Sunday, March 20, 2011

నీ కోసం..


నువ్వెక్కడున్నావో తెలీకుండానే ఎన్నెన్నో కాలాలు కరిగిపోయాయి..
ఒకే ఒక్కసారి నువ్వెలా ఉన్నావో తెలిస్తే చాలుననుకున్నాను..
నీ ఊసు తెలిసాక ఒకే ఒక్కసారి నీ స్వరం వింటే చాలుననుకున్నాను..
ఇప్పుడేమో ఒకే ఒక్కసారి నీ మోము చూస్తే బాగుండుననిపిస్తోంది..
నిన్నెలా కలుసుకోవాలో, ఎక్కడని వెతకాలో తెలీనప్పుడు కేవలం నీ తలపుల్లోనే యుగాలు గడిపేశాను..
నీ జాడ తెలిసాక మాత్రం నిన్ను గొంతెత్తి పిలవకుండా నిమిషం పాటైనా నను నేను నిలువరించుకోలేకున్నాను..
ఇన్నాళ్ళు నిదురిస్తున్నాయనుకున్న నీ జ్ఞాపకాలు ఇహ నటన మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి!

16 comments:

  1. చాలా బాగుంది

    ReplyDelete
  2. ఈ మధ్యే మీ అక్షర స్వప్నం చదివాను,

    మీరు ఈ కవిత ఇంకా బాగా రాయగలరేమో అనిపించింది.


    వాసు

    ReplyDelete
  3. చాలా బాగుందండి!

    ReplyDelete
  4. చాలా బాగుందండి!

    ReplyDelete
  5. దీనికి కవిత అన్న పేరు పెట్టడం కవితలను అవమానించినట్టు అవుతుందని నా అభిప్రాయం! కాస్త మంచి రచనలు చెయ్యండి మధురవాణిగారూ, మీరు మనసు పెడితే తప్పక రాయగలరు!
    కృషి చెయ్యండి. రచనలు ఇలా రాయాలి కదా అని రాయకండి దయ చేసి!

    ReplyDelete
  6. చాలా బాగుంది

    ReplyDelete
  7. Hello Maduravaani gaaru,

    Very Nice.. chaala baaga raasaru :)

    ReplyDelete
  8. @ శ్రీధర్ యలమంచిలి, సాయి, ప్రవీణ, అయినవోలు ప్రవీణ్, హరేకృష్ణ, అరుణ్ కుమార్, శ్రీ హర్ష, విరిబోణి, అనుదీప్, పద్మార్పిత, కృష్ణప్రియ,
    స్పందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!

    @ వాసు,
    ధన్యవాదాలండీ! అలాగంటారా.. అప్పటికలా అనిపిస్తే రాసేసానండీ! కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించి రాయడం నచ్చదు ఎందుకో! :)

    @ స్వాతి,
    నిజానికి నాకు అసలు కవితలు రాయడమే రాదండీ! అప్పుడప్పుడూ అక్షరాల్లో పెట్టాలనిపించిన భావాల్ని యథాతథంగా ఈ లేబుల్ కింద పెట్టేస్తూ ఉంటాను. కేవలం నా బ్లాగులో నేను రాసి పెట్టుకున్న నాలుగు లైన్ల వల్ల కవిత్వం అనే మాటకే అవమానం జరిగిపోతుందన్న మీ అభిప్రాయాన్ని నేను అంగీకరించను. అలాగే, ఏదోకటి బ్లాగులో రాసేయ్యాలి అనుకుని నేనసలు ఎప్పుడూ రాయనండీ.. అలాగైతే రోజుకో పోస్ట్ రాసేదాన్నే కదా! నేను ఇంకా మెరుగ్గా రాయగలనని మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. మీ కవిత్వం లో ఒక భావావేశం వుండండి..బాగా రాసారు ...
    విరహ వేదన ఎలా వుంటుందో సింపుల్ గా చెప్పేసారు...ఒక కవిత ద్వారా ...
    ధన్యవాదాలు

    ReplyDelete
  10. @ కథాసాగర్,
    మీ స్పందనకి ధన్యవాదాలు! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!