Monday, July 18, 2011

చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం.. డబ్బులిచ్చాం.. వెంట తీసుకొచ్చాం!

ఈ పాట 2000 సంవత్సరంలో ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నుంచి వచ్చిన 'శుభవేళ' అనే సినిమాలోది. ఈ సినిమాలో నాయికానాయికలు రవికాంత్, అనసూయ అనే కొత్తవాళ్ళు. నిజానికి నాకీ సినిమా గురించి ఏమీ తెలీదు.. ఈ సినిమా కూడా అస్సలు ఆడినట్టు లేదు.. కానీ, అప్పట్లో ఈటీవీలో తెగ వేసేవాడు ఈ సినిమా యాడ్స్.. అందుకని ఈ సినిమాలో "చిలకలాగా.. చినుకు లాగ.." అనే ఒక్క పాట మాత్రం తెలుసు నాకు. కానీ, ఇప్పుడు నేను చెప్పే పాట కూడా చాలా చాలా బావుంటుంది. చాలా సరదాగా ఉన్నట్టే ఉంటుంది గానీ కాసేపు ఆలోచనలో పడేస్తుంది.. ముఖ్యంగా అమ్మాయిలని.. :) పాట రాసిన కులశేఖర్ గారు చాలా బాగా రాసారు. సంగీతం RP పట్నాయక్ అందించగా దీప్తి, నిత్య పాడారు. పాడిన గొంతు కూడా అచ్చం టీనేజ్ అమ్మాయి గొంతులా చాలా స్వీట్ గా ఉంది. మధ్య మధ్యలో పాడిన చిన్న పిల్లలు కూడా భలే క్యూట్ గా పాడారు. :)

ఈ సినిమానే పెద్దగా ఎవరికీ తెలీదు కాబట్టి ఇంక ఈ పాట ఎక్కువమందికి తెలిసే అవకాశం ఉండదని, కొంతమందికైనా పరిచయం చెయ్యాలని నా బ్లాగులో రాస్తున్నా! నిజానికి ఎక్కువ ఏం చెప్పాలో తెలీట్లేదు గానీ, పాట వింటే మాత్రం చాలా చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి.. మీరూ విని నాలాగే మీకు మీరే ఆలోచించేసుకోండి మరి! :))

ఈ పాట వినాలనుకుంటే ఇక్కడ లేదా ఇక్కడో చూడండి.. మీకీ పాట కావాలంటే ఇక్కడ చూడొచ్చు..

శ్రీరామనవమి తిరనాళ్ళు.. నాకప్పుడేమో ఆరేళ్ళు..
నేనడగానే ఈ బొమ్మ.. ముచ్చటగ కొంది మా బామ్మ..
అప్పుడు దీని ఖరీదెంతో తెలుసా?
పది రూపాయలు..

చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం..
డబ్బులిచ్చాం.. వెంట తీసుకొచ్చాం..
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం..
డబ్బులిచ్చాం.. వెంట తీసుకొచ్చాం..

నా వయసు అపుడు పది కామోసు..
మేమంతా వెళ్ళాం మదరాసు..
పాండిబజారను మాయాబజారులో
ఈ జడ కుచ్చులు పాపిట బిళ్ళలు చెవి జూకాలు రవ్వల గాజులు..
ఎన్నో కొన్నది.. వెన్నంటి మనసు అమ్మది..
అప్పుడు వీటి ఖరీదెంతో తెలుసా?
మరో రెండు సున్నాలు..

చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం..
డబ్బులిచ్చాం.. వెంట తీసుకొచ్చాం..

నాకప్పుడేమో టీనేజీ..
పక్కూరిలోనే కాలేజీ..
నాకప్పుడేమో టీనేజీ..
పక్కూరిలోనే కాలేజీ..
వెళ్ళి రావటానికి రాలీ సైకిలు
వేసుకోవటానికి కొత్త చెప్పులు..
పట్టు పావడాలు చోళీ గాగ్రాలు..
ఎన్నో కొన్నారు.. మా మంచి నాన్నారూ..
అప్పుడు వీటి ఖరీదెంతో తెలుసా?
మరో సున్నా..

చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం..
డబ్బులిచ్చాం.. వెంట తీసుకొచ్చాం..

పెళ్ళీడు కొచ్చావన్నారూ..
కుర్రాడ్ని తీసుకొచ్చారూ..
నచ్చాడా అని అడిగారూ..
కాబోయే మొగుడన్నారూ..
కట్నం గా పది లక్షలంట..
నగా నట్రా పొలం గట్రా ఇవ్వాలంట..
తీరా అన్నీ ఇచ్చాక
నేను కూడా వారి వెంట..
పుట్టిల్లు వదిలిపెట్టి వెళ్ళాలంట..

చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం..
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం..
మొగుడి కోసం.. బోల్డు డబ్బు పోశాం..
రాను అంటే ఎందుకూరుకుంటాం..
ఇదేమి రూలూ.. ఇదేమి న్యాయం..
చూసారా ఈ విడ్డూరం!

చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం..
డబ్బులిచ్చాం.. వెంట తీసుకొచ్చాం..
ఎన్ని చెప్పినా మేము తాళి కట్టాం..
అత్తారింటికే నిన్ను తీసుకెళ్తాం!

20 comments:

  1. అబ్బ మధు నువ్విలాంటి స్వీట్ సాంగ్స్ పరిచయం చేస్తావు చూడు ...నువ్వు సో స్వీట్ అన్నమాట ..ఈ సాంగ్ భలే ఉంది ఇది నేను ఇంతకూ ముందు విన్నా నాకు చాలా చాలా నచ్చింది

    ReplyDelete
  2. ఫస్ట్ కామెంట్ పెడదాము అని కంగారుగా టైప్ చేస్తుంటే కరెంట్ పోయింది ..మాకు కరెంట్ ఎప్పుడూ ఇంతే సుత్తి కరెంట్ . డొక్కు కరెంట్ , సోది కరెంట్

    ReplyDelete
  3. భలే భలే మధురగారూ అప్పట్లో ఈ పాట చాలా పాపులర్ మా సర్కిల్లో. దీనికి కంప్యూటర్ కోర్సుల మీద, కాలేజీ ఫీజుల మీద భీభత్సమయిన పేరడీలు చేసుకుని పాడుకునేవాళ్ళం. మొన్న శ్రీరామనవమికి కూడా పందిళ్ళు చూసి ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది. లింకులు ఇచ్చినందుకు థాంకులు

    ReplyDelete
  4. బావుంది మధుర....చాలా ఆలోచింపజేసేదిగా ఉంది!

    ReplyDelete
  5. saahityamatrame chadivaanu.. song inkaa vinaledu.. vini maLLee cheptaa :D

    ReplyDelete
  6. Bagundi bagundi,,,.. Harsha Vardhan M

    ReplyDelete
  7. Hi Madhuravani,

    Its nice idea to introduce some good songs as part of 'Agnana geethalu'.

    One song which I came to my thoughts is following: (Sannajaji puvva from Yuvarathna)
    http://www.youtube.com/watch?v=aNZFXe7sOus

    I am not sure whether you listened this or not. If not listen, try to listen at your leisure.

    Thanks,
    Srinivas

    ReplyDelete
  8. మధురా, నిజానికి ఒక పది రోజుల నుంచి ఈ పాట కోసం వెదుకుతున్నాను బజ్ లో పెట్టాలని. నాకు పాట తప్ప సినిమా పేరు (శుభ అని మొదలవుతుందని మాత్రమే గుర్తుంది) , నటులు ఎవ్వరూ గుర్తు లేదు, సో బజ్ లో అడుగుదామనుకున్నాను. :-))
    ఎలా వచ్చిందో గుర్తు లేదు కానీ, ఈ పాటల కేసెట్ మా దగ్గర ఉండేది ఈ సినిమా వచ్చిన కొత్తలో. బహుశా ఇండియా నుంచి వచ్చినపుడు ఇంకేదో కాంబినేషన్ తో కొని ఉంటాము. ఒకరోజు మేమిద్దరం కార్లో వెళ్తున్నప్పుడు ఇది పెట్టి చాలా కేజువల్గా మాట్లాడుకుంటూ వింటున్నాము. నేను అసలే తెలుగు పాటలు పెద్దగా పని గట్టుకొని వినే అలవాటు లేదు నాకు. ఈ పాట వింటూ చివర "చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం.." అన్న చరణం వినగానే పగలబడి విరగబడి నవ్వటం మొదలుపెట్టాను. అప్పటివరకూ మామూలుగా ఉన్న నేను అలా పిచ్చి పట్టినదానిలా ఎందుకు నవ్వానో తనకి అర్ధం కాలేదు పాపం. అప్పటి నుంచి ఆ పాట విన్నప్పుడల్లా బలే నవ్వొచ్చేది. థాంక్స్, మీ వలన మళ్లీ విన్నాను ఆపాటని.

