Friday, December 23, 2011

It's a wonderful life


క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది కదా.. సందర్భంగా క్రిస్మస్ టైం లో చూడదగిన ఒక గొప్ప సినిమా గురించి చెప్తాను. ఇది 1946 లో తీసిన నలుపు తెలుపు సినిమా. సినిమా పేరు It's a wonderful life. అప్పుడెప్పుడో పాత కాలంలో తీసిన సినిమా అయినప్పటికీ నిర్మాణపు విలువలు గానీ, నటీనటుల అభినయాలు గానీ చూడచక్కగా అత్యంత సహజంగా, సినిమా చూసిన మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. సినిమాకి కథ, కథనం, దర్శకత్వం నాకైతే అద్భుతం అనిపించింది. ఇంక సంభాషణల గురించైతే సినిమాకి అవే ప్రాణం అని చెప్పుకోవాలి. సినిమా చూసి నచ్చలేదు అనేవారుండరని నా నమ్మకం. నాకైతే నా ఆల్ టైం ఫేవరేట్ సినిమాల లిస్టులో సినిమా చేరిపోయింది.
కొన్ని నెలల క్రితం మొదటిసారి నేనీ సినిమా చూసినప్పుడే నా బ్లాగ్లో ఒక పోస్ట్ రాద్దామనుకున్నాను. కానీ, అదేంటో ఒకోసారి ఏదైనా మరీ ఎక్కువ నచ్చేసినా దాని గురించి ఏమని చెప్పాలో, ఎలా అక్షరాల్లో పెట్టాలో తోచదు. నేనీ సినిమా చూసే సమయానికి సినిమా కథ గురించి నాకస్సలేమీ తెలీదు. సినిమా చూస్తున్నప్పుడు నిజంగా చాలా థ్రిల్లింగా అనిపించింది. అందుకని ఇప్పుడీ సినిమా కథ మొత్తం వివరంగా చెప్పడం నాకిష్టం లేదు. అదీ గాక సినిమాని సమీక్షించేంత సాహసం కూడా నేను చెయ్యలేను కాబట్టి క్లుప్తంగా సినిమా కథని పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

అనగనగా ఒక చిన్న మారుమూల పల్లెటూర్లో ఒక తెలివైన, చురుకైన అబ్బాయి. 'డబ్బు సంపాదన, మన కోసం మనం బ్రతికాం' అన్నదాని కన్నా మన చుట్టూ ఉన్న వారిలో కనీసం నలుగురి జీవితాల్లోనైనా సరే వెలుగులు నింపడంలోనే గొప్ప సంతృప్తి ఉందని నమ్మే తండ్రికి వారసుడైన అబ్బాయికి చిన్న ఊర్లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ బ్రతకడం అస్సలు ఇష్టం లేని పని. ఎప్పటికైనా చదువు ముగించుకుని కుగ్రామం నుంచి బయటపడి దేశ విదేశాల్లోని ప్రముఖమైన ప్రదేశాలన్నీ సందర్శిస్తూ మొత్తం ప్రపంచాన్నంతా చుట్టి రావాలని చిన్ననాటి నుంచీ అతని కల, ఆశయం. పట్టుదలగా అనుకున్నది ఏదైనా భేషుగ్గా సాధించగల తెలివితేటలు, సమర్ధత కలిగిన అబ్బాయి తన ఆశయాలకి అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న మనస్తత్వాన్ని వారసత్వంగా అంది పుచ్చుకున్న యువకుడు తన జీవితంలోని ప్రతీ మలుపులోనూ తన సొంత కలలు నిజం చేసుకోడం కంటే తన చుట్టూ ఉన్న వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడటం ముఖ్యమనుకుంటాడు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఎలాంటి ఇబ్బందులూ, కష్టాలూ ఎదుర్కోవలసి వచ్చింది, చివరికి అతను జీవితంలో ఏం సాధించగలిగాడు, అతని చివరికి మిగిలింది ఏంటి, తనకి (మనకి కూడా) జీవితం అందించిన స్ఫూర్తి ఏంటీ.. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

