Saturday, November 20, 2010

మా ఇంటబ్బాయ్ వంట! -2

(నిన్నటి టపాకి కొనసాగింపు)
నిన్న సాయంత్రం ఏమైందంటే.. నాక్కొంచెం నీరసంగా ఉంది, ఓపిక లేదని చెప్పి ఇంటికొచ్చి వంట చేయకుండా ముసుగు తన్ని కూర్చున్నానన్నమాట. నాక్కొంచెం సహాయం చేద్దామని పాపం తను కూడా పని మధ్యలోనే ఆపేసి ల్యాబ్ నుంచి తొందరగా వచ్చేశాడు. ఇహ అప్పుడు రాత్రికి మాకు భోజన సదుపాయం ఎలాగా అని ఆలోచించుకోవాలి కదా! నేనేమో నా వల్ల మాత్రం కాదన్నట్టుgarupale దీనంగా మొహం పెట్టేసరికి ఇంక మన అబ్బాయ్ గారికి వేరే గత్యంతరం లేకపోయింది. అన్నం వండటం వరకూ సమస్య లేదు.. ఎందుకంటే రైస్ కుక్కర్లో పెట్టేయ్యడమే కదా! మరి అన్నంలోకి ఏదో ఒక కూర కావాలి కదా తినడానికి. అందుకని నువ్వు ఆమ్లేట్స్ వేసెయ్యి, ఆవకాయ వేసుకుని తినేద్దాం అన్నా నేను. కళనున్నాడో ఏమో గానీ, నో.. నేను ఆమ్లెట్ వేయను, కోడిగుడ్డు పొరటు చేస్తాను.. అన్నాడు. బాబోయ్.. వంట చేయాలని నీకు ఇంత ఉత్సాహం వస్తే నేనెందుకు అడ్డుపడటం అని సరే అన్నా!

ఇహ ఇప్పుడు కోడిగుడ్డు పొరటు చేయు విధానం ఎలాగో మీరు సావధానంగా వినండి మరి. అదేలెద్దురూ.. చదవండి.rindu
మొదట అబ్బాయ్ గారు వెళ్లి పొయ్యి దగ్గర నించుని అక్కడి నుంచే నాకు ఇంటర్వ్యూ పెట్టారు. కూర చెయ్యడానికి కళాయి వాడాలి, రెండు ఉల్లిపాయలు వేయనా, మూడు వెయ్యనా, మరీ సన్నగా తరగాలా, కొంచం పెద్దవైనా పర్లేదా, ఆలివ్ నూనె వెయ్యనా, సన్ఫ్లవర్ నూనె వెయ్యనా.. ఇవ్విధముగా సాగిందన్నమాట నా ఇంటర్వ్యూ!soal కళాయిలో నూనె వేసాక మళ్ళీ ఇంకో సందేహం. పొయ్యి మీద నుంచి దింపి పట్టుకొచ్చి నాకు చూపించి మరీ అడిగాడు అంత నూనె సరిపోతుందో లేదోనని.
కళాయిలో నూనె వేడెక్కాక తాలింపు గింజలు వెయ్యమని చెప్పానో లేదో.. ఇంక నువ్వేం చెప్పక్కర్లేదులే.. మళ్ళీ కూర రుచిగా వచ్చాక క్రెడిట్ అంతా నీదేనంటావు. నాకు తెలుసు తరవాత పసుపు వెయ్యాలి, తరవాత ఉల్లిపాయ ముక్కలెయ్యాలి.. అంతే కదా.. అన్నాడు. సర్లే అని నేను ఊరుకున్నా. ఎంతసేపైనా ఉల్లిపాయ ముక్కలు వేగిపోవట్లేదని మళ్ళీ కంప్లెయింటు. encemసందు దొరికింది కదా అని నేనొక ఉచిత వంటోపదేశం చేసేసా. వంట చేయడమంటే తీరిగ్గా లాప్టాప్ ముందు కూర్చుని pacman ఆడడం, ఐఫోన్లో గేమ్స్ ఆడటం అనుకున్నావా మరి!fikir వంట చేయడానికి బోల్డంత ఓపికుండాలి బాబూ.. అని.
హెంతో కష్టపడి అయిదు నిమిషాలు ఓపిగ్గా కలబెట్టాక ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి. లోపు నాకో జ్ఞానోపదేశం కూడా..nerdఅసలైనా కూరగాయల్ని ఇలా ఎక్కువెక్కువసేపు మగ్గించి తింటే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయనీ. ఎంత తక్కువ మగ్గితే అంత ఆరోగ్యమనీ! ఇంతలో మరో సందేహం ఎన్ని గుడ్లు వెయ్యాలి అని. ఓహో.. నాలుగెయ్యనా.. సర్లే ఇంకేం చెప్పకు నువ్వు అన్నాడు. ఇంకో అయిదు నిమిషాలయ్యాక.. గుడ్డు కూడా బాగానే వేగిపోయింది, ఇంక కారం వేసెయ్యనా.. అంటూ మళ్ళీ ప్రశ్న. సరే, వేసెయ్యి.. అవునూ.. ఇంతకీ ఉప్పేసావా? అంటూ నా తిరుగు ప్రశ్న. ఓహ్..adusఇందాక అనుకున్నా.. అంతలోనే మర్చిపోయా.. ఇప్పుడు వేస్తున్నాలే! ఎంతేశావ్ ఉప్పూ కారం అనడిగాను. ఖచ్చితంగా ఎక్కువయ్యే అవకాశం మాత్రం లేదు. అలా వేశాను తెలివిగా అన్నాడు.kenyit