    ReplyDelete
  9. నిజమే మధురా ఆలోచింపచేసే పాట.. ఈ సినిమాలో మిగిలిన పాటలు కూడా బాగానే ఉంటాయి కొన్ని సరదాగా ఉంటే ఇంకొన్ని మెలొడీలు కూడా ఉన్నాయి..

    ReplyDelete
  10. సుకవి ప్రజల నాల్కల మీద బ్రతుకుతాడని జాషువా అన్నమాట ఈ సందర్భంలో కొంచెం ఎక్కువే కానీ, సినీ మాయాలోకంలో తారాజువ్వలా దూసుకుపోయినంత సేపు ఉండకుండా పాతాళంలోకి పడిపోయిన కులశేఖర్ కి మీ టపా ఎవరైనా చూపిస్తే బాగుండును. మంచి భవిష్యత్తు ఉన్న రచయిత. ప్చ్..
    మంచి టపా. మంచి పాట. అభినందనలు. "అజ్ఞాత గీతాలు" శీర్షిక చాలా బాగుంది.

    ReplyDelete
  11. Such a meaningful song!

    ReplyDelete
  12. భలే బాగుంది ఈ పాట నేనెప్పుడు వినలేదు ఈ పాట..ఏంటి మీరు అన్ని అజ్ఞత పాటలు ఉషాకిరణ్ వారివే రాస్తునారు..బహుశ వాళ్ళే అట్టర్ ప్లాప్ సినిమాలకి
    కుడా అంతాగా పబ్లిసిటి ఇస్తారు ఆనుకు౦టా!!

    ReplyDelete
  13. పాట చాలా బాగుంది . నేనెప్పుడూ ఈ పాట వినలెదు .

    ReplyDelete
  14. @ శివరంజని,
    హహ్హహహా బుజ్జీ.. మీ డొక్కు కరంట్ ని, సోది కరంట్ ని నా తరపున కూడా ఇంకో పది తిట్లు తిట్టేసేయ్.. అయినా, నీదే ఫస్ట్ కామెంట్ కదా.. :))
    అయితే నీకీ పాట ముందే తెలుసన్నమాట!

    @ శంకర్ గారూ,
    అవునా.. పేరడీలు కూడా పాడుకునేంత బాగా తెలుసా మీకీ పాట. ఎక్కువ ఎవరికీ తెలీదనుకున్నా నేను ఈ పాట. :)

    @ సౌమ్యా,
    నాదీ అదే ఫీలింగ్! :)

    @ వేణూరాం, హర్ష M, శ్రీహర్ష
    థాంక్యూ! :)

    ReplyDelete
  15. @ శ్రీనివాస్ గారూ,
    మీరు చెప్పిన పాట నాకు తెలీదండి. తప్పకుండా విని చూస్తాను. ధన్యవాదాలు.

    @ పద్మవల్లి గారూ,
    చాలా సంతోషమయింది పద్మ గారూ మీ వ్యాఖ్య చూసి.. అయితే మీరు వెతుకుతున్నప్పుడే యాధృచ్చికంగా నేను పోస్ట్ వేసానన్నమాట! :))

    @ వేణూ శ్రీకాంత్,
    అవునండీ.. ఇది కాకుండా ఈ సినిమాలో చిలక లాగా, ఇలా ఇలా.. అనే పాటలు నాకు నచ్చుతాయి. :)

    @ అనానిమస్,
    Yes.. indeed..! :)

    ReplyDelete
  16. @ కొత్తావకాయ గారూ,
    అవునండీ మీరు చెప్పింది నిజమే.. కులశేఖర్ గారు రాసిన పాటల్లో చాలాకాలం గుర్తుండిపోయే మంచి సాహిత్యంతో ఉన్న పాటలు ఉన్నాయి. ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు ఆయన పాటలు.. ఎంచేతనో మరి! ధన్యవాదాలు. :)

    @ సుభద్ర,
    హహ్హహ్హా.. నిజమే కావోచ్చండీ.. వాళ్ళ సొంత సినిమాలైతే ఈటీవీలో వాయించి వాయించి చంపుతాడు కదా మరి.. కాబట్టి సినిమాలు ఎంత అత్తర్ ఫ్లాప్ అయినా పాటలు తెలిసిపోతాయ్ బాగా.. :))

    @ మాలా గారూ,
    ఇంకెందుకు లేటు.. ఇప్పుడు వినేసేయ్యండి మరి.. :))

    ReplyDelete
  17. వావ్..భలే ఉంది పాట :)))))))

    ReplyDelete
  18. అవును కిరణ్.. మంచి పాట! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!