అదే చిన్న ఊర్లో ఒక ముచ్చటైన అమ్మాయి. చిన్ననాటి నుంచీ తన మనసంతా ఒక అబ్బాయి స్నేహం వైపే మొగ్గేది. చాలా చిన్నప్పుడే "నేను అబ్బాయిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా" నన్న గట్టి నిర్ణయానికొచ్చేసేంత ఇష్టం, ఆరాధనా అబ్బాయంటే! అమ్మాయికి వయసుతో పాటు అతగాడిపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. అబ్బాయికి కూడా అమ్మాయి అంటే ఇష్టం ఉన్నప్పటికీ అతని ధ్యాస, దృష్టి మిగతా బోల్డు విషయాలపై ఉండటం వల్ల ప్రేమా, పెళ్ళీ గురించిన ఆలోచన తక్కువ. అసలా అమ్మాయి కళ్ళల్లో ఎప్పుడు చూసినా ఇతగాడిపై ప్రేమ తప్ప మరేం కనిపించదు.. అంతలా ఆరాధిస్తుంటుంది.
వాళ్ళ చిన్నప్పటి రోజుల తర్వాత మళ్ళీ అమ్మాయికి పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఒకానొక సందర్భంలో మన హీరో ఎదురుపడతాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యానందాలలో తేలిపోయి కళ్ళతోనే ఇష్టం ప్రదర్శించుకుంటారు.
ఆనాటి వెన్నెల రాత్రి నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో ఇద్దరూ అలా అలా నడుచుకుంటూ వెళుతుండగా అబ్బాయి అడుగుతాడు.. "నీకోసం ఏం ఇమ్మంటావ్ చెప్పు.." అంటూ ఆకాశంలోకి చూస్తే అక్కడ వెన్నెల్లో మెరిసిపోతున్న చందమామ కనిపిస్తుంది.
"నీక్కావాలా చెప్పు.. నేనిప్పుడే ఆకాశంలోకి ఒక తాడు వేసి చంద్రుణ్ణి కిందకి లాగేసి భూమ్మీదకి దించి నీకు కానుకగా ఇచ్చేస్తా"నంటాడు.
".. సరే.. నేనా చందమామని తీసుకుంటాను. తర్వాత?" అంటుంది అమ్మాయి.
" తర్వాతేముందీ.. నువ్వా జాబిలిని అమాంతంగా మింగేసేయ్.. అప్పుడు వెన్నెలంతా నీలోనే నిండిపోతుంది. నీ కళ్ళల్లోంచీ, చేతి వేలి కొనల నుంచీ, నీ కురుల చివర్ల నుంచీ వెన్నెల కురుస్తుంది..." అంటూ మురిపించేస్తాడు మన హీరో.
సినిమాలో నాకు చాలా చాలా ఇష్టమైన సన్నివేశం ఇదే! అందమైన జ్ఞాపకాన్ని అమ్మాయి పదిలంగా దాచుకుంటుంది. అదెలాగో సినిమాలో చూడాల్సిందే! ;)