తరవాత ఇంకో అయిదు నిమిషాలు ఆపసోపాలు పడుతూ కూరని తిప్పీ తిప్పీ కష్టపడి చివరికి ఎలాగో కోడిగుడ్డు పొరటు చేయడం అనే ప్రహసనం ముగించాం.. క్షమించాలి.. ముగించాడు. ఇందులో నాకు అస్సలు క్రెడిట్ లేదని బ్లాగ్ముఖంగా మనవి చేసుకుంటున్నా అధ్యక్షా! (స్వగతం - ఇప్పుడన్నా కామెంట్లలో గైడ్ డౌన్ డౌన్ అనడం ఆపి జిందాబాద్ అంటారో లేదో!). అప్పటికే మాకు బాగా ఆకలిగా ఉండటంతో వెంటనే కోడిగుడ్డు పొరటుని వేడి వేడి అన్నంలో వేసుకుని తినేశాం కాబట్టి, ఫోటోలూ అవీ ఏమీ తీయలేదు. అంచేత గొప్ప రెసిపీని కళ్ళారా చూసే మహద్భాగ్యం కలగకుండా మీరు తప్పించుకుని బతికిపోయారనిmenari చెప్పడానికి చింతిస్తున్నాను. కానీ, మా ఇంటబ్బాయ్ గారి మాటల్లో చెప్పాలంటే మాత్రం.. ఇప్పటిదాకా మొత్తం జీవితంలో తిన్న అన్నీ కోడిగుడ్డు పొరటుల్లోకీ.. ఇదే అత్యుత్తమమైనదీ, శ్రేష్ఠమైనదీ మరియూ రుచికరమైనదీ అట!sengihnampakgigi

ఇంతటితో కథ సమాప్తం. ఇందు మూలంగా నీతి ఏంటంటే, ఎవరికైనా వంట అస్సలు రాకపోతే ఎంచక్కా ఆమ్లెట్ వెయ్యడం, కోడిగుడ్డు పొరటు గనక విధంగా వీజీగా నేర్చేసుకున్నట్టయితే అప్పుడప్పుడైనా మీ ఇంటమ్మాయిలు కాస్తో కూస్తో సుఖపడిపోగలరు. అలా అని చెప్పి అత్యుత్సాహంతో అన్నీ వంటలు మహా బాగా నేర్చేసుకుని తరవాత మీ పాకశాస్త్ర ప్రావీణ్యం వల్ల వచ్చిన పొగరుతో marahమీ ఇంటమ్మాయిల వంటలకి వంకలు పెట్టేంత దూరం మాత్రం వెళ్లకండేం! మంచబ్బాయిలు చెప్పిన మాట వింటారన్నమాట.. విన్నారు కదూ!

కొసమెరుపు: అసలు కార్తీక మాసం వనభోజనాలకి కోడిగుడ్డు పొరటు రెసిపీ చెప్పడవేంటో, మరీ చోద్యం కాకపోతే అని మీరు విస్తుపోతున్నారు కదూ! ఏదోకటిలెద్దురూ.. ఈసారికి సర్దుకోండి. అయినా మన పోకిరి చెప్పినట్టు.. రెసిపీ చెప్పామా లేదా అన్నది ముఖ్యం కానీ అది కోడిగుడ్డు పొరటా ఆమ్లెట్టా అన్నది అంత ముఖ్యం కాదు కదా! అయినా మీ అందరికోసం అరిసెలు, లడ్డూలు, బూందీ, కారప్పూస, ఇంకా.. జంతికలు ఇక్కడ పెట్టాను. తినేసి వెళ్ళండేం!senyum
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!

