Monday, August 15, 2011

నా అక్షరాల ఓదార్పు!


నా ఆకాశపు నీలిరంగుని ఎవరో ఎత్తుకెళ్ళిపోతుంటే తెల్లబోయి చూస్తుండిపోయాను నిస్సహాయంగా..
చుక్కలన్నీ జలజలా నేలరాలిపోయాయి కలకాలం అమావాస్య చీకటిలోనే పడుండమని శపిస్తూ..
అలల ఊపిరి ఆగిపోయింది శాశ్వతంగా మనఃసంద్రాన్ని మూగతనంలోనే మగ్గిపొమ్మని శాసిస్తూ..
హృదయ విలయానికి పొంగిన కన్నీటి వరదలో కళ్ళల్లోని కలలన్నీ గూడు ఖాళీ చేసి పోయాయి..
ఇంతటి శూన్యంలోంచి కూడా నా అక్షరాలు వెలికి వచ్చి నన్ను సముదాయిస్తూ నీకు మేమున్నామంటూ ఊరడిస్తున్నాయి..!


9 comments:

  1. ఇంతటి శూన్యంలోంచి కూడా నా అక్షరాలు వెలికి వచ్చి నన్ను సముదాయిస్తూ నీకు మేమున్నామంటూ ఊరడిస్తున్నాయి..!

    ఇది చాలా బావుంది

    ReplyDelete
  2. మీ అక్షరాలకు మెచ్చిన నేస్తాలం మేము ఉన్నాం గా.

    ReplyDelete
  3. చాలా బాగుంది మధురా!!! :)

    ReplyDelete
  4. @ కృష్ణప్రియ, వేణూ శ్రీకాంత్, హరే కృష్ణ, భారతీయ, లోకనాథ్, ఇందూ, రఘు, కిరణ్...
    థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్! :)

    @ లోకనాథ్..
    ఉన్నారుగా మరి.. అందుకే నా అక్షరాలు మీ స్నేహం చేస్తున్నాయి.. :))

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!