తర్వాత అమ్మాయి చదువు కోసమనీ, అబ్బాయి బాధ్యతలలో తలమునకలైపోతారు. అమ్మాయి పెళ్ళి చేసుకోడానికి బాగా డబ్బున్న వేరే అబ్బాయిలున్నా గానీ తన ఆశ, ధ్యాస నిత్యం అబ్బాయి మీదే పెట్టుకుంటుంది. ఇతగాడినే వలచి వరిస్తుంది. అది మొదలు అతను వేసే ప్రతీ అడుగులో వెన్నంటి నడుస్తుంది. అచ్చమైన అర్ధాంగిలా అతను చేసే ప్రతీ పనిలో తోడుగా నిలబడుతుంది. అతని కష్టనష్టాల్లో పాలు పంచుకుంటుంది. ఒకానొక సందర్భంలో అతను అమ్మాయికి విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాననిపించి "నువ్వెందుకసలు నన్ను పెళ్ళి చేసుకున్నావ్?" అంటాడు కొంచెం దిగాలుగా. అప్పుడా అమ్మాయి తేలిగ్గా నవ్వేసి "నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోయుంటే నేను ఒంటరిగానే ఉండిపోయేదాన్ని. నువ్వే ఎందుకు కావాలనుకున్నానంటే నా పిల్లలు అచ్చం నీలాగే ఉండాలనుకున్నాను కాబట్టి.." అంటుంది. అతని సాహచర్యం తప్ప ప్రపంచంలో విలువైనది మరేదీ లేదనుకుంటుంది. అమ్మాయి ప్రేమనీ, ప్రేమపై తనకున్న నమ్మకాన్నీ చూస్తే ప్రేమని మించిన పెన్నిధి జీవితంలో మరేం ఉంటుంది అనిపిస్తుంది.

ఇంత చెప్పేసాక సినిమాలో ఇంకా కథేం మిగిలి ఉంటుంది చూట్టానికి అనుకుంటున్నారా! నేనింతవరకూ చెప్పింది కేవలం అబ్బాయి, అమ్మాయి మధ్యనున్న ప్రేమని గురించిన చిన్న భాగం మాత్రమే! అసలు కథ సినిమాలో వేరే ఉంది. అదేంటో చెప్పను గానీ, సినిమా చూసాక నాకేమనిపించిందో చెప్తాను.
జీవితం మనకొక విలువైన బహుమతి అనీ, It's a wonderful life! అనీ సినిమా మరోసారి మనకి గుర్తు చేస్తుంది. సినిమా చూసేసాక మనం చాలా ఆలోచనల్లో పడిపోతాం. మన లైఫ్ ఎంత వండర్ఫుల్ అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కునే పనిలో పడిపోతాం. అలాగే, మన జీవితానికున్న విలువ కేవలం మన కోసం మనం ఏం సాధించాం అన్నదొక్కటే కాదు, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో ఎంతవరకూ మనం సంతోషాన్ని నింపగలిగాం అన్నదాని మీద కూడా ఆధారపడి ఉంటుందని గుర్తిస్తాం. ఎప్పుడైనా జీవితంతో పాటు తీసే పరుగులో అలసిపోయి, విసుగెత్తిపోయి, విరక్తి చెంది "అబ్బా.. అసలు అనవసరంగా పుట్టానేమో.. అసలీ జన్మే లేకపోయుంటే ఎంత బావుండేది.. అయినా నా పిచ్చి గానీ నేను పుట్టనంత మాత్రాన ప్రపంచానికి వచ్చే నష్టమేముంది" లాంటి ఆలోచనలు రావొచ్చు. జీవితం మీద విరక్తి కలిగే అలాంటి క్షణాల్లో ఖచ్చితంగా సినిమా గుర్తొచ్చి తీరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మనలో ఒక ఆశావహ దృక్పథాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుందని మాత్రం నమ్మకంగా చెప్పగలను. అందుకే మరి సినిమా అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ వారి సత్కారాలు ఎన్నింటినో అందుకుంది.
This movie has been voted the #1 inspirational film of all time in AFI's "100 Years, 100 Cheers", Ranked as the #1 Most Powerful Movie of All Time, Also ranked as the #20 Greatest Movie of All Time.
సినిమా గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు. సినిమా చూసేసిన తరువాత సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని ఇక్కడ చూడొచ్చు.

