Sunday, June 19, 2011

ఎందుకిలా..!?


నీ గురించే ఆలోచిస్తూ..
నీ ఊహల్లో ఊరేగుతూ..
నీ తలపుల్లో తప్పిపోతూ..
నీ కోసమే ఎదురు చూస్తూ..
నీ ఊసులతో మురిసిపోతూ..
నీ మాటల్లో మైమరచిపోతూ..
నీ కలలతో నిదరోతూ..
నీ జ్ఞాపకాలతో మేలుకొంటూ..
నీ అల్లరిని విసుక్కుంటూ..
నీ కోసం ఆరాటపడుతూ..
నీ ప్రేమకి ఉప్పొంగిపోతూ..
నీ మాయని తిట్టుకుంటూ..
నీపై కోపం నటిస్తూ..
నీ మీద అలిగేస్తూ..
నీ ముందు బింకం నటిస్తూ..
నీ దగ్గర గారాలు పోతూ..
నీ చేత బతిమాలించుకుంటూ..
నీ నుంచి పారిపోవాలని ఓడిపోతూ..
నీ వల్లే అంతా అని నిందిస్తూ..
మళ్ళీ మళ్ళీ పడుతూ లేస్తూ..
నా మీద నేనే గెలుస్తూ ఓడిపోతూ..
అలసిపోతూ.. సొలసిపోతూ..
ఎందుకిలా నేనంతా నువ్వే అయిపోతూ.. నన్ను నాకు దూరం చేస్తున్నావ్!?


Image source

26 comments:

  1. ఎందుకిలా...
    మీ వెంటే పడుతూ
    మీ బ్లాగులు వెతుకుతూ
    మేము మరిచిన ఆ క్షణాలని మీ ద్వారా చూస్తూ
    ఆ అనుభూతి కోసం పలవరిస్తూ
    మీ అదృష్టానికి అసూయపడుతూ

    మీ భావ చిత్రాలలో కరిగిపోతూ
    ప్రాణ మున్న వాటిని చూస్తూ మైమరిచిపోతూ
    ఇంతలో మీ కవితా ప్రవాహం లో కొట్టుకుపోతూ

    ఎందుకిలా...
    మాకే (మీ బ్లాగు చదువరులకే) ఈ తీపి శిక్ష.

    ReplyDelete
  2. ఇంతకూ మీ బొమ్మల సంగతి చెప్పనే లేదు. మీ స్వీయ చిత్రాలా... మీ స్వంత చిత్రాలా. లేక ....
    బదులిస్తారు కదూ!!!

    ReplyDelete
  3. keka....
    simply superb....

    ReplyDelete
  4. మల్లాది లక్ష్మణ్ కుమార్ గారూ,
    ఆహా.. ఎంత ముచ్చటగా చెప్పారండీ! చాలా సంతోషమయ్యింది మీ స్పందన చూసి.. ధన్యవాదాలండీ! :)
    అంత అందమైన బొమ్మలు వేసేంత టాలెంట్ నాకు లేదండి.. బొమ్మల మూలం ఎక్కడి నుంచి అని లింక్ అప్డేట్ చేస్తాను పోస్టులోనే.. చూడండి.. :)

    ReplyDelete
  5. మల్లాది లక్ష్మణ కుమార్ గారి వ్యాఖ్యతో ఈకీభవిస్తున్నా :)

    మంచి లిస్ట్ పెట్టారు...

    ReplyDelete
  6. నోఈ....నో...నోఎ...


    నేనొప్పుకోను! ఇలా నేను దాచిపెట్టుకున్న బొమ్మలన్నీ పెట్టేస్తున్న మధురని ఏంచేద్దాం??? ఎలాంటి శిక్ష విధిద్దాం?? సుమనోహరుడి....'మమతా చూపిస్తా మధురా నీకు ;)

    వాకేనా?

    కవిత చాలా బాగుంది... :)

    ReplyDelete
  7. కె వ్వ్వ్...
    beautifully expressed

    ReplyDelete
  8. కవితకి బొమ్మ సరిగ్గా సరిపోయింది.

    ReplyDelete
  9. ఏంటండీ బాబూ వచనం వదిలేసి కవిత్వం మీద,ఫోటో ల పడారందరూ..


    మీ లాంటి పేరున్న రచయితలు ఏది రాసినా వాహ్వా లు కెవ్వ్ లు కామనే కదండీ..ఫోటో లూ కవిత్వాలూ కాదు కానీ ప్లీజ్ మామూలు పోస్టు లు రాయండి నా లాంటి వారి కోసం..

    మీ అభిమాని

    ReplyDelete
  10. కవిత చాలా బాగుంది...

    ReplyDelete
  11. ఈ పోస్టుదీ దీని ముందు పోస్టుదీ బొమ్మలు ఎక్కడ పట్టారు? భలే ఉన్నాయి. రచనలు సూపరని వేరే చెప్పనక్కర్లేదు.

    ReplyDelete
  12. ఈ విషయం తెలిసిన తరువాత అతని ప్రతిస్పందన ఎలా వుంట్టుంది అంటే

    ఏమైనదొ ఎమో నాలో కొత్తగా వుంది లొలో
    కలలిలా నిజమైతే వరమిలా యెదురైతే
    నాలొ నీవై నీలొ నేనై ఉండాలనే నా చిగురాశని
    లొలో పొంగే భావాలన్నీ ఈవేళ ఇలా నీతో చెప్పాలని ఉన్నది .