45 comments:

  1. బాగుంది బాగుంది :-) మొత్తానికి తిన్నారు కదా సంతోషం. నూటికి తొంభైశాతం వంట నేర్చుకునేప్పుడు దోశలో ఆమ్లెట్లో కోడిగుడ్డు పొరటుతోనో మొదలెడతారు అదేంటో.

    ReplyDelete
  2. intaki mi intabbayi ee blog chaduvutaara Madhura?

    ReplyDelete
  3. ఇంక ఎప్పటికీ మీ ఇంటబ్బాయ్ తోటే వంట చేయించేసేయండి. మీ ఆంలేట్ కూర నాకొద్దు గాని, మీ పిండి వంటలు మాత్రం సుష్టుగా అరగించేస్తా:)

    ReplyDelete
  4. are miru kuda naalagae kosamerupu pettare. same to same, same pinch miku.

    mi ayanaki vantalu anni vaste manaki ishtaminavanni chepinchukovachhuga enchakka eppudu kavalante appudu, emantaru? miru only ive nerpinchadaanni nenu kandisthunnanu adhyaksha :)

    ReplyDelete
  5. ee roju kodiguudu cheptunnarenti ani miru cheppentha varaku naku asalu bulb velagaledu suma ;)

    ReplyDelete
  6. కార్తీక పౌర్ణిమకి కాక్ టెయిల్ పార్టీ...మీ రెసిపీ:)

    ReplyDelete
  7. బాగుంది బాగుంది.. చాలా ప్రయత్నాల తర్వాత మీ బ్లాగు ఓపెన్ అయ్యిందండీ.. విషయానికి వస్తే, మీరు కూడా అబ్బాయి మంచి మనసుని అర్ధం చేసేసుకుని నిజ్జంగా బాగోనప్పుడు మాత్రమే ముసుగు పెట్టాలన్న మాట :-) :-)

    ReplyDelete
  8. ఇంక చాలు మధురా చాలు నీ కష్టాలు విని నేను తట్టుకోలేకపోతున్నాను...ఇంత చిన్నవయసులో ఎలా తల్లీ భరిస్తున్నావు :(

    ReplyDelete
  9. మరి గుడ్డుకూడ తినని నాలాంటి కోటక శాకాహారుల పరిస్థితేంటండి?

    >>>మంచబ్బాయిలు చెప్పిన మాట వింటారన్నమాట.. విన్నారు కదూ>>>

    మీరు మంచబ్బాయిలని అన్నారా లేదా 'మంచు'అబ్బాయిగారి గురించన్నారా?

    ReplyDelete
  10. :-)
    జెబి గారు... మీరు అన్నది అలొచించగా...చించగా.... ఎందుకొ అనుమానం వస్తుంది సుమా

    ReplyDelete
  11. "(స్వగతం - ఇప్పుడన్నా కామెంట్లలో గైడ్ డౌన్ డౌన్ అనడం ఆపి జిందాబాద్ అంటారో లేదో!)."
    అబ ఛా ఈ మాత్రానికే జిందాబాద్ అనేస్తారా?ఓయ్ అమ్మడూ ఇప్పుడూ ఇంటబ్బాయికే జిందాబాద్,హెంత కష్టపడి మాంచి ఆకలితో ఉన్నప్పుడే అంతరుచిగా వచ్చేట్టు చేసాడు మరి.జిందాబాద్ జిందాబాద్ ఇంటబ్బాయ్ జిందాబాద్.

    ReplyDelete
  12. ఇది అన్యాయం.
    రుచికరమైన వంటని డామినేట్ చేసేలాగ వేరే కిటికిలోంచి లడ్డు ఫొటొలు చూపిస్తున్నారు.

    ReplyDelete
  13. ఈ టపాతో డౌన్ డౌన్ ఆపేస్తాం కానీ, మరీ జిందాబాద్ అంటే కష్టం :P
    మీకు ఇంత మంచిగా అత్యుత్తమమైన , శ్రేష్టమైన మరియు రుచికరమైన పొరటు చేసి పెట్టినందుకు మీ ఇంటబ్బాయి గారికి జిందాబాద్ :)

    ReplyDelete
  14. అబ్బ ఎంత హ్యూమరస్ గా రాస్తారు అండీ
    మీరు ఎవరైనా చాల ఈజీగా చెయ్యగల వంట కద ఎగ్స్ పొరుటు

    ReplyDelete
  15. పోనీలే నాలాంటి పక్తు శాకాహారుల కోసం లడ్డూలు పెట్టావు . లేకపోతే ఉపవాసం వుండాల్సి వచ్చేది . థాంక్యు .