నేను ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూడనంటూ కాస్త బద్ధకించినా సరే విసుక్కోకుండా "చాలా మంచి సినిమా. ఒక్కసారి ఓపిక చేసుకుని చూడండి. సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసాక మీరే సినిమా గురించి ఒక పోస్ట్ రాసి అందరికీ పరిచయం చేస్తారు చూడండి" అంటూ బోల్డంత ఓపిగ్గా నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మరీ ఇంత మంచి సినిమాని నాకు చూపించిన మనందరి చల్లటి ఫ్రెండ్ గారికి బోల్డు బోల్డు థాంకులు చెప్తూ.. క్రిస్మస్ కి మీకో బుల్లి కానుకగా పోస్ట్ మీకే అంకితం. క్రిస్మస్ రోజున మీ కోసం కూడా ఒక ఏంజెల్ వచ్చి మీ విషెస్ అన్నీ తీర్చెయ్యాలని మనసారా కోరుకుంటూ Merry Christmas! :)

26 comments:

  1. అదేంటో చెప్పనుగాని..... పూర్తిగా చెప్పివుండాల్సింది. సినిమా చూసిన వాళ్ళకి ఇది బోనస్. చూడలేకపోయిన వారికి, చూడడానికి సావకాశం లేని వారికి అదృష్టం కదా.

    ReplyDelete
  2. చాలా ఆసక్తికరంగా రాశారు, తప్పక చూసి మా అభిప్రాయం త్వరగా చెప్పాలినిపిస్తుంది.
    Merry Christmas !

    ReplyDelete
  3. నీ పోస్టుల గురించి కొత్తగా చెప్పేదేముంటుంది మధూ? ఇంతకీ మనందరి చల్లటి ఫ్రెండ్ ఎక్కడ అఙ్ఞాతవాసం చేస్తున్నాడు? కనిపించడం లేదు? అందునా ఇప్పుడు హాలిడేస్ కూడా కదా?

    ReplyDelete
  4. sameeksha baagundi. naaku english movies choodalante baddakam kaani choodadaaniki prayathnisthaanu. nenu mee blog gurinchi eenadu paper lo chadivi naa blog pettanu. adi cheppe avakasham ee roju vachhindi. thank you so much.

    ReplyDelete
  5. Yes, really 'touchy touchy' movie! Especially the scene where the hero meets the girl in the garden and the Angel meets the Hero, the Crooked moneyed man's discussions with the Hero oh I cannot stop telling which all are the scnenes, probably I will repeat all the scenes!

    Really it's a wonderful life! I do not know if you have seen the other ones Roman Holiday or Shangrila, the other good ones of 'our' (g)old those times! It pulls me back to 'my days'!

    cheers
    zilebi

    ReplyDelete
  6. సినిమా గురించి చాలాబాగా చెప్పావు మధు .
    నీకూనూ మెరీ క్రిస్మస్ .

    ReplyDelete
  7. ప్లస్ లో పోస్ట్ చూడగానే ఇంకేమీ ఆలోచించకుండా పరిగెత్తుకు వచ్చేసా, పోస్ట్ అలాంటిలాంటి సినిమా మీద కాదాయే. My all time favorite greatest movie... just awesome. The only movie I wish to write a review for- I wish to present. you grabbed it :)

    ఇది చూసాక జేమ్స్‌ స్టీవార్ట్‌కు ఫంఖానైపోయి దొరికిన సినిమానల్లా డౌన్‍లోడ్ చేశా. తనది మరొక సినిమా Mr.Smith goes Washington, వీలైతే అది కూడా చూడండి.బావుంటుంది

    ఈ సినిమా గురిమ్చి ఎంత చెప్పినా తక్కువే ఆ సన్నివేశాలు, స్కిన్‌ప్లే, పాత్రలు ఒహ్ ఒకటా రెండా and i think any review would be incomplete without mentioning Clarence's words. మీరు పెట్టుంటారు అనుకున్నా, మరేం ఫరవాలేదు here it goes "Strange, isn't it? Each man's life touches so many other's lives that when he isn't around he leaves an awful hole, doesn't he?" - జీవితం గురించి ఎంత బాగా చెప్పాడొ కదా.