    అందాల సిరి మల్లె పువ్వూ ఏ మూల దాగవొ నువ్వూ
    చిరుగాలిల వచ్చి నావూ యెదలొన సడి రేపినావు
    యెదొ రొజు నీకై నువ్వూ ఇస్తావనే నీ చిరునవ్వునీ
    ఎన్నెన్నెనో ఆశలతోనె ఉన్నాను నే నీకొసం ఇలా....
    --------------------
    ఈ పాటని క్రింది వెబ్ సైట్ లో వినవచ్చు
    http://divyakshar.blogspot.com/2011/02/emaindo-emo-nalo.html
    ---------------------------
    మధురవాణి గారు,చాలా బాగా రాశారు. పదే పదే మీరు బాగా రాశారు అని చెప్పాలంటే, బాల సుబ్రమణ్యన్ని పాటలు బాగా పాడాడు అన్నట్టు వుంట్టుంది. :-)

    ReplyDelete
  13. మల్లాది లక్ష్మణ కుమార్ గారి వ్యాఖ్య చదివాక ఏకీభవించడమ్ తప్ప వేరే వ్యాఖ్య రాయాలని అనిపించడంలేదు. అద్భుతంగా రాశారు.

    ReplyDelete
  14. మధురా.. ఎంత బాగా రాసావో... లేట్ గా చూసా సారీ సారీ:((( టపా చాలా చాలా చాలా బాగుంది:)

    ReplyDelete
  15. ఎందుకలా చెప్పు మధు ఎందుకు?

    పెళ్ళయిన కొత్తకదా అందుకు ..అలాగే ఉంటుంది :P
    కాని చాలా బాగా రాసావ్

    ReplyDelete
  16. చాలా బాగా రాసావు . బొమ్మ చాలా బాగుంది . నీ పోలికలు కనిపిస్తున్నాయే ! ఎవరు వేసారు ?

    ReplyDelete
  17. Mee Madhi bhaavala tho allina ee manihaaram baagundi.......

    ReplyDelete
  18. @ అనానిమస్,
    హహ్హహ్హా! బోల్డన్ని ధన్యవాదాలు! :))

    @ భాస్కర్ గారూ,
    అయితే మీకూ లక్ష్మణ్ గారికి చెప్పినట్టే బోల్డు బోల్డు ధన్యవాదాలు.. :)

    @ ఇందూ,
    ఓహ్.. ఇదే బొమ్మని నువ్వు వాడదాం అనుకున్నావా అయితే! :P సారీ ఇందూ.. ఈసారికి క్షమించేయ్.. అంత పెద్ద శిక్ష భరించలేను.. అయినా, నువ్వూ ఇదే బొమ్మకి వేరే పోస్ట్ రాయి.. అదొక సరదాగా ఉంటుంది కదా! ;)

    @ హరేకృష్ణ, శ్రీ, అరుణ్..
    చాలా థాంక్సండీ! :)

    ReplyDelete
  19. @ అనానిమస్ 2,
    అంటే.. ఏదో అప్పటికప్పుడు తోచినవి రాసేస్తూ ఉంటానండీ! పాపం.. మీకు మరీ బోర్ కొట్టేసినట్టుంది.. మీ కామెంట్ చూసే మొన్ననే 'చుక్కల మొక్కు' అని వేరే సరదా పోస్ట్ ఒకటి రాసాను.. చూడండి.. మీ అభిమానానికి బోల్డు ధన్యవాదాలు. :))

    @ కొత్తపాళీ,
    థాంక్స్ గురువు గారూ! బొమ్మల సోర్స్ లింక్ పెట్టాను.. చూడండి.. :)

    @ శ్రీకర్ గారూ,
    బావుందండీ మీరిచ్చిన పాట! మీ ప్రశంసకి నేను తగనని తెలిసి కూడా బోల్డు పొంగిపోయి అలా అలా మబ్బుల దాకా వెళ్ళోచ్చానండీ! బోల్డు ధన్యవాదాలు! :)

    @ వేణూ,
    మీరందరూ ఇలా ప్రోత్సహిస్తుంటే నాకు తెలీకుండానే అలా రాసేస్తున్నానన్నమాట! థాంక్యూ! :))

    ReplyDelete
  20. @ అప్పూ,
    సారీ ఎందుకు.. ఎప్పుడో అప్పుడు ఓపిగ్గా చదవడమే కాకుండా కామెంట్ కూడా పెట్టావ్ కదా! నేనే నీకు థాంక్స్ చెప్పాలి.. :)

    @ నేస్తం గారూ..
    హహ్హహా! మీరు మరీనూ.. :P
    బావుందన్నదుకు థాంక్స్! :)

    @ శ్రీహర్ష, కిరణ్..
    థాంక్యూ! :)

    @ మాలా గారూ,
    థాంక్యూ! మీకూ అలానే అనిపిస్తోందా? వేరే కొంతమంది స్నేహితులు కూడా అలాగే అన్నారు! :)) పోస్టులో లింక్ ఇచ్చాను చూడండి.. ఆ ఇళయరాజా అనే అతను గీసిన బొమ్మలు అవి..

    @ సంతోష్ రెడ్డి,
    పోస్ట్ బావుందని అందంగా చెప్పారండీ.. థాంక్యూ! :)

    ReplyDelete
  21. meloni bhavalu chakkaga akshara roopam ichharu...bagundi...

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!