Wednesday, November 23, 2011

పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..

ఈ పల్లవితో సాగే పాట 2004 లో వచ్చిన 'అమ్మాయి బాగుంది' సినిమాలోది. శివాజీ, మీరా జాస్మిన్ జంటగా నటించిన ఈ సినిమా గొప్ప హిట్ సినిమా కాకపోవడం వల్ల ఈ సినిమాలోని పాటలు ఎక్కువ మందికి తెలిసుండవేమో అనుకుంటున్నా.. నాక్కూడా ఈ ఒక్క పాటే బాగా తెలుసులెండి. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది MM శ్రీలేఖ. తన స్వరపరచిన చాలా పాటల్లాగే ఈ పాట కూడా కీరవాణి గారి శైలిని గుర్తుకు తెస్తుంది. ఈ పాట వినడానికి బావుంటుంది కానీ కొత్త పాటలా కాకుండా ఇదివరకు చాలాసార్లు విన్న ట్యూనే కదా అన్నట్టుంటుంది. నాకైతే పెళ్ళిసందడి పాటలు గుర్తొచ్చాయి.

ఈ పాటకి అందాన్ని తీసుకొచ్చింది మాత్రం కులశేఖర్ గారి సాహిత్యం, చిత్ర గారి గళం. ఇలాంటి ఒక పాట రాయాలి అన్న ఆలోచన ఎవరికొచ్చిందో కానీ నాకా అయిడియా చాలా నచ్చింది. కొత్తగా అనిపించింది. ముఖ్యంగా సెల్ ఫోన్, సిగిరెట్, కళ్ళు, ప్రేమ, సిగ్గు, బెస్ట్ ఫ్రెండ్ అనే పదాల గురించి రాసిన వ్యాఖ్యానాలు కొత్తగా అనిపిస్తాయి. సిగిరెట్ గురించి ఇంతందంగా చెప్పొచ్చని నాకీ పాట విన్నాకే తెలిసింది. ;)

రోజూ ఇష్టంగా పాటలు వినే అభిరుచి, అలవాటు ఉన్న వాళ్ళ జీవితంలో పాటలతో పెనవేసుకున్న జ్ఞాపకాలెన్నో కదా! అలాంటి వాళ్ళందరికీ ఈ పాట నచ్చుతుందని నా అభిప్రాయం. :)

ఈ పాటని ఇక్కడ వినొచ్చు.. ఇక్కడ చూడొచ్చు..

పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..
గుప్పెడు గుండెలలోన.. గుడి గంటల సందడిలోన.. ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం..
కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం..
ఎన్నెల్లోనా గోదారల్లే పొంగే సంగీతం..
పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..

సెల్ ఫోన్..
ఎంత దూరమైనా చిరుగాలి పాటలోన అనుబంధం పలికించే రాగం..

సిగిరెట్..
గాలి అలలపైన ఆ నింగి తాకుతున్న పొగమబ్బును కరిగించును రాగం..

కళ్ళు..
కంటి పాప భాష సంగీతం..
అంతులేనిదోయి సంగీతం..
గాలి గుండె పాట సంగీతం..
పూల చెట్టు నీడ సంగీతం..
అక్షరాలకందమైన రూపం..
హృదయలయల శృతులు కలుపు పెదవి సంతకం..

పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..

మరి ప్రేమ..
వానవిల్లులోన ఆ రంగులేడు అయినా ఎద పొంగుల తొలి రంగే ప్రేమ..

మరి బెస్ట్ ఫ్రెండ్..
కొంటె ఊసులోన ఈ ఒంటరీడులోన జత చేరిన ప్రియనేస్తమే ప్రేమ..

సిగ్గు..
పాలబుగ్గ సిగ్గు ఈ ప్రేమ..
వాలు కళ్ళ ముగ్గు ఈ ప్రేమ..
తేనె కన్న మత్తు ఈ ప్రేమ..
పూల కన్న మెత్తదీ ప్రేమ..
తీపి జ్ఞాపకాల పేరే ప్రేమా...
మనసు తలుపు తెరిచి పిలుచు చిలిపి సరిగమ..

పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..
గుప్పెడు గుండెలలోన.. గుడి గంటల సందడిలోన.. ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం..
కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం..
ఎన్నెల్లోనా గోదారల్లే పొంగే సంగీతం..

5 comments:

  1. పాట రాగం గుర్తుంది కాని నాకు సాహిత్యం తెలియదు. మంచి పాటని టపా చేసారు. ధన్యవాదాలు మధుర గారు.

    ReplyDelete
  2. సాహిత్యం చాలా బావుంది. మంచి పాత వినిపించారు.ధన్యవాదములు

    ReplyDelete
  3. మంచిపాట మధురా, నిజమే మొదటి సారి విన్నపుడు సాహిత్యం చిత్రంగా బాగా రాశాడు మంచి ఐడియా అనిపించింది. ఈ అల్బం అంతాకూడా బాగానే ఉంటుంది ఈ సినిమాలో మధు బాలకృష్ణ పాడిన “కలే కన్నానులే చెలియా” అన్నపాట నాకు ఎక్కువ ఇష్టం. అమ్మాయిబాగుంది, నిజమే చెప్తున్నా, కృష్ణ కృష్ణ హరిగోవింద మురళీ గానం బాగుందా అన్న పాటలు కూడా బాగానే ఉంటాయి.

    ReplyDelete
  4. Hi Madhura,

    I am here again ... after along time ... hhaha

    ee paata nenu chaala sarlu vinnanu. chaala chaala baaguntundi. eeroju work chesi chesi full stress lo unna. ne blog gurthochindi .. open cheste ventane manchi paata undi ... thanks for this song ...

    enjoy cheyandi .. bye

    ReplyDelete
  5. @ సుభా, జ్యోతిర్మయి..
    అయితే మీకూ నచ్చిందా ఈ పాట.. ధన్యవాదాలండీ.. :)

    @ వేణూ శ్రీకాంత్,
    'కలే కన్నానులే' పాట నేనూ విన్నాను వేణూ.. బావుంటుంది. అమ్మాయి బాగుంది పాట కూడా బానే ఉంటుంది కానీ, ట్యూన్లు చిరపరిచితంగా అనిపిస్తాయి కదూ! ;)

    @ Prasad Gutti,
    ఓహో.. మీకు ముందే తెలుసా ఈ పాట! Thanks for visiting my blog! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!