    అవకాశం ఉంటేగనక ఈ సినిమా గురించి ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది.ప్చ్ !
    Thank you a lot lot lot for the post and for reminding an absolute classic

    ReplyDelete
  8. జేమ్స్‌ స్టీవార్ట్ మూవీనా ఇది ... ఈ మూవీ మంచు గారి ప్రొఫైల్ లో చూసాను .. ఆయన ఫేవరేట్ మూవీస్ లిస్టు లో ఉండడం చూసాను ...కాని మరి ఇంత ఇష్టం మని తెలియదు ..సో అంత ఇష్టమైన మూవీతో ఆయనకీ క్రిస్టమస్ విషెస్ చెప్పడం బాగుంది

    ఇంత బాగుంటుందని ఈ మూవీ గురించి నాకు ఇప్పడివరకూ ఎవ్వరు చెప్పలేదు ...నాకు తెలియదు కూడా
    . చాలా బాగా చెప్పావు మధు ... నీ పోస్ట్ చూసి అర్జెంట్ గా ఆ మూవీ చూసేయ్యాలి అనిపిస్తుంది

    అంతే కాదు నువ్వు చెప్పినట్టే ..ఈ క్రిష్టమస్ కి మంచుగారి కోసం ఒక ఏంజెల్ వచ్చి ఆయన విషెస్ అన్ని తీర్చేసి ఆయన లైఫ్ కూడా వండర్ఫుల్ గా చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

    మీ ఇద్దరికీ హేపీ క్రిష్టమస్

    ReplyDelete
  9. ఈ సినిమా ఎప్పటినుండో చూద్దామని అనుకుంటున్నాను, కుదిరింది కాదు. మీ పోస్ట్ చూసాక వెంటనే చూసెయ్యాలని ఉంది.

    ReplyDelete
  10. మీ వివరణ బాగుంది.... తప్పకుండా ఈ సినిమా చూడటానికి ప్రయత్నిస్తాను...

    ReplyDelete
  11. శర్వానంద్ నటించిన " అందరి బంధువయా " సినిమా కధను దీనిలోంచి కొంత గ్రహించినట్ట్లున్నారు ...! టపా బాగా వ్రాసారు, తప్పకుండా చూస్తాను ...!

    ReplyDelete
  12. Nice Madhura..I'm gng to watch the film soon..

    ReplyDelete
  13. @ కష్టేఫలే,
    అంటే, కథంతా చెప్పేస్తే సినిమా చూడబోయే వాళ్లకి థ్రిల్ అంతా మిస్సయిపోతుందని కేవలం పరిచయం మాత్రం చేద్దామన్నట్టు ఇలా రేఖామాత్రంగా చెప్పానండీ. మీరొక పని చెయ్యండి. IMDB సైట్లో చూడండి. ఇంకా వివరంగా ఉంటుంది సినిమా కథంతా.. :)
    స్పందించినందుకు ధన్యవాదాలు.

    @ చిన్ని ఆశ,
    ధన్యవాదాలండీ.. తప్పకుండానండీ.. మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తాను. :)

    @ సునీత గారూ,
    థాంక్యూ థాంక్యూ! :)
    ఏమోనండీ మరి.. చల్లటి ఫ్రెండ్ గారు ఏ మంచుకొండల్లో ఉన్నారో.. కనిపించక చాన్నాళ్ళైంది కదా! :)

    @ వేణూ శ్రీకాంత్,
    థాంక్యూ! :)

    ReplyDelete
  14. @ గీత_యశస్వి,
    మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమయింది గీత గారూ! Nice to hear it! ధన్యవాదాలండీ.. :)

    @ జిలేబి,
    Totally agree with you! Really it's a wonderful life! B-)

    I haven't seen Roman Holiday and Shangrila. I'll try to watch them sometime. Thanks for the comment! :)

    @ మాలా గారూ,
    థాంక్యూ సో మచ్! :)

    ReplyDelete
  15. @ నాగార్జున,
    మీ excitement చూస్తే ఈ సినిమా గురించి వేరెవరైనా రాసుంటే నేను కూడా అచ్చం ఇలాగే ఉత్సాహం చూపించేదాన్ననిపించింది. :)

    సినిమా స్టోరీ మొత్తం చెప్పకుండా ఉంటేనే కొత్తగా చూసే వాళ్లకి బాగుంటుందనిపించింది నాగార్జున.. సింపుల్ గా పరిచయం మాత్రం చేద్దామన్నట్టుగా రాసాను. మీరెందుకు మానుకోడం, మీరు చక్కగా, మరింత వివరంగా రివ్యూ రాయండి. అయినా, ఈ సినిమా గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా వినడం బావుంటుందని నా నమ్మకం. :)

    సూపర్ డైలాగ్ గుర్తు చేసారుగా మీరసలు. Thanks a lot for your response! :)

    @ శివరంజని,
    నాకు కూడా ఇంగ్లీషు సినిమాల గురించి పెద్దగా తెలియదు రంజనీ.. తను చెప్తేనే తెలిసింది ఈ సినిమా గురించి. క్రిస్మస్ టైం లో చూడదగిన ఒక మంచి సినిమా కదాని ఇప్పుడు పరిచయం చేస్తే బాగుంటుందనిపించింది. Thanks for your comment! :)

    ReplyDelete
  16. @ జ్యోతిర్మయి, రాజ్, రాజేష్ దేవభక్తుని, రవి..
    స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. తప్పకుండా చూడండి. ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. :)

    @ రాజేష్ దేవభక్తుని,
    'అందరి బంధువయా' సినిమా నేనూ చూసానండీ! దానిలోనూ, ఈ సినిమాలోనూ, మంచితనం, మానవత్వం గురించే చెప్పినా కూడా రెండూ పూర్తిగా వేరే వేరే కథలండీ. ఇందులోంచి కథని గ్రహించారనుకోను. రెండూ చూసాక మీకేమనిపిస్తుందో చూడండి మరి.. :)

    ReplyDelete
  17. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  18. !! మధురవాణి !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  19. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మధుర గారూ

    ReplyDelete
  20. ఈరోజు ఈనాడు సండే అనుభందంలో మీ "చుక్కలమొక్కు చూసి చాలా ఇష్టపడి మిమ్మల్ని అభినందించాలని అనిపించింది.అభినందనలు
    లక్ష్మీ రాఘవ

    ReplyDelete
  21. @ జయ, తెలుగు పాటలు, సుభా,
    హృదయపూర్వక ధన్యవాదాలండీ.. మీకూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. :)

    @ లక్ష్మీ రాఘవ గారూ,
    చాలా సంతోషంగా అనిపించిందండీ మీ వ్యాఖ్య చూసి. అంత కష్టపడి వెతుక్కుంటూ వచ్చి మరీ అభినందించినందుకు మీ అభిమానానికి, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. :)

    ReplyDelete
  22. మధురవాణి గారూ, హ్యాపీ న్యూ ఇయర్ అండీ!

    ReplyDelete
  23. @ చిన్ని ఆశ,
    Thanks for the wishes! :)

    ReplyDelete
  24. మీ పరిచయానికి పూర్వమే ఈ సినిమా గురించి విన్నాను. మీర్రాసింది చదివాకా వెంటనే చూడలనిపించినా ఈ చిత్రం ఎక్కడా దొరకలేదు. దాదాపుగా ఏడాది తరువాత ఇవాళ ఈ సినిమా చూడడం కుదిరింది. జీవితం చాలా అందంగా కనిపిస్తోందిప్పుడు. థాంక్స్ మధుర గారు.

    ReplyDelete
  25. @ జ్యోతిర్మయి,
    మీ వ్యాఖ్య బోల్డు సంతోషాన్ని కలిగించిందండీ.. అప్పుడెప్పుడో నా బ్లాగులో ఈ పోస్టు చదివారన్న సంగతి జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి చెప్పడం నిజంగా గొప్ప విషయం. మీ అభిమానానికి బోల్డు ధన్యవాదాలు.
    నాక్కూడా క్రిస్మస్ రోజులు దగ్గర పడే కొద్దీ ఈ సినిమా తరచూ గుర్తొస్తూ ఉంటుంది.. :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!