    ReplyDelete
  16. హ్హహ్హహా! నేను ఎంతసేపు నవ్వుకున్ననో తెలుసా మధురగారు! నేను పక్కా వెజ్జి కాబట్టీ నాకు ఈ కోడిగుడ్డు పొరటు గురించి తెలియదు కానీ....మీరు చెప్పిన పధ్ధతి మాత్రం భలె కమెడీగా ఉంది :) ఎట్లాగైతేనేం మీ ఇంటబ్బాయిని....వంటబ్బాయి చేసేసారు ;)

    ReplyDelete
  17. మేము ఉక్కిరి అంటాం. పొరటు అన్నా, ఉక్కిరి అన్నా ఒకటేనా?

    ReplyDelete
  18. మధుర గారు.. భలే ఉంది మీ టపా.. అంతేనండీ అంతే ఈ మగ జెంట్స్ అంతా అంతే..;) చేసేది, వచ్చేది ఏమీ ఉండదు కానీ, మాటలతో మాత్రం మాత్రం కోటలు కట్టేస్తూ ఉంటారు..:)))) ఎక్కడో పురాణాల్లో ఉన్న నల భీముల్ని ఇంకా పట్టుకుని ఆ ఘనత మాదే అంటూ ఉంటారు...;) ఏమన్నా అంటే, చెక్కెర పొంగలీ, నూడుల్స్, కుక్కర్‌లో చపాతీలు అంటారు..:D :D

    ReplyDelete
  19. ఏదో పాపం నీరసంగా ఉన్నారని మీ ఇంతబ్బయ్ సహాయం చేస్తే మీరు అతన్ని ఇలా "పబ్లాగ్లో" అదేననది పబ్లిగ్గా అందరిముందు నిలబెడితే ఎలాగండీ. మా ఇంతబ్బయిలమంతా తీవ్రంగా ....(ఖల్..ఖల్...ఖల్) కొద్దిగా తీవ్రత ఎక్కువయినట్టుంది లెండి. ఖండిస్తున్నాం అధ్యక్షా:)) ఇది చదివి మా ఇంతమ్మయిలంతా మమ్మల్ని వేపుకు తినాలనేగా మీ కోరిక :)) బాగుంది మీ పోస్ట్ నెనర్లు :))

    ReplyDelete
  20. >>మన పోకిరి చెప్పినట్టు.. రెసిపీ చెప్పామా లేదా అన్నది ముఖ్యం కానీ అది కోడిగుడ్డు పొరటా ఆమ్లెట్టా అన్నది అంత ముఖ్యం కాదు కదా!

    ఈ డైలాగ్ తప్పు పడిందే..

    ఆది సంగతి వదిలేయ్ నువ్వు చెప్పు ఏద్దామా వద్దా
    ఏంట్రా ఏసేది..ఏంట్రా ఏసేది.ఆ
    నేను కర్రెక్ట్ గానే ఉన్నాను..నువ్వే ఆలోచించు ఊ అని చెప్పు చాలు
    ఏయ్ నిన్న కాక మొన్నోచ్చి..నిన్న కాక మొన్నోచ్చి ఊ ఏంట్రా.. ఊ ఏంట్రా..
    ఎప్పుడు వచ్చామన్నది కాదనయ్యా..బుల్లెట్ దిగిందా లేదా..
    అదండీ సంగతి!

    ReplyDelete
  21. అపర్ణ ఎందుకో మీ ఆడలేడీస్ కి మా మగజెంట్స్ మీద అంత కోపం అస్సలు మీకు పెళ్ళయ్యాక మొదలు వంటలు నేర్పేది మా మగ జెంత్సే కదా :)) :))

    ReplyDelete
  22. భాను గారు
    >>అస్సలు మీకు పెళ్ళయ్యాక మొదలు వంటలు నేర్పేది మా మగ జెంత్సే కదా :)) :))
    ఏమిటిదీ..? నాకిక్కడ ఏదో మసక మసగ్గా కనిపిస్తుంది..;) ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు..
    దయచేసి ఎవరైనా కాస్త సహాయం చేద్దురూ...

    ReplyDelete
  23. అపర్ణ నిజాలు వింటే అలానే కళ్ళు బైర్లు కమ్ముతయిలే. :))

    ReplyDelete
  24. సారీ అపర్ణ అది నా పేరు మీద రావాల్సిన కామెంట్ పొరపాటున మా ఇంతమ్మాయి పేరు మీద వచ్చేసింది భాను

    అపర్ణ నిజాలు వింటే అలానే కళ్ళు బైర్లు కమ్ముతయిలే. :)

    ReplyDelete
  25. భాను గారు,
    నిజాలు విని కాదేమో.. అసలు ఏమాత్రం నిజం అవ్వడానికి స్కోప్ లేని అబద్ధాలు చూస్తే అలా అవుద్దేమో అని నా డవుట్.. కాదు కాదు ప్రగాఢ నమ్మకం..:D:D

    ReplyDelete
  26. ఇంత తొందరగా రిప్లై లు ఇచ్చేస్తున్నారు..అంటే మరో రెండు రోజుల్లో కొత్త పోస్ట్ వేస్తున్నారన్న మాట

    ReplyDelete
  27. ఎవ్వరి నమ్మకాలు వాళ్ళవి అని నా ప్రగాడ నమ్మకం :))

    ReplyDelete
  28. @అపర్ణ
    >>అసలు ఏమాత్రం నిజం అవ్వడానికి స్కోప్ లేని అబద్ధాలు చూస్తే అలా అవుద్దేమో అని నా డవుట్.. కాదు కాదు ప్రగాఢ నమ్మకం..
    నీకు అంత నమ్మకం ఎందుకో కానీ నేను అలాంటి జంటలను చాలా మందినే చూసాను. :)

    ReplyDelete
  29. హమ్మయ్య ఇప్పటికి నాకో తోడూ దొరికింది. థాంక్స్ సాయి ప్రవీణ్ :))

    ReplyDelete
  30. kuda kaarthika maasam shubhakankshaklu... mee intabbayi paakashastra pravvenyamu super andi...

    ReplyDelete
  31. మధుగారూ .. ఏది ఏమైనా అప్పటికప్పుడు నేర్చుకుని మీ వంటబ్బాయిగారు (సారీ ఇంటబ్బాయి గారు ) అంత రుచిగా వండేసారు కాబట్టి .. ఇంటబ్బాయి జిందాబాద్ ..

    నేను కుడా ఆమ్లెట్ తోనే మొదలుపెట్టానండి (నేను వండుకుని తినాల్సివచింది లెండి ఒక 4 రోజులు ).. ఆ 4 రోజులూ, ఒక పూట పొరటు, తరవాత ఆమ్లెట్, మల్లి పొరటు, మల్లి ఆమ్లెట్. ఇలా ఆ రెండిన్తినే మార్చి మార్చి వండుకున్నాను..ఇంకేమి వండటం రాదు మరి.. సరే ఇన్ని తిప్పలు ఎందుకని ఇంటికి వెళ్ళినపుడు నాకు కూరలు వండటం నేర్పమని అడిగితే "ఒరేయ్ వెధవాయ్ .. మగ వెధవ వి నీకెందుకురా వంట ?" అని వంటింట్లో నుండి గెంటేసారు.. బహుసా వాళ్ళు చేసే వంటలని చెడగోట్టేస్తానని భయమేమో. అయినా కస్టపడి వండే పద్ధతి బాగా బట్టీ కొట్టా.. కాని వండే అవకాసం ఇంకా రాలేదు.. (ఇంట్లో వాళ్ళు ఇవ్వట్లేదు .).. నా పెళ్లి అయ్యేవరకూ ఆగాలేమో.. మా ఇంటమ్మాయిని ఒప్పించాలి..

    కాని, ఇంట్లో దోసెలు మాత్రం వేసాను చాలాసార్లు. నాకు తెలిసీ వంటలో అతి సులువయిన పని దోసెలు తిప్పడమే..

    ReplyDelete
  32. @ వేణూ శ్రీకాంత్,
    అవునండీ..మొత్తానికి తినగాలిగాం. ;) అవైతే చేయడం సులువు కదండీ.. అందుకేనేమో వాటితో వంటకి శ్రీకారం చుడతారు అందరూ! నేనైతే టీ పెట్టడంతో మొదలెట్టాను. :)

    @ జాబిలి,
    చదువుతారు అందం కంటే చూస్తారు అనడం కరక్టేమో.. అది కూడా ఏదో నా కళ్ళ నీళ్ళు తుడవడానికన్నట్టు. ;)

    @ జయ,
    ఇంక ఎప్పటికీ ఇంటబ్బాయ్ చేతనే వంట చేయించేంతటి మహా అదృష్టం నాకు పట్టే అవకాశం లేనట్టే ఉందండీ చూడబోతే! ;) పోన్లెండి.. ఏదోకటి ఆరగించారు కదా! అదే సంతోషము :)

    @ కృష్ణప్రియ,
    :))

    @ swapna@kalalaprapancham,
    ఎన్ని రకాల వంటలు నేర్చుకోగలరు అనేది నేర్పించేవాళ్ళని బట్టి అస్సలు ఉండదు స్వప్నా..నేర్చుకునే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళని బట్టే ఉంటుంది. కాబట్టి, ఇందులో నేను చేయగలిగిందేమీ లేదు.
    ఎంచక్కా వంటలు చేయడం వచ్చిన శ్రీవారు ఉంటే.. ఏది కావాలంటే అది తినచ్చు అని నువ్వనుకుంటున్నట్టే.. అచ్చంగా అలాగే అబ్బాయిలు కూడా అనుకుంటూ ఉంటారు.. శ్రీమతికి వంట చేయడం వస్తే బాగుంటుంది అని. కాబట్టి, చివరికి ఎవరో ఒకరికి తప్పదు. ఆ ఒకరూ ఎవరనేది వారి వారి అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట! ;)

    కార్తీక పౌర్ణమి రోజు గుడ్డు ఏంటీ అని ఎవరో ఒకరు అక్షింతలు వెయ్యకముందే నేనే ఆ విషయం చెప్పేసానన్నమాట! ;)

    ReplyDelete
  33. @ పద్మార్పిత,
    హహ్హహ్హా.. భలే చెప్పారే! :)

    @ మురళి,
    హహ్హహ్హా.. గట్టి పాఠమే చెప్పారుగా! అలాగేనని మాటిస్తున్నాం అధ్యక్షా! :)

    చాలా ప్రయత్నాల తర్వాత నా బ్లాగు ఓపెన్ అయ్యిందన్నారు..అదేంటో అర్థం కాలేదు మురళీ గారూ!

    @ నేస్తం,
    హేం చేస్తాం నేస్తం.. హేంటో.. చిన్నప్పటి నుంచీ హిలా త్యాగశీలిలా కష్టాల్ని భరించడం హలవాటైపోయింది.. :)

    @ జేబి - JB,
    అందుకే కదండీ.. ఎంచక్కా లడ్డూలు, అరిసెలూ కూడా పెట్టింది. అవి మీరు మిస్సయిపోయినట్టున్నారు! :)

    మంచబ్బాయిలు = మంచి + అబ్బాయిలు :)

    @ మంచు,
    మీరు మరీ అంత ఆలోచించీ.. చించీ.. అక్కడ లేని అర్థాలు వెతుక్కోకండీ! :-)

    @ శ్రీనివాస్ పప్పు,
    ఇదన్యాయం..అక్రమం..ఘోరం.. నేరం..మహా పాపం.. ఇప్పుడు కూడా నాకు జిందాబాద్ లేదా అయితే! :( నేను తీవ్రాతితీవ్రంగా.. మహా తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా! :)

    @ సునీత,
    ధన్యవాదాలండీ! :)

    ReplyDelete
  34. @ అనానిమస్,
    హహ్హహ్హా.. అలా అంటారా? అంటే.. అదీ.. మరి.. కార్తీక పౌర్ణమి రోజు గుడ్డు తినడమేంటీ అని అందరూ ఇబ్బంది పడతారు కదండీ.. అందుకని అలా లడ్డూలూ అవీ పెట్టానన్నమాట!
    అయినా నాకు తెలీకడుగుతాను.. ఎక్కడో పక్క కిటికీలో ఉన్న లడ్డూలు ఇక్కడున్న వంటని డామినేట్ చేయడమేవిటండీ మరీ విడ్డూరం కాకపోతేనూ! ఇదొక్కటే పెద్ద మహా గొప్ప వంటని బడాయి కాకపోతేనూ! ;)

    @ సాయి ప్రవీణ్,
    నాకు జిందాబాద్ చెప్పరు కదూ! :( అందుకని మీ కామెంట్ కి రిప్లై ఇక్కడ రాయను. పైన శ్రీనివాస్ పప్పు గారికి ఏం చెప్పానో వెతికి చూసుకుని మీరే చదువుకోండి. ;)

    @ లత,
    నా పోస్ట్ చూసి మీకు కొంచెమైనా నవ్వొచ్చిందంటే సంతోషమే కదండీ! :)
    ఎవరైనా ఈజీగానే చేయగలరనుకోండి.. కానీ, వంటలో అ,ఆ లు ఉంటాయని కూడా తెలీని వాళ్ళు చేయాలంటే అదొక పెద్ద ప్రహసనమే కదండీ ఈ పోస్టులో చెప్పినట్టు. ;)

    ReplyDelete
  35. పాపం కదా ? ఇంటబ్బాయ్ చేత వంట చేయించి తినేసి మరి ఇన్ని పేర్లు పెట్టారా ??????
    మీరు మహేష్ బాబు ఫాన్ ఆ ? ఎందుకంటే మన పోకిరి అన్నారు కదా ...

    ReplyDelete
  36. పాపం, laptop లో చక్కగా pacman ఆడుకునే మనిషి చేత వంట చేయించి , దాన్ని బ్లాగ్ చేస్తారా....అయిన ఇంకా ప్రజలు pacman ఆడుతున్నారా ?

    ReplyDelete
  37. @మాలా కుమార్,
    చూశారా మరి.. ఎంత తెలివో నాకు! ;)

    @ ఇందు,
    నా పోస్టు మిమ్మల్ని నవ్వించినందుకు సంతోషంగా ఉంది. మా ఇంటబ్బాయ్ కూడా అచ్చు ఇలాగే అన్నాడండీ.. ఏంటో నాకు వంటబ్బాయ్ అన్నట్టు వినిపిస్తోంది అని. ;)

    @ ఆ.సౌమ్య,
    ఉక్కిరి అనే పదం ఇదే మొదటిసారి నేను వినడం. నాకూ తెలీదు మరి.. రెండూ ఒకటో కాదో!

    @ మనసు పలికే,
    హహ్హహ్హా.. పని రానప్పుడు కనీసం మాటలతో కోటలు కట్టడమన్నా వచ్చి ఉండాలి కదా అపర్ణా మరి! ;)

    @ భాను,
    హెంత బాగా వంట చేశారో అని మెచ్చుకోడం తప్ప నేను వేరే ఏవీ అనలేదు కదండీ! అయినా ఇంటబ్బాయ్ అనుమతితోనే ఇలా బ్లాగుకెక్కించాను. అది సరే గానీ, మీ ఇంటమ్మాయ్ ఈమెయిల్ ఇవ్వండి ఓసారి.. మీ చేత కూడా వంట చేయించమని రికమెండ్ చేస్తాను. ;)

    @ మనసు పలికే, భాను,
    ఇరువర్గాల వాదన విన్నాక.. మీ ఇద్దరు చెప్పిందీ కరక్టే అని విన్నవిస్తూ.. రెండు రకాల వాళ్ళూ ఉంటారని ఒప్పుకుంటున్నాం. ఇదివరకు అపర్ణ చెప్పిన రకం వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో సాయి ప్రవీణ్ గారు చెప్పినట్టు సీన్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ;)

    @ భరత్ నూనేపల్లి,
    ధన్యవాదాలండీ! :)


    @ అనానిమస్ 2,
    మీ లాజిక్ భలే ఉందండీ! మీకలా అనిపించిందా? వీలుని బట్టి తొందరగా రిప్లైలు ఇవ్వాలనే ప్రయత్నిస్తున్నానండీ.. సాధారణంగా కొత్త పోస్టు వెయ్యడానికి నాకు ప్లాన్ ఏమీ ఉండదు. ఏదన్నా ఆలోచన వచ్చి, టైం కూడా దొరికితే అప్పటికప్పుడు రాసేసి వెంటనే పోస్ట్ చేస్తాను. మీ కామెంట్ చూసినప్పుడు కొత్త పోస్ట్ వేస్తానా అనుకున్నాను. మీ నోటిమాటో ఏమో గానీ అనుకోకుండా వెంటవెంటనే రెండు పోస్ట్స్ పెట్టాను. థాంక్యూ! :)

    ReplyDelete
  38. @ హరేకృష్ణ,
    ఏదో ఫ్లో లో అలా చెప్పేస్తామండీ.. మీరొచ్చి ఇలా గట్టిగా అడిగితే ఏం చెప్తాం! ఏ మాటకామాటే.. భలేగా గుర్తుంచుకున్నారే! పోకిరి ఎన్ని సార్లు చూశారు సార్ మీరు?

    @ హరీష్,
    మీరు కూడా ప్రతిపక్షమేనా! నాకు జిందాబాద్ చెప్పలేదుగా! :( వంట నేర్చుకునే వారు సాధారణంగా ఆమ్లెట్, పొరటుతోనే మొదలెట్టేస్తుంటారు. ఎందుకంటే అవే చాలా సులువు మరి! వాటితో పాటు మీకు దోసెలు వెయ్యడం కూడా వచ్చిందంటే.. పాకశాస్త్ర ప్రావీణ్యం సగం సంపాదించినట్టే! మీరేం బాధపడకండి.. మీ ఇంటమ్మాయ్ ని ఒప్పించడం ఏమి ఖర్మ.. మీరే తనకి నేర్పించాల్సి వస్తుందేమో! ;)

    @ శివరంజని,
    ఇది మరీ బాగుంది.. అసలు నేను ఒక్క పేరైనా పెట్టానా అని నిలదీస్తున్నాను అధ్యక్షా! మన పోకిరి అంటే.. ఏమో అలా అనేసాను. ఫ్యానా అంటే.. మరీ అష్టా చేమ్మాలో స్వాతి అంత కాదులే గానీ కొంచెం ఫ్యాన్ నే! ;)

    @ sanju -The king!!!,
    మీరు మరీనండీ.. laptop లో ఆటలాడుకునే వాళ్ళు వంట చేయకూడదని రూల్ లేదుగా! ;) pacman ఇంకా ప్రజలు ఆడుతున్నారు. దానికి నేనే సాక్ష్యం. అయినా పచ్మన్ ఒక్కటనేముంది చెప్పండి..బోల్డన్ని గేమ్స్ ఉంటున్నాయిగా.. ఏదో ఒకటి.. ఆడటం మాత్రం గ్యారెంటీ! నాకు తెలిసిన పేరు కాబట్టి అది చెప్పాను. ;)

    ReplyDelete
  39. బాబోయ్ మధు గారు..! కొంపదీసి మీ మాట నిజమయిపోదుగా?? ఎందుకంటే వంట లో నన్ను హెల్ప్ చెయ్యమంటే చేస్తాను గాని , నేనే వంట నేర్పాలని అంటే మాత్రం నిజం గా అది నా ఖర్మే tensiongigitjari!
    ఇకపోతే జిందాబాద్ అంటారా, నేను మీకు ప్రతిపక్షం కాదు గాని, స్వపక్షం. అంటే నేను కుడా అలంటి అబ్బాయినే కదా అని తనని సపోర్ట్ చేస్తున్నా అంతే.. అయినా మీ ఇంటబ్బాయి ఆసక్తిని గమనించి ప్రోత్సహించి, ఆ వంట ఎలా వున్నా తిని, ఆ విశేషాలని మా అందరితో పంచుకుని, మీ ఇంటబ్బాయి ప్రావీణ్యాన్ని ఇలా నలుదిశలా వ్యాపిమ్పజేస్తున్నందుకు మీకు జోహర్లు,ఇంకా బోల్డన్ని జిందాబాద్ లు. ఒక్క పోరటుతోనే ఆయన ఇంత పేరు సంపాదిన్చేసారంటే (అసలు పేరు మీరు ఇంకా చెప్పలేదు మరి sigh ) అది మీ చలవే. tepuktangan

    .... హరీష్

    ReplyDelete
  40. @ హరీష్,
    అయితే సరేనండీ.. వంట నేర్పించడాన్ని మీరు కర్మలాగా కాకుండా ఖర్మలాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి.. నేనిచ్చిన ఆశీస్సుని అర్జెంటుగా వెనక్కి తీసేసుకుంటున్నా! ;)
    హహ్హహ్హా.. ఒక్క జిందాబాద్ చెప్పలేదు అన్నందుకు భలే పొగిడేసారుగా! :)

    ReplyDelete
  41. అప్పుడే మీ ఇంటబ్బాయికి బ్లాగ్ముఖం గా అక్షింతలు మొదలెట్టేసారన్నమాట..ఐనా పాపం మంచి అబ్బాయి లాగే వున్నారు...మా వారు ఎంత indirect గా రాసినా కనిపెట్టేసి యుధ్ధానికొచ్చేస్తున్నారు...:)

    ReplyDelete
  42. @ స్ఫురిత,
    హహ్హహా.. అక్షింతలు వేసేసానంటారా?:D
    అవునా.. అలాగయితే మీరు కొత్త మార్గాలేవన్నా కనిపెట్టాలండీ! ;) ప్రస్తుతానికి నాకా సమస్య లేదులెండి..నీ బ్లాగు నీకు నచ్చింది రాస్కో అంటాడు మా ఇంటబ్బాయి. :)

    ReplyDelete
  43. ఇప్పటిదాకా మొత్తం జీవితంలో తిన్న అన్నీ కోడిగుడ్డు పొరటుల్లోకీ.. ఇదే అత్యుత్తమమైనదీ, శ్రేష్ఠమైనదీ మరియూ రుచికరమైనదీ అట!

    chaala navochindi. Andaru alane anukuntaremo:D..
    very nice post.

    ReplyDelete
  44. @ దీప,
    ఎప్పుడో రెండేళ్ళ కిందట రాసిన పోస్టుని మళ్ళీ గుర్తు చేసారండీ. నేను కూడా మళ్ళీ నవ్వుకున్నా. అంత పాత పోస్ట్ చదివి వ్యాఖ్య రాసినందుకు బోల్డు ధన్యవాదాలు. :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!