట! ఈ కథాంశం చాలాసార్లు చాలామంది రాసేసినదే అనుకుంటాను. :-)